top of page

అమ్మతో... అతి భయంకర పోరాటం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Ammatho Athi Bhayankara Poratam' Written By Nallabati Raghavendra Rao

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

అతనికి అన్నతో ఆస్తి తగాదాలు వున్నాయి.

అన్న మీద కక్ష పెంచుకున్నాడు.

అన్న దగ్గర వున్న తల్లి పైన కూడా ద్వేషం పెంచుకున్నాడు.

చివరికైనా తన తప్పుతెలుసుకున్నాడా లేదా అన్నది ప్రముఖ రచయిత నల్లబటి రాఘవేంద్ర రావు గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.


పట్టాభిరామచంద్రం రక్తసంబంధీకుల వల్లే ఆస్తి పంపకాల విషయంలో చాలా అవమానాలు పడ్డాడు. తన అన్న గోపాలరావు తనవీధిలో, వీధిజనం అందరూ చూస్తుండగా తనను కర్రలతో కొట్టించాడు. అంతేనా.. పెద్దమనుషులను నియమించి, వాళ్లకు లంచం ఎరచూపి, తనను నానా దుర్భాషలాడించాడు. తను ఉమ్మడిలో కోట్లాది రూపాయలు దాచేసుకున్నట్టు బంధుజనంలో చెడుగా ప్రచారం చేయించి వాళ్లని నమ్మేలా చేశాడు. చివరికి తల్లి మనసు కూడా తనమీద విరిగిపోయేలా ఆమెను రెచ్చగొట్టి,.. భయపెట్టి లోబరుచు కుని.. తన తల్లిచేతే తన ముఖం పై ఉమ్ము వేయించాడు.. చెప్పుతో కొట్టించాడు. అభం శుభం తెలియని మరో ఆఖరి తమ్ముడికి కూడా తనపై అసహ్యం కలిగేలా నూరిపోసి వాడితో తనపై ఏకంగా గునపంతో హత్యా ప్రయత్నం చేయించాడు. తన భార్యను సైతం అందరూ కలసి దుర్భాషలాడి కించపరిచారు.గాలి కోసం ఉమ్మడిలో తనుఉంటున్న భాగానికి దొడ్లోకి వచ్చేలా చిన్న కిటికీ పెట్టకుంటే .. పంపకాలు అయ్యేవరకు వీల్లేదని... పోలీసులను..లాయర్లను తీసుకొచ్చి అది మూయించేశాడు. ముదరాగ.. తను ఇచ్చినంత డబ్బులు తీసుకొని వాటా ఆస్తిని వదిలి వెళ్లిపోవాలని రౌడీల చేత బెదిరించాడు.. తన అన్న.తను దారిలోకి రావడం లేదని.. దారిలోకి రావడం కోసం పోలీస్ క్రిమినల్ కేస్ పెట్టిం చాడు. తను కత్తితో దాడి చేయకపోయినా తనే చేసినట్టు కథలు అల్లి, కత్తిని కూడా సృష్టించి.. దొంగ సాక్ష్యాలను సైతం నిర్ణయించి కేసు ఫైల్ చేయించి తనను స్టేషన్లో కూర్చోబెట్టించి... రెండేళ్లు కోర్టుల చుట్టూ కూడా తిప్పించాడు... పాపాత్ముడు తన అన్న!!ఇలాంటి మరెన్నో ..అన్న గోపాలరావు భయం కర చర్యలతో నరకం మొత్తం భూమి మీదే అనుభవించేసి.. చచ్చిపోవాలనికూడాఅనుకొన్నాడు...పట్టాభిరామచంద్రం..ఇదంతా కేవలం ఉన్న ఒకే ఒక్క ఉమ్మడి ఇంటి పంపకాల విషయంలో!!!ఇలా........ ఐదు సంవత్సరాలు తన అన్న వల్ల యమలోకపు బాధల కన్నా వందరెట్లు ఎక్కువ బాధలు అనుభవించాడు పట్టాభి రామచంద్రం. తన అన్న లో గోముఖవ్యాఘ్రాన్ని నిజంగా చూసేసాడు. 'తేనెపూసిన కత్తి ' అంటే ఏమిటో పూర్తిగా అర్థమయింది.

చివరకు అప్పుడు అన్నకు ,తల్లికి,ఆఖరి తమ్ముడికి.. పెద్దలు నిర్ణయించిన ఆస్తిని వదిలేసి.. తనకు ఎంతిస్తే అంతే తీసుకొని.. ఆఖరుకి తల్లి ఆస్తి భాగంపై కూడా..... హక్కును తను మనస్ఫూర్తి గా.... ఎవరి బలవంతము లేకుండా వదులు కొంటున్నట్టు.. ఒప్పుంటు న్నానని.... అక్రమ విధానంలో తన అన్న గోపాలరావు దస్తావేజులు తయారుచేయించి

సంతకాలు పెట్టించి పంపకాలు పూర్తి చేయించాడు.


