top of page
Original.png

మోసగాళ్లకు రాజు ఎవరు?

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #మోసగాళ్లకు రాజు ఎవరు, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Mosagallaku Raju Evaru - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 25/01/2026

మోసగాళ్లకు రాజు ఎవరు? - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


ఒకసారి ఒక రాజు ఒక దండోరా వేయించారు. అందరికంటే ఎక్కువ మోసం చేసి చూపిన వారికి "మోసగాళ్లకు రాజు" బంగారు కిరీట ధారణ మరియు బిరుదు ప్రధానం ఉంటుందని.


2)


ఎందరో వచ్చి రకరకాల మోసాలు చేశారు.


అంతలో రాజు యొక్క ప్రాణస్నేహితుడు రామన్న రాజసభలోకి వచ్చాడు.


"ప్రాణస్నేహితుడా రామన్నా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నీ దర్శనం!", అంటూ సంతోషంతో రాజు సింహాసనం దిగి వచ్చి అతడిని ఆలింగనం చేసుకున్నాడు.


ఆశ్చర్యం.


అతడు వేషం తీశాడు. అతడు ప్రాణస్నేహితుడు రామన్న కాడు. సోమన్న అనే మనిషి ఆ వేషంలో వచ్చి మోసం చేశాడు... అందరినీ నమ్మించాడు.


3)


రాజు సోమన్నకే "మోసగాళ్లకు రాజు" 'బంగారు కిరీట ధారణ' మరియు 'బిరుదు ప్రధానం' చేయాలని మంత్రిని కోరాడు.


4)


మంత్రి అందరినీ ఒక క్షణం కళ్ళు మూసుకొని ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అన్నారు. తరువాత సోమన్నకు "మోసగాళ్లకు రాజు" 'బంగారు కిరీట ధారణ' మరియు 'బిరుదు ప్రధానం' చేశాడు. సోమన్న వెళ్ళిపోయాడు.


5)


ఓ గంట తరువాత సోమన్న వచ్చి "ఇది బంగారు కిరీటం కాదు... ఇంత మోసమా!", అన్నాడు కోపంగా.


మంత్రి చిరునవ్వుతో


"మీ అందరినీ ఓ క్షణం కళ్ళు మూసుకోండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అని... మీరు అలా చేశాక... ఆ బంగారు కిరీటాన్ని రాజసింహాసనం వెనుక దాచి... అక్కడ ముందే ఉంచిన ఈ నకిలీ కిరీటం తీసి... సోమన్నకు తల మీద పెట్టాను... మిమ్మల్నందరినీ మోసం చేశాను", అని ముగించాడు.


6)


రాజు ఈసారి ఇలా అన్నారు,


"మంత్రికే... 'మోసగాళ్లకు రాజు' 'బంగారు కిరీట ధారణ' మరియు 'బిరుదు ప్రధానం' చేయాలి" అని.


6)


కానీ మంత్రి ఇలా అన్నాడు...


"రాజుగారికే ఈ 'బంగారు కిరీట ధారణ చేయాలి" అని.


"ఎందుకలా?" అని అరిచారు అందరూ ఆశ్చర్యంగా... రాజుతో సహా


7)


మంత్రి ఇలా అన్నారు,


"రాజు అందరి... ప్రజా సమయాన్ని, డబ్బు, బంగారాన్ని వృథా చేస్తున్నారు. ఇటువంటి పనికిమాలిన పోటీలతో, పరీక్షలతో, బహుమానాలతో ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి",


అన్నారు గంభీరంగా.


8)


రాజుకు కనువిప్పు అయింది.


"ఇప్పటి నుంచి ఇలాంటి పోటీలు పెట్టను... ప్రజా డబ్బు, సమయాన్ని వృథా చేయను... ప్రజలను మోసం చేయను" అని దేవుడిపై ఒట్టు పెట్టుకున్నాడు... అప్పటికప్పుడే... అక్కడక్కడే.


రాజ్యాన్ని సమర్థవంతంగా, సరైన దృష్టితో పరిపాలించి... త్వరలో తన దేశాన్ని చుట్టుపక్కల... సాటిలేని మేటి దేశంగా తీర్చిదిద్దాడు.


సాటిలేని మేటి రాజుగా త్వరలో పేరు గాంచాడు.


------------- చిన్న కథ సమాప్తం ---------------------------


నీతి:


1)


ఎవ్వరూ కూడా...


ప్రజా సమయాన్ని, డబ్బు, బంగారాన్ని వృథా చేయకూడదు.


2)


అధికారులు, నిర్వాహకులు, మేనేజర్లు...


సమర్థవంతంగా, దృష్టితో పరిపాలించాలి.


3)


అధికారులు, నిర్వాహకులు, మేనేజర్లు


ఇవ్వవలసింది... అందరికీ...


......


[


సంతోషపూరిత నిర్వహణ


+


ఆనందదాయక పరిష్కారాల తీరు


+

నిర్మాణాత్మక నిర్వహణ


+

శాంతి సౌభాగ్య పురోగతి...


+

మంచి మాటల కార్యాల అమలు


+

మంచి ఆరోగ్యం, సంస్కరణ, పర్యావరణ సౌకర్యాలు- సదుపాయాలు


]



------- నీతి సమాప్తం ---------------------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page