top of page
Original.png

మనసు ఇచ్చా కానీ...


ప్రేమలో విఫలమైన ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ వర్షంలో ఫుట్‌బాల్ మైదానంలో ఒంటరిగా నిలబడి, తన బాధను విజయంగా మార్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్న దృశ్యం.

Manasu Icha Kaani... - Telugu Love Story | Harish Babu Pondugula

మనసు ఇచ్చా కానీ... తెలుగు ప్రేమ కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 26/08/2026


ప్రేమించిన వ్యక్తి దూరమైతే మనసు విరిగిపోవచ్చు. కానీ అదే బాధను జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక బలంగా మార్చుకుంటే? “మనసు ఇచ్చా కానీ... — ఒక ఆటగాడి ప్రేమ కథ” అలాంటి భావోద్వేగ ప్రయాణాన్ని చెప్పే తెలుగు కథ. ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే సునీల్, తనను ప్రేమిస్తుందని భావించిన సునీత మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో తీవ్రంగా కుంగిపోతాడు. అయితే తన ప్రిన్సిపాల్ ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ ఫుట్‌బాల్ సాధనపై దృష్టి పెట్టి, తన ప్రతిభను నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటాడు.

ప్రేమలో ఎదురైన తిరస్కారం అతని జీవితానికి ముగింపు కాకుండా, ఒక కొత్త ప్రారంభంగా మారుతుంది. ప్రేమ, విరహం, క్రీడా ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు జీవితంలో విజయం వంటి అంశాలను కలిపిన ఈ కథ, ఓటమి తర్వాత మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో చెబుతుంది.


జోరున వర్షం పడుతోంది. వర్షం తాలూకు సౌండ్ రూమ్ లోపలి వరకు వస్తోంది. సునీల్ అని బాగా గడ్డం ఉన్న ఒక వ్యక్తి డార్కుగా ఉన్న రూమ్ లో బ్లూ లైట్ బ్యాక్ గ్రౌండ్ లో కూర్చుని డ్రింక్ చేస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు.


"ప్రేమించాను అనుకున్నా, కానీ నాతో నేను ఆడే ఫుట్‌బాల్‌తో నన్నే తంతుంది అనుకోలేదు. అసలు ఆ రోజుల్లో నేను ఫుట్‌బాల్ ఆడుతుంటే జనాలు పిచ్చెక్కి చూసేవాళ్లు..."


అది ఒక కాలేజ్ ఫుట్‌బాల్ స్టేడియం. చుట్టూ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే మధ్యలో రెండు కాలేజీ టీమ్స్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది.


కెమెరా ఇప్పుడు ప్రేక్షకుల గ్యాలరీ మీద నుంచి అందరి ప్లేయర్స్ మీదకు వెళ్లి, అటు నుంచి ఒక్కొక ప్లేయర్ వైపు వెళ్లి లాస్ట్ కు ఒక ప్లేయర్ వెనుక షాడో మీదకు వెళ్లి ఆగుతుంది... అతడే సునీల్. ఇప్పుడు ఆ ప్లేయర్ కాళ్ల వెంటే కెమెరా మూవ్ అవుతోంది. ఫుట్‌బాల్ తన్నుకుంటూ, తన్నుకుంటూ ఫాస్ట్ గా వచ్చిన అతను ఆ ఫుట్‌బాల్‌ను ఫ్రెండ్ కి పాస్ చేస్తూ ఒక 'ఎస్' ఆకారంలో ఫాస్ట్ ఫాస్ట్ గా రన్ చేస్తూ గోల్ చేశాడు. ప్రతి 5 నిమిషాలకి వరుసగా మళ్ళీ మళ్ళీ గోల్స్ చేస్తూ మ్యాచ్‌లో మొత్తముగా 10 గోల్స్ చేస్తాడు.


ఇప్పుడు కెమెరా ఆ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల లోకి వెళుతుంది. హీరోయిన్ సునీతను హైలైట్ చేస్తుంది. సునీత "గోల్ గోల్" అని అరుస్తూ ఎంజాయ్ చేస్తోంది. సునీల్ చేసే ఒక్కొక్క గోల్ కి తాను ఇంప్రెస్ అయింది.


సునీల్ కి సునీత కాలేజీలో ఎదురుపడుతుంది. ఇద్దరి మధ్య ఒక స్మైల్ తరువాత పరిచయంగా మారింది. ఆ తరువాత కొద్ది రోజులకే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా మారిపోతారు. ఇంకా చాలా ఎక్కువే క్లోజ్ అవుతారు. ఇద్దరూ ఫోన్ నంబర్స్ షేర్ చేసుకుంటారు. మొదట్లో అప్పుడప్పుడు వచ్చే మెసేజ్ లు ఇప్పుడు ఎపుడెపుడా అని ఎదురుచూసే అంతగా క్లోజ్ అయిపోయారు. ఇలా ఒక నాలుగు నెలల తర్వాత సునీల్ సునీతతో పీకలతు ప్రేమలో పడతాడు. ఇక పెళ్లి అంటూ చేసుకుంటే సునీతనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.


