వల్లభాచార్య విరచిత మధురాష్టకం
- Sudha Vishwam Akondi

- 50 minutes ago
- 2 min read

Vallabhacharya Virachitha Madhurashtakam - Telugu Devotional Article | Sudhavishwam Akondi
వల్లభాచార్య విరచిత మధురాష్టకం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 04/09/2026
“అధరం మధురం.. వదనం మధురం.. నయనం మధురం.. హసితం మధురం..” అంటూ శ్రీకృష్ణుని దివ్య స్వరూపాన్ని అణువణువునా మధురంగా కీర్తించే ప్రసిద్ధ స్తోత్రమే మధురాష్టకం. శ్రీ వల్లభాచార్యులు రచించిన ఈ అష్టకంలో కృష్ణుని చిరునవ్వు, నేత్రాలు, వేణువు, పాదాలు, గోపికలు, గోవులు, యమునా తీరం... ఇలా ఆయనతో ముడిపడిన ప్రతిదీ మధురమేనన్న పరమ భక్తి భావం వ్యక్తమవుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాల్లో భక్తితో పఠించేందుకు మధురాష్టకం తెలుగు పాఠంతో పాటు దానిలోని భక్తి మాధుర్యాన్ని ఈ రచనలో ఆస్వాదిద్దాం.
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో.....
వల్లభాచార్య విరచిత మధురాష్టకం
అధరం మధురం
వదనం మధురం
నయనం మధురం
హసితం మధురం |
హృదయం మధురం
గమనం మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||1||
వచనం మధురం
చరితం మధురం
వసనం మధురం
వలితం మధురం |
చలితం మధురం
భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||2||
వేణుర్మధురో రేణుర్మధురః
పాణీర్మధురః పాదం మధురం |
నృత్యం మధురం సఖ్యం
మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||3||
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం
మధురం |
రూపం మధురం తిలకం
మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||4||
కరణం మధురం తరణం
మధురం
హరణం మధురం స్మరణం
మధురం |
వమితం మధురం షమితం
మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||5||
గుంజా మధురా మాలా
మధురా
యమునా మధురా వీచీ
మధురా |
సలిలం మధురం కమలం
మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||6||
గోపి మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం
మధురం |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||7||
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా |
దలితం మధురం ఫలితం
మధురం
మధురాధిపతేరఖిలం
మధురం ||8||
ఇతి శ్రీమత్ వల్లభాచార్య విరచిత మధురాష్టకం
సంపూర్ణం
ప్రజలలో భక్తిని కలిగించి, ఉద్ధరించడానికి ఎంతోమంది మహాత్ములు అవతరించారు మన పుణ్యభూమిలో.
నాయనార్లు, ఆళ్వార్లు, శంకర భగవత్పాదులు, భగవద్రామానుజులు, భక్త తుకారం, భక్త జయదేవుడు, నారాయణతీర్థులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో...
అటువంటి మహాత్ములలో ఒకరు వల్లభాచార్యులు. ఆయన కృష్ణ భక్తులు. కృష్ణ దర్శనం పొందిన మహాత్ములు. కృష్ణ దర్శనం పొంది, ఆ పరమాత్మను వర్ణించడానికి ఈ అష్టకం రచించారు.
పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ....
ఏమి చెప్పమంటావయ్యా? నీ అధరం , నీ కన్నులు, నీ చిరునవ్వు, అభయం ఇచ్చే నీ హస్తాలు, బ్రహ్మాది దేవతలు, ఋషులు, సమస్త జీవకోటికి శరణ్యం అయిన నీ పాదపద్మాలు అన్నీ ఎంతో మధురమైనవి. నీ వద్ద ఉన్న వేణువు, ఆవులు, నీతో ఉన్నవారు కూడా మధురమైన వారే! అసలు నువ్వే మధురం అని అంటూ కృష్ణ పరమాత్మను వర్ణిస్తూ 'మధురాష్టకం' చెప్పారు. అది చదువుతుంటే, వింటుంటే ఆ చిన్నికృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ మనముందు ఉంటాడు.
మీరూ చదివి ఆనందానుభూతి పొందండి. మరికొద్దిసేపటిలో చిన్నికృష్ణుడు అవతరించబోతున్నాడు. మనుషులందరి మనసులోని అసూరీ ప్రవృత్తులను సంహరించి, అందరినీ తన వైపుకు ఆకర్షించుకుని అభయం ఇచ్చి, రక్షిస్తాడు.
శ్రీకృష్ణ శరణం మమ
🙏🙏🙏🙏🙏
సుధావిశ్వం
***
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం









Comments