బాలల దినోత్సవం
- P. V. Padmavathi Madhu Nivrithi

- Nov 14, 2025
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #BalalaDinotsavam, #బాలలదినోత్సవం, #TeluguKavitha

బాలల దినోత్సవం: నవంబర్ 14 & 20
Balala Dinotsavam - New Telugu Poem Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 14/11/2025
బాలల దినోత్సవం - తెలుగు కవిత
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
-------------1వ భాగం--------------
1)
(1947-1964) జవహర్‌లాల్ నెహ్రూ భారత మొదటి ప్రధాని,
అతడికి ఆప్యాయత పిల్లలంటే ఎనలేని
2)
అందుకే (1964 నుండి) భారత దేశం లో నవంబర్ 14న బాలల దినోత్సవం,
చాచా జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భం
3)
1889 నుండి 1964 వరకు ... నెహ్రూ 74 ఏళ్ళు జీవించారు,
భరత దేశపు "ఆధునిక వాస్తుశిల్పి" గా పేరు గాంచారు
4)
నవంబర్ 20న "ప్రపంచ" బాలల దినోత్సవం,
1959లో ఐక్యరాజ్యసమితి "బాలల హక్కుల" ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భం - జ్ఞాపకార్థం
-----------------2వ భాగం-----------------
5)
నేటి సంతోష - ఆరోగ్యకరమైన బాలలు ... రేపటి ఆరోగ్యకర - అభ్యుదయ - ప్రగతి పొందిన దేశానికి పునాదులు - రేపటి పౌరులు,
ఇవ్వాలి ఈ "లేత మనసులకు" - "పసి హృదయాలకు" అన్ని సౌకార్యాలు - సదుపాయాలు
6)
తీర్చిదిద్దాలి వారిని "ప్రపంచ స్థాయి" సంతోషకరమైన అభివృద్ధి - అభ్యుదయం - ప్రగతి పథం నిర్వాహకులుగా,
తయారు చేయాలి వారిని "నిర్మాణాత్మకమైన - ఆనంద దాయక పరిష్కాల" తీరు నిర్వాహకులుగా
7)
పిల్లలను తయారు చేయాలి "ఆధునిక టెక్నాలజీ నిపుణులుగా",
తర్ఫీదు ఇవ్వాలి "శాస్త్రీయ - సంతోష అభివృద్ధి - పద్దతులు" ఆధారంగా
-----------------3వ భాగం--------------
8)
(సిలబస్ సైజు తగ్గించి) ప్రతీ విద్యాకేంద్రంలో చదువులతో పాటు,
క్రీడల - అభిరుచుల తరగుతులను జరపటానికి చేయాలి ఏర్పాటు
9)
విద్యాకేంద్రాల నుండి జట్టుగా మరియు ఇంటి కుటుంబ సభ్యులతో సహా బ్రుందంగా - తరుచు విహార యాత్రల ఏర్పాటు,
పిల్లలకిస్తుంది మానస వికాసం - ఆసక్తి మరియు పర్యావర్ణం నుండి నేర్చుకునే అలవాటు
----------------4వ భాగం---------------
10)
మానసిక సంతోషం -ఉత్సాహం - ఉల్లాసం చిన్నారులకు కలిగించాలి,
"బట్టి పట్టటం" "అవసరం లేని" - "సులభతరం విద్య" - "ఆధునిక - సరదా పద్ధతులతో" పిల్లలకు అందచేయాలి,
11)
ఉపాధ్యాయులకు కూడా తరచు సంతోషకరమైన నిర్వహణలో - నిర్మాణాత్మక - ఆనందదాయక పరిష్కారాల తీరు లో శిక్షణ ఇవ్వాలి,
"సులభ" బోధన పద్దతులు - పాట్య పుస్తకాలు - సులభ చిన్న ప్రాజెక్టులు హోంవర్క్లు - తరగతి గదిలో చేసిన సిలబస్సుకు తగ్గట్టు పరీక్షల నిర్వహణ - "పరిచయం" చేయాలి
