top of page
Original.png

మహాలయ పక్షాలు పితృపక్షాల్లో పాటించవలసిన విధానాలు, నిబంధనలు

14 hours ago
5 min read

మహాలయ పక్షాల్లో పూర్వీకులకు తర్పణం, పిండప్రదానం చేస్తున్న హిందూ కుటుంబం – పితృపక్ష నియమాలు మరియు ఆచారాలు

 

Mahalaya Pakshalu Pithru Pakshallo Patinchavalasina Vidhanalu Nibandhanalu - Telugu Inspirational Article | R C Kumar

మహాలయ పక్షాలు పితృపక్షాల్లో పాటించవలసిన విధానాలు, నిబంధనలు - తెలుగు స్ఫూర్తిదాయక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 28/09/2026


హిందూ సంప్రదాయంలో పూర్వీకులను స్మరించుకొని వారికి శ్రద్ధతో తర్పణాలు, పిండప్రదానాలు సమర్పించే పవిత్ర కాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షాలు అంటారు. ఈ సమయంలో పాటించాల్సిన ఆహార నియమాలు, శ్రాద్ధ విధానాలు, ఘంటానాదం వంటి అంశాలపై అనేక సందేహాలు ఉన్నాయి.


ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు పితృపక్షం కొనసాగుతుంది. హిందూ సంప్రదాయంలో పూర్వీకులను స్మరించుకోవడానికి ఈ 16 రోజుల కాలాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. 


పితృపక్షాలు సాధారణంగా 16 చాంద్రమాన రోజులు (తిథులు) కలిగి ఉంటాయి, అయితే ఆచరణలో వీటిని చాలామంది 15 రోజులుగా భావిస్తుంటారు. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం. పితృపక్షాలు భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు లేదా పాడ్యమి రోజు ప్రారంభమై, అశ్వయుజ మాసంలో వచ్చే మహాలయ అమావస్య (సర్వపితృ అమావస్య) తో ముగుస్తాయి. 


ఈ లెక్క ప్రకారం పౌర్ణమి తిథి నుంచి అమావాస్య వరకు మొత్తం 16 తిథులు (లేదా రోజులు) వస్తాయి. అందుకే దీనిని సంస్కృతంలో 'షోడశ శ్రాద్ధం' అంటారు. ఆ విధంగా పౌర్ణమి రోజున పితృకార్యాలు ఆచరించడం మొదలుపెట్టే వారు కొంతమందైతే, కృష్ణ పక్షం పాడ్యమి నుండి అమావస్య వరకు ఉండే 15 రోజుల్లో పితృదేవతలను తలచుకుని తర్పణాలు, పిండ ప్రదానాలు చేసేవారు మరికొందరు. పక్షం అనగా 15 రోజులు కాబట్టి, సాధారణ వ్యవహారంలో వీటిని 15 రోజుల కాలం అని అంటుంటారు.


ఈమధ్య వెలువడుతున్న కొన్ని యూట్యూబ్ వీడియోల్లో పితృపక్ష పూజాదికాల నియమాలు గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి తోచింది వారు దీని గురించి చెప్పుకుంటూ పోతున్నారు. 


ఉదాహరణకు పితృపక్షాల 16 రోజుల కాలంలో ఇళ్లలో పూజలు చేసుకునే సమయంలో గంట కొట్టకూడదు అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి శాస్త్రపరమైన విధానాలు, నిబంధనలు పరిశీలించి విశ్లేషించే ప్రయత్నమే ఈ వ్యాసం. 


పితృపక్ష నియమాలు ప్రాథమికంగా మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను చూపేందుకు రూపొందించబడ్డాయి. అందులో భాగంగా సామాన్య ప్రజానీకంలో ఉన్న ముఖ్యమైన సందేహం గంట కొట్టడం గురించి. 


ఈ సందేహ నివృత్తి చేసుకునే ముందు గంట' మరియు 'ఘంట' అనే రెండు పదాల్లో ఏది కరెక్ట్ అనే విషయంపై కొంత అవగాహన అవసరం. ఇవి ఉపయోగించే సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. 


గంట అనేది సాధారణంగా మనం నిత్యజీవితంలో వాడే అచ్చ తెలుగు పదం. దీనిని సమయం కోసం లేదా బడిలో/కార్యాలయాల్లో కొట్టే గంటకు ఉపయోగిస్తాము. ఉదాహరణ: "ఇప్పుడు సమయం ఒక గంట అయింది", "బడి గంట మ్రోగింది". 


