top of page

క్షమాపణ


'Kshamapana' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 12/10/2023

'క్షమాపణ' తెలుగు కథ

రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


సీరియస్ గా పని చేసుకుంటున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ విజయ్, ఫోన్ రింగవడంతో చేస్తున్న పని ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు.


"హలో! అది సనత్ నగర్ పోలీసు స్టేషనేనా? ఎస్సయి గారున్నారా?" అవతల స్త్రీ స్వరం ఆందోళనగా వినిపిస్తోంది.


"ఎస్. నేను ఎస్సయిని మాట్లాడుతున్నాను." అన్నాడు విజయ్.


"సర్. నేను చంద్రమ్మని. హాస్టల్ వార్డెన్ ని. మాంటిస్సోరి కాలేజీ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ రూమ్ నెంబర్ 18 లో ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో ఉండగా ఇప్పుడే 108 కు ఫోన్ చేసి హాస్పిటల్ లో తోటి విద్యార్థినుల సాయంతో చేర్చాను. డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. మీరు వెంటనే రావాలి." అని హాస్పిటల్ వివరాలు చెప్పి ఫోన్ పెట్టేసింది.


వెంటనే హడావుడిగా ఆవిడ చెప్పిన అడ్రసుకు వాహనంలో వెళ్ళాడు విజయ్. అక్కడ డాక్టర్ ను కలిసి ఆ అమ్మాయిని చేర్చిన గదిలోకి వెళ్ళాడు. బెడ్ మీద అచేతనంగా పడి ఉన్నదామె. డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. విజయ్ అక్కడి నుంచి బయటకు వచ్చి వేచి చూడగా కాసేపటికి ఒక డాక్టర్ బయటకు వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందని, అదృష్టవశాత్తు సమయానికి తీసుకొచ్చి హాస్పిటల్ లో చేర్చబట్టి చికిత్స చేశామని, ప్రాణాపాయం తప్పిందని, కాసేపట్లో స్పృహలోకి వస్తుందని చెప్పాడు. విజయ్ ఆమె గురించి వివరాలు అడిగితే అవి తమకు తెలియదనీ, తమ వద్దకు తీసుకొచ్చిన ఆవిడను చూపించాడు.


కొంచెం దూరంలో వీళ్లను గమనిస్తున్న ఆవిడ వీళ్ళ వద్దకు వచ్చి " డాక్టర్ ! ఇప్పుడామె పరిస్థితి ఎలాఉంది? స్పృహ వచ్చిందా? ప్రాణాపాయం లేదు కదా? నేను వెళ్ళి ఆమెను చూడచ్చా? " అని ఆదుర్దాగా ప్రశ్నిస్తున్న ఆవిడకు " కొద్ది సేపటికి ఆమె స్పృహలోకి రాగానే మీరు వెళ్ళి చూడవచ్చు" అన్నాడు డాక్టర్.


'ధాంక్ గాడ్' అని విజయ్ వేపు తిరిగి "నమస్కారం సర్. నేను చంద్రమ్మను. మీకు ఫోన్ చేసింది నేనే" అని తనని తాను పరిచయం చేసుకుంది.


కేసు ఫైలు చేద్దామని ఆవిడను ఆ యువతిని గురించి వివరాలు అడిగితే ఆవిడ ఆ అమ్మాయి పేరు రమ్య అనీ, మా కాలేజీలో ఇంటర్ ద్వితీయ సం.. . చదువుతూ ఎమ్ సెట్ కోచింగ్ ని తీసుకుంటూ, ఆ కాలేజీ హాస్టల్లో ఉంటోందనీ, రమ్య ఫోన్ నెంబర్, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబరు ఇచ్చింది.


విజయ్ ఆ వివరాలను నమోదు చేసుకుని కేసు ఫైలు చేసి రమ్య తల్లి తండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. విషయం విన్న వాళ్ళు "అయ్యో! దేవుడా ! ఎంత ఘోరం ? మా అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది ? వెంటనే బయలుదేరి వస్తున్నాము." అని ఏడుస్తున్న వాళ్లకు ధైర్యం చెప్పాడు విజయ్.


కాసేపటికి రమ్య కు స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పగానే విజయ్, చంద్రమ్మ ఆ గదిలోకి వెళ్ళారు. నిర్లిప్తంగా చూస్తున్న రమ్యను చూసి ఈ సమయంలో ఆమెను ప్రశ్నించ కూడదనుకుని ఆమెకు ధైర్యం చెప్పాడు విజయ్.


కాసేపటికి రమ్య తల్లి తండ్రులు గాబరాగా వస్తూ "రమ్యా! ఎలా ఉన్నావమ్మా? డాక్టర్! మా అమ్మాయి కి ఏం ప్రమాదం లేదు కదా ?" ఆని ఏడుస్తూ అడుగుతున్న వాళ్ళను ఓదార్చి, ప్రాణాపాయం లేదని ధైర్యం చెప్పాడు డాక్టర్.

రమ్య ను " ఆత్మహత్య కు ఎందుకు ప్రయత్నించావు? అది నేరమని నీకు తెలీదా ?" అన్నాడు విజయ్.


"తెలుసు సర్. నా పేరు రమ్య. నేను ఇంటర్ చదువుతున్నాను. వీళ్ళు మా అమ్మానాన్నలు. గ్రామంలో వ్యవసాయ కూలీలు. వాళ్లకు నేనొక్కత్తినే సంతానం. కూలిపనులు చేసి కష్టపడి పెంచి నన్ను చదివిస్తున్నారు. మా ఊరిలో డాక్టరు లేడు. నన్ను డాక్టరు ను చేయాలని వాళ్ళ కోరిక. బాగా చదువుతూ ఎమ్ సెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. మంచి రాంకుతో సీటు తెచ్చుకుని డాక్టరునయి ప్రజలకు సేవచేయాలని, నా పేరెంట్స్ ను బాగా చూసుకోవాలనుకున్న లక్ష్యంతో చదువుతున్నాను. కానీ 2 నెలల నుంచి విపరీతమైన వత్తిడి. ఎంత చదువుతున్నా కోర్సు అర్ధం కాక ఎన్నోమార్లు సందేహ నివృత్తికోసం లెక్చరర్ని అడిగాను. వాళ్లు చెప్పింది అర్థం కావట్లేదు. ఇంక నేను నా లక్ష్యాన్ని సాధించలేనేమో, నా వాళ్లకు భారమెందుకు? అని ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించాను" అంది రమ్య.


"నీపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు నీ తల్లీతండ్రి. నువ్విలా చేయడం సరైన పనేనా? చెప్పు. చదువులో వత్తిడి సహజం. కౌన్సెలింగ్ తీసుకుని వత్తిడిని పోగొట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి కానీ ప్రాణాలు తీసుకుంటారా? అదృష్టవశాత్తు వైద్యం అంది బ్రతికావు. ఇంక ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయకు " అని మందలించి వెళ్ళాడు విజయ్.


"నన్ను క్షమించండి " అంటూ కన్నీళ్లతో పేరెంట్స్ చేతిని పట్టుకుంది రమ్య. కూతురి కన్నీళ్ళను తుడిచి గుండెలకు హత్తుకున్నారు వాళ్లు. తనని కాపాడిన చంద్రమ్మకు, డాక్టర్ కు ధన్యవాదాలను తెలిపింది రమ్య.

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



79 views0 comments
bottom of page