top of page
Original.png

కిలకిలలు


చిన్నారి ప్రీతి పగిలిన వాచ్‌కు క్షమాపణగా కిడ్డీ బ్యాంక్ డబ్బులు తల్లికి ఇస్తున్న దృశ్యం

Kilakilalu - Telugu Family story | Nandyala Vijaya Lakshmi

కిలకిలలు - తెలుగు కుటుంబ కథ | నంద్యాల విజయలక్ష్మి

Published in manatelugukathalu.com on 03/09/2026


పిల్లల అల్లరిలో కోపం తెప్పించే క్షణాలున్నా, వాటి వెనుక దాగి ఉండే అమాయకత్వం తల్లిదండ్రులకు ఎంతో మధురంగా ఉంటుంది. ‘కిలకిలలు’ కథలో చిన్నారి ప్రీతి చేసే చిలిపి పనులు, అమ్మ ప్రియ–నాన్న మాధవ్ చూపించే ప్రేమాభిమానాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. అనుకోకుండా అమ్మ వాచ్ పగలగొట్టిన తర్వాత ప్రీతి చేసే చిన్న ప్రయత్నం కథను మరింత హృద్యంగా, నవ్వు తెప్పించేలా చేస్తుంది. పిల్లల మనస్తత్వాన్ని, కుటుంబంలోని ప్రేమానురాగాలను ఆహ్లాదకరంగా చూపించే చక్కని కథ ఇది.


ప్రియ, మాధవ్ అన్యోన్యమైన జంట. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, గౌరవము, శ్రద్ధ.

ఈ అనురాగాల జంట ప్రేమఫలము చిన్ని పాపాయి. ఈ గారాబాల కుర్రాడికి/పాపకు ప్రేమగా ప్రీతి అనే పేరు పెట్టారు.


వయసు పెరుగుతూ ఉంటే చిన్నారి ప్రీతి ఆకతాయి పనులు ఒకోసారి నవ్వు తెప్పించినా, కోపము వచ్చేది ప్రియకు. హార్లిక్స్, జామ్ సీసాలు, చాక్లెట్లు, తేనె ఇలా చప్పుడు చేయకుండా ఖాళీ చేసేది. అడిగితే నాకు తెలీదని డబాయించడం మామూలు అయిపోయింది. ప్రియా, మాధవ్ వారించినా ఈ పనులు మానలేదు.


ఒక రోజు అనుకోని సంఘటన జరిగింది.

ప్రీతికి ఎప్పటినుండో ప్రియ వాచ్ పెట్టుకోవాలని ఉంది. వాళ్ళ అమ్మ దానిని అపురూపంగా చూసుకుంటుందని అడిగితే ఒప్పుకోదని, ఆ రోజు ధైర్యం చేసి ప్రియ స్నానము చేయడానికి వెళ్ళినప్పుడు గబగబా చేతికి పెట్టుకుని చూసుకుంది. తీసేద్దామనుకుంటూ అనుకోకుండా ఒక బటన్ నొక్కింది. వెంటనే ప్రీతికి ఇష్టమైన పాట వచ్చింది. ఆ సంతోషంలో డాన్స్ మొదలు పెట్టింది.


తలుపు చప్పుడు అవడంతో బయటికి పరుగెత్తే హడావుడిలో గుమ్మం తగిలి పడింది. ఆ పడిన పాటుకు చేతికున్న వాచీ పగిలింది. అదే టైముకి మాధవ్ వచ్చి జరిగింది చూసి, "అమ్మ, వస్తువులు ఎందుకు తీశావు?" అని కోపంగా అన్నాడు.


"డాడీ, నువ్వు ఏ శిక్ష వేస్తావు? ఎండలో నిలబడనా? టీవీ చూడటము మానెయ్యనా?" అని తనే చెబుతోంది.


మాధవ్ వచ్చే నవ్వు ఆపుకుని, అప్పుడే బయటికి వచ్చిన ప్రియను చూసి నవ్వాడు.


"ఏమిటి సంగతి?" అని అడిగింది ప్రియ.


ఇంతలో ప్రీతి పరుగులాంటి నడకతో వెళ్ళి, కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు ఒక చేతితో, ఇంకో చేతిలో ఒక కాగితము తీసుకుని వచ్చి ప్రియ చేతిలో పెట్టి పారిపోయింది.


"మమ్మీ సారీ, ఈ డబ్బులతో కొత్త వాచీ కొనుక్కోవచ్చు అనుకుంటాను."


ఇది చదివాక నవ్వు ఆగలేదు ప్రియకు. మాధవ్ చేతిలో ప్రీతి రాసిన కాగితం పెట్టింది. ఇద్దరూ గదిలో మూల దాక్కున్న ప్రీతి నుదుటిన ముద్దు పెట్టుకుని నవ్వారు. ప్రీతి వారితో కలిసి కిలకిలా నవ్వింది.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


నంద్యాల విజయలక్ష్మి

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను. రెండు వందలపైగా కవితలు, మూడుకథానికలు రాసాను. యాభై పైగా సర్టిఫికెట్స్, సహస్రకవిమిత్ర బిరుదు పొందాను. పుస్తకపఠనము పై నాకు ఆసక్తి. విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను. ఇంకా ఎన్నో చదవాలని కోరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page