చిల్లు జేబు
- Munipalle Vasundhara Rani

- 18 hours ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #ChilluJebu, #చిల్లుజేబు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 21
Chillu Jebu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle
Published in manatelugukathalu.com on 04/02/2026
చిల్లు జేబు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
ఒక ఆదివారం ఉదయం చింటూ, నీలిమ తమ కిడ్డీ బ్యాంకులు తీసుకుని హాల్లో కూర్చున్నారు. నీలిమ తన బ్యాంకును కుదుపుతుంటే గణగణమని బోలెడు శబ్దం వస్తోంది. చింటూ తన బ్యాంకును బల్లకేసి కొట్టాడు గానీ అందులోంచి కేవలం రెండు నాణేలు, ఒక పాత బటన్ మాత్రమే రాలాయి. బామ్మా ఇది అన్యాయం, నాన్న నీలిమకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, నాకు మాత్రం తక్కువ ఇస్తున్నారు అని చింటూ కంప్లైంట్ చేశాడు. అబద్ధం బామ్మా, నాన్న ఇద్దరికీ సమానంగానే ఇస్తారు కానీ చింటూనే ప్రతిరోజూ స్కూల్ దగ్గర అనవసరమైన చాక్లెట్లు, స్టిక్కర్లు కొని పైసలన్నీ ఖర్చు చేస్తాడని నీలిమ అంది.
బామ్మ వారిద్దరి గొడవ విని మీలో ఎవరు పొదుపు చేస్తారో ఇప్పుడే తేల్చేద్దాం అని చెప్పి లోపల గదిలోకి వెళ్ళింది. మంచం మీద ఉన్న రెండు షర్టులను చూపిస్తూ ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకు రండి అని చెప్పింది.
చింటూ హడావిడిగా పరిగెత్తుకెళ్లి అక్కడ ఉన్న రంగురంగుల షర్టుని గభీమని వేసేసుకున్నాడు. నీలిమ మిగిలిన షర్టును తీసుకుని వేసుకుంది. చింటూ వేసుకున్న షర్టు జేబుకి ఒక మూల చిన్న చిల్లు ఉంది కానీ ఆ తొందరలో అతను అది గమనించలేదు. బామ్మ అది చూసినా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది.
ఆ తర్వాత బామ్మ వారిద్దరికీ తలా పది రూపాయల నాణేలు ఇచ్చి సాయంత్రం సంతకు వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర ఈ నాణేలు భద్రంగా ఉంటాయో వాళ్ళకి నచ్చిన పెద్ద బొమ్మ కొనిస్తానని చెప్పింది.
నా జేబులో భద్రంగా ఉంటాయి చూడు అని చింటూ తోటలోకి పరిగెత్తాడు. అక్కడ కోతిలా చెట్లు ఎక్కాడు, కుక్కపిల్లతో కలిసి పరుగులు తీశాడు. చింటూ గెంతినప్పుడల్లా ఆ జేబు రంధ్రం గుండా నాణేలు టక్ టక్ మంటూ కింద పడిపోతున్నాయి. చింటూ తన ఆటల్లో పడి అవేమీ గమనించలేదు. కానీ నీలిమ మాత్రం మధ్యమధ్యలో తన జేబును తడుముకుంటూ జాగ్రత్తగా ఆడుకుంది.
సాయంత్రం బామ్మ ఇద్దరినీ పిలిచి ఎవరి నాణేలు ఎన్ని ఉన్నాయో తీయమని అడిగింది. నీలిమ తన జేబులోంచి పది నాణేలను తీసి ఇచ్చింది. చింటూ ధీమాగా జేబులో చేయి పెట్టాడు కానీ అక్కడ ఒక్క నాణెం కూడా లేదు. ఖాళీ జేబులో ఆ చిన్న రంధ్రం ఇప్పుడు చింటూ వేలికి తగిలింది.
చింటూ బిక్కమొహం వేసి ఏడుస్తుంటే బామ్మ దగ్గరకు తీసుకుని "చూశావా చింటూ, పొద్దున నీ కిడ్డీ బ్యాంకు ఖాళీగా ఉండటానికి కారణం నాన్న డబ్బులు తక్కువ ఇవ్వడం కాదు, నీ నిర్లక్ష్యం. నువ్వు షర్టును సరిగా చూసుకోలేదు, అలాగే నీ ఖర్చులను కూడా చూసుకోవడం లేదు. ఒక్క రూపాయే కదా అని నువ్వు చేసే చిన్న చిన్న ఖర్చులు ఈ చిల్లు జేబు లాంటివే. ఆ రంధ్రం చిన్నదే ఉండొచ్చు కానీ అది నీ పది నాణేలను పోగొట్టింది. సంపాదించడం కంటే ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం" అని వివరించింది.
అప్పుడు నీలిమ చింటూ భుజం మీద చేయి వేసి పర్లేదు చింటూ ఏడవకు, బామ్మ చెప్పింది కరెక్టే. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎంత హుషారుగా ఉంటామో, వాటిని దాచుకునేటప్పుడు కూడా అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ పది రూపాయలు పోతే పోయాయి కానీ నీకు ఒక మంచి పాఠం దొరికింది కదా అని ఓదార్చింది. ఇక నుంచి మనం ఇద్దరం కలిసి మన కిడ్డీ బ్యాంకులను నింపుదాం, ఈసారి సంతలో నా బొమ్మతో పాటు నీకు నచ్చిన చిన్న కారు కూడా కొందాం అని చెప్పింది.
నీలిమ మాటలకు చింటూ కళ్ళు తుడుచుకుని నవ్వి ఇక నుంచి నేను కూడా నీలాగే ప్రతి పైసాను జాగ్రత్తగా దాచుకుంటాను, చిన్న చిల్లుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయను అన్నాడు. బామ్మ వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోయింది. సాయంత్రం ముగ్గురూ కలిసి సంతోషంగా సంతకు బయలుదేరారు.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments