top of page
Original.png

జీవితానికి విల్లు!

Updated: Apr 8


జీవితం చివరి దశలో మన కోరికలు గౌరవించబడాలంటే ముందుగానే తీసుకునే నిర్ణయమే “లివింగ్ విల్”. ఇది కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు—కుటుంబానికి బాధ్యత, మనసుకు శాంతి ఇచ్చే ముందుచూపు.

Jeevithaniki Villu - Telugu Article | A. Annapurna

జీవితానికి విల్లు! - తెలుగు వ్యాసం | ఏ. అన్నపూర్ణ | ఉత్తమ అభ్యుదయ రచయిత్రి

Published in manatelugukathalu.com on 07/04/2026


సీనియర్ సిటిజన్స్‌కు, ప్రజలకు, మిత్రులకు ఒక సూచన. భవితకు ఆలోచన.

మనిషి నాలుగు దశలు దాటి చివరి మజిలీకి చేరుకున్నాక ముందు చూపుతో నిర్దుష్టమైన ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.


సంపాదించిన ఆస్తిని, తాతల నుంచి వచ్చిన వారసత్వపు ఆస్తిని కుటుంబ సభ్యులకు విల్లు రాయడం మామూలు విషయం. దీనితోపాటు "లివింగ్ విల్" కూడా రాయడం అవసరం అని మీకు తెలుసా?

ఈ విల్ రాయకపోతే మీరు మీ కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినవారు అవుతారు.

వయసుతో సంబంధం లేని వ్యాధులు కావచ్చు, అనుకోని ప్రమాదాలు కావచ్చు, ఎప్పుడు ఎదురుకోవలసి వస్తుందో తెలియదు.


ప్రపంచ జనాభాలో వృద్ధుల జీవన ప్రమాణం పెరిగింది. వైద్య సదుపాయాలు, నూతన సౌకర్యాలు లభించడం సంతోషించే విషయమే! కానీ ఇందువలన నష్టమూ జరుగుతోంది. అదేమిటో తెలుసుకుందాం.


మా బంధువు స్కూటర్ మీద నుంచి పడిపోయాడు. కాలు ఫ్రాక్చర్ అయితే బ్యాండేజ్ వేశారు. కొంతకాలం తర్వాత ఏవో అర్థం పర్థం లేని మతిమరపు మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు.


డాక్టర్ దగ్గరకు తీసుకువెళితే తలకు దెబ్బ తగిలిందని వెంటనే జాగ్రత్త తీసుకోలేదని ఇప్పుడు ఆ ప్రభావం ఇది అంటూ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. క్రమంగా పార్కిన్సన్, డిమెన్షియా లోకి దారితీసింది.


ఇక చూడండి... హాస్పిటల్లో కొద్దిరోజులు, రిహబ్‌లో కొద్దికాలం, రెండేళ్లు గడిచిపోయాయి. ఇన్సూరెన్స్ లిమిట్ దాటిపోయింది. మనిషిలో మార్పులేదు, సరికదా కోమాలో ఉన్నాడు. అలాంటి మనిషికి ఫిజియో థెరపీ అంటారు-ఎక్సర్సైజులు అంటారు, గొంతులో ట్యూబ్, ముక్కులో ఓ ట్యూబ్, నోటిలో మరో మెషిన్ ఇలా బొమ్మతో ఫీడింగ్స్ చేయించినట్టు ఇష్టం వచ్చినట్టు ఆడుకునేవారు రిహాబ్‌లో. మధ్యలో అప్పుడప్పుడు హాస్పిటల్- మళ్ళీ రిహాబ్ ఇలా ముప్పు తిప్పలు పెట్టి కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేశారు.


వాళ్ళు భరించలేక ఇంటికి తెచ్చారు. ఇంట్లో మాత్రం ఏముంది? నర్సును పెట్టి ట్యూబ్‌లో ద్రవం తాగించి ఏడాది పాటు అస్తిపంజరానికి సేవలు చేశారు.


పేరుకి మనిషి. చూస్తాడు కానీ ఏమీ తెలియదు. లేచి తిరుగుతాడని ఆశలేదు. ఒళ్లంతా కృత్రిమ శ్వాస, గుండె కొట్టుకోవడానికో మెషిన్, ట్యూబులు. వీల్ చైర్‌లో ఇంట్లోనే తిప్పడం. చూడలేకపోయాం. ఇలా నాలుగేళ్లు కాలం గడిచింది.


