top of page

బ్లాక్ హార్స్


'Black horse' - New Telugu Story Written By Mohana Krishna Tata

'బ్లాక్ హార్స్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఆఫీస్ కు బయల్దేరుతున్న శ్రీను.. తన స్కూటర్ స్టార్ట్ చెయ్యడానికి తెగ కష్టపడుతున్నాడు. ఈలోపు ఇంటి లోపల నుంచి తన భార్య పద్మ వచ్చింది.


"ఏమండీ! ఆ దిక్కుమాలిన స్కూటర్ ఎన్నేళ్ళు వాడతారు. రోజూ ఉదయాన్నే టిక్కు.. టిక్కు అని సౌండ్స్...మీకు ఎలా అనిపిస్తుందో కానీ... నాకైతే చాలా ఇబ్బందిగా ఉందండి!...దాన్ని హుస్సేన్ సాగర్ లో పడేసి... కొత్తది కొనుక్కోవచ్చుగా...ఒక మంచి బైక్ తీసుకోండి..


"నువ్వు ఎన్నైనా.. చెప్పు పద్మా! ఈ బండి నా లక్కీ...నేను ఉద్యోగం లో జాయిన్ అయినప్పుడు కొన్నది.. "

"పనిచెయ్యనిది ఎంత పాతదైనా..కొత్తదైనా.. ఒకటే!"


"నేను చెప్పింది కొంచం ఆలోచించండి...ఒక బైక్ తీసుకోండి..ఎంచక్కా! మనం అలా హ్యాపీ గా రొజూ షికారు కు వెళ్ళొచ్చు గా.."


"నువ్వు ఇంతలాగ చెబుతున్నావు కాబట్టి..మంచి ఆఫర్ లో వస్తే చూస్తాను..."

"మీ ఆఫర్ పిచ్చి పాడుగాను...గుండు సూది నుంచి పెద్ద వస్తువుల వరకు...అన్నిటికి ఆఫర్స్ అంటారు కదా!..."

"అవునే..ఆఫర్స్ అంటే..ఏమిటనుకున్నావు! ఎంత డబ్బులు సేవ్ అవుతాయో తెలుసా? బైక్ అంటే మాటలా?..మంచిదైతే..అటు ఇటు గా ఒక లక్ష మాటే..."


"ఎక్కడైనా...మంచి డిస్కౌంట్ లో చూస్తాను లే! మన బైక్ మెకానిక్ రాజు ను కలుస్తాను..."


మర్నాడు మెకానిక్ రాజు షెడ్ దగ్గరకు వచ్చాడు శ్రీను....


"రాజు! ఒక మంచి బైక్ కావాలి..."

"కొత్తది తీసుకోండి సర్!"

"అంత బడ్జెట్ లేదు రాజు!"

"నీ దగ్గర కు వచ్చే.. ఒక మంచి సెకండ్ హ్యాండ్ బైక్ ఉంటే చెప్పు!"

"ఇప్పుడైతే లేవు...వచ్చాక చెబుతాను సర్!"


శ్రీను ఇంటికి వచ్చేసాడు...

రోజూ.. ఉదయం పెళ్ళాం..పద్మ...అడుగుతూనే వుంది....కొత్త బైక్ ఎక్కడని?

"చూస్తున్నాను!" అని చెప్పేవాడు..

"ఎన్నాళ్ళు చూస్తారు?"

"లేకపోతే..మీ నాన్న ని డబ్బులు అడిగి తీసుకురా!... కొత్తది కొంటా" అన్నాడు శ్రీను

"మా నాన్న అంత ఇచ్చేటట్టుగా ఉంటే...మిమల్ని ఎందుకు చేసుకుంటాను చెప్పండి!"

"అలాగైతే.. వెయిట్ చెయ్యి!"


రోజు రోజు కు స్కూటర్ కండిషన్ ఇంకా పాడయిపోయింది. స్కూటర్ కు కాలు విరిగే లాగ కిక్ కొడితే గాని..స్టార్ట్ అవట్లేదు. పోనీ.. రిపేర్ చేయిద్దాం అంటే...ఎవరూ చెయ్యట్లేదు....


ఒక వారం తర్వాత.. శ్రీను కు మెకానిక్ రాజు కాల్ చేసాడు..

"సర్! ఒక బండి వచ్చింది....కొత్తది లాగ ఉంది...వీలున్నప్పుడు రండి సర్!"


"రేపు ఉదయం వస్తాను...!"