0000000 0000000 0000

ఇదంతా జరిగి 20 సంవత్సరాలు గడిచింది!!.


రోజూ...ఊరిమధ్య రావిచెట్టుకింద పెద్దల బండపై కూర్చొని ఇదేవిషయం గుర్తుకు తెచ్చుకొని తన కొలీగ్ కనకలింగానికి... ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కథలు కథలుగా చెప్పు కుంటూ తెగబాధ పడుతూ... ఉండేవాడు పట్టాభిరామచంద్రం .ఇప్పుడు పట్టాభిరామచంద్రం వయస్సు ఎని మిది పదులు. వృద్ధాప్యమైనా .. చిన్ని చిన్న రుగ్మతలు తప్ప బలంగానే ఉన్నాడు. తన అన్నకు మరో రెండేళ్లు ఎక్కువ. తప్పని పరిస్థితుల్లో తన అన్న దగ్గరే ఉండవలసి వచ్చిన తన తల్లికి నూరేళ్లు దగ్గర పడుతున్న వయసు!!


" ఒరేయ్ కనకలింగం.. నాకు వయసు ఎనభై దగ్గర పడుతుంది. కానీ నన్ను ఓ ' ధర్మ సందేహం ' పీక్కుని తింటుందని.. నీకు తెలుసుకదా. దానికి నువ్వు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇది ఇంతేనా !!??. సృష్టిలో ధర్మం లేదా??".... నిలదీస్తున్నట్టు అడిగాడు కొలీగ్ కనక లింగాన్ని పట్టాభి రామచంద్రం ." ఇదిగో... రామచంద్రం.. రోజు ఇలా అడిగితే చెప్పడానికి నేను ఏమైనా మహాపండితుడినా?! మన పక్కఊర్లో పురాణపురుషోత్తమ రావుగారు.. ఉన్నారుగా.. శాస్త్రాల్లో ఘనాపాటి. మనల్ని 'ఒరేయ్ ..ఒరేయ్'...... అంటాడు కదా.. పసల పూడి నుండి వస్తుంటాడు. నీకు బాగా తెలుసు కదా. ఈమధ్య మన ఊర్లో శివాలయంలోప్రతిరోజు పురాణం చెప్తున్నాడు. రోజుకు ఒక ఘట్టం!! జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్లిపోదాం.. నీ ధర్మ సందేహానికి సమాధానం ఆయనే చెప్ప గలరు.ఈరోజు వినాయకునికి 'గణనాథుడు' అనే పేరు ఎలా వచ్చింది అన్న విషయం మీద పురాణం. రారా.. కాసేపు అక్కడ కూర్చుని ఆయన చెప్పింది విని పురాణం అయ్యాక పురాణ పురుషోత్తమరావుగారినే ... నీ ధర్మసందేహానికి వివరణ ఇవ్వమని అడుగుదాం"....అంటూ రావి చెట్టు కింద పెద్దలబండ మీద కూర్చున్న మిత్రుడు పట్టాభిరామచంద్రాన్ని బలవంతంగా శివాలయానికి లాక్కెళ్లాడు.... కనకలింగం.


oooooo. ooooooo. ooవీళ్లిద్దరు వెళ్లేసరికి గుడిలో పురాణకాలక్షేపం ముగింపు దశకు వచ్చింది.


