top of page
Original.png

ఈర్ష్య... స్నేహాన్ని కూడా శత్రుత్వంగా మారుస్తుంది...

17 hours ago
2 min read

హేమకు వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి రావడంతో ఈర్ష్యపడిన సౌమ్య, చివరకు స్నేహితురాలిని క్షమాపణ కోరుతున్న దృశ్యం

Eershya... Snehanni Kuda Shathruthvanga Marustundi ...- Telugu Moral Story | Sanjeeva Kumar Y

ఈర్ష్య... స్నేహాన్ని కూడా శత్రుత్వంగా మారుస్తుంది... - తెలుగు నీతి కథ| వై. సంజీవ కుమార్

Published in manatelugukathalu.com on 13/11/2026


ఈర్ష్య స్నేహాన్ని కూడా శత్రుత్వంగా మారుస్తుంది. హేమ, సౌమ్య కథ ద్వారా నిజమైన స్నేహం అంటే ఒకరి విజయాన్ని మరొకరు ప్రోత్సహించడమేనని తెలుసుకుందాం.


ఒక పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు హేమ, సౌమ్య మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇద్దరూ కలిసే చదువుకునేవారు, ఆడుకునేవారు. 


ఒకరి దగ్గర ఉన్న వస్తువులను మరొకరు పంచుకునేవారు. వారి స్నేహాన్ని చూసి ఉపాధ్యాయులు కూడా సంతోషించేవారు.


ఒకరోజు పాఠశాలలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఇద్దరూ పాల్గొన్నారు. అందులో హేమకు మొదటి బహుమతి వచ్చింది. ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. తోటి విద్యార్థులు చప్పట్లతో ప్రశంసించారు.


స్నేహితురాలు సౌమ్య కూడా మొదట నవ్వుతూ అభినందించింది. కానీ మనస్సులో మాత్రం ఏదో తెలియని బాధ మొదలైంది. చిన్న ఈర్ష్య మొలకెత్తింది....


మరుసటి రోజు నుంచి సౌమ్య ప్రవర్తన మారిపోయింది. స్నేహితురాలు హేమ మాట్లాడితే నిర్లక్ష్యం చేయడం, ఆమె రాసిన వ్యాసంలో తప్పులు వెతకడం, ఇతరుల దగ్గర హేమ గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టింది.


అన్నీ గమనిస్తూ వస్తున్న హేమ ఒకరోజు కన్నీళ్లతో అడిగింది.


"నేను బహుమతి గెలిచినప్పుడు నువ్వు సంతోషించలేదా? మన స్నేహం కంటే ఆ బహుమతి పెద్దదైందా?"


ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సౌమ్య తలదించుకుంది.


అప్పుడే పక్కనే వీళ్ళ సంభాషణ వింటున్న ఉపాధ్యాయురాలు జోక్యం చేసుకొని ఇలా అన్నారు...


"ఒకరి ప్రతిభను మరొకరు ప్రోత్సహించుకోవాల్సిన వయస్సులో, ఈర్ష్యతో ఎదుటివారి మనస్సును గాయపరచకూడదు. నీ స్నేహితురాలికి వచ్చిన బహుమతి నీ ఓటమి కాదు. రేపు నువ్వు కూడా గెలవడానికి అది ఒక స్ఫూర్తి కావాలి."


ఆ మాటలు విన్న సౌమ్య తన తప్పును తెలుసుకుంది. స్నేహితురాలు హేమను కౌగిలించుకుని క్షమాపణ కోరింది.


రచన: వై. సంజీవ కుమార్









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


వై. సంజీవ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: వై. సంజీవ కుమార్


భట్టు వెంకటరావు

నా పేరు వై. సంజీవ కుమార్. హైదరాబాద్‌లో చిన్న కన్సల్టెన్సీ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాను. సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో స్కై ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి, వివిధ రకాల సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను.


అలాగే సామాజిక కోణంలో ఉండే అనేక అంశాలపై వ్యాసాలు రాయడం నాకు అలవాటు. ఇప్పటివరకు ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాశాను. వాటిలో అనేక వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి.


ఇటీవల మొదటిసారిగా తెలుగు కథల ప్రపంచాన్ని పరిశీలించే అవకాశం కలిగింది. కథల ద్వారా భావాలను, జీవితంలోని అనుభవాలను, సామాజిక అంశాలను మరింత ఆసక్తికరంగా చెప్పవచ్చని అనిపించింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page