అయితే సడన్ గా ఒక రోజు నుంచి సునీత సునీల్ ని కలవడం మానేసింది. పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడు సునీల్. ఎంత వెతికినా సునీత ఎక్కడ ఉంది అనేది సునీల్ కి అర్థం కాలేదు. లాస్ట్ కి ఒకరోజు తన ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది... సునీతకి అశోక్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిందని తెలుసుకుంటాడు సునీల్. సునీల్ కి చెప్పలేనంత కోపం వస్తుంది. అయితే సునీత మీద ఉన్న నమ్మకంతో ఆ కోపాన్ని అణచుకొని అదేదో సునీతనే అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు.


ఆ రోజు దసరా పండుగ ఉండటంతో తప్పకుండా గుడికి వస్తుంది అని గుడికి వెళ్లే దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. గుడి నుంచి వచ్చే దారిలో చీకట్లో ఒక రోడ్డు మధ్యలో సునీత ఇంటికి గుడికి మధ్యలో ఎవరూ లేని చోట సునీత తన ఫ్రెండ్ తో పాటు వస్తూ ఉంటుంది. దారిలో ఒక చోట సునీల్ బైక్ పార్క్ చేసి ఆగి ఉండటం చూస్తుంది సునీత. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లంగా వోణీలో అద్భుతంగా డ్రెస్సప్ అయి ఉంటుంది సునీత.


సునీతను అక్కడే ఆపి సునీల్ అడుగుతాడు:

"నేను విన్నది నిజమేనా... నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అంట కదా... నేను నమ్మలేదు, అబద్ధం కదా... చెప్పు చెప్పు" అంటాడు.


దానికి కాసేపు ఆలోచించి సునీత:

"కాదు, నిజమే" అంటుంది.


దానికి సునీల్:

"మరి నా సంగతి ఏంటి?" అంటాడు.


"నీ సంగతి ఏమి ఉంటుంది... నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ వి కదా" అంటుంది సునీత.


సునీల్ కి ఎక్కడ లేని ఉక్రోషం వస్తుంది. తట్టుకోలేక సునీత మెడ మీద రెండు చేతులతో నొక్కి దాదాపు పీక పిసికేటంత పని చేస్తాడు.


"అయితే ఇన్ని రోజులు మేమిద్దరం కలిసి తిరిగింది ఏం చేసింది? అంతా జస్ట్ ఫ్రెండ్ షిప్ అంటావా? ముద్దు పెట్టుకోవడం, నైట్ స్పెండ్ చేయడం ఇవన్నీ ఫ్రెండ్ షిప్ లా... అలా ప్రవర్తిస్తారా?" అని అడుగుతాడు.


సునీత విననట్టుగా "లేదు" అని చెప్పి ఇలా అంది:

"సరే చెబుతా విను... బి ప్రాక్టికల్... నువ్వు పెద్ద ఫుట్‌బాల్ ప్లేయర్ అని నేను నిన్ను ఇష్టపడ్డాను నిజమే. కానీ ఆలోచిస్తే నీకు ఇప్పుడు జాబ్ లేదు. పెద్ద ఫుట్‌బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావా? అది ఇంకా లేదు. పోనీ వెయిట్ చేద్దామనుకుంటే నాకు అంత టైం లేదు. నేను ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషిని అని నీకు బాగా తెలుసు. నాకు ఒక సంబంధం వచ్చింది.


అబ్బాయి USA లో లక్షలు లక్షలు సంపాదించే జాబ్ చేస్తున్నాడు. నన్ను బాగా చూసుకుంటాడు. నా లైఫ్ సెటిల్ అవ్వాలంటే జస్ట్ ఒక్క సెకండ్... నేను జస్ట్ 'ఎస్' ఆర్ 'నో' చెప్తే సరిపోతుంది. ఆ ఒక 'ఎస్' తో లైఫ్ సెటిల్ చేసుకునే ఛాన్స్ ఒకవైపు... నీ లైఫ్ ఇంకా సెటిల్ కావటానికి ఎంత కాలం పడుతుందో తెలియకుండా వెయిట్ చేయడం ఇంకోవైపు... ఆలోచించాను... 'ఎస్' చెప్పడమే కరెక్ట్ అనిపించింది. నాకు ఉన్నది ఒకటే ఒక్క లైఫ్... ఇంకో లైఫ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకే ఒకసారి ఈ ఆపర్చునిటీ (అవకాశం) వదులుకోడానికి నేను తెలివి తక్కువదానిని కాదు... ఇంకా వెయిట్ చెయ్యడం అనవసరం అని చెప్పి నేను అబ్బాయికి 'ఎస్' చెప్పాను.


