top of page
Original.png

ఏదో మన పిచ్చి కానీ!

40 minutes ago
2 min read

“ఏదో మన పిచ్చి కానీ!” తెలుగు వ్యంగ్య రచనకు సంబంధించిన చిత్రం. ఒక మధ్యవయస్కుడు తన జీవితాన్ని సూచించే నోట్‌బుక్ చేతిలో పట్టుకుని ముందుకు నడుస్తుండగా, ఇరువైపులా ఉన్న వ్యక్తులు అతని ప్రతి పనిని గమనిస్తూ వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నట్లు చూపించారు. వెనుక ప్రేక్షకులు అతని జీవితానికే కథ, స్క్రీన్‌ప్లే రాస్తున్నట్లు ప్రతీకాత్మకంగా కనిపిస్తుండగా, అతను వాటిని పట్టించుకోకుండా వెలుగుతో నిండిన తన మార్గంలో ముందుకు సాగుతున్నాడు. అందరినీ మెప్పించడం కంటే మనసుకు నచ్చేలా జీవించాలనే భావాన్ని చిత్రం ప్రతిబింబిస్తుంది.

Edo Mana Pichhi kanee - Telugu Inspirational Article | Kotha Viritha

ఏదో మన పిచ్చి కానీ! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 02/10/2026



మనం మంచిగా ఉంటే “బిల్డప్ ఇస్తున్నాడు” అంటారు.

చెడుగా ఉంటే “ఇదే అసలు క్యారెక్టర్” అంటారు.

నవ్వితే “ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు” అంటారు.

మౌనంగా ఉంటే “పొగరెక్కింది” అంటారు.


సహాయం చేస్తే “పేరు కోసం చేస్తున్నాడు” అంటారు. 

చేయకపోతే “మనసే లేదు” అంటారు.

గెలిస్తే “అదృష్టం కలిసొచ్చింది” అంటారు. 

ఓడితే “సత్తా లేదని అప్పుడే తెలుసు” అంటారు. 


మన పని మనం చేసుకుంటే “ఎవరినీ లెక్కచేయడు” అంటారు.

అందరితో కలిస్తే “అందరినీ మెప్పించాలనుకుంటున్నాడు” అంటారు.


అంటే మొత్తానికి… మనం ఏం చేసినా కామెంట్‌కి కొరత ఉండదు.


మన జీవితానికి మనమే దర్శకులమని అనుకుంటాం…

కానీ ప్రేక్షకులుగా కూర్చున్నవాళ్లే కథ, స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్ అన్నీ రాసేస్తారు.


అందరినీ మెప్పించాలనే ప్రయత్నం అంటే, ప్రతిరోజూ మనల్ని మనమే నిరాశపరచుకోవడం.


మనం ఎంత మంచిగా ఉన్నా, ఎవరో ఒకరి అభిప్రాయంలో మనం తప్పుగానే ఉంటాం. అందుకే అందరికీ నచ్చేలా కాదు… మనసుకు నచ్చేలా బ్రతకాలి.

ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా, “ఇతను ఇలా ఉండాల్సింది” అని చెప్పేవాళ్లు ఉంటారు.


ఏదో మన పిచ్చి కానీ…  "బ్రతికున్నప్పుడే బ్రతికేద్దాం".

మన కథ మనం రాసుకుందాం… 

మిగతావాళ్ల పని ఎలాగూ కామెంట్ చేయడమే కదా!


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page