top of page

కర్తవ్యం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Karthavyam' New Telugu Story Written By Jidigunta Srinivasa Rao

రచన : జీడిగుంట శ్రీనివాసరావు


శేఖర్, మూర్తి.. యిద్దరూ ప్రాణ స్నేహితులు. యిద్దరూ మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. రోజూ యిద్దరూ కలిసి పార్క్ కి వెళ్లి నడుస్తూ పిచ్చా, పాటి మాట్లాడుకోవడం అలవాటు.

ఒక రోజు సాయంత్రం పార్కులో నడుస్తో సడన్ గా మూర్తి, శేఖర్ ని అడిగాడు, “శేఖర్! మీ వూరి వాడు కృష్ణారావు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు రా? అతను వాళ్ళ కులం వాళ్ళకి తప్ప ఎవరికీ తన కంపెనీలలో ఉద్యోగం ఇవ్వడుట. అటువంటి అతనిలో ఏమి గొప్ప వుందో తెలియటం లేదు, యింత పేరు రావడానికి” అన్నాడు మూర్తి.

వేగంగా నడుస్తున్న శేఖర్ ఒక్కసారిగా ఆగి, “పద, ఆ బెంచీమీద కూర్చొని మాట్లాడుకుందాం” అంటూ బెంచీ వైపు కి నడిచాడు.

“చూడు మూర్తీ! ప్రతీ వ్వక్తిలో ఏదో ఒక సుగుణం వుంటుంది. అది ఒక్కొక్క మనిషిలో వేగంగా పనిచేసి ఆ వ్వక్తి ని మంచి స్టేజి కి తీసుకొని వెళ్తుంది. అది తెలుసుకోకుండా అతను అంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళాడు, మనం యిలాగే ఎందుకు వున్నాము అని బాధపడుతో వుంటాము. నువ్వు అడిగిన ఆ కృష్ణారావు గారి గురించి నాకు తెలిసిన నిజం చెపుతాను విను” అని చెప్పడం మొదలుపెట్టాడు శేఖర్.

“కృష్ణారావు గారి కుటుంబం ఉన్నంతలో మా వూరిలో డబ్బున్న కుటుంబం. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ లో పెద్ద ఉద్యోగం చేసేవారు. ఆయన చేతికి ఎముక లేదనే వాళ్ళు. అవసరం అయిన వాళ్లందరికీ లేదనకుండా సహాయం చేసేవారు.

కొన్నాళ్ల తరువాత ఆ కుటుంబం మా ఊరినుంచి వెళ్లిపోయారు. అయితే కృష్ణారావు నా స్నేహితుడు కావడం వలన అతను ఎక్కడ వున్నాడో అని ఆరా తీస్తూ వుండేవాడిని.

నేను చదువు కంప్లైంట్ చేసి హైదరాబాద్ లో ఉద్యోగం సంపాదించాను. ఒకరోజున తెలిసింది కృష్ణారావు దేశంలో చాలా స్టేట్స్ లో పెద్ద పెద్ద కంపెనీలకు అధిపతి అని. నేను, నువ్వు స్నేహితులుగా మారిన తరువాత కూడా ఎప్పుడూ నీకు కృష్ణారావు తో నాకున్న స్నేహం గురించి చెప్పలేదు.

అయితే ఒక సారి నేను పదిరోజులు సెలవు పెట్టి సింగపూర్ వెళ్తున్నానని తెలిసి నువ్వు ఏడ్చావు చూడు.. నిన్ను తీసుకుని వెళ్లకుండా నేను ఒక్కడినే వెళ్తున్నానని, అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళింది ఆ కృష్ణారావే.

సరే.. మేము యిద్దరం సింగపూర్ లో పెద్ద హోటల్ లో వున్నాము. రాజు తలుచుకుంటే సుఖాలకి

కొదవేముంది? పెద్ద పెద్ద కంపెనీల ఆధిపతులు వచ్చి కృష్ణారావుని కలుస్తున్నారు. వాళ్ళకి నన్ను తన ప్రాణ స్నేహితుడని పరిచయం చేయడం, నేను ఒక మూల ఒదిగి కూర్చొని ఉండటం తప్ప, సింగపూర్ లో ఆ రోజు చూసింది ఏమీలేదు. రెండవ రోజు సింగపూర్ అంతా తిరిగి రాత్రికి హోటల్ చేరుకున్నాము.


సరిగ్గా రాత్రి 11 గంటలకు ఎవరిదో నెంబర్ నుంచి కృష్ణారావు కి ఫోన్ వచ్చింది. నేను అయితే అటువంటి సమయంలో తెలియని ఫోన్ కాల్ తీయను. సెల్ ఫోన్ టేబుల్ మీంచి చేతిలోకి తీసుకుంటున్న కృష్ణారావుతో అదే మాట అంటే, ‘ఏమో.. ఎవరు ఏ అవసరం వచ్చి ఫోన్ చేసారో..’ అంటూ 'హలో' అని కంగారు గా మాట్లాడి, కొంతసేపటికి ఎవరికో థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టి, “శేఖర్! నా వైఫ్ ప్రయాణం చేస్తున్న కారు కి ప్రమాదం జరిగిందిట. ఎవరో పుణ్యాత్ముడు తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మనం వెంటనే ఇండియా బయలుదేరాలి” అని ప్రయాణానికి కావలిసిన ఏర్పాట్లు క్షణం లో చేసేసాడు.

