గుర్రం జాషువాపై కవితా గానం

Gurram Jashuvapai kavitha Ganam |Special Telugu Article | Polayya Kavi
గుర్రం జాషువాపై కవితా గానం - తెలుగు వ్యాసం |పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 28/09/2026
గుర్రం జాషువాపై కవితా గానం - పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం
హైదరాబాద్, సెప్టెంబర్ 27:
హిమాయత్ నగర్‌లోని శారదా
కల్చరల్ స్టూడియోలో సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో
డా. విడి రాజగోపాల్ అధ్యక్షతన స్మృతి
నీరాజనం సభ ఘనంగా నిర్వహించారు.
డా. అక్కినేని నాగేశ్వరరావు, కవి కోకిల
గుర్రం జాషువా జయంతులతో పాటు గాన గంధర్వుడు డా. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రముఖ కవి, రచయిత, నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని కవి కోకిల గుర్రం జాషువాపై “కలం నా కత్తి — కుల నిర్మూలన నా వృత్తి” అనే శీర్షికతో జాషువా సాహిత్య ప్రస్థానం, సామాజిక చైతన్యం, సమానత్వ సందేశాన్ని ప్రతిబింబించేలా సాగిన కవితా గానం సభికులను ఆకట్టుకుంది.
తదనంతరం డా. విడి రాజగోపాల్,
డా. వెంకట రమణ, ఏ.ఎల్. కృష్ణారెడ్డి
తదితర సాహితీ మూర్తులు పోలయ్య
కవి కూకట్లపల్లిని ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం
పూర్వ ఉప సంచాలకులు, డా. ఓలేటి పార్వతీశం,పాల్గొని 46 కవితల
ఈ-పుస్తకంతో పాటు “బాలగేయ బ్రహ్మ”
శ్రీ గద్వాల సోమన్న రచించిన
"చిరుగాలి - పున్నమి వెన్నెల”పుస్తకాలను
ఆవిష్కరించి చక్కని ప్రసంగం చేశారు
సుమారు 40 మంది కవులు, కవయిత్రులు
పాల్గొని కళామతల్లి ముద్దు బిడ్డలైన
అక్కినేని నాగేశ్వరరావు, గుర్రం జాషువా, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సేవలను స్మరిస్తూ కవితా గానం చేశారు.
స్వర సామ్రాట్ డా. శరత్చంద్ర సంగీత దర్శకత్వంలో గాయని శ్రీదేవి, మధుర
గాయకులు రవీంద్రబాబు అరవ, గాన కోకిల
డా. అన్నపూర్ణ తదితరులు ఆలపించిన
సినీ గీతాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ సభకు గౌరవ అతిథులుగా కళారత్న శ్రీమతి ఎం.కే. ఆశాలత (రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్), ఏ.ఎల్. కృష్ణారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు డా. వెంకట రమణ, పారిశ్రామికవేత్త మోసు శ్రీనివాసులు,
డా. కోగంటి ఉషారాణి, సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను, కవులను, కవయిత్రులను డా. విడి రాజగోపాల్ ఘనంగా సన్మానించారు. చక్కని విందు భోజనంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
-పోలయ్య కవి









Comments