top of page
Original.png

బ్యాడ్‌ టచ్‌

11 hours ago
2 min read

ముంబై లోకల్ రైలులో మహిళల భద్రత, బ్యాడ్ టచ్‌కు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడిన మహిళ

Bad Touch - Telugu Social Article | B. N. Satyanarayana

బ్యాడ్‌ టచ్‌ - తెలుగు సామాజిక వ్యాసం | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 18/11/2026


“బ్యాడ్ టచ్” కథనం మహిళలపై జరిగే వేధింపులు, హింసను తీవ్రంగా ప్రశ్నిస్తూ బాధితులకు న్యాయం, రక్షణ, నష్టపరిహారం కల్పించాల్సిన అవసరాన్ని వివరిస్తుంది. మహిళల గౌరవం, భద్రతను కాపాడటంలో ప్రభుత్వం మరియు న్యాయవ్యవస్థ బాధ్యతను గుర్తుచేస్తుంది.


బొంబాయిలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.


అక్కడ లోకల్‌ ట్రైన్‌లో ఒక మహిళను బ్యాడ్‌ టచ్‌ చేస్తూ ఒక వ్యక్తి వేధిస్తుంటే, ఆ మహిళ భరించలేక ఆఖరుగా వాడిని చెప్పుతో కొట్టిందన్నది వార్త.


దానిని అవమానంగా భావించిన ఆ సిగ్గుమాలిన వ్యక్తి (వాడు చేసినది నీచమైనది అని తెలిసి కూడా) ఆమెపై దాడి చేసి, ఆమెను రైలు నుండి కిందకి తోసివేశాడట. 


ఎంత దారుణం!! ఎంత అమానుషం!! దానితో కింద పడ్డ ఆమె గాయాల పాలై, చేయి రైలు చక్రం కింద పడి తెగి పడిందన్న వార్త ఎంతో ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి.


ఆమె చేయని తప్పుకి ఆమే అంగవైకల్యం పాలై గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందవలసి రావడం ఎంత బాధాకరం, ఎంత విషాదకరం! ఇటువంటి హేయమైన నేరాలకు ప్రభుత్వాలు ఎటువంటి శిక్షలు అమలు పరుస్తున్నాయి? ఈ దోషులకు కనీసం 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా కఠినమైన కారాగార శిక్ష విధించాలి.


అంతేకాకుండా ఆమె అంగవైకల్యానికి బాధ్యుడు వాడే కాబట్టి, వాడు కలిగిన ఆస్తిలో నుండి ఆమెకు తగిన నష్టపరిహారం అందించాలి.


అంతేకాదు, చేతిని కోల్పోయిన బాధితురాలైన ఆ యువతికి, ఆమె ప్రభుత్వ ఉద్యోగి కాని ఎడల జీవనాధారంగా ఆమెకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పరిహారం కూడా కల్పించాలి.


ప్రభుత్వ ఉద్యోగి అయిననాడు తప్పనిసరిగా పరిహారం ప్రకటించి ఆమెకు న్యాయం చేయాలి. ఇటువంటి అరాచకాలు అరికట్టడానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటూ ఎంతో కఠినంగా వ్యవహరించాలి.


దీనిని బాధితులకు ప్రభుత్వాలు ఇచ్చే సహాయంగా భావించకూడదు, పౌరులకు ఇచ్చే రక్షణలో భాగంగా తీసుకోవాలి.


గతంలో బొంబాయి హైకోర్టు మహిళా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఇటువంటి దారుణాలు అధికం కావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. 


స్త్రీల గౌరవానికి రక్షణ కల్పించలేని తీర్పులపై పునరాలోచన చేయవలసిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానంపై ఉంది.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page