top of page
Original.png

మరో జన్మ

10 hours ago
4 min read

మరో జన్మ కథకు సంబంధించిన AI, బయోకంప్యూటర్, మానవ న్యూరాన్లు మరియు తల్లి కూతుళ్ల భావోద్వేగ సంభాషణను చూపించే దృశ్యం

Maro Janma - Telugu Emotional Story | Musunuru Chayadevi

మరో జన్మ - తెలుగు భావోద్వేగ కథ| ముసునూరు ఛాయాదేవి

Published in manatelugukathalu.com on 27/11/2026


AI, బయోకంప్యూటర్లు, మానవ న్యూరాన్లు, కర్మఫలం వంటి ఆధునిక మరియు తాత్విక అంశాల నేపథ్యంలో సాగే ఆలోచింపజేసే కథ “మరో జన్మ”. సాంకేతిక పురోగతికి మానవతా విలువలు తోడుకాకపోతే ఎదురయ్యే ప్రమాదాలను ఈ కథ ప్రశ్నిస్తుంది.


"అమ్మా! 'గతజన్మల కర్మల ఫలితమే మనమిప్పుడు అనుభవిస్తున్నది. ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాలతో కొంతవరకు సంచిత పాపకర్మల నుండి తప్పించుకోవచ్చును' అంటావు గదా! ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే ఇది నిజమని అనిపించడం లేదమ్మా."


వసుధ అభిప్రాయానికి ఏ విధంగా స్పందించాలో ఆలోచిస్తూ గతంలోనికి జారుకుంది శ్రావణి. ఈ జన్మలోనే కర్మఫలాన్ని అనుభవించిన వారి గురించి చెప్పాలనిపించింది.


"మేము న్యాయంగానే వాటాలు పంచుకున్నాము, అన్యాయంగా ఏమీ తీసుకోలేదు" అన్న తన స్నేహితురాలి పిల్లలు, వారి తాతల రోగాలు గూడా ఎలా పంచుకోవలసి వచ్చిందో గుర్తుకొచ్చింది. 


అక్రమంగా సంపాదించిన ధనం అన్యుల పాలైన వైనం, సంబంధాలు చెడగొట్టిన వారి వంశాభివృద్ధి ఆగిపోవడం తన బంధువులలోనే చూస్తున్నది. అమ్మ మౌనమే అర్ధాంగీకారంగా భావించి వసుధ తన వాదనను కొనసాగించింది.


"అమ్మా! ఆత్మ శాశ్వతం, మరణించాక శరీరానికి ఆత్మకు సంబంధమే ఉండదంటారు గదా... ఇప్పుడు జరుగుతున్నదేమిటి? ఏ.ఐ. (AI) డాటా సెంటర్లు కొన్ని వేల కంప్యూటర్ల నుండి వేడిని ఉత్పత్తి చేస్తాయి. 


ఆ వేడిని చల్లార్చేందుకు నీటి అవసరం అమితంగా పెరిగింది. కరెంటు ఖర్చు తగ్గించేందుకు పోషకాలతో పనిచేసే బయోకంప్యూటర్ న్యూరాన్లను కొన్ని సంవత్సరాలు సజీవంగానే ఉంచి, సిలికాన్ చిప్స్‌తో పనిచేసే కంప్యూటర్ కంటే శక్తివంతంగా పనిచేస్తుందని తెలిసింది. 


మనిషి న్యూరాన్లను కంప్యూటర్ చిప్స్ బదులుగా వాడుకుంటున్నారు. 


శాస్త్రవేత్తలు, వారికనుగుణంగా ఆలోచించేలా న్యూరాన్లను మార్చుకుంటున్నారు. మనిషి మరణించినా ఆ న్యూరాన్లను కొన్ని సంవత్సరాలు సజీవంగా ఉంచుతున్నారు. 


అంటే ఆ మనిషి ఆలోచనాశక్తిని కొంతవరకు ఈ గ్రహంలోనే బంధించి, డాటా సెంటర్ యజమానులకు శాస్త్రవేత్తలు సహాయపడుతున్నారు. 


న్యూరాన్ల ఆలోచనాశక్తిని ప్రేరేపించేందుకు షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. తన న్యూరాన్లు భూమిమీద ఆలోచిస్తూ స్వార్థపరుడైన శాస్త్రవేత్త చేతుల్లో కొరడా దెబ్బలు తింటున్నాయని తెలిసి ఆ ఆత్మ ఎంత కుమిలిపోతుందో!" అంటూ వసుధ చెప్తూండగా శ్రావణి తన సందేహం వెలిబుచ్చింది.


"అసలు బయోకంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? న్యూరాన్లంటే ఏమిటి? మనిషి మరణించినా కొన్ని రోజులు ఆ శరీర భాగాలనుండి కొన్ని కణాలు ఉపయోగపడగలవని విన్నాను. నిజమేనా?"

"అవునమ్మా! పదిరోజుల పాటు వెంట్రుకలు, గోళ్లూ పెరుగుతాయని తెలుసు గదా? మన నాడీ వ్యవస్థలో నాడీ కణాలుంటాయి, వీటినే న్యూరాన్లంటారు. 


మెదడుకి జ్ఞానేంద్రియాల నుండి వీటి ద్వారా విద్యుత్ రసాయన పద్ధతిలో సమాచారం అందుతుంది. 


సజీవ మానవ శరీరంలోని రక్తము, చర్మం మొదలైన భాగాల స్టెమ్ సెల్స్ నుండి న్యూరాన్లను ఉత్పత్తి చేసి, వీటినుండి ఆర్గనాయిడ్స్ అనే సమూహాన్ని తయారుచేసి, ఎలక్ట్రోడ్లకు, వాటిద్వారా కంప్యూటర్ చిప్స్‌కూ అనుసంధానం చేస్తే బయోకంప్యూటర్‌గా ఉపయోగపడుతుంది. 


ఇది షాక్ ట్రీట్‌మెంట్ లాంటిది. ఈ బయోకంప్యూటర్‌లో జీవ సంబంధమైన డీ.ఎన్.ఏ. (DNA), ప్రోటీన్లు మొదలైనవన్నీ ఉంటాయి. 


మానవ మేధస్సును పోలిన సూపర్ కంప్యూటర్ చాలా ఖర్చుతో పనిచేస్తుంది. అందుకే బయోకంప్యూటర్‌తో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందడానికి వివిధ దేశాలలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. 


శరీరంలోని వివిధ భాగాల ఆర్గనాయిడ్స్ వలన వైద్యరంగంలో ఎన్నో లాభాలున్నాయి. 


కానీ, స్వంత నిర్ణయాలు తీసుకోగలిగిన బయోకంప్యూటర్ భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడగలదని చేస్తున్న పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి."


"ఆ మధ్య ఒక ప్రవచనకర్త మాట్లాడుతూ జీవంలేని శరీరాన్ని పిల్లలు విదేశాలనుంచి వచ్చేవరకు రెండు మూడు రోజులు ఐసుపెట్టెలో బంధించడమే శోచనీయమన్నారు. 


న్యూరాన్లను సజీవంగానే ఉంచి స్వప్రయోజనాలకి వాడుకోవడం ఎంతవరకు సమంజసం? డాటా సెంటర్ల యజమానుల స్వలాభం కోసమే ఇదంతా జరుగుతున్నది. 


ఇప్పుడు చెప్పమ్మా! ఉత్తమ గతులనధిరోహించవలసిన ఆత్మ క్షోభించేలా చేసేవారు పాపం మూటగట్టుకోరా?"


జోలపాటగా ఉన్న వసుధ మాటలు వింటూ నిద్రలోకి జారుకుంది శ్రావణి. ఫోన్ స్విచ్ ఆన్ చేసి శ్రావణి భర్త శ్రీరామ్‌ను పిలిచింది. 


ఏడాది క్రితం కాలంచేసిన శ్రీరామ్ ప్రేమగా, "ఎలా ఉన్నావు శ్రావణీ? పెన్షన్ సరిపోతున్నదా? అవసరమైతే ఫిక్స్‌డ్ డిపాజిట్ విత్‌డ్రా చేయి. వసుధకి ఏ లోటూ రానీకు."


"అంతా బాగానే ఉంది. మీ సలహాల ప్రకారం అంతా సవ్యంగానే జరుగుతున్నది. ఇప్పుడు పెన్షన్, అద్దెడబ్బులు మా అవసరాలకు సరిపోతున్నాయి. 


అవునూ, మెదడులోని న్యూరాన్లను వాడుతున్నారని శాస్త్రవేత్తలను వసుధ నిందిస్తున్నది. ఏం చెప్పాలో తెలియడం లేదు" అన్నది శ్రావణి.


"నీతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే శాస్త్రవేత్తల పుణ్యమే కదా? నీకే సలహా కావాలన్నా నా మెదడు నీకోసం ఆలోచిస్తున్నది కదా? ఈ కుళ్లు సమాజంలో మీ ఇద్దరినీ కాపాడుకోవాలనేదే నా తపన. 


పాపపుణ్యాలు, సద్గతులు, కర్మఫలాలకి తిలోదకాలిచ్చే కాలమిది. 


నిన్ను చూడలేకపోయినా, నీకెప్పుడూ అందుబాటులో ఉంటున్నాను. నా మెదడు కణాలు వీలైనంత కాలం మీకోసం సజీవంగానే ఉంటాయి. మీకోసం నా మెదడు ఆలోచిస్తున్నదన్న తృప్తితో ఉన్నాను. ధైర్యంగా ఉండు."


స్విచ్ ఆఫ్ చేసింది శ్రావణి.... కల కరిగిపోయింది. వసుధ అడిగిన ప్రశ్నలకు కలలో జవాబు దొరికిందనిపించింది.