ఇండియా రావడం తోనే ఢిల్లీలో ఒక పెద్ద నగల షాప్ వాళ్లకు కాల్ చేసి పదిహేను లక్షలతో ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాడు. ‘ఏమిటి యిప్పుడు నగ కొన్నాడు.. ఒక పక్కన భార్య కి ఆక్సిడెంట్ అయితే..’ అనుకున్నాను. అక్కడ నుంచి యింకో ఫ్లైట్ లో హైదరాబాద్, అక్కడ నుంచి కారులో కోదాడ చేరుకొని ఒక పెంకుటిల్లు ముందు కారు ఆపాడు. కారులోనుంచి కంగారుగా దిగి ఆ యింట్లోకి వెళ్ళాము. ఒక కుర్చీలో కాలుకి కట్టు తో కూర్చుని కృష్ణారావు భార్య కనిపించింది.

భార్య ని చూసి ‘వచ్చేసాను. కంగారు పడకు’ అంటూ, అప్పుడే వంట గదిలోనుంచి గ్లాసు లో కాఫీ తీసుకొని తన భార్య కి యిచ్చి, నమస్కారం అన్నయ్య గారు అని అంటున్న ముప్పై ఏళ్ళు వుండి లక్ష్మి కళ తో వున్న అమ్మాయి ని చూసి ‘నమస్కారం అమ్మా’ అంటూ బ్యాగ్ లో వున్న బాక్స్ ని ఆమె చేతిలో పెట్టి "మీ సహాయం మర్చిపోలేను చెల్లీ. యిది నీకు నీ అన్నయ్య యిస్తున్న కానుక తల్లీ! తప్పకుండా తీసుకోవాలి. యింతకీ బావగారు ఏరి?" అన్నాడు కృష్ణారావు చనువుగా.

‘మందులు తీసుకొని రావడానికి షాప్ కి వెళ్లారు, వచ్చేస్తారు' అంటూ నన్ను చూసి యింకో స్టూల్ నాకు వేసి ‘కూర్చోండి. కాఫీ తెస్తాను’ అని లోపలికి వెళ్ళింది.

యింతలో స్కూటర్ మీద నుంచి దిగిన ఒక సన్నటి అందగాడు మందుల కవర్ తో లోపలికి వచ్చి, పరిస్థితి అర్ధం చేసుకుని, ‘నమస్కారం సార్! మీ లాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం. అమ్మగారికి కాలు ఒక బోన్ పక్కకి తప్పుకుంది. ఒక ఇరవై రోజులలో తగ్గిపోతుంది అన్నారు’ అని అంటూ చెప్పుకుంటూ పోతో భార్య చేతిలోని కాఫీ గ్లాసులు అందుకొని మా చేతికి అందించాడు.

కాఫీ తాగి, ఆదంపుతులకి కృతజ్ఞతలు తెలిపి భార్యని జాగ్రత్తగా కారులో కూర్చోపెట్టి, బయలుదేర బోతోవుంటే, ఆ ఇంటి యజమాని చేతిలో నగలపెట్టిని కృష్ణారావ్ చేతిలో పెట్టి ‘వద్దు సార్! కష్టంలో వున్న అమ్మగారిని చూసి మనిషి గా నా పని నేను చేసాను. యింత బహుమతి కి మేము అర్హులం కాదు’ అన్నాడు.

వెంటనే కారు డోర్ తీసుకొని కిందకి దిగి, కృష్ణారావ్ అతని రెండు చేతులు పట్టుకుని, “మీరు సమయానికి నా భార్యని ఆపదనుంచి కాపాడినందుకు యిది కానుక కాదు. నా చెల్లెమ్మకి అన్నగా యిస్తున్న కానుక” అని మళ్ళీ ఆ నగ బాక్స్ అమ్మాయి చేతిలో పెట్టి, కారును ముందుకు పోనిమ్మన్నాడు.

కొంత దూరం ప్రయాణం జరిగిన తరువాత వుండబెట్టుకోలేక అడిగాను, ‘ఈ ఉపకారానికి యింత పెద్ద బహుమతి యిచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించాలిసిoది’ అన్నాను.

‘మనకి ఎవరైనా ఉపకారం చేసినప్పుడు, తక్షణమే మన శక్తి కి తగ్గట్టుగా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. ఇంటికి వెళ్లి ఆలోచించి చేసే సహాయoలో ఎప్పుడూ క్వాలిటీ ఉండదు. నిజంగానే అతను నా భార్య కి సహాయం చేసేటప్పుడు, ఆలోచన చేస్తే తనకెందుకు అనిపించవచ్చు.

పాండవులు అజ్ఞతవాసం విరాట రాజ్యంలో చేసినందుకు ఉపకారం గా, విరాట రాజ్యం మీదకి దండయాత్ర చేసిన కౌరవులని జయించి సహాయం చేసారు. అందుకే సహాయం చేయాలిసిన అవసరం వచ్చినప్పుడు మన తాహతుకు తగ్గట్టుగా తక్షణమే సహాయం చేసినదే సహాయం. ఆలోచన చేసి చేసే సహాయం సహాయం కాదు. ఋణం తీర్చుకోవడం’ అన్నాడు కృష్ణారావు.

యిప్పుడు చెప్పు మూర్తి! కృష్ణారావు లో ఏముందో అంత గొప్పవాడుగా ఉండటానికి కారణం.. అర్ధం అయిందా? అతనికి సంపద తో పాటు సహాయం చేసే గుణం ఉండటం వలన అతను అంత గొప్పవాడు అయ్యాడు. మనం యిలా పార్కులో బెంచీ కి అంకితం అయ్యాము. అంతే!” అన్నాడు.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


39 views2 comments
bottom of page