మద్యం: కిక్కా? క్షీణతా?
మద్యం వ్యసనం తెలుగు, alcohol awareness Telugu, anti alcohol Telugu writing, మద్యపానం దుష్ప్రభావాలు

Madyam Kikka ksheenatha - Telugu Article | Sudhavishwam Akondi
మద్యం: కిక్కా? క్షీణతా? - తెలుగు వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 21/05/2026
“కిక్కు” కోసం మొదలైన అలవాటు…చివరకు కుటుంబాలను, జీవితాలను, విలువలను నాశనం చేస్తోంది.
మద్యం అనే వ్యసనం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు…అతని కుటుంబాన్ని, భవిష్యత్తును, సమాజాన్నే క్రమంగా కూల్చేస్తోంది.
ఈ ఆలోచనాత్మక రచనలో రచయిత్రి, తాగుడు సంస్కృతి వెనుక దాగి ఉన్న సామాజిక ప్రమాదాలను ప్రశ్నిస్తూ, మన సమాజం ఎటు వెళ్తోందో మన ముందుంచుతున్నారు.
సప్త వ్యసనాలలో ఒకటి మందు తాగడం. అంతే కాదు, పంచమహా పాతకాల్లో కూడా ఒకటి. మనిషిని పూర్తిగా భ్రష్టుపట్టించి, యుక్తాయుక్త విచక్షణ లేకుండా చేసి, ఒక కుక్క కన్నా హీనమైన బ్రతుకు బ్రతికేలా చేస్తుంది అనడానికి రోడ్డుపై అడ్డంగా పడిపోయిన మందుబాబులే ఉదాహరణ.
ప్రభుత్వానికి ఇవేవీ పట్టదు. ఎందుకంటే నాయకులే తాగుబోతులు అయితే (సోషల్ డ్రింకింగ్ అని పోష్ నేమ్ తో అయినా సరే) ఇక నిషేధం ఎందుకు చేస్తారు? ప్రజలను సర్వనాశనం చేసి వాళ్ల శవాలపై డబ్బు ఏరుకునే బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
ఈ తాగుబోతు క్యారెక్టర్ నే హీరో! ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమా వాళ్లు డబ్బులు సంపాదించుకుంటూ జనాలను తాగుబోతులను చేస్తుంటే, మందు సీసాలు అమ్మి మద్యం షాపుల వాళ్లు డబ్బులు దండుకుంటుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
కిక్కు కోసం మందు తాగి కుక్క కన్నా హీనమైన స్థితికి దిగజారి, కుటుంబాన్ని నడిరోడ్డుపై వదిలివేసి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకేనా?
సమాజంలో స్పృహ కలిగేదెప్పుడు?
సుధావిశ్వం
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం










Comments