top of page

అనర్ఘ రత్నం'Anargha Rathnam' - New Telugu Story Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 12/02/2024  

'అనర్ఘ రత్నం' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


వుమ్మడి ఆంధ్రప్రదెశ్కి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఆ తరవాత దేశ ప్రధానిగా వున్నత శిఖరాలను అధిరోహించిన బహుభాషాకోవిదుడు, పండితుడు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు. 


వారికి దేశ వున్నత సత్కారం "భారత రత్న" ఇవ్వడం సముచిత నిర్ణయం. 


ఈ సంవత్సరం 5 గురు ప్రముఖులకు ఈ సత్కారం లభించడం అందరికి ఆనంద దాయకం. 


ఇంతటి గొప్ప వ్యక్తి పీవీగారిని దర్శించుకోడంలో నాకూ ఒక అనుభూతి ఉందీ అంటే గర్వముగా వుంది. అదెలాగో మీతో పంచుకుంటాను. 


 పీవీ గారికి సాహిత్యం అంటే మహా ప్రీతి. అప్పటి తరంలో పుస్తకాలు చదవని కుటుంబాలు లేవు. అప్పటి

రచయితలు పాండిత్యం తెలిసినవారు. తెలుగు, సంస్కృతంలో ఉద్దండులు. అప్పటి భాష గ్రాంధికంలో రాసినా అర్ధం చేసుకునే పాఠకులూ ఉండేవారు. 


అయిదో క్లాసునుంచే పెద్దవాళ్ళు పిల్లల చేత చదివించడం,

అర్ధం చెప్పడం వుండెదిట. తాతలనుంచి మొదలై తండ్రులు, పిల్లలు, మనవలు రామాయణ, భారత, భాగవత

కథలను చదివించేవారు.... అని చెబుతూ మా నాన్నగారు కూడా మా చేత చదివించేరు. 


అంతేకాకుండా ఆనాటి ప్రముఖ రచయితలు విశ్వనాథ, అడవిబాపిరాజు, బెంగాలీ రైటర్స్ ఐన ప్రేమ్చంద్, శరత్ నవలలు, కథలు ఇంకా ఎందరో రచయితల గ్రంధాలు నాన్నగారి స్వంత ఇంటి గ్రంధాలయంలో ఉండేవి. వాటిని వదలకుండా చదివి మంచి చెడూ చర్చలు జరిపేవాళ్ళం. అలా పఠనాసక్తి ఒకభాగమైపోయిన్ది. లోక జ్ఞానమూ అలవడింది. ఆరోజుల్లో సాహిత్యం అందరి మనసుల్లోనూ స్థిర నివాసం ఏర్పరచుకోడం సామాన్య విషయంగా ఉండేది. 


మా నాన్నగారు కూడా అలాగే చదవడం మొదలుపెట్టి మాకూ అలవాటు చేశారు. అందులో వారిది టీచింగ్ ప్రొఫెషన్. ఇకనేం.. వారు కూడా రచయిత అయ్యారు. వారు చాలావరకూ పురాణ గ్రంధాలనే పునాదిగా చేసుకుని రాశారు. అయితే భాషలో మార్పు తీసుకువస్తూ కొన్ని రచనలు చేశారు. అలాంటి ప్రయోగంలో భారత భాగవత రామాయణ గ్రంధాలను ప్రచురించి వాటిని అప్పటి విద్యా శాఖా మంత్రి పీవీ గారు ఆవిష్కరించడం మా కుటుంబ సభ్యులకు మరువలేని జ్ఞాపకం. 


అప్పటి మంత్రులు కర్తవ్య దీక్షతో, పనిపట్ల బాధ్యత, నిబద్టత వున్నవారు. అలాంటి తీరికేలేని వ్యక్తి పీవీగారు. ఇష్టమైన సాహితీ సమావేశాలకు తప్పక వచ్చేవారు. నాన్నగారి కోరిక మన్నించి కొంత సమయాన్నీ కేటాఇంచడం వారి విజ్ఞతకు నిదర్శనం. 

 మా నాన్నగారు మమ్మల్ని పరిచయం చేస్తే దగ్గిరకు తీసుకుని ఆశీర్వదించడం మా అదృష్టంగా అనుకున్నాము.. ఇప్పుడు తలచుకుంటే ఆక్షణాలు అపురూపమైన వరంగానూ భావిస్తున్నాము. 


''పదవులు శాశ్వతంకాదు. ఆపదవికే వన్నె తెచ్చే మహానుభావులు కొందరు వుంటారు. అది పీవీ గారు '' ఎదుటివారికి గౌరవం ఇవ్వడం తానూ పొందడం'' అంటే ఎంత గొప్ప విషయం!


 దేశ దేశాలు కీర్తించిన ఘనుడు. కాంగ్రెస్లో చేరి చివరి శ్వాసవరకూ ఆపార్టీకోసం, దేశ ప్రజలకోసం పాటుపడిన గొప్ప మనిషి పీవీగారు. వారికి హృదయ పూర్వక అభినందనలు. **********************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


49 views1 comment

1 Kommentar


పీవీ నరసింహారావు గారి గురించి చాలా బాగా రాశారు. మీకు ధన్యవాదాలు.

Gefällt mir
bottom of page