'Manumada Majaka' - New Telugu Story Written By Pitta Gopi
'మనుమడా మజాకా' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
జీవితంలో మంచివారికి చెడ్డవాళ్ళు, అలాగే చెడ్డవాళ్ళకి మంచివాళ్ళు భాగస్వాములుగా దొరకటం ఒక శాసనంలా ఉంటుంది.
భరణి కి కూడా ఓ మంచి బార్య సుశీల, చిన్న పిల్లవాడు అయినా మంచి మనసు, తెలివితేటలు ఉన్న విశాల్ ఉన్నారు.
అంతేనా.. ధనవంతుడు. పలు కంపెనీలు అతనికి ఉన్నాయి. మరియు కఠిన హృదయుడు కావటంతో అతనంటే భయపడేవారు ఎక్కువ. ఆ కారణంతో పలు కంపెనీ మేనేజర్ లు భరణి కి లొంగిపోవల్సి వచ్చేది.
ఆ కారణంతో భరణి కంపెనీల కంటే ఇతర కంపెనీలు తక్కువ స్థాయిలో ఉండేవి. ఇదిగాక భరణి కి కొంత సైన్యం కూడా ఉంది.
అయితే ఎంత కఠినాత్ముడు అయినా.. భార్య సుశీల ను ఎప్పుడూ ఏమీ అనడు. అందువలన భర్త ఎంత దుర్మార్గపు పనులు చేసినా మిన్నుకుండేది సుశీల.
భరణి కి ఇలాంటి మనసు ఉన్నందుకు, చిన్నపుడు గారాబం చేసినందుకు తల్లి రాధిక ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. అవును మరి!
భరణి కి చిన్నపుడే తండ్రి పోయినా... ఒకవైపు భర్త కంపెనీల బాధ్యత చూసుకుంటూనే భరణిని చాలా గారాబంగా పెంచింది.
చిన్నప్పుడే భరణి ఒక విలన్ లా ప్రవర్తించే వాడు.
స్నేహితులు అయినా మరెవరైనా.... అతడి కంటే కింది స్థాయిలో ఉండాలి. లేకపోతే వారిని చిత్ర హింసలకు గురిచేసి వేధించి లొంగదీసుకునే మనసు భరణి ది.
సుశీల, భరణి లు ఎప్పుడూ కంపెనీల బాధ్యత చూసుకుని ఒక్కోసారి ఏ రాత్రికో వస్తుంటారు.
ఇంటి వద్దే ఉన్నా.. ఒక్కోసారి కొడుకు విశాల్ ని స్కూల్ కి రెడీ చేయటం నుండి అన్ని రాధికనే చేస్తుంది. ఇంటిపని, వంటపని కూడా తానే చేస్తుంటుంది.
అయితే అది గతం.
ఇప్పుడు తాను ముసలిది. పూర్తిగా ఏ పని చేయలేదు. కానీ..
తన పనులు తాను కొద్దోగొప్పో చేసుకోగలదు.
ఇలాంటి తరుణంలో భరణి తల్లి పై ఒకింత అసహనం తో ఉండేవాడు. ఎందుకంటే తాము లేని సమయంలో విశాల్ ని చూసుకోలేదు. పైగా తాము ఉన్నా.. విశాల్ తో పాటు తనని కూడా చూసుకోవల్సి ఉండటం.
ఈ విషయం భార్య సుశీల కు కూడా తెలుసు అయినా.. తాను ఉన్నంత వరకు భర్త ఆమెను ఏమీ చేయలేడు అనుకుని ఊరుకునేది.
ఒకనొక రోజు బార్య కు తెలియకుండా తల్లిని ఎక్కడో వదిలి వచ్చి ఏమీ తెలియనట్టు
"ఇంటి నుండి ఒక్కతే ఎక్కడికి వెళ్ళింది" అంటూ నటన మొదలెట్టగా సుశీల.. భరణి వాలకం తెలిసి,
"మర్యాద గా అత్తగారిని ఎక్కడ వదిలి వచ్చారో అక్కడ కి వెళ్లి తిరిగి తీసుకురండి. లేకపోతే తల్లిని, భార్యని వేదిస్తున్నాడని కేసు వేస్తా" అని బెదిరించటంతో తిరిగి రాధికను తీసుకుని వచ్చాడు.
ఇంకొన్ని రోజుల తర్వాత ఎలాగో బార్య ని ఒప్పించి వృద్ధాశ్రమంలో చేర్చాడు.
పన్నిండేళ్ళ రాధిక మనుమడు నాన్నమ్మ గూర్చి పదే పదే అడుగుతుండటంతో
"నాన్నమ్మ వేరే ఊరు బంధువుల ఇంటికి వెళ్ళింద" ని చెప్పి నమ్మించారు.