పరిశోధనలు మంచివైపుకు దారిచూపేవిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, పుడమితల్లికి నమస్కరించి లేచింది. బడాబాబుల అత్యాశకు అడ్డుగోడ కట్టి మానవాళిని రక్షించమని విశ్వకర్మను వేడుకుంటూ వసుధ గదిలోనికి నడిచింది శ్రావణి.


"వసుధా! నా కల నిజమైతే ఎంత బాగుంటుందో!" అంటూ వివరించి చెప్పింది.


"పిచ్చి అమ్మా! డాటా సెంటర్ల యజమానులు వారి స్వంత లాభాలు వదులుకుని కుటుంబ వ్యవహారాల కోసం నీవు కలగన్నట్లు బయోకంప్యూటర్లను తయారుచేయరు" అన్నది వసుధ.


"అలాగా? సరే! నీకేదో రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగం వచ్చిందని చెప్పావు. ఎప్పుడు జాయిన్ అవుతావు?" అడిగింది శ్రావణి.


"ఈ వారంలోనే వెళ్లాలమ్మా, నీకు నిన్న చెప్పిన బయోకంప్యూటర్ ల్యాబ్‌లోనే రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరుతున్నాను. అందుకే నీకు వివరించి చెప్పాను. ప్రజల ప్రయోజనాల కోసం పరిశోధనలు చేస్తాను."


"సరే వసుధా! నీ కోరిక తీరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను."


"శ్రావణీ! వసుధ పనిచేసే ల్యాబ్ నుండి ఫోన్ వచ్చింది. నీవు కంగారు పడతావని నాకు చేశారు. మల్టిపుల్ ఫ్రాక్చర్లతో వసుధ హాస్పిటల్లో ఉన్నదట. 


మాతో వెంటనే బయలుదేరు." అకస్మాత్తుగా వచ్చిన అన్నయ్య మాటలు విని శ్రావణి కన్నీరు మున్నీరైంది. ఎలాగో మనసు దిటవు చేసుకుని కారెక్కింది. ల్యాబ్‌లోనే ఏదో జరిగిందని చెప్పారట. 


వివరంగా చెప్పలేదట. వసుధకు స్పృహ వచ్చాక గానీ ఏమీ చెప్పలేమన్నారు. స్టేట్‌మెంట్ తీసుకోవడానికి పోలీసులు గూడా సిద్ధంగా ఉన్నారు.


"మేడమ్! మీ అమ్మాయి మిమ్మల్ని చూడాలంటున్నది, రండి" స్పృహ వచ్చినట్లు నర్స్ చెప్పగానే పరుగున ఐ.సి.యు. (ICU) లోనికి వెళ్లింది శ్రావణి.


"ఏమయిందమ్మా! ఎలా జరిగింది?" కన్నీళ్లతో నుదుటిపై ముద్దు పెట్టుకుంది.


వసుధ హీనస్వరంతో, "బాధ పడకమ్మా, నా అజాగ్రత్తతో ఇలా జరిగింది. బయోకంప్యూటర్ స్వంతంగా గూడా ఆలోచించగలదని తెలిసి కూడా ప్రమాదానికి దారి చూపాను. 


బయోకంప్యూటర్ నామీద దాడి చేయమని రోబోని ప్రేరేపించింది. దానిని నియంత్రించే లోపే ఇలా జరిగింది. 


ఫరవాలేదమ్మా! నేను కోలుకుంటాను. నువ్వన్నట్లు నా పూర్వ జన్మలో ఎవరిని హింసించానో, ఇలా జరిగింది. 


మనం కోరుకున్న పని మాత్రమే చేసిపెట్టే సిలికాన్ చిప్స్‌తో పనిచేసే ఏ.ఐ. (AI), బయోకంప్యూటర్ కంటే నయమనిపిస్తున్నది. న్యూరాన్లకు పోషకాలందించి విద్యుత్ వాడకాన్ని తగ్గించడం మంచిదే గానీ, ఇలాంటి దుష్ఫలితాలు గూడా ఉంటాయేమోననే భయం పీడిస్తున్నదమ్మా."


"సరే వసుధా, ఎక్కువ ఆలోచించకు. చాలా నీరసంగా ఉన్నావు. ప్రశాంతంగా పడుకో, ఆ సృష్టికర్తే ఈ సమస్యలకి పరిష్కారం చూపించాలి" అంటూ శ్రావణి బయటకు నడిచింది.


బ్రతికినంత కాలం యాంత్రికంగా, స్వార్థపరుడిగా గడిపినా, యంత్రానికి జీవం పోస్తున్న మనిషి మరణించాకైనా సమాజహితమే కోరుకొనేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలి. లేదంటే మానవాళి మనుగడకే ప్రమాదం.










📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


ముసునూరు ఛాయాదేవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: ముసునూరు ఛాయాదేవి



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page