" అందుచేత ఈ పురాణ పురుషోత్తమరావు చెప్పేది ఏమిటంటే.. వినాయకునిలా తల్లి దండ్రుల చుట్టూ భక్తితో ముమ్మారు ప్రదక్షిణ చేస్తే ముమ్మారు విశ్వప్రదక్షిణ చేసిన ఫలితం దక్కు తుంది ..అది "సృష్టిరహస్యం" !! కుమారస్వామి ఈ రహస్యం తెలుసుకోకుండా తన వాహనం మీద కష్టపడి కష్టపడి ముమ్మారు విశ్వ ప్రదక్షిణ చేసివచ్చి ఫలితం దక్కక అమాయకుడిలా, వెర్రివాడిలా నోరెళ్లబెట్టాడు.. పాపం...!! ప్రజలారా దీన్నిబట్టి అందరం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే.................." పురాణ పురుషోత్తమరావుగారు ఇంకా ఏదో చెబుతూనేఉన్నారు. ఇంతలో కరెంటు పోయింది!!!!పురాణం ముగింపు సందర్భం కావడంతో జనం అంతా వెళ్ళిపోతున్నారు.దూరంగా నిలబడి ఉన్నారు.. పట్టాభిరామ చంద్రం, కనక లింగం. వాళ్లని చూశాడు పురాణ పురుషోత్తమరావు." రండ్రా... ఇప్పుడే వచ్చినట్టున్నారు. మీరు రోజూ వస్తుండండి ..వయసు పైబడిన వాళ్లు కదా మంచిముక్కలు వినటం ఆరోగ్యానికి మంచిది".పురాణ పురుషోత్తమరావు పలకరింపుతో ఇద్దరూ దగ్గరగా వచ్చి కూర్చున్నారు." మాదొక 'ధర్మసందేహం'.. గురువుగారు"." అడగండ్రా.. తీర్చడానికే కదా నేను ఉన్నది." నవ్వుతూ అన్నారు పురుషోత్తమరావు గారు." పాపాత్ములు ఏ రోగాలు లేకుండా హాయిగా మంచి ఆరోగ్యంతో పిల్లాపాపలతో అష్టైశ్వ ర్యాలతో ఉంటున్నారు. ఇదెలా??? పురాణంలో కథలు ఉదాహరణలుగా చెప్పొద్దు పురుషోత్త మరావు గారు... అలాగే పూర్వజన్మ సుకృతం అని కూడా అనొద్దు.. మాకు తృప్తిగా ఉండేలా వివరణ ఇవ్వండి ".. అడిగాడు పట్టాభిరామ చంద్రం." భలేగుందిరా... రెండుకాళ్లకు రెండుబంధాలు వేసి పరుగుపందెంలో పాల్గొనమన్నాడట!!!.... వెనకటికి..... నీలాంటోడే. అయినా నువ్వు ఈ ధర్మసందేహం ఎందుకు అడిగావో నాకు అర్థంమయిందిలే. నీ కుటుంబసమస్యలు అన్ని నాకు పూర్తిగా తెలుసుగా. నా దగ్గరకి కూడా మీ అన్నదమ్ముల తగువు వచ్చింది. అయినా ఈ వయసులో హాయిగా ఉండకుండా ఎందుకురా నీకీ సందేహాలు.. చచ్చుబండలు!!"భ్రుకుటి ముడుస్తూ అన్నారు పురుషోత్తమరావు గారు." హాయిగా ఉండలేకపోతున్నాను గురువుగారు.

మా అన్న గురించి కాదు కానీ.. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుంది. నేను చాలా సంఘ టనలు గమనించాను. జీవితం చివరి వరకూ ఏ కర్మ అనుభవించకుండా........ పాపాత్ములు కూడా ఎలా హాయిగా ఉంటున్నారో ..నాకు అర్థం కావడం లేదు.. ఇది ధర్మవిరుద్ధం, సృష్టి విరుద్ధం... చెప్పాలంటే దైవతప్పిదంలా నాకనిపిస్తుంది గురువు గారు ఇది ఎట్లా ???"

ఆతృతగా అడిగాడు పట్టాభిరామచంద్రం." నాకు తెలుసురా "నీఅన్న".. నీ పట్లే కాదు సమాజం పట్ల కూడా చాలా తప్పులు చేశాడు. ఇది జగ మెరిగిన సత్యం. అయినా రాజభోగం అనుభవిస్తున్నాడు. నువ్వు దైవభక్తుడువి. నాకు తెలుసుంటుండగాపూజలకు..పునస్కారా

లకు.. బోల్డంత ఖర్చు పెట్టావు.. అయినా నీ పని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు

ఉంది. ఇది ఎట్లా అంటే ??? ఇది ఎట్లా అంటే???.... అంటే? ....కొద్దిపాటి దానాలు చేశావు.. ఊరవతల చిన్న సత్రం కట్టించావు... అయినా ఏదో ఎక్కడో చిన్న తేడా కొడుతుంది రా నీ లైఫ్ లో... అది ఏమిటి అంటే బాగా ఆలోచిస్తే గాని అర్థం కాదు..."... పురాణ పురుషోత్తమరావు.. ఆలోచించి ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు గ్రహించాడు పట్టాభి రామచంద్రం." పాపంపండితే అనుభవిస్తారు"........" దేనికైనా

సమయం రావాలి కదా"....... అనొద్దు గురువు గారు.....పాపం ఎప్పుడు పండుద్ది.? ఎనభై సంవత్సరాలు హాయిగా బ్రతికేసాడు కదా మా అన్న కూడా! పాడి పంటలు, రాజాబంగళాలు,

కార్లు, నౌకర్లు, మణిమాణిక్యాల వైభోగం! నిండు నూరుపాళ్ళ హోదా.. అనుభవించవలసిన

రాజభోగం ఇంకేమీ లేదుగురువుగారు.....ఓ...