ఇదిలా ఉంటే ఒకరోజు పాఠశాల ప్రోగ్రాం లో భాగంగా పిల్లలు వృద్ధాశ్రమానికి వెళ్ళగా అక్కడ నాన్నమ్మ కనిపించింది.
దీంతో నాన్నమ్మ పై మరింత ప్రేమ, జాలి పెరగగా..
తల్లిదండ్రులు పై ఓకింత అసహ్యం కల్గింది విశాల్ కి.
అయితేనేం తల్లిదండ్రులపై చిర్రుబుర్రులాడి నాన్నమ్మని ఇంటికి తీసుకు వచ్చాడు.
ఒకవైపు కంపెనీ ఎంప్లాయిస్ జీతాలు పెంచమని ఒత్తిడి చేయటం, మరోవైపు ఇతర కంపెనీలు భరణికి పోటిగా రావటం మొదలుపెట్టంతో భరణిలో కాస్త ఒత్తిడి పెరిగింది.
ఆ కోపం అంతా వృద్దురాలైన తల్లి రాదికా పై చూపెడుతు ఉండేవాడు.
భరణి చేష్టలు, అతడి ప్రవర్తన పై అతడితో ఒప్పందం చేసుకున్న పలు ముఖ్య కంపెనీలు ఒప్పందం రద్దు చేసుకోవటం, ఇంకోవైపు పలు కంపెనీలు దీటుగా పోటి పడటంతో తన కంపెనీల స్టాక్ మార్కెట్లు పడిపోయి ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి.
చేసేది లేక చాలా కంపెనీలు మూసివేయవల్సి వచ్చింది
రోజురోజుకు భరణిలో సహనం నశించేది.
ఒక రోజు భరణి స్నేహితుడు వివాహానికి హజరు కావాల్సి ఉండగా బార్య, కుమారుడితో బయలుదేరాడు.
"అదేంటీ మన ముగ్గురమేనా? అత్తయ్య గారికి తీసుకెళ్ళటం లేదా" ప్రశ్నించింది సుశీల.
"తానేందుకు ముసల్ది. తాను మనతో వస్తే నా పరువుపోతుంది, పదండి" అంటాడు భరణి.
"మనం అందరం వెళ్ళిపోతే నాన్నమ్మ ఒక్కతే అయిపోతుంది కదా! తనను కూడా తీసుకెళ్దాం" అంటాడు విశాల్.
చేసేది లేక తల్లిని కారు ఎక్కమని అంటాడు.
తల్లి రాధిక ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. ఆనందంతో కారు ఎక్కింది.
అందరూ బయలుదేరారు.
చాలా దూరం ప్రయాణం తర్వాత ఒక పెద్ద గుడి వద్ద భరణి కారు ఆపాడు.
తల్లిని దించి ఆ గుడికి తీసుకెళ్ళి ఒక పళ్లెం కూడా ఇచ్చి
"అమ్మా! ఈ గుడి వద్ద నిత్యం అన్నదానం పెడతారు. నువ్వు మాతో వస్తే నా స్నేహితులు అందరూ నవ్వుతారు. ఈరోజుకి ఇక్కడ బోజనం చేయి. సాయంత్రానికి మరలా మేం వచ్చి తీసుకుని వెళ్తాం" అని చెప్పి బయలుదేరాడు.
తండ్రికి ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచించి
"అమ్మ నాన్న.. నేను పెద్దవాడ్ని అయితే మన ఇంటి దగ్గర్లో ఒక పెద్ద గుడి కట్టిస్తాను =" అన్నాడు.
ఆ మాటకు భరణి, సుశీల లు
"వేరీగుడ్.. ! మరీ గుడి ఎందుకు కడతావు?” అని ప్రశ్నించారు వాళ్ళు.
"ఎందుకంటే మీకు కారులో కూర్చోబెట్టి దూరంలో ఉండే గుడికి తీసుకెళ్ళే అవసరం లేకుండా స్వయంగా మీరే గుడికి వెళ్లి బొజనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి " అన్నాడు.
వెంటనే భరణి కారును సడన్ గా ఆపి ఒక్క క్షణం ఆలోచించి వెనక్కి తిప్పి తల్లిని తీసుకుని వివాహానికి హజరయ్యాడు. అప్పటినుంచి తల్లిని ఏ రోజూ దూరం చేసుకునే ప్రయత్నం చేయలేదు సరికదా మంచిగా ప్రవర్తించి అందరి మన్ననలు పొంది తిరిగి తన కంపెనీలు తెరిచి లాభాలు పొందేలా నడుచుకున్నాడు భరణి.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments