ఎంగిలి మెతుకులు

Yengili Methukulu - Telugu Social Story | Jeedigunta Srinivasa Rao
ఎంగిలి మెతుకులు - తెలుగు సామాజిక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 02/10/2026
“ఎంగిలి మెతుకులు” లంచం, అవినీతి, నిజాయితీ మరియు మానవ విలువలను ప్రతిబింబించే తెలుగు సామాజిక సందేశాత్మక కథ.“మనది కాని వస్తువుపై ఆశపడటం ఎంగిలి కూడు కోసం ఆశించినట్టే” అనే సందేశంతో ఈ కథ పాఠకులను ఆత్మపరిశీలనకు గురిచేస్తుంది.
రమేష్, శ్రీకాంత్ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగులు.
రమేష్ పనిచేస్తున్న సెక్షన్ ప్రజలు తమ అవసరాల కోసం వచ్చే సెక్షన్. దానితో రమేష్‌కి రోజువారీ పైసంపాదన ఉండేది. శ్రీకాంత్‌కి అటువంటి అవకాశం లేదు.
అయితే రమేష్, చూసి చూడనట్లు అప్పుడప్పుడు కొంత డబ్బు శ్రీకాంత్‌కి ఇచ్చి ఇంట్లో ఖర్చులకి వాడుకోమనేవాడు.
"వద్దురా! నీ అదృష్టం బాగుండి నీకు మంచి సెక్షన్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. నీ సంపాదనలో నాకు ఇవ్వడం ఎందుకు? దానివలన మన స్నేహం దెబ్బతినడానికి అవకాశం ఉంది. రమేష్! నీకు నా సలహా ఏమిటంటే... ఎవ్వరూ సంతోషంగా డబ్బులు ఇవ్వరు.
నీ జీతం నీకు వస్తున్నప్పుడు ఎందుకు ఈ సంపాదనకి అలవాటు పడ్డావు? అన్ని రోజులూ ఒకేలా ఉండవు, పొరపాటున జరగకూడనిది జరిగితే నీ జీవితంతోపాటు ఇంట్లో నీ కుటుంబం కూడా దెబ్బతింటుంది" అని సలహా ఇచ్చాడు శ్రీకాంత్.
"చూడు శ్రీకాంత్! నా పైన ఆరుగురు ఆఫీసర్స్ ఉన్నారు. ఒకాయన ఎప్పుడూ క్యాంపులు అంటూ నన్ను సెకండ్ ఏసీ టికెట్లు కొనమంటాడు, ఇంకొకడు మీటింగ్ రోజున స్నాక్స్ అంటూ నన్ను తినేస్తాడు. ఇలా ప్రతి ఒక్కరి కోరికలూ తీర్చాలి.
పైపెచ్చు ప్రతి ఫైల్ సంతకానికి కొంత బహుమతి కావాలంటారు. 'నీ సొమ్ము ఇమ్మని అడగటం లేదుగా, పని కోసం వచ్చిన వాళ్ల నుంచి వసూలు చెయ్యి' అని సలహా... అందుకే నేను వాటికి అలవాటు పడిపోయాను.
నీ సంసారం పెద్దది, వచ్చే జీతం ఎంతవరకు సరిపోతుందో తెలియదు. అందుకే నీ స్నేహితుడిగా నిన్ను ఆదుకోవాలని నాకు ఏదైనా డబ్బులు వస్తే కొంత నీకు ఇస్తున్నాను" అన్నాడు.
"నిజమే! మొదట్లో నువ్వు ఇచ్చే డబ్బు అప్పుగా అనుకున్నాను, తరువాత నువ్వు చేస్తున్న సహాయం అనుకుని అలవాటు పడిపోయాను. కానీ ఈ ఊబిలోంచి నువ్వు బయటకు వచ్చి పైసంపాదన లేని సెక్షన్‌లో శాంతిగా పనిచేసుకో.
నీకు ఏదైనా జరిగితే నేను భరించలేను" అన్నాడు శ్రీకాంత్ చెయ్యి పట్టుకుని రమేష్.
"నీ సలహా దృష్టిలో పెట్టుకుంటాను, రేపు మా బాస్‌ని అడిగి వేరే సెక్షన్‌కి పోస్టింగ్ ఇవ్వమని అడుగుతాను" అన్నాడు ఏదో ఆలోచిస్తూ.
ఇంటికి వెళ్లిన తరువాత భోజనం చేస్తూ రమేష్ తన భార్యకి శ్రీకాంత్ సలహా చెప్పాడు.
"మనం నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నామని మీ స్నేహితుడి ఏడుపు. ఈ రోజుల్లో నాలుగు రూపాయలు పైసంపాదన ఉంటుంది అనేగా గవర్నమెంట్ ఉద్యోగం చేసేది! అతని మాట విని చెడిపోకండి" అంది.
