ముసుగు తొలిగింది - కథ మారింది

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/FA93OeNQu8E

'Musugu Tholigindi Katha Marindi' - New Telugu Story By written by Parimala Kalyan

రచన: పరిమళ కళ్యాణ్


కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి షాపింగ్ అప్పుడే అయిపోయిందా అనుకుంటూ తలుపు తెరిచాడు.

తలుపు తీయగానే ఎదురుగా కనపడిన ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు, కంగారుపడ్డాడు హరీష్.

"అసలెందుకు వచ్చింది ఇదీ..? పెళ్ళికి ముందు రూపతో తిరిగిన విషయం, కట్నం డబ్బుల కోసం లతని పెళ్ళి చేసుకున్న విషయం అవన్నీ దీనికి తెలుసు. ఇప్పుడు నా గురించి మా ఆవిడకి చెప్తే, ఇక అంతే సంగతులు. అసలే కట్నం ఎక్కువ ఇచ్చానని దెప్పుతూ ఉండటమే కాదు, ఇంటి పనంతా నాతో చేయిస్తోంది లత. ఇక ఇప్పుడు ఈ మాధురి వల్ల రూప సంగతి తెలిస్తే ఇంకేం పనులు చేయిస్తుందో ఏమిటో?" అని భయపడ్డాడు. కాస్త తమాయించుకుని, ఇంట్లో భార్య లేదన్న విషయం గుర్తుచేసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు.

గబగబా మాధురిని లోపలకి లాక్కొచ్చి పడేసి, కాస్త మెల్లిగా "నువ్వా? ఎందుకొచ్చావ్ మళ్ళీ.. రూపకి నాకూ మన మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆరోజే చెప్పాను కదా? నా భార్యకి నా విషయం చెప్పాలని ట్రై చేసావో బాగోదు చెప్తున్నా. దయచేసి ఇక్కడ నుంచీ వెళ్ళిపో!" అంటూ కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు హరీష్.

ఈలోగా లత షాపింగ్ నుంచీ రావటం చూసి, ముచ్చెమటలు

పూసాయి హరీష్ కి.

లోపలకి వస్తూనే, "ఎవరీవిడ, ఇక్కడెందుకుంది? మీరు పిలిచారా?" అంటూ ఎంక్వయిరీ మొదలు పెట్టింది.

"అదీ.. అదీ.." అంటూ నీళ్లు నములుతూ సమాధానం ఏమని చెప్పాలో తెలీక తటపటాయిస్తున్నాడు హరీష్.

అంతలో మాధురి కల్పించుకుని, "చాల్లేవే, ఇప్పటికే కంగారు పడిపోతున్నాడు. ఇంకా నాన్చితే గుండాగిపోయేలా ఉంది. ఇక చెప్పేయ్ " అంది లత వంక చూస్తూ.

"హహ.. మనం చెప్పే విషయం వింటే కూడా అదే పరిస్థితి వచ్చేలా ఉంది " నవ్వుతూ అంది లత.

ఏం జరిగిందో తేలిక, అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాకా పిచ్చెక్కేలా ఉంది హరీష్ కి.

అలా జుట్టు పీక్కుంటూ ఉంటే, లత జరిగింది చెప్పటం మొదలుపెట్టింది.

"మాధురి ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. నీ వేషాలన్నీ నాకు పెళ్ళికి ముందే తెలుసు. రూపకి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని తెలియగానే, మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలనుకుంది. కానీ అంతలో వాళ్ళ నాన్నకి హార్ట్ ఎటాక్ రావటం వలన చెప్పలేక పోయింది. ఆ తర్వాత రూపకి వేరే సంబంధం కూడా కుదిరి, పెళ్ళై పోయింది. ఆ తర్వాత మన పెళ్ళి చూపులు జరిగాయి. నాతో పాటు మా నాన్న ఇచ్చే కట్నం కూడా నచ్చి ఈ పెళ్ళికి సిద్ధపడినట్టు అర్థమైంది.

పెళ్ళికి ముందు మాధురిని కలిసాక ఈ విషయాలన్నీ నాకు తెలిసాయి. కట్నం కోసం నన్ను చేసుకోబోతున్నావని తెలిసి బాధ పడింది. కాకపోతే నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది.

నేను కాకపోతే మరో అమ్మాయి కట్నం ఎక్కువ ఇస్తానంటే ఆ అమ్మాయినే చేసుకోవటానికి సిద్ధపడతావు కదా నువ్వు. అందుకే కట్నం ఎంతైనా ఇచ్చి నీతో పెళ్ళి చేయమని మా నాన్నకు నేనే చెప్పాను. దాంతో మీ వాళ్ళు అడిగిన దాని కన్నా ఎక్కువే ఇచ్చాడు మా నాన్న.

నీ ఆటలు కట్టించాలనే నేనూ ఇన్నాళ్ళు నీతో ఆడుకుంది, నీతో ఆ పనీ ఈ పనీ చేయించింది. ఇకనైనా బుద్ధి వచ్చిందా? అమ్మాయిలంటే అంత అలుసుగా ఉందా నీ లాంటి మగాళ్ళకి? ఇంకోసారి ఎవరైనా ఇలాంటి వేషాలేస్తే ఊరుకునేది లేదు!" అంటూ అసలు విషయం చెప్పి, పనిలో పనిగా చిన్న క్లాసు కూడా తీసుకుంది.

జరిగింది గ్రహించిన హరీష్, తల దించుకుని, "అర్థం అయ్యింది. ఇన్నాళ్ళు నువ్వు నాతో చేయించిన పనంతా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తమే. ఇంకెప్పుడూ ఆడవాళ్ళ గురించీ కల్లో కూడా తప్పుగా ఆలోచించను." అంటూ మాధురి వైపు తిరిగి, "సారీ మాధురీ" అన్నాడు.

"పోనీలెండి ఇప్పటికైనా మారిపోయారు సంతోషం. ఈ సంతోష సమయంలో పార్టీ చేసుకోవాల్సిందే. పదండి " అంటూ బయటకి నడిపించింది హరీష్ ని లత.

మొదట గిల్టీ గా అనిపించినా, చేసేదేం లేక ఇకపై బుద్దిగా ఉండాలని నిశ్చయించుకుని, ఇద్దరికీ మంచి ట్రీట్ ఇప్పించాడు హరీష్. లత పిలుపు ‘నువ్వు’ నుంచీ ‘మీరు’ కి మారినందుకు సంతోషపడ్డాడు.

మర్నాడు ఫోన్లో "భలే దారిలో పెట్టావు లే హరీష్ ని. నీకు ఆ యోగేష్ కన్నా ఇతనే కరెక్ట్. వాడిని వదిలించుని, పెళ్ళి చేసుకుని మంచి పని చేసావు లతా. అయ్యిందేదో అయిపోయింది. ఇకపై మీ సంసారం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను!" అంది మాధురి.

"అలాగే మాధురీ, సరైన సమయంలో నాకు మంచి సలహా ఇచ్చావు. థాంక్యూ!"

"ఫ్రెండ్స్ మధ్యలో, థాంక్స్ సారీ లు ఉండకూడదు సరేనా! ఈసారి తప్పకుండా మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి. సరే ఉంటా మరి." అంటూ ఫోన్ పెట్టేసింది మాధురి.

ఆనందంగా ఇంటి పనిలో పడింది లత.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

వాట్సాప్ తెచ్చిన తంటా- కడుపులో మంట

తీరిన కోరిక

చేజారని స్వర్గం

తియ్యని బంధం

కొత్త చిగురు

మిస్ బ్యూటిఫుల్


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.


81 views0 comments