కొడుకులు,కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మన వలు... ఇప్పుడు ఈ వయసులో ఇంకా ఏదో ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నాడట!దొడ్లో చిన్న షెడ్డు వేసి అందులో పెట్టాడు నాతల్లిని. మా అమ్మకు ఎంత కష్టం వచ్చిందో చూడండి.. ఎంత నరకం అనుభవిస్తుందో చూడండి..

వాడు మూర్ఖుడు కాదంటారా? పాపాత్ముడు కాదంటారా? దేవుడికి దండం పెట్టడువీడు..

అయినా దేవుడు బాగానే చూస్తున్నాడు. ఇదేమి బాగోలేదు పురుషోత్తమ రావు గారు"... ...ఊగిపోతూ అన్నాడు పట్టాభి రామచంద్రం." ఒరేయ్.. నువ్వు చాలావేడికాక మీద ఉన్నావు. ఈ పరిస్థితుల్లో నీకు చెప్పినా అర్థం అవ్వదు."" వద్దు గురువుగారు.. చెప్పొద్దు.. మే వెళ్తాం..

మరోసారి కలుస్తాం.... ." సమాధానం విన కుండానే తన కొలీగ్ కనకలింగంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు పట్టాభి రామచంద్రం.


పురాణ పురుషోత్తమరావు వేదాంత ధోరణిలో నవ్వుకున్నాడు.


000000 0000000 00


కొన్ని రోజుల తర్వాత

" హలో... కనకలింగం అన్నయ్యగారు.. నేనండీ సావిత్రిని.. మీ బావగారు.. కళ్ళుతిరిగి పడిపో యారు." పట్టాభిరామచంద్రం భార్య ఫోన్ కాల్ తో అంతే పరుగున వచ్చాడు కనకలింగం. వెంటనే ఇద్దరూ కలిసి దగ్గర్లోని పెద్దాస్పటల్ కి తీసు కెళ్లారు. డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంచి అవసరమైన హెల్త్ చెక్అప్ లు చేశారు. సాయం త్రానికి రిపోర్ట్స్ వచ్చాయి.' వ్యాధి ఏదైనా ఎట్టి పరిస్థితిలోనూ మూడు నెలలు మించి బ్రతకడం కష్టం'.....అదీ సారాంశం. తను విషయం తెలుసుకొని.. నీరస పడ్డాడు పట్టాభి రామచంద్రం.... మందులు తీసుకున్నారు." ఏం చేస్తాం.. ఇన్నాళ్ళు బ్రతికాను ..చాలు ఎటొచ్చి మీ చెల్లెలుకు ఒక ఇల్లు కూడా కట్టించ లేకపోయాను. అది ఒకటే బాధరా కనకలింగం. పంపకాల్లో వచ్చిన ఇంటి భాగం కూడా నిల బెట్టలేకపోయాను. సరే వెళ్లి పోదాం నడ వండి". .. పైకి లేచాడు హాస్పిటల్ బెడ్ మీద నుండి పట్టాభి రామచంద్రం." ఆటో మీద వెళ్దాం"అన్నాడు సహాయానికి వచ్చిన కనుకలింగం." వద్దు బాగానేఉంది నడవగలను."" పోనీ... స్ట్రెచర్ మీద గేటు వరకు దిగబెట్ట మని అడగనా.. ?"" వద్దురా నెమ్మదిగా వెళ్దాం."పట్టాభిరామచంద్రం కనకలింగం సహాయం

తో నెమ్మదిగా హాస్పటల్ మెట్లు దిగుతు న్నాడు ... ఓ పక్క.


మరోపక్క.. ఒకవృద్ధురాలిని పట్టుకొని నెమ్మ దిగా నడిపించుకుంటూ ఇద్దరు మనుషులు హాస్పటల్ లోకి వస్తున్నారు." రామచంద్రం.. అదిగో రా మీ అమ్మ." చూపిం చాడు కనకలింగం." అమ్మ.... నాకు అన్యాయం చేసింది కదా. ఒక పక్షాన చేరి నాతో యుద్ధం చేసింది. ఎవరో ఒకరు పక్షాన చేరితే.. చివరి జీవితం అంతా బాగుంటుం దని పెద్ద కొడుకు బెదిరింపులతో.. వాడి పక్షాన చేరి.. వాడు చెప్పినట్టు తందాన తాన అంటూ నాపై పోలీసు కేసు కు కూడా సై సై అంది. అబద్ధపు సాక్ష్యం చెప్పింది. ప్రపం చంలో అసలు చెడ్డతల్లి ఉండదంటారు. ఈమాట నిజంగా అబద్ధం రా. పెద్ద కొడుకు చెప్పినట్టు కోర్టులో కూడా జడ్జిగారి ముందు ఆయన మనసు కరిగేలా అబద్ధపు నటన చేసింది. కన్నతల్లి ఇలా చేయొచ్చా????"

కోపంతో కూడిన కసితో కూడిన క్రోధంతో కూడిన విధంగా అన్నాడు... పట్టాభిరామచంద్రం.


" ఇప్పుడు అవన్నీ ఎందుకురా. ఏ తల్లి అయినా పరిస్థితుల ప్రభావంతో ఒక్కోసారి అలా మారవచ్చు. అది తాత్కాలికం...

ఎంతైనా తల్లితల్లే . నీ పరిస్థితి అసలు బాగుండ లేదు. ఆ విషయాలు, ఆలోచనలు పక్కన పెట్టు. ఓసారి 'అమ్మా ' అని పలకరించి చూడు..... ఆవిడ ఆనంద పడిపోతుంది."" వద్దురా పలకరిస్తే.. మళ్లీ కొట్టడానికి వచ్చానని

దొంగకేసు పెట్టి దొంగసాక్ష్యం ఇస్తే."" గతం ఎందుకులే.. తల్లి కదా."అనునయంగా అన్నాడు కనకలింగం" కనకలింగం..ఇలా చెప్పి మా తల్లి కొడుకులను కలపాలని ఇప్పటికి నువ్వు చాలాచాలా ప్రయ త్నాలు చేశావు. నా గుండె బాధ నీకు ఏం తెలు సురా...ఆ... కొడుకు కదా అన్న బుద్ధి ఆవిడకు ఉండాలి కదా...తల్లికి ఆస్తి ఉంటే బాగుంటుం దని.. పంపకాల్లో ఆవిడకు ఆస్తి దక్కేలా నేను చేస్తే.. ఆమెకు వచ్చిన భాగం అమ్మేసి డబ్బు కాజేశాడు ఆ పెద్దకొడుకు వెధవ! అయినా ఈవిడకు బుద్ధి రాలేదు. ఏమైందిప్పుడు.......

కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకొచ్చి చూపిం చడం లేదు... అదిగో పనోళ్ళు చేత నా తల్లిని పంపించాడు. ఎంతపాపం చేస్తున్నాడో చూడరా

ఆ పాపాత్ముడు మా అన్న.... ఛి 'అన్నా' అని అనడానికి నాకు సిగ్గుగా ఉంది.. అయినా దేవుడు వాడినే రక్షిస్తున్నాడు. అసలు ఇట్లా ఎట్లా జరుగుతుంది? అన్న దాని రీజన్తెలియ కుండానే నేను చచ్చిపోతానా? అది నా బాధ."ఇలా అంటూ...పట్టాభిరామచంద్రం.. తల్లిని దూరం నుండే చూస్తూ గమనిస్తున్నాడు. ఆమె కొన్ని మెట్లు ఎక్కాక నీరసపడితే... కూడా వచ్చినవాళ్ళు ఆమెను పైకెత్తి లోపలకు మోసుకు వస్తున్నారు. ఆమె ముఖం మాత్రం చాలా ధైర్యంగా ఉంది. ,' నీ కర్మ అనుభవించు'

... అంటూ కదిలాడు పట్టాభి రామచంద్రం.oooooo. oooooo. ooooనెల గడిచింది.ఆరోగ్యం పరిస్థితి లోపల విషమిస్తున్న.. కాస్త స్థిమితంగానే ఉన్నాడు పట్టాభిరామచంద్రం. ప్రతిరోజు కనకలింగం వచ్చి తోడుగా ఉంటు న్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఎక్కడో దూర ప్రాంతం లో ..ఇతర దేశాల్లో ఉంటున్నాడు..

