top of page
Original.png

మోనోపలి - ఆధిపత్యం కోసం పోరు - పార్ట్ 2

1 hour ago
4 min read

మోనోపలి ఆధిపత్య పోరులో రైతుల అండతో రొట్టెల బండి నడుపుతున్న గోపమ్మ, పక్కన గోపి, ఎదురుగా హోటల్ యజమాని హరిశ్చంద్రరావు

Monopoly - Adhipathyam Kosam Poru - Part 2 - Telugu Inspiraational Story | Sritha

మోనోపలి - ఆధిపత్యం కోసం పోరు - పార్ట్ 2 - తెలుగు ప్రేరణాత్మక కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 02/10/2026


“మోనోపలి – ఆధిపత్యం కోసం పోరు | పార్ట్ 2” చిన్న వ్యాపారం, స్వయం ఉపాధి, పోటీ మరియు ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో సాగే కల్పిత తెలుగు సామాజిక కథ. తనకు తెలిసిన రొట్టెల పనితో గౌరవంగా జీవించాలనుకున్న గోపమ్మకు ఎదురైన అడ్డంకులు కథను ఆసక్తికర మలుపుల్లోకి తీసుకెళ్తాయి. రైతులు, వినియోగదారులు ఆమెకు అండగా నిలవడంతో ఒక చిన్న రొట్టె బండి మనుషుల మధ్య అనుబంధానికి ప్రతీకగా మారుతుంది. ఆధిపత్యం కోసం సాగే పోరాటం ఎంత దూరం వెళ్లగలదనే ప్రశ్నను కథ పాఠకుల ముందుంచుతుంది.




మోనోపలి - ఆధిపత్యం కోసం పోరు - పార్ట్ 2 చదవండి


పాఠకులకు ఒక చిన్న గమనిక 🙏

మోనోపలి… ప్రతిభపై పెత్తనమా? పార్ట్ వన్ చదివారు కదా. ఆ కథ ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు. ఒక మనిషి మోనోపలీ కోసం, ఆధిపత్యం కోసం ఎంతవరకు తెగించగలడో ఊహించి రాసిన పూర్తిగా కల్పితమైన కథ మాత్రమే.

అదే ఆలోచనను కొనసాగిస్తూ రాసినదే

“మోనోపలి – ఆధిపత్యం కోసం పోరు | పార్ట్ 2.” ఇది కూడా పూర్తిగా కల్పితమైన కథే. ఇందులోని పాత్రలు, సంఘటనలు ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు.

పాఠకులు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 🙏


మోనోపలి – ఆధిపత్యం కోసం పోరు | పార్ట్ 2

రమేష్ ఒక రైతు. చిన్న గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. కానీ పంటలు సరిగ్గా పండకపోవడంతో కుటుంబంతో కలిసి పట్టణానికి వలస వచ్చాడు.

రమేష్, అతని భార్య రమణి కూలీనాలి చేసుకుంటూ జీవించసాగారు.

రమణికి రొట్టెలు చేయడం బాగా వచ్చు. ఒకరోజు ఆమె పనిచేసే ఇంట్లో రొట్టెలు కావడంతో,

“నాకు వచ్చమ్మా… నేను చేస్తాను,” అంది.

ఆమె చేసిన రొట్టెలు తిన్నవాళ్లు,

“అబ్బా! చాలా బాగున్నాయి. ఇంత మెత్తగా, కమ్మగా ఉన్నాయి!” అంటూ మెచ్చుకున్నారు.

కొన్నాళ్లకు రమేష్‌కు కూడా కూలి దొరకడం కష్టమైంది.

“మన దగ్గర రొట్టెలు చేసే నైపుణ్యం ఉంది కదా. నేను రొట్టెలు చేసి అమ్ముతాను,” అంది రమణి.

అలా ఒక చిన్న బండి పెట్టుకుని రొట్టెలు మాత్రమే అమ్మడం మొదలుపెట్టింది. కూరలు లేవు… హంగు ఆర్భాటం లేదు. పొయ్యి మీద కాల్చిన వేడివేడి జొన్న రొట్టెలే!

మొదటి రెండు రోజులు పెద్దగా ఎవరూ రాలేదు. కానీ రమణి వెనక్కి తగ్గలేదు.

మూడో రోజు నుంచి రుచి నోటా నోటా పాకింది. సాయంత్రం ఏడు గంటలకల్లా ఆమె బండి ముందు పెద్ద క్యూ కనిపించేది.

అదే దారిలో హోటల్ నడుపుతున్న హరిశ్చంద్రరావు ఈ రద్దీని గమనించాడు.

“నా హోటల్ దగ్గర కూడా ఇంత క్యూ ఉండదు కదా!” అనుకున్నాడు.

డ్రైవర్‌ను పంపి విషయం తెలుసుకున్నాడు. రొట్టెలు తెప్పించుకుని తిన్నాడు.

రుచి, మెత్తదనం, ఆకారం… అన్నీ అతనికి నచ్చాయి.

“ఈమె మన హోటల్లో రొట్టెలు చేస్తే వ్యాపారం ఇంకా పెరుగుతుంది,” అనుకున్నాడు.

వెంటనే రమణిని పిలిచి మంచి జీతం ఇస్తానని చెప్పాడు. రమణి ఒప్పుకుంది.

అలా రమణి హరిశ్చంద్రరావు హోటల్లో రొట్టెలు చేయడం మొదలుపెట్టింది. హోటల్ వ్యాపారం కూడా రోజురోజుకూ పెరిగింది.

రమణి రొట్టెలకు వచ్చిన పేరు… క్రమంగా హరిశ్చంద్రరావు హోటల్ పేరుగా మారిపోయింది.

అలా కొంతకాలం సాఫీగానే సాగింది.

కానీ అదే రొట్టెల వ్యాపారం చుట్టూ మరో కుటుంబం అడుగుపెట్టింది.

ఒకరోజు గోపి అనే కుర్రాడు తన తల్లి గోపమ్మతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. గోపి చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లిని చూసుకునేవాడు.

ఒకరోజు రొట్టెల కోసం క్యూ కట్టిన జనాన్ని చూసిన గోపమ్మ,

“ఇంతమంది రొట్టెల కోసం వస్తున్నారా? నాకు కూడా రొట్టెలు బాగా వచ్చు. నువ్వు చదువుకో. నేను సాయంత్రం రెండు గంటలు రొట్టెలు చేసి అమ్ముతాను,” అంది.

మరుసటి రోజు నుంచే గోపమ్మ కూడా రొట్టెలు అమ్మడం మొదలుపెట్టింది.

రుచి చూసినవాళ్లు,

“అమ్మా! ఇవి చాలా బాగున్నాయి!” అంటూ మళ్లీ రావడం మొదలుపెట్టారు.

కొద్దిరోజుల్లో గోపమ్మ బండి ముందు కూడా క్యూ కనిపించింది.

ఈ విషయం హరిశ్చంద్రరావు దృష్టికి వచ్చింది.

“మళ్లీ ఇంకో రొట్టెల వ్యాపారం మొదలైందా? నా హోటల్‌కు పోటీనా?” అనుకున్నాడు.

గోపమ్మను పిలిచి,

“నువ్వు మా హోటల్లోనే రొట్టెలు చేయి. మంచి జీతం ఇస్తాను,” అన్నాడు.

గోపి వెంటనే,

“సార్… మా అమ్మ రోజుకు రెండు గంటలే చేస్తుంది. ఆ సంపాదనతో మా జీవితం సాఫీగా సాగుతోంది. నేను చదువుకుంటున్నాను. నా చదువు పూర్తయ్యాక నేనూ ఏదో వ్యాపారం చేసుకుంటాను. అప్పటివరకు మా అమ్మను ఆమె పని చేసుకోనివ్వండి,” అన్నాడు.

ఆ మాట హరిశ్చంద్రరావుకు నచ్చలేదు.

“నా రొట్టెలపై ఆధిపత్యం ఉండాలి. నా హోటల్ రొట్టెలకు మరెవరూ పోటీగా ఉండకూడదు!” అనుకున్నాడు.

అక్కడి నుంచే మోనోపలి పోరు మొదలైంది.

గోపమ్మకు కట్టల పొయ్యి మీద కట్టలు అందకుండా చేశారు. చివరికి ట్యూబ్‌లైట్ వెలుగులో, చిన్న విద్యుత్ దీపం పెట్టుకుని రొట్టెలు చేయాల్సి వచ్చేది.

అంతటితో ఆగలేదు.

ఆమె బండి దగ్గర కుక్కలను పెట్టారు. అవి మొరుగుతూ ఉండడంతో రొట్టెల కోసం వచ్చే వాళ్లు భయపడి వెనక్కి వెళ్లిపోయేవారు.

రోజూ ఏదో ఒక సతాయింపు!

ఒకరోజు లైట్లు కూడా ఆపేశారు.

గోపి తట్టుకోలేక,

“అమ్మా… ఇక రొట్టెలు చేయొద్దు. ఇంట్లోనే ఉండు,” అన్నాడు.

గోపమ్మ మాత్రం నవ్వుతూ,

“అదేంట్రా! రొట్టెలు అడిగినవాళ్లకు నేను రొట్టెలు చేసి ఇస్తున్నాను. నేను పది రూపాయలకు ఇచ్చే రొట్టెను వాళ్లు హోటల్‌లో ఇరవై రూపాయలకు కొనాలి. మనలాంటి వాళ్లు కూడా బతకాలి కదా!

నేను నలుగురికి సహాయం చేస్తున్నాను… వాళ్లు కూడా నాకు సహాయం చేస్తున్నారు. నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ బతకడంలో తప్పేముంది?” అంది.

ఆ తల్లి ధైర్యానికి గోపి ఆశ్చర్యపోయాడు.

కానీ హరిశ్చంద్రరావు మాత్రం మరో ఎత్తు వేశాడు.

“రొట్టెలు చేయకుండా ఆపలేకపోతే… సరుకు దొరకకుండా చేస్తే?” అనుకున్నాడు.

జొన్నపిండి, కట్టెలు అమ్మేవాళ్లందరికీ గోపమ్మకు సరుకు ఇవ్వవద్దని చెప్పాడు.

మరుసటి రోజు గోపమ్మ బండి దగ్గర పిండి లేదు.

“అమ్మా… ఇవాళ ఎలా చేస్తావు?” అన్నాడు గోపి.

గోపమ్మ నవ్వి,

“పిండి అమ్మేవాళ్లు ఒక్కరే ఉన్నారా నాయనా? వెతికితే దారి దొరుకుతుంది,” అంది.

గోపి రైతులను సంప్రదించాడు.

గోపమ్మ రొట్టెలు తిన్న కొంతమంది రైతులు ముందుకొచ్చారు.

“మీ అమ్మ రొట్టెలు మేమూ తిన్నాం బాబూ. కావాల్సిన జొన్నలు మా ఊరి నుంచి మేమే తీసుకొస్తాం,” అన్నారు.

ఎవరో జొన్నలు తెచ్చారు. మరెవరో కట్టెలు ఇచ్చారు.

“ఏం కావాలన్నా చెప్పు,” అంటూ ఇంకొందరు అండగా నిలిచారు.

గోపి కళ్లలో ఆనందం మెరిసింది.

“అమ్మ రొట్టెలు కేవలం రొట్టెలు కాదు… మనుషుల్ని కలిపే బంధం!” అనుకున్నాడు.

ఈ విషయం కూడా హరిశ్చంద్రరావుకు తెలిసింది.

ఇప్పటివరకు గోపమ్మ బండినే అడ్డుకున్న అతను… ఇప్పుడు రైతుల వైపు కూడా దృష్టి మళ్లించాడు.

గోపి మాత్రం అన్నీ గమనిస్తున్నాడు.

ఇది కేవలం రొట్టెల వ్యాపారం కోసం జరుగుతున్న పోటీ కాదు…

ఒక మనిషి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడో చూపించే పోరు.

కానీ గోపమ్మ తన పొయ్యి వెలిగించడం ఆపలేదు.

ఆమె చేతిలో రొట్టె…

ఆమె వెనుక రైతులు…

ఆమె పక్కన గోపి…

ముందు మాత్రం హరిశ్చంద్రరావు వేసే మరో ఎత్తు!

ఎవరు గెలుస్తారో తెలియదు.

ఎవరి ఆధిపత్యం ఓడిపోతుందో తెలియదు.

కానీ గోపమ్మ రొట్టెలు వేస్తూనే ఉంది…

రొట్టెలు కాలుతూనే ఉన్నాయి…

వాటిని తినడానికి జనం వస్తూనే ఉన్నారు.

ఒకవైపు గోపమ్మ రొట్టెలు…

మరోవైపు హరిశ్చంద్రరావు ఆధిపత్యం కోసం వేసే ఎత్తులు…

మోనోపలి పోరు మాత్రం ఆగలేదు… కొనసాగుతూనే ఉంది!

అంతంకాని ఆరంభం…

అంతులేని పోరాటం…

అదే మోనోపాలీపై ఆధిపత్య పోరు!

ది ఎండ్…?

కాదు… ఇది మరో ఆరంభం!



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page