ఉదయాన్నే.. ఆఫీసు టైం కి ఒక గంట ముందే బయల్దేరాడు శ్రీను...రాజు దగ్గరకు


"రాజు! ఏది ఆ బైక్?"

"అదిగో! అని చూపించాడు.... చూడడానికి అది కొత్త రెడ్ కలర్ బైక్. షోరూం బండి లాగా ఉంది."

"కొత్తదా? రాజు"

"కాదు సర్"

"మరి?"

"నిన్న ఒక ఆమె వచ్చి.. తక్కువ రేట్ కి తీసుకోమని ఇచ్చేసి వెళ్లిపోయింది"

"ఎందుకు?"

"అదే నేను అడిగితే...తన స్టొరీ చెప్పింది"


*********

ఆమె తన భర్త ను కొత్త బండి కొనమని రోజూ అడిగేది...వాళ్ళాయన డబ్బులు తగ్గుతాయని...ఒక సెకండ్ హ్యాండ్ బండి కోసం ఆన్లైన్ లో ట్రై చేశాడు...అనుకున్న దానికన్నా...తక్కువకే బండి దొరికిందనీ...వేంటనే డీల్ సెటిల్ చేసుకొని...కొనేసాడు...చాలా చీప్ గా బండి దొరికిందని.. వాళ్ళావిడ తో హ్యాపీ గా చెప్పాడంట..

మర్నాడు.. మొగుడు పెళ్ళాం సాయంత్రం షికారు కెళ్ళారు...ఎదురుగా వస్తున్న...లారి ను తప్పించబోయి ఆక్సిడెంట్ అయ్యింది...వాళ్ళాయన స్పాట్ లోనే చనిపోయారంట. ఆమె దెబ్బలతో హాస్పిటల్ లో జాయిన్ అయి...తేరుకుంది..


తేరుకున్నాకా...బండి తీసుకున్న వాడి దగ్గరకు వెళ్లి అడిగింది...అక్కడ నుంచి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది...ఆ బండి షోరూం నుంచి కొన్న మనిషి కి కుడా ఆక్సిడెంట్ అయి చనిపోయాడు. అందుకే.. ఆ బండి తక్కువ రేట్ కి అమ్మేశారు..వాళ్ళాయన కు..


బండి చూస్తే, చాలా బ్యాడ్ లక్ బండి లాగా ఉందని...ఆమె ఇంకా తక్కువ రేట్ కి.. నాకు అమ్మేసింది..అన్నాడు రాజు


********

"ఇప్పుడు చెప్పండి సర్! ఈ బండి మీరు కొంటారా? ఇప్పటివరకు...దీని ఓనర్స్ ఇద్దరూ చనిపోయారు...మీరు నాకు బాగా తెలుసు కాబట్టి...మీకు ఈ విషయం ముందే చెప్పేస్తున్నాను!"

"అలోచించి రేపు చెబుతాను..."

"అలాగే సర్!"

"ఒక వారం ఆలోచించాడు శ్రీను..."

వారం తర్వాత వచ్చి చూసినా....బండి అక్కడే ఉంది...ఎవరూ కొనలేదు..

"నేను ఈ బండి కొంటాను..."అన్నాడు శ్రీను

"ఓకే నా సర్?"

"'ఎస్'! బాగా ఆలోచించుకున్నాను"


శ్రీను కు బండి బాగా తక్కువ రేట్ లో.. అంటే.. ఆఫర్ లో నే వచ్చిందనమాట...


శ్రీను కు జాతకాల మీద బాగా పట్టుంది... చనిపోయిన ఓనర్స్ డీటెయిల్స్ సేకరించి..వాళ్ళ జాతకాలు చూసాడు. తన జాతకం ప్రకారం బండి లో కొన్ని మార్పులు చేస్తే...తనకి సెట్ అవుతుందని తెలుసుకున్నాడు..కలర్ కూడా బ్లాకు కు మార్చి...బ్లాక్ హార్స్ గా నామకరణం చేసాడు...న్యూమరాలజీ, ప్రకారం కుడా తనకి సెట్ అవుతుందని నమ్మకం. అతని నమ్మకం ప్రకారం ....అతను గెలిచాడు...ఆఫర్ లో బండి కొని..ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది. పెళ్ళాం...పిల్లలతో హ్యాపీ గా ఉన్నాడు శ్రీను.


*******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


46 views0 comments

Comments


bottom of page