ఎప్పటికైనా ఈ లోకానికి వీడ్కోలు చెప్పాలి. తప్పదు. బెడ్‌కే పరిమితం అయినా, తెలివిలేని మనిషికి సాధ్యమైనంత త్వరగా విముక్తి కలిగించడం అవసరం.


ఎవరో ఏదో అనుకుంటారని, డబ్బు ఉందిగా అనో మానసిక క్షోభ భరించడం అవసరమా?


అవసరం లేదు. అందుకో ఉపాయం ఉంది. అదే "లివింగ్ విల్". ఎవరికి వారే రాసుకోవడం.


విదేశాల్లో ఈ విల్‌కి అనుమతి ఉంది. భారత దేశంలో ఇప్పుడు చట్ట పరంగా అమలు చేయడానికి అనుమతి లభించింది.


దీన్ని ఎలా వాడుకోవాలి? ఎలా రాయాలి అనే వివరాలు తెలుసుకోండి.

దీర్ఘకాలం మంచానికే పరిమితమైనవారు, పరిష్కారం లేనప్పుడు, ఏ ట్రీట్మెంట్ పనికిరానప్పుడు, "నాకు ఏ రకమైన ట్రీట్మెంట్ వద్దు" అని ఎవరికివారే రాతపూర్వకంగా ఇచ్చే డాక్యుమెంట్.

భర్త జబ్బుపడితే భార్య, భార్య కోలుకోలేని పరిస్థితిలో భర్త, ఇద్దరు సాక్షుల సంతకాలతో ఇచ్చే పత్రం.

దగ్గరి బంధువులు, మిత్రులు, హితము కోరేవారు సహకరించాలి.


ఒక వ్యక్తి జీవిత చరమాంకంలో కోలుకోలేని వ్యాధితో ఉన్నప్పుడు, వైద్య చికిత్సను నిరాకరించే స్థితిలో

ముందే రాసిపెట్టుకోవడం వలన వారి కోరికను అనుసరించి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకునే వీలు కల్పిస్తుంది.


చాలా వివరంగా ఉంటుంది.

లైఫ్ సపోర్ట్ నిరాకరణ. ఫీడింగ్ ట్యూబ్ నిరాకరణ. CPR నిరాకరణ, గుండె ఆగిపోతే తిరిగి కొట్టుకునే పరికరం అమర్చే విధానం నిరాకరణ.


Breathing assistance. Supplemental feeding. Cardiopulmonary resuscitation (CPR).

Blood transfusions, Medications and Treatment, Palliative care, Body Donations

Organs, bodily tissues, entire body.


ఇవి అమెరికాలో వివరాలు.


చాలామంది భారత దేశంలో డెత్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు.

కానీ అన్ని ప్లాన్ చేసుకున్నట్టు మరణాంతర జాగ్రత్త కూడా చాలా అవసరం.

దానికి టైము లేదు, ఏజ్ లేదు. కనుక తప్పనిసరిగా భావించాలి.


ప్రతి రోజు మనం ఎన్నో ప్రమాదాల బారిన పడి, చావు బ్రతుకుల మధ్య పోరాడే జీవులకు విముక్తి మార్గం ఆలోచించే వారు కావాలి. ఇది తప్పు కాదు. ముందు జాగ్రత్త. ఒక ఉపకారం. మంచి నిర్ణయం.


ఇది రాసిన నన్ను తిట్టుకోవద్దు. ఆలోచించండి.

అసలు పత్రికవారు ప్రచురణకు తీసుకుంటారా...? అనుమానమే.

నా ప్రయత్నం నేను చేశాను. ఇది ఒక మేలుకొలుపు.

ఇండియాలో "లివింగ్ విల్" వివరాలు గూగుల్ సెర్చ్‌లో చూడండి.


Blood donation కి group ఏర్పడినట్టే లివింగ్ will అవగాహనతో 45 years ఏజ్ వారు కొందరు ఇప్పటికే living will హాస్పిటల్కి ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ఇచ్చారు .

ఒకరికి చెప్పడమే కాదు ఆచరణలో పెట్టిన వారికీ అభినందనలు .

ఐతే వీరు NIR లు . India లో కూడా ముందు జాగ్రత్త తీసుకుంటారని ఆశిద్దాం .

*******************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page