పుష్కర కాలం నుండి మాతృదేశాన్ని పట్టించు కోకుండా."ఒరేయ్ కనకలింగం ఒకసారి రాజమండ్రి వెళ్దాంరా" ." ఇప్పుడా... ఎందుకు.... రాగలవా?"" చివరిరోజులు కదా ఒకసారి అలా తిరుగు దామని ఉంది. నువ్వు వెంట ఉంటే పర్వా లేదు. ఎలాగోలా నెమ్మదిగా రాగలను ".రాజమండ్రి వెళ్లారు.. ఇద్దరు." గోదావరి.....' వేదంలా ఘోషించే గోదావరి' .. .. అన్నాడు.. ఒక మహానుభావుడు ఎంత అందంగా ఉందో చూడు. చాలురా.... నాకు చాలా ఆనందంగా ఉంది . ఇప్పుడు ఒకసారి వెంకటసచ్చి దానందస్వామి వారిని కలిసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోదాం."అన్నాడు పట్టాభి రామచంద్రం." ఇప్పుడా.. . గోపాలమఠం వెళ్లాలి.... అయినా ఆయనతో పని ఏమిటి?"" చచ్చిపోయే ముందు ఒక 'ధర్మసందేహం'..... తీర్చుకోవాలిరా"." అర్థమైంది. నువ్వు వచ్చిన సంగతి అదన్న మాట.ఇంకా ఎందుకురా ఆ 'తలంపు' వదిలేయ వచ్చుగా."అంటూ ఆపాలి అన్న ప్రయత్నంలో చెప్పాడు కనకలింగం" కూడదురా.. వెళ్దాంపద... ఆయన ఏం చెబు తారో." ఇద్దరూ వెళ్లారు. వెంకటసచ్చిదానంద స్వామివారు చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. పళ్ళుపూలు పాదాలదగ్గర పెట్టి నమస్కరించాడు పట్టాభిరామచంద్రం." స్వామి ఒక ధర్మసందేహం తీర్చుకుందామని వచ్చాము".నవ్వారు.. వెంకటసచ్చిదానందస్వామివారు." పాపాత్ములు సమస్యలు లేకుండా చిరకాలం ఆనందంగానే ఉంటున్నారు రోజు రోజు అభి వృద్ధి చెందుతున్నారు. పాప ఫలితం అనుభ వించడం లేదు. వచ్చే జన్మలో అనుభవిస్తే ఏముంది స్వామి .ఈ జన్మలో వాళ్లు చేసిన పాపం ఈజన్మ లోనే అనుభవించాలి కదా. అలాగైతే కదా అతని వల్ల దగా పడ్డవాళ్ళు.. కష్ట పడ్డ వాళ్ళు.. నష్టపడ్డ వాళ్లు.. అది చూచి వాళ్లు కూడా జాగ్రత్తగా ఉంటారు. అలా కాకుండా సృష్టికి విరుద్ధంగా జరుగుతుంది ఏమిటిస్వామి. ఇదే జీవితంలో చిట్టచివరగా నాకు మిగిలిన ధర్మసందేహం." వివరంగా వివరించాడు వెంకటసచ్చిదానంద స్వామి వారికి పట్టాభిరామచంద్రం" నాయనా.... నాకు పూలు పండ్లు తెచ్చావు. నా అనుచరులు తీసుకుని లోపల పెట్టారు. వాళ్లు నీకు మంచి తీర్థం అందించారు. బయట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది... దాన్ని నువ్వు కనీసం ముట్టలేదు... ఎందుచేత?"."అదేమిటి స్వామి దానికి దీనికి సంబంధం ఏమిటి?"" ఉంటుంది నాయన నువ్వు అడిగింది అతి సూక్ష్మ ధర్మసందేహం. దానికి సమాధానం నేను చెప్పినా నీకు అర్థం కావాలంటే ముందు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసు లో మలినం అసలు ఉండకూడదు."వెంకట సచ్చిదానంద స్వామి వారు చిద్విలాసంగా అన్నారు." అదేమిటి స్వామి మంచినీళ్ళు తాగకపోతే నాలో మలినం ఉన్నట్టా?"" నీ ఆలోచన పవిత్రంగా ఉంటే వెంటనే దాహం తీర్చు కొంటావు. అది వక్రంగా ఉంటే.. ఏ పని నీకు మనసారా చేయాలనిపించదు. ఏం చెప్పిన.. అర్థమూ కాదు"." వేదాంతమా స్వామి.. సరే స్వామి నేను మళ్ళీ వస్తాను." పైకి లేచిపోయాడు పట్టాభి రామ చంద్రం." నీ ప్రశ్నకు సమాధానం.. నా దగ్గర ఉంది."

నమ్మకంగా చెప్పారు వెంకటసచ్చిదానంద స్వామి వారు." లేదులే స్వామి.. ఈసారి వస్తాగా.".. పట్టాభి రామచంద్రం.. కనుకలింగానికి సైగ చేశాడు. ఇద్దరు బయటకు వచ్చేస్తారు.ooooooo oooooooo. ooooమరో రెండు నెలలూ గడిచిపోయాయి." హలో.. 'సందేహనివృత్తి' కార్యక్రమం.నుండి యాంకర్ స్వర్ణలత మాట్లాడు తున్నాను....

.చెప్పండి మీ పేరు..?"" నమస్తే. నా పేరు పట్టాభిరామచంద్రం... నేను

రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. మేడమ్ నేను చాలాసేపటినుండి ట్రై చేస్తు న్నాను. ఫోన్ కలవడం లేదు. బాబాజీగారితో.. మాట్లాడాలి."" ముందు మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించు కోండి. రామచంద్రంగారు.. మీ ప్రశ్న అడ గండి ... బాబాజి గారిని"." హలో ..బాబాజీగారు.. ముందుగా మీకు మన స్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్."" సంతోషంగా ఉండండి రామచంద్రంగారు. మీ ప్రశ్న అడగండి."" బాబాజీగారు ..బాబాజీగారు..."రామచంద్రం కాల్ కట్ అవుతుంది అన్న భయంతో ఆతృతగా చెప్ప నారంభించాడు." వినబడుతుంది రామచంద్రంగారు.. మీరు బాబాజీ గారితో మాట్లాడండి. మీరు మీ టీవీ వాల్యూమ్ ఇంకా తగ్గించి బాబాజీ గారిని ప్రశ్న అడగండి."అటు నుంచి యాంకర్ స్వర్ణలత కంగారు పెడుతుంది.." హలో.. హలో.."ఆత్రుత పెరిగిపోతుంది పట్టాభి రామచంద్రం లో." వినిపిస్తుంది సార్. బాబాజీగారు వింటు న్నారు. ప్రశ్న అడగండి."" హలో.. బాబాజీగారు.. నాదో 'ధర్మసందేహం' సార్" హలో ..హలో.. హలో.."" మాట్లాడండి రామచంద్రంగారు.. బాబాజీగార్ని

అడగండి.. హలో ..హలో ..హలో.. లైన్ కట్ అయింది"చిరాగ్గా టీవీ ఆఫ్ చేశాడు.. పట్టాభిరామచంద్రం.

కానీ అప్పటికే తను కుర్చీలో ఒక పక్కకు ఒరిగిపోయిన విషయం తెలుసుకోలేకపోతు న్నాడు .పట్టాభిరామచంద్రం భార్య సావిత్రి ఫోన్ కాల్ తో.... కనకలింగం వచ్చేసాడు. అంబులెన్స్ తెప్పించి అతని భార్య సహాయంతో వెంటనే హాస్పటల్ లో చేర్పించాడు.డాక్టర్స్ ఎమర్జెన్సీ వార్డులో పరీక్షించారు. పెద్ద డాక్టరుగారు కేస్ షీట్ చూసి పెదవి విరిచారు.." చెప్పానుకదా.. నేను చెప్పిన గడువు అయి పోయింది. మనిషికి స్పృహ వచ్చింది. సృహ లోనే ఉంటాడు.. కానీ ఇక 48గంటలు మించి బ్రతకడు. కావలసిన వాళ్లను రప్పించండి.

జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లిపొండి." పట్టాభి రామచంద్రానికి షేక్ హ్యాండ్ ఇచ్చి , భుజంతట్టి వెళ్లిపోయారు డాక్టరుగారు." ఇంటికి వెళ్ళిపోదాంరా కనకలింగం. ఆ స్ట్రెచర్లు,అంబులెన్సు.. వద్దు. నాకు అదోలా ఉంటుంది. పర్లేదు.. నడవగలను.. మీరిద్దరూ చెరోపక్క పట్టుకుంటే చాలు.రోడ్డువరకు... నెమ్మదిగా వెళ్లి ఆటోఎక్కి ...ఇంటికి... వెళ్ళి పోదాం." పట్టాభి రామచంద్రం ఆయాసపడు తూ భార్య , కనకలింగం సహాయంతో.. నెమ్మ దిగా.. హాస్పటల్ మెట్లు దిగుతున్నాడు.మళ్లీ... అతని తల్లిని ఎవరో మోసుకొస్తూ హాస్పటల్ లోనికి ప్రవేశిస్తూ మెట్లు ఎక్కిస్తున్న సన్నివేశం!!!కూడా.. పెద్దకొడుకు ఉన్నాడేమోనని పరికిం చాడు పట్టాభిరామచంద్రం. అబ్బే లేడు. చి చి.. పాపాత్ముడు.. నీచుడు.. చండాలుడు.. తల్లిని గాలికి వదిలేశాడు......ఆలోచనలతో ఆయాసం వచ్చి ఆవేశంగా గట్టిగా దగ్గు కొన్నాడు... పట్టాభి రామచంద్రం బయటకు వెళుతూ.లోపలకోస్తూ అతని తల్లి... ఆ శబ్దానికి ఇటు వైపు ముఖం తిప్పి చూసింది." తననే చూసిందా????!!!" ఉలిక్కిపడ్డాడు.ఆమెకు తాను కనిపిస్తున్నానో లేదో గానీ... ప్రస్ఫుటంగానే.... చూస్తూ ఉంది!!ఆమె నవ్వుతుంది కూడా. అది.. మామూలు నవ్వా... లేక పళ్ళు ఊడిపోవడం వలన.. దవ డలు లోపలకు పోయిన బాపతు సందర్భమో.. తెలియదు గానీ మొత్తానికి తనను చూసి....


