top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

పేల మందు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Pela Mandu' Written By Jidigunta Srinivasa Rao

రచన : జీడిగుంట శ్రీనివాసరావు


సుందరి, అందంలో పేరుకి తగ్గట్టుగా చాలా అందంగా వుంటుంది. కాణీ తీసుకోకుండా మూర్తి మొదటి చూపులోనే తన అంగీకారం తెలిపి సుందరిని పెళ్లిచేసున్నాడు.


రెండు రోజుల తరువాత రోజూ తల గోక్కుంటున్న సుందరిని అడిగాడు, 'ఎందుకు ఆలా తల గోక్కుంటున్నావు' అని.


“నాకు వున్న పెద్ద ప్రాబ్లెమ్ యిదే! తలనిండా పేలు, ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు” అని చావు కబురు చల్లగా చెప్పింది.


‘ఇందుకా నిన్నటినుండి తన తల్లో ఒక్కటే దురద, ఏవో అటుయిటు వాకింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది’ అనుకుని ఎవరు చూడకుండా తల దువ్వుకుంటే నల్ల నువ్వులు పడినట్టుగా గుప్పెడు పేలు పడి, పరుగులు తీయడం మొదలు పెట్టాయి.


‘బాబోయ్.. యింత సుందరమైన భార్య కి ఈ పాడు పేలు తేనె పట్టులాగా పట్టి, అవి తన తలకి కరోనా లాగా అంటుకోవడం ఏమిటి భగవంతుడా’ అనుకుని ఆలోచనలో పడి కొత్త పెళ్ళికొడుకునన్న విషయమే మరిచి తలగొక్కుంటో కూర్చున్నాడు.


అదిచూసిన మామగారు “పరవాలేదు. తన అల్లుడికి కూడా కూతురుకి ఉన్నట్లు పేల బాధ వున్నట్టు వుంది. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఒకరి తల ఒకరు గోక్కుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడి కలకాలం గొడవలు లేకుండా వుంటారు” అనుకున్నాడు.

మొత్తానికి పదిరోజులు అత్తగారి యింట్లో గడిపి, తను ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్ కి బయలుదేరారు. విజయవాడ లో యింకో ట్రైన్ ఎక్కుతో వుంటే భార్య సుందరి అడిగింది మూర్తిని, “అదేమిటి హైదరాబాద్ కి డైరెక్ట్ ట్రైన్ వుందిగా, యిక్కడ మారటం ఎందుకు” అని.


“పెళ్లిళ్ల సీజన్ కదా! డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు లే” అని సర్దిచెప్పి, ‘నిద్రపో’ అన్నాడు.

గాఢ నిద్రలో వున్న సుందరి భర్త పిలుపు కి ఉలిక్కి పడి లేచి చూసే సరికి, “లే త్వరగా దిగాలి స్టేషన్ వచ్చింది” అంటూ సామాను పట్టుకొని పరుగున దిగిపోయాడు.

పై మెట్టు నుంచి భర్త కి చేయి యిస్తూ దిగుతో చూసి “ఇదేమిటి తిరుపతి లో దిగుతున్నాము?" అంది.

“సరిగ్గానే దిగుతున్నాము, మన జబ్బుకి సరైయైన మందు యిక్కడ దొరుకుతుంది, ఆ మందు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుని హైదరాబాద్ వెళ్దాం” అన్నాడు మూర్తి సుందరి చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తో.

******

కొత్త పెళ్ళికొడుకుని, పెళ్లికూతురుని రిసీవ్ చేసుకోడానికి హైదరాబాద్ స్టేషన్ కి కారు తీసుకొని వచ్చిన మూర్తి స్నేహితులు, రైల్లోనుంచి దిగుతున్న రెండు నున్నటి గుండులని చూసి, ఇదేమిటిరా అని అడిగారు.


వారితో , “తరువాత చెబుతా గాని ముందు సామాను అందుకోండిరా” అని అన్నాడు మూర్తి గుండు తడుముకుంటూ.


శుభం

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



186 views3 comments

3 Comments


Sai Praveena jeedigunta • 11 days ago

Short and sweet story

Like

Uma Rani • 11 days ago

Chala bagundi...

Like

Himabindu's World • 11 days ago

చాలా బాగుంంది కథ


Like
bottom of page