నోరు ఉంది కదా అని...!

Noru Undi Kada Ania - Telugu Inspirational Article | Kotha Viritha
నోరు ఉంది కదా అని...! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 29/09/2026
మాటకు ఉన్న శక్తి, వినడంలోని విలువ, మాట్లాడే ముందు కాసేపు ఆలోచించాల్సిన అవసరం గురించి సరదా వ్యంగ్యంతో చెప్పే కొత్త విరిత రచన “నోరు ఉంది కదా అని...!”
మనిషికి ఉచితంగా దొరికే అత్యంత చవకైన వినోదం ఏంటో తెలుసా? అవసరం లేకపోయినా నోరు తెరవడం! ఎవరు అడగకపోయినా సలహా ఇవ్వడం, తెలియకపోయినా అభిప్రాయం చెప్పడం, విషయం తెలియకపోయినా మధ్యలో దూరి తీర్పు చెప్పడం!
రావణుడు కూడా మాట్లాడాడు హనుమంతుడు కూడా మాట్లాడాడు. కానీ ఒకరి మాటలు సీతమ్మ హృదయాన్ని గాయపరిచాయి, మరొకరి మాటలు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి .కాబట్టి సమస్య నోటిలో లేదు… నోరు తెరిచే మనిషిలో, అనే మాటలలో ఉంది!
ఏనుగును ఒక్కసారి చూడండి.పెద్ద పెద్ద చెవులు… చిన్న నోరు!
ప్రకృతి దాన్ని చూసి నేర్చుకో అంటుంది. “ఎక్కువ విను, తక్కువ మాట్లాడు!”అని.
మనిషికి మాత్రం చెవులు రెండు, నోరు ఒకటి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం వినేది సగం, మాట్లాడేది డబుల్, అర్థం చేసుకునేది మాత్రం జీరో!
గురువుల దగ్గర వినాల్సినప్పుడు మనకే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు మాట్లాడతాం. సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం మైక్ చూసి మౌనంగా ఉండిపోతాం. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అసలు ఆ సభ మొత్తాన్ని మనమే నడిపించినట్టు స్పీచ్ ఇస్తాం! ఎక్కడ మాట్లాడాలో అక్కడ మనకు సిగ్గు, ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ మనకు ధైర్యం!
ఇది మనిషి అభివృద్ధి కాదు… నాలుకకు ఇచ్చిన స్వేచ్ఛా దుర్వినియోగం! ఒక్క అనవసరపు మాటతో గొడవ మొదలవుతుంది, రెండో మాటతో
సంబంధం పాడవుతుంది, మూడో మాటతో “నేను అసలు అలా అనలేదు” అనే కొత్త డ్రామా మొదలవుతుంది!
పెద్ద పెద్ద పాపాలు మూటకట్టుకునేది పనులవల్ల కాదు, మనం మాట్లాడే మాటల వల్లనే! అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి.
ఎందుకంటే మాట్లాడే ముందు ఐదు సెకన్లు మౌనంగా ఉండటం కష్టం కావచ్చు…
కానీ మాట్లాడిన తర్వాత ఐదు సంవత్సరాలు పశ్చాత్తాపపడటం ఇంకా కష్టం!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments