top of page
Original_edited.jpg

బంధాలు

  • Writer: Nandyala Vijaya Lakshmi
    Nandyala Vijaya Lakshmi
  • Oct 15
  • 2 min read

#NandyalaVijayaLakshmi, #నంద్యాలవిజయలక్ష్మి, #Bandhalu, #బంధాలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Bandhalu - New Telugu Story Written By  - Nandyala Vijaya Lakshmi

Published in manatelugukathalu.com on 15/10/2025 

బంధాలు - తెలుగు  కథ

రచన: నంద్యాల విజయలక్ష్మి


“నీకేమీ తెలియదు నాన్నా! హాయిగా కృష్ణారామా అనుకుంటూ కూర్చోకుండా ఎప్పుడూ ఏవో సర్దుతూ ఉంటావు — నీకు ఎందుకు? నా వస్తువులు, ముఖ్యంగా నా ఆఫీస్ కాగితాలు ముట్టుకోవద్దు! నేను నా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటాను,” అని గట్టిగా చెప్పాడు ఆనంద్, వాళ్ల నాన్న సీతారాంను.


ఆ మాటలు సీతారాం చెవిలో మారుమ్రోగుతున్నాయి. “తనేమి చేసాడని చిందరవందరగా ఉన్న కాగితాలు సర్దిపెట్టాడు? దానికే అంత గట్టిగా వద్దని అరవాలా? ఏదో నేరం చేసినట్టుగా!” తనకు ఏమీ తెలియదా? — ఇదే ప్రశ్న సీతారాం మనసును వేధిస్తోంది.


ఏమీ తెలియకుండానే తన పెద్ద కుటుంబపు బాధ్యతలు నెరవేర్చాడా? ఇంటికి పెద్దవాడు కావడంతో తల్లిదండ్రుల బాధ్యతల్లో కొన్ని పంచుకోవలసి వచ్చింది. చాలీ చాలని జీతం, వచ్చిపోతూ ఉండే బంధువులు, చిన్నా పెద్దా వేడుకలు, తప్పనిసరి ప్రయాణ ఖర్చులు — అన్నిటినీ అధిగమించి, ఇప్పుడే కొంచెం విశ్రాంతిగా ఉన్నాడు తాను, తన భార్య శ్యామలతో.


ఏ పనీ చేయకుండా కూర్చోలేక, చేసిన చిన్న పనికే మాటలు పడటం... పిల్లలకు తాను ఏమీ చేతకానివాడిలా మిగిలిపోవడం — అది సీతారాంను బాధించింది.


ఇది ఇలా ఉండగా, వంటింట్లో శ్యామలకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏ పని చేయబోయినా కోడలు సంగీత — “అలా కాదు!” అంటూ వంక పెట్టడం. “మొన్న మీరు చేసిన కూర ఎవరూ సరిగ్గా తినలేదు, అయినా మీకెందుకు? హాల్లో కూర్చోండి.”


“అది కాదమ్మా, నీకు కొంచెం సాయముగా...” 


"అదే వద్దు! మీరు చేసినట్లు తెలిసి ఆనంద్ ‘మా అమ్మ చేత ఎందుకు చేయించావు? నువ్వు చేయచ్చుగా!’ అంటూ నాకు చివాట్లు వేస్తాడు. మీరు డబ్బాలు అటు ఇటు సర్దకండి,” అని కొంచెం కఠినంగానే చెప్పింది సంగీత.


శ్యామల మౌనంగా హాల్లోకి నడిచింది. సీతారాంకు పరిస్థితి అర్థమైంది. తరాల అంతరాలు — వాటి ప్రభావం ఇలానే ఉంటుంది.


ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు పొద్దున్నే శ్యామలకు — “మనకు నేను ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అవసరమైన సామాన్లు సర్దు,” అన్నాడు.


శ్యామల ఏమీ మాట్లాడలేదు. అరగంట తర్వాత ఆటో వచ్చింది. ఇంతలో ఆనంద్, సంగీత కూడా వచ్చారు. వాళ్లకు క్లుప్తంగా తాను తీసుకున్న నిర్ణయం చెప్పాడు. వాళ్లు ఆపే ప్రయత్నం చేయలేదు.


రాత్రికి టిఫిన్ తెచ్చుకొచ్చారు. మరుసటి రోజు నుంచే ఇంట్లో శ్యామల వంట చేస్తూ ఉండగా, సీతారాం మిగతావన్నీ సర్దాడు.


సీతారాం ఆలోచనలో పడ్డాడు. మొన్నటికి మొన్న మనవడూ ఏదో లెక్క చెప్పబోతే — “నీకు రాదు తాతయ్యా!” అంటూ తన మాట వినలేదు.


“పాత తరము వెనక్కి తగ్గాలి, అప్పుడే కొత్త తరము ఆలోచిస్తుంది. ఇది సహజం.” 


“అక్కడే ఉండి పదేపదే మనకు ఏమీ తెలియనట్టుగా ఉండటం బదులు, విడిగా మన సమర్థతను నిరూపించుకోవచ్చు.”


ఇప్పుడు హాయిగా ఉంది. ఓపిక ఉన్న రోజు వండుకోవడం, లేని రోజు బయట తినడం. ఒకరికి ఒకరు చాలు. శ్యామలకు కూడా ప్రశాంతంగా అనిపించింది.

ఆదివారం రోజు కొడుకు, కోడలు, మనవడు వచ్చారు. శ్యామల మనవడికి ఇష్టమైన సున్నుండలు చేసింది. అతడు ఇష్టంగా తిన్నాడు. సాయంత్రం వెళ్ళిపోయారు.

వాళ్లు వెళ్ళాక సీతారాం, శ్యామల ఇద్దరూ తేలికపడ్డ హృదయాలతో హాయిగా నవ్వుకున్నారు — తాము ఏ తప్పు చేయలేదనే భావనతో.


బంధాలు ఉంచుకోవాలి, కానీ బంధాలకు బందీలుగా బ్రతకకూడదు.


***

నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి

చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .

రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను

యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .

పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .

విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page