." నేను బాగున్నాను.. నువ్వు బాగున్నావురా చిన్నోడా.."... అంటూ ప్రేమగా పలకరిస్తు న్నట్టు....గానే.. నవ్వుతున్నట్టు గానే తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నట్టుగానే... ఉంది ఆ మోము!!.ఒక క్షణం..... శరీరం జలదరించింది పట్టాభి రామచంద్రానికి...!' సృష్టి '.... స్తంభించినట్టు అయిపోయింది.!!ఆ స్తంభన లోంచి ఒక కాంతిపుంజం...ఆమె నవ్వును తాకి...ఆనవ్వు ...తన...'ధర్మ సందే హానికి'......సమాధానంగా తన ముందుకు

దూసుకువస్తున్నట్టు అనిపించింది...పట్టాభి రామచంద్రానికి!!!!.


తల్లి తన కళ్ళలోకి చూసిన ఆ తన్మయత్వపు

చూపుకి ఒక అద్భుతమైన కాంతిపుంజం తన మెదడు లోకి ప్రవేశించి అది తన మెదడును పూర్తిగా ప్రక్షాళన చేసిన అనుభూతి కలిగింది

పట్టాభి రామచంద్రానికి.


3 నెలల క్రితం....పురాణ పురుషోత్తమరావు ప్రవచనంలో చెప్పింది గుర్తొచ్చింది.....పట్టాభి రామచంద్రానికిి....' వినాయకుడు తన తల్లి దండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే విశ్వ ప్రదక్షణ చేసిన ఫలితం దక్కేేసిందని అప్పుడు ఆయన చెప్పగానే ఎగతాళిగా విన్నాను. పురాణ సంఘటనలు మానవ జీవితాలకు వరాలుగా మార్చుకొని అన్వయించుకోవాలి అన్న భావం అర్థం చేసుకో లేకపోయాను '.... చెంపలు వాయించు కొన్నాడు!!2 నెలల క్రితం....వెంకటసచ్చిదానందస్వామి..అలా అలా మదిలో మెదిలాడు... ' మానసిక ప్రశాంతత అన్ని సమస్యలకు పరిష్కారం చూపి స్తుంది'...... అన్న భావం వచ్చేలా ఆయన చెప్పింది.... వృద్ధుడనై ఉండి కూడా పెడచెవిని పెట్టాను.'. ... తల బాదుకున్నాడు... పట్టాభి రామచంద్రం!!!"నాఅన్న ....పాపాలుచేశాడు....కానీ..మంచిగానో.... చెడుగానో మొత్తానికి “తల్లిరుణం” తీర్చు కుంటున్నాడు. అందుకనే అతను బాగున్నాడు

.. హాయిగా ఉన్నాడు. అతను పాపాత్ముడే !! పాపాత్ముడే!!!కానీ ..కానీ....ప్రతిరోజులో 24 గంటలూ అన్నను ఆడిపోసుకుంటూ నేను మొత్తం జీవితమంతా గడిపేశాను... అతను మీద కసితో, క్రోధంతో కత్తులు నూరుతూనే బ్రతికాను కానీ .... ఆ బ్రతకడంలో అసలు విషయమే మరచిపో యాను.అతను... నా అన్న....పాపాత్ముడు అయితే....

" నేనెవర్ని??? నేనెవర్ని????"!!!9 నెలలు గర్భాశయంలో నన్ను నవమాసాలు మోసి జన్మ నిచ్చిన తల్లిరుణం తీర్చుకోని..

నేను.. నేనెవర్ని???నేనెవర్ని?తన శరీరం 'చితాభస్మం' కావడానికి కొద్దిగంటల ముందు... పట్టాభిరామచంద్రం ప్రశ్నించుకుంటు న్నాడు...????!!!!

ooooooo.

అమ్మ ..'విలువ'.. తెలియజెప్పే పాఠాలు, కథలు పాఠ్య పుస్తకాలలో ..ఉంచాలనేది

నా అభిప్రాయం.


రచయిత

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


181 views0 comments

コメント


bottom of page