సునీల్! లెట్ అస్ సపోజ్ నీకు ఒక జాబ్ వస్తుంది అనుకుందాం. ఒక 3 లేదా 4 ఇయర్స్ అయ్యాక... మళ్ళీ అప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కుని దానికి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టుకుంటూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి... ఇదంతా నాతో కాదు. నువ్వు నా టైపు కాదు సునీల్! అనవసరంగా ఎక్కువ ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ ప్రాక్టీస్‌కి లేట్ అవుతుంది, వెళ్లి పడుకో త్వరగా" అంది.


సునీల్ సునీతను అక్కడే వదిలేసి, "సరే, నీ లైఫ్ నువ్వు చూసుకో. నీ లైఫ్ లో నేను ఇంకెప్పుడూ రాను" అని చెప్పేసి వెళ్ళిపోయాడు.


సునీల్ కి ఇది పెద్ద షాక్... తేరుకోవడానికి చాలా టైమే పట్టింది.

ఎప్పుడూ బార్‌లోనే గడుపుతున్నాడు... ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు.

ఒక రోజు వాళ్ళ ప్రిన్సిపాల్ అదే బార్‌లో కలిశాడు.


"ఏంటి సునీల్ ఇలా అయిపోయావ్? కాలేజ్ తర్వాత పెద్ద క్లబ్ కి ఆడతావ్ అనుకున్నా..."


ఆ మాటలకి సునీల్ చలించిపోయి తన కథ అంతా చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన దానికి ప్రిన్సిపాల్ చలించిపోయాడు.


"చూడు సునీల్, నీ కోపం అంతా ఫుట్‌బాల్ మీద చూపించు... తంతే బాల్ వెళ్లి గోల్ లో పడాలి... ఆ సునీత కాదు, ఇంకా ఎవరైనా సరే నిన్ను ఎందుకు మిస్ అయ్యానా అని బాధపడేలా ఆడు... నీ సెలెక్షన్స్ నేను చూసుకుంటాను..." అని చెప్పాడు.


అప్పటి నుంచి సునీల్ మళ్ళీ ఫుట్‌బాల్ సాధన కఠోరంగా మొదలు పెట్టాడు. పగలు రాత్రి ఏకం చేసి సాధన చేశాడు.


అనుకోకుండా ఒక రోజు మార్నింగ్ సునీల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసుకుంటుండగా ఒక కాల్ వస్తుంది.


ఆ కాల్ విన్నాక సునీల్ ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. అక్కడి నుండి వెంటనే బైక్ తీసుకొని వెళ్ళి సునీత ఇంటి ముందు ఆగాడు. అక్కడ తన బైక్ హార్న్ మోగిస్తూనే ఉన్నాడు.


"ఎవరబ్బో పొద్దున్నే మా ఇంటి ముందు గోల" అనుకుంటూ సునీత బయటికి వచ్చింది.


"సునీల్, మళ్ళీ ఏంటి నువ్విక్కడ?" అంది సునీత.


సునీల్ ఆ అమ్మాయికి ఒక ఎన్వలప్ ఇచ్చాడు.


"ఏంటి మళ్ళీ ఇంకో లవ్ లెటర్ ఆ... నేను చెప్పా కదా మనకి ఇంకా సెట్ కాదు అని" అంది.


"ముందు ఆ కవర్ ఓపెన్ చేసి చూడు" అన్నాడు సునీల్.


ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యం! సునీల్ కి ఒక యుకె ఫుట్‌బాల్ క్లబ్ నుంచి మూడు కోట్ల ఇయర్లీ సాలరీతో ఒక అవకాశం ఇస్తున్నట్టుగా అందులో రాసి ఉంది. సునీత సునీల్ వైపు కోపంగా చూసింది.


సునీల్ అన్నాడు:

"భయపడకు, ఇది చూపించి నిన్ను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు... కేవలం థాంక్స్ చెప్పడానికి నేను వచ్చాను. ఆ రోజు నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఉండకపోతే నేను నువ్వు చెప్పినట్టు యావరేజ్ జాబ్ చేస్తూ ఉండేవాడినేమో! ఇప్పుడు నేను ఏంటో నేను నిరూపించుకున్నాను... కాదు, నువ్వు నన్ను నిరూపించుకునేలాగా చేశావ్... థాంక్యూ సో మచ్!"


అని చెప్పి అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయి చూడటం సునీత వంతు అయింది.


-- సమాప్తం --


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:



హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page