తింటున్న ముద్ద పక్కన పెట్టి, "కీర్తీ! రేపు ఒకవేళ నేను ఏసీబీకి పట్టుబడితే అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవా?" అన్నాడు.
"బాగానే భయపెట్టాడు మీ ఫ్రెండ్! మీతోపాటు వాటాలు తీసుకుంటున్న మీ పైఅధికారులు ఉన్నంతవరకు ఏసీబీ ఎలా వస్తుంది మీ ఆఫీసులోకి? అందుకే రోజూ చెప్పేది... పనుల కోసం వచ్చిన వాళ్ల దగ్గర ఎక్కువగా గుంజితే, రేపు అవసరమైతే మంచి అడ్వకేట్‌ని పెట్టుకుని బయటకు వచ్చి సంపాదించిన ఆస్తులతో హాయిగా జీవితం గడపగలం" అంది.
"చివరికి ఈ రోజుల్లో భర్త జైలుకి వెళ్లినా పర్వాలేదు, డబ్బులు ఉంటే గౌరవం అదే వస్తుంది అనుకునే విధంగా మారిపోయారు" అనుకున్నాడు. శ్రీకాంత్‌కి ఏం అవసరం అని తన శ్రేయస్సు గురించి సలహా చెప్పాడు అనుకున్నాడు.
ఉదయం ఆఫీస్‌కి వెళ్లగానే బాస్‌ని కలిసి తనకి బీపీ ఎక్కువగా ఉంటోందని, అందుకే కొద్దిగా ప్రశాంతంగా ఉండే సెక్షన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగాడు.
"అదేమిటోయ్! కలెక్షన్ ఏజెంట్ వి నువ్వే వెళ్ళిపోతే ఎలా? అసలే బీపీ అంటున్నావు, సరే చూద్దాం... వీలైనంత త్వరగా వేరే సెక్షన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాను" అన్నాడు.
ఒకరోజు ఉదయం ఆఫీసుకి రాగానే అటెండర్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాపీ చేతికి ఇచ్చాడు. ఆశ్చర్యం! తనని శ్రీకాంత్ పనిచేస్తున్న సెక్షన్‌కి, శ్రీకాంత్‌ని తను పనిచేస్తున్న సెక్షన్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఇంతలో శ్రీకాంత్ తన ఆర్డర్ కాపీ పట్టుకుని రమేష్ దగ్గరికి వచ్చి, "ఇదేమిటిరా! నిన్ను ఆ అవినీతి సెక్షన్ నుంచి బయటకు రమ్మంటే నన్ను దాంట్లోకి లాగావు?" అన్నాడు.
"నాకు ట్రాన్స్‌ఫర్ అడిగాను, నీ విషయం నేను మాట్లాడలేదు. పద, బాస్‌ని అడుగుదాం" అని ఇద్దరూ కలిసి బాస్‌ని అడిగారు.
"చూడు రమేష్! నీకు బీపీ అన్నావు కాబట్టి ట్రాన్స్‌ఫర్ చేశాను. శ్రీకాంత్‌కి ఏం రోగం లేదుగా, అందుకే నమ్మకస్తుడు కదా అని శ్రీకాంత్‌ని తీసుకున్నాను" అన్నాడు.
"సార్! నాకు బీపీనే. శ్రీకాంత్‌కి తనకి గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలు అనుకునే మనిషి, మీకు ఉపయోగం లేదు" అన్నాడు రమేష్.
"నాలుగు రూపాయలు రావడం మొదలుపెడితే తనే సీటుకి అతుక్కుపోతాడు, ముందు నువ్వు మంచి డాక్టర్‌కి చూపించుకో" అన్నాడు బాస్.
"సారీరా రమేష్! నీ సీట్‌కి నేను రావడం అనేది నాకు తెలియకుండా జరిగింది. అయితే ఒక విషయం నేను నీకు హామీ ఇవ్వగలను... లంచం తీసుకోకుండా పనిచేయడం ఎలాగో నేర్పుతాను" అన్నాడు శ్రీకాంత్.
ఈ ఆడవాళ్లకి ఆఫీసులో జరిగే విషయాలు ఎలా తెలుసుకుంటారో తెలియదు గానీ, తన భర్తని ట్రాన్స్‌ఫర్ చేసి ఆ స్థానంలో శ్రీకాంత్ వచ్చాడని తెలిసిపోయింది రమేష్ భార్యకి.
