పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం

Polayya Kavi Kukatlapalliki Sahithi Satkaram -|Special Telugu Article| Polayya Kavi
పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం - తెలుగు వ్యాసం |పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 03/10/2026
డా. జి.వి. రత్నాకర్ గారి "బాబాసాహెబ్ డైరీ" పుస్తకావిష్కరణ సభలో కవితా గానం... పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం
హైదరాబాద్: అక్టోబర్ 1
చిక్కడపల్లిలోని త్యాగరాజ గాన సభలో విమల సాహితి సమితి వ్యవస్థాపకులు డాక్టర్ జల్ది విద్యాధర్ ఆధ్వర్యంలో, డా. బిక్కి కృష్ణ అధ్యక్షతన డా. జి.వి. రత్నాకర్ రచించిన "బాబాసాహెబ్ డైరీ" తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనువాద పుస్తకాల ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా డా. కోగంటి ఉషారాణి, డా. ఝాన్సీ ముడుంబై, శ్రీలత ధావన్‌లు సమన్వయకర్తలుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవి, రచయిత, నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని...
"రక్తపాతమా..? రాజ్యాధికారమా..?" శీర్షికతో సందేశాత్మక కవితను గానం చేసి, ఆహుతులను అలరించారు...
అంతేకాక, అనతి కాలంలోనే 5000 కవితలను రాసి విశేషమైన సాహిత్య సేవ చేస్తున్నందుకు గుర్తింపుగా పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ, డాక్టర్ జల్దీ విద్యాధర్‌లు పోలయ్య కవి కూకట్లపల్లిని ఆత్మీయంగా, అభిమానంతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ "బాబాసాహెబ్ డైరీ" మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. మారేపల్లి భువనేశ్వరి చక్కగా పుస్తక సమీక్ష చేశారు.
ఈ పుస్తక ప్రచురణకర్త పామిడి సుధీర్ రెడ్డి, డా. బిక్కి కృష్ణ, డా. జల్దీ విద్యాధర్ రచయిత గురించి, అంబేద్కర్ గురించి చక్కని ఉపన్యాసాలు చేశారు.
చివరలో కొలకలూరి ఇనాక్ డా. బి.ఆర్. అంబేద్కర్, హిందూ కోడ్ బిల్లు గురించి అందరి హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన, చక్కని ప్రసంగం చేశారు.
తదనంతరం అతిథులను, అంబేద్కర్ పై కమ్మని కవితలను గానం చేసిన కవులను, కవయిత్రులను కొలకలూరి ఇనాక్, బిక్కి కృష్ణ, జల్ది విద్యాధర్‌లు ఎంతో
ఓపికతో, సహనంతో, చిరునవ్వులతో అందరినీ ఘనంగా సన్మానించారు.
చివరగా పుస్తక రచయిత డాక్టర్ జీ.వి. రత్నాకర్ సంక్షిప్త స్పందనతో, వందన సమర్పణతో, తీపి జ్ఞాపకాలతో
సభ దిగ్విజయంగా ముగిసింది.







-పోలయ్య కవి





Comments