ఇక ఘంట అనేది సంస్కృత పదం. పూజా కార్యక్రమాలలో, దేవాలయాలలో మరియు సాహిత్యపరంగా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఘంటానాదం (గుడిలో గంట కొట్టడం), ఘంటాపథంగా (ఖచ్చితంగా/నొక్కి చెప్పడం)


పితృపక్షం నడిచే అన్ని రోజుల్లో పితృదేవతలు మన ఇళ్లలోనే సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటారని కొందరు నమ్ముతారు. ఘంటానాదం మరియు శంఖ ధ్వని వారిని ఇబ్బంది పెడతాయి కాబట్టి, ఈ 15 రోజులు ఇంట్లో చేసే నిత్య దైవ పూజలో కూడా గంట వాయించకుండా ఉండటమే మంచిదని కొందరు పండితులు, పూజారులు చెబుతుంటారు. 


నిశ్శబ్దంగా దీపారాధన, ధూపం, మరియు మంత్ర పఠనం చేసుకోవచ్చని వారి అభిప్రాయం. శాస్త్ర పరంగా చూసుకుంటే పితృపక్ష సమయంలో ఇంట్లో రోజువారి పూజలు చేసేటప్పుడు గంట వాయించకూడదని ఎక్కడా ఏ శాస్త్రంలో స్పష్టంగా నిషేధించలేదు. ఎప్పటివలె ఇంట్లో దేవునికి చేసే పూజల్లో గంట వాయించవచ్చు, ఎలాంటి దోషం ఉండదు. 


కానీ ఏరోజు అయితే పూర్వీకులకు శ్రాద్ధం లేదా పిండప్రదానం చేస్తారో, ఆ రోజు మాత్రమే పితృ కార్యాలు పూర్తయ్యే వరకు శుభ కార్యాలు, పెద్ద శబ్దాలు, ఉత్సవాలకు దూరంగా ఉండాలి. ఆ సమయంలో మాత్రం దేవుని పూజలో గంట కొట్టడం మానుకోవాలి.


ఈ విషయంపై ఆయా సందర్భంలో ఆయా పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. గరుడ పురాణం మరణం, ఆత్మల ప్రయాణం, మరియు పితృదేవతలకు సంబంధించిన ఆచారాలను అత్యంత వివరంగా చర్చించే గ్రంథం. పితృ లోకంలో ఉన్న ఆత్మలు భూమికి వచ్చేటప్పుడు వాతావరణం ఎలా ఉండాలి, వారికి ఎలాంటి అర్పణలు, పిండప్రదానాలు చేయాలో ఇందులో స్పష్టంగా ఉంది. 


ఘంటానాదం వంటి దేవతా పూజా శబ్దాలు పితృదేవతల రాకకు అంతరాయం కలిగిస్తాయని ఇందులో సూచించబడింది. ఎందుకు అనేది స్కాంద పురాణంలో ఉంది. ఆ పురాణం ప్రకారం, పూజా గంట నుండి వచ్చే ధ్వని పవిత్రమైన 'ఓం' కారాన్ని పోలి ఉంటుంది. 


గంటను మోగించినప్పుడు వచ్చే ‘టాంగ్’ అనే శబ్దం క్రమంగా తగ్గుతూ ‘ఓం’ అనే నాదంతో ముగుస్తుంది. ఈ నాదం నుండి వెలువడే ధ్వని తరంగాలు సాత్విక శక్తులను, దైవిక శక్తులను ఆకర్షిస్తుంది. మనస్సులోని చెడు ఆలోచనలను దూరం చేసి, దైవచింతనను కలిగిస్తుంది. గంట శబ్దం వినగానే రాక్షసులు దూరం అవుతారు దేవతలు వస్తారు అనడం దానికి ప్రతీక.


ఇందులో శాస్త్రీయ కోణం ఏమిటంటే - గంటను తయారుచేసేటప్పుడు క్యాడ్మియం, రాగి, జింక్, నికెల్, సీసం వంటి లోహాలను ప్రత్యేక నిష్పత్తిలో కలుపుతారు. దీనివల్ల గంట మోగించినప్పుడు వచ్చే తరంగాలు మెదడులోని ఎడమ, కుడి భాగాలను సమతుల్యం చేస్తాయి. ఈ ధ్వని మనస్సును ప్రశాంత పరిచి, పూజపై పూర్తి ఏకాగ్రత నిలిపేలా చేస్తుంది. 


ఈ నాదం ప్రతికూల శక్తులను లేదా లౌకిక బంధాలను దాటి సూక్ష్మ రూపంలో ఉండే ఆత్మలను దూరం చేస్తుంది. అందువల్ల పితృకార్యాలు జరిగే సమయంలో ఇటువంటి శబ్దం చేయకూడదని ఈ పురాణం చెబుతుంది. 