"చెప్తే విన్నారా? స్నేహం స్నేహం అనుకుంటూ శ్రీకాంత్‌ని వెంటేసుకుని తిరిగారు, అతను మీకే ఎసరు పెట్టాడు. ఇక రేపటి నుండి అతని జేబులో డబ్బులు, మనం మళ్లీ జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు" అంది.
"చూడు! నువ్వు కావాలంటే ఇంటి ఖర్చులు ప్రణాళిక ప్రకారం వాడుకో. భగవంతుడు నాకు ఒక దారి చూపించి నిజాయితీగా ఉండమంటే, అవినీతికి అలవాటు పడి ఆయన దృష్టిలో హీనుడిగా ఉండలేను. ఇక శ్రీకాంత్ అంటావా, అతను ఏమిటో నిదానంగా తెలుస్తుంది" అన్నాడు.
"ఏమిటోయ్ శ్రీకాంత్! రోజుకి ఇరవై ఫైళ్లు పంపుతున్నావు, ఏదీ నా వాటా రావడం లేదు? అంతా నొక్కేస్తున్నావా?" అన్నాడు శ్రీకాంత్ బాస్.
"క్షమించండి! నేను నిజాయతీగా బతుకుతున్నాను. ఎంగిలి మెతుకులు తినడం అలవాటు లేదు" అన్నాడు.
"నీ స్నేహితుడు ఇక్కడ పద్ధతి నీకు చెప్పలేదా? వచ్చిన ప్రతి రూపాయిలో ఇరవై పైసలు నీకు, ముప్పై పైసలు నాకు, యాభై పైసలు నా బాస్‌కి, తెలుసా? రేపటి నుంచి వసూళ్లు మొదలుపెట్టు, లేదంటే వాళ్లని ఫైలుతోపాటు నా దగ్గరికి పంపించు, నేను చూసుకుంటాను.
అప్పుడు నీకు నీ వాటా రాదు, నువ్వు నిజాయితీగా బతుకుదువుగాని" అని హుంకరించాడు.
తలవంచుకుని తన సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు.
"సార్! మా ఫైలు ఏమైంది సార్?" అంటున్న కాంట్రాక్టర్‌తో "నా చేతుల్లో ఏమీ లేదు, బాస్‌ని కలవండి" అని చెప్పాడు.
అలా పదిమంది వరకు శ్రీకాంత్ వాళ్ల బాస్ కుమార్ దగ్గరికి వెళ్లి తమ కేసు గురించి చెప్పుకున్నారు. కుమార్ కాంట్రాక్టర్లందరినీ కూర్చోబెట్టి కాఫీ తాగించి, వాళ్ల బిల్లు పాస్ చేయాలంటే పది శాతం కమిషన్ ఇవ్వాలని చెప్పి ఒప్పించుకుని డబ్బులు తీసుకుంటూ ఉండగా, తలుపు తెరుచుకుని నలుగురు ఆఫీసర్లు, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చి తాము ఏసీబీ నుంచి అని చెప్పి కుమార్ చేతులకు లిక్విడ్ టెస్ట్ చేసి లంచం తీసుకున్నట్టుగా నిరూపించారు.
"నాకేమీ సంబంధం లేదు, మా అకౌంటెంట్ శ్రీకాంత్ బయట నుంచి వీళ్లని పంపించాడు, అతనే కారణం" అన్నాడు కుమార్.
"మీ అకౌంటెంట్ గురించి మాకు తెలుసు, ముందు జీప్ ఎక్కండి" అంటూ లాక్కుని వెళ్లారు.
ఆఫీసు గగ్గోలు ఎత్తిపోయింది—ఏసీబీ వాళ్లకి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు, ఇంతవరకు సుఖంగా దోచుకున్న మనల్ని దెబ్బ తీసింది ఎవ్వరు అని.
కాంటీన్‌లో కూర్చొని కాఫీ తాగుతూ, "మంచి పనిచేశావు శ్రీకాంత్! ఆ సీట్లో నేను ఉంటే ఏదో ఒకరోజు జీపు ఎక్కాల్సి వచ్చేది" అన్నాడు రమేష్.
సచివాలయం నుంచి శ్రీకాంత్‌ని పొగుడుతూ లెటర్ వచ్చింది. డిపార్ట్‌మెంట్ హెడ్ శ్రీకాంత్‌ని పొగిడి, అన్ని సెక్షన్లలో "లంచం అడిగితే ఈ ఫోన్ నంబర్‌కి ఫోన్ చేయండి" అని బోర్డులు వెలిశాయి.
మనది కాని వస్తువుకి ఆశ పడటం ఎంగిలి కూడు కోసం ఆశించినట్టే.
కథ విన్నందుకు ధన్యవాదాలు.
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


















Comments