12)
కంప్యూటర్లో "యానిమేషన్" బోధన - "ప్రొజెక్టర్ స్లయిడ్‌ల" బోధన పద్ధతులు,
ఉపాధ్యాయులకు వ్రాసే సమయం ఆదా - వివరించటానికి యెక్కువ సమయ-కల్పన ఏర్పాట్లు
------------------5వ భాగం-----------------
13)
పిల్లలకు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉద్భోదించాలి,
ఉప్పు - చక్కెర - నూనె - కారం - కొవ్వు - కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తక్కువ తినాలి - అని తెలపాలి
14)
పోషకమైన ఆహారం - వ్యాయామం - మానసిక సంతోషం అందేలా చూడాలి,
ఆరోగ్యానికి హానికరమయిన (పొగకు) ధూమ - మద్య పానం - డ్రగ్స్ కు దూరంగా ఉండటం నేర్పాలి
15)
సమయ-పట్టిక ఏర్పాటు ద్వార - సెల్ ఫోన్ (చరవాణి)
వాడుక పై నియంత్రణ నేర్పాలి,
పేద పిల్లలకు ఉచిత విద్య - భోజనం - స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలి
16)
"కోమల సున్నిత హృదయాల" చిన్నారులకు - ఇతర అవసరాలైన సదుపాయాలు కలగచేయాలి,
చీకు - చింత - ఆందోళన లేని 100% మనశ్శాంతి జీవితం ఏర్పరచాలి
-----------------6వ భాగం---------------
17)
(యే ఒక్కరికి అన్యాయం - హాని - త్రోయటం - బలిపశువు చేయకుండా) అందరికి శాంతి - ప్రగతి - శ్రేయస్సు - ఐశ్వర్యం - ఆరోగ్యం,
అందేలా చూడటమే దేశం - దేశ నిర్వాహకులకు అవ్వాలి ధ్యేయం
18)
భూత సర్ప పైశాచిక తత్వం - దారిద్యం నిర్మూలించటమ్,
అవ్వాలి దేశము - ప్రపంచము యొక్క తొలి ధ్యేయం
-------- చిన్న కవిత - సమాప్తం --------
------------ నీతి ------------
I)
నేటి సంతోష - ఆరోగ్యకరమైన బాలలు ... రేపటి ఆరోగ్యకర - అభ్యుదయ - ప్రగతి పొందిన దేశానికి పునాదులు - రేపటి పౌరులు,
2)
ఇవ్వాలి ఈ "లేత మనసులకు" - "పసి హృదయాలకు" అన్ని సౌకార్యాలు - సదుపాయాలు
3)
ప్రత్యేకంగా పేద - మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు
...
ఉచితంగా లేక అందుబాటు ధరలో
...
[
I) మంచి విద్య (తెలికైన - సులువైన బోధన పద్దతులతో)
+
పోషకాహారం
+
ఆరోగ్య సంరక్షణ
+
క్రీడా శిక్షణ
...
అందెలా చూడాలి
]
4)
పిల్లల బల బలాలను - ఇష్టాలను - అభిరుచులను అనుకూలతను బట్టి ... వారికి ప్రగతి బాట నిర్మించాలి ... వారిని మలచాలి - తీర్చిదిద్దాలి - చెక్కాలి (ఉపాధ్యాయుల యిన శిల్పులు)
...
[
పిల్లలకు యే విషయం ఇష్టం, యే క్రీడ ఇష్టం, వారి అభిరుచులు యేమిటి ... వాటిని బట్టి
]
5)
జీవితం ఆశాశ్వతం ...
ఒక సరదా ఆటలా లోపాలను అధిగమించండి
...
ఆటలా - పాటలా ... ఉత్సాహంగా - ఉల్లాసంగా - దిగ్విజయ పరముగా జీవించండి ప్రపంచంలో అందరు (చిన్న- పెద్ద ... ఆడ - మగ)
------- X X X చిన్న కవిత ---నీతి ---- సమాప్తం ------- X X X ------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.




Comments