ఇక వాయు పురాణం మరియు మత్స్య పురాణాల్లో కూడా పితృపక్ష నియమాలు చెప్పబడ్డాయి. పితృ పూజ దైవ పూజ కంటే భిన్నమైనది. రెండు వేరువేరు కాబట్టే పితృదేవతలు ఫోటోలు పూజ గదిలో దేవుళ్ళ పక్కన పెట్టకూడదు. 


మరణించిన వారికోసం నిశ్శబ్దంగా నిలబడి రెండు నిమిషాలు పాటు శ్రద్ధాంజలి పాటించడం ఎందుకంటే దైవ పూజలో శబ్దం, ఆర్భాటం ఉంటుంది... పితృ పూజలో నిశ్శబ్దం, ఏకాగ్రత, ధ్యానం ముఖ్యమని పురాణాలు ఉద్ఘాటిస్తాయి.


మనస్మృతి & యాజ్ఞవల్క్య స్మృతి వంటి ధర్మశాస్త్రాల ప్రకారం శ్రాద్ధ కర్మలు జరుగుతున్నప్పుడు గంట వాయించడం నిషేధం. ఒకవేళ పొరపాటున గంట మోగితే, పితృదేవతలు ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోతారని ఈ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 


సంక్షిప్తంగా చెప్పాలంటే, దేవతలు "నాద ప్రియులు" శబ్దాలను ఇష్టపడతారు, కానీ పితృదేవతలు "స్వధా ప్రియులు" ప్రశాంతతను కోరుకుంటారు. అందువల్లనే మన పూర్వీకులు ఈ సూక్ష్మమైన తేడాలను గమనించి నియమాలను రూపొందించారు. 


పితృదేవతలకు తర్పణాలు లేదా పిండప్రదానం వదిలేటప్పుడు "స్వధా" అని పలుకుతారు.‌ దేవతలకు హవిస్సు (ఆహారం) సమర్పించేటప్పుడు "స్వాహా" అంటాం. 


'స్వధా' అనేది ఒక దేవత పేరు. ఈమె ఆహారాన్ని పితృదేవతలకు చేరవేసే శక్తిగా పరిగణించబడుతుంది. స్వధా మంత్రంతో ఇచ్చే ఆహారాన్ని పితృదేవతలు ఇష్టంగా స్వీకరిస్తారు కాబట్టి వారిని 'స్వధా ప్రియులు' అంటారు. 


పూర్వీకులు మరణించిన నిర్దిష్ట తిథి తెలియకపోతే, పక్షం చివరి రోజైన మహాలయ అమావాస్య (సర్వ పితృ అమావాస్య) రోజున తర్పణాలు ఇస్తే, సంవత్సరం మొత్తం పితృ తర్పణాలు చేసిన ఫలితం లభిస్తుంది. 


పితృపక్షం రోజుల్లో పాటించాల్సిన సాధారణ నియమాలు:


1. ఈ 15 రోజులు ఇంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మరియు మద్యం వంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి.


2. కొత్త ఇల్లు కొనడం, గృహప్రవేశాలు, వివాహ నిశ్చయాలు, లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలను ఈ కాలంలో చేయకూడదు. దేశీయ, విదేశీయ పర్యటనలు కూడా నిషిద్ధం.


3. ముఖ్యంగా ఇంట్లో పితృకార్యం (శ్రాద్ధం) చేసే కర్త, ఆ తిథి రోజు వరకు లేదా అమావాస్య ముగిసే వరకు క్షౌరం చేసుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు.


4. పితృపక్షం రోజుల్లో ప్రతిదినం ఉదయం కాకులకు, ఆవులకు లేదా కుక్కలకు అన్నం పెట్టడం పితృదేవతలకు సంతోషాన్ని కలిగిస్తుంది.


5. ఏదైనా ప్రమాదాలలో, దుర్ఘటనల్లో, యుద్ధ ప్రాంతాలలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు ఆకస్మికంగా ఎవరైనా చనిపోతే, లేదా ఏ సమయంలో, ఏ రోజు చనిపోయారో తెలియ పోయినా మహాలయ పక్షాలు పితృపక్షాలు ఒక అద్భుతమైన అవకాశం. 

6. ఈ కార్యం వల్ల ఇంట్లో ఉన్న ఎటువంటి దోషాలైనా నివారించబడతాయి. ఈ నియమాలన్నీ మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతను చూపేందుకు, ఇంట్లో సాత్వికమైన ప్రశాంత వాతావరణాన్ని ఉంచేందుకు రూపొందించబడ్డాయి.


స్వస్తి, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🙏


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page