top of page
Original.png

నా అంతరంగమందు నీవు

తెలుగు కథ, సురేఖ పులి కథలు, ప్రేమ కథ, కుటుంబ కథ, తెలుగు షార్ట్ స్టోరీ, మామిడి పండు కథ, పెళ్లిచూపులు కథ, తెలుగు సాహిత్యం, emotional Telugu story

ప్రశాంత్ చేతిలో పండిన మామిడి పండు పట్టుకుని వైదేహిని ప్రేమగా చూస్తుండగా, వైదేహి మామిడి చెట్టు కింద సిగ్గుతో చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం. వెనుక సంప్రదాయ తెలుగు ఇల్లు, మామిడి తోట, సాయంత్రపు బంగారు వెలుగులు ప్రేమ, అనుబంధం మరియు మధుర జ్ఞాపకాలను ప్రతిబింబిస్తున్నాయి.
ప్రశాంత్ చేతిలో పండిన మామిడి పండు పట్టుకుని వైదేహిని ప్రేమగా చూస్తుండగా, వైదేహి మామిడి చెట్టు కింద సిగ్గుతో చిరునవ్వు చిందిస్తున్న దృశ్యం. వెనుక సంప్రదాయ తెలుగు ఇల్లు, మామిడి తోట, సాయంత్రపు బంగారు వెలుగులు ప్రేమ, అనుబంధం మరియు మధుర జ్ఞాపకాలను ప్రతిబింబిస్తున్నాయి.

Na Antharangamandu Neevu - Telugu Love Story | Surekha Puli

నా అంతరంగమందు నీవు - తెలుగు ప్రేమ కథ | సురేఖ పులి

Published in manatelugukathalu.com on 11/06/2026

ఒక మామిడి పండు రుచి... రెండు హృదయాల మధ్య బంధంగా మారితే? 

సురేఖ పులి గారి తియ్యటి కథ నా అంతరంగమందు నీవు చదవండి


“ఇక నా వల్ల కాదు నీకు పెళ్లి సంబంధాలు చూడటం” విసుక్కుంది ప్రశాంత్ తల్లి ప్రమీల.


“నాకు నచ్చిన సంబంధాలు మీకు నచ్చవు అండ్ వైస్ వెర్సా!” తీరిగ్గా సమాధానం చెప్పాడు ప్రశాంత్.


“వైస్ వెర్సా కాదు. వయసు దాటితే మంచి సంబంధాలు దొరకడం కష్టం, వాడికి నచ్చిన వాటిల్లో ఏదో ఒకటి సెటిల్ చేసి పెళ్లి జరిపించి మన మర్యాద నిలుపుకోవడం బెటర్.” తండ్రి శాంతమూర్తి అన్నాడు.


“సరే, మీ మాటే కానిద్దాం.” రెడీగా ఉన్న సంబంధాల లిస్ట్ లో వద్దు అనుకొని కొట్టేసిన అమ్మాయిల జాబితాలో ‘వైదేహి’ ప్రొఫైల్ తల్లిదండ్రులకు చూపించాడు.


“ప్రశాంతూ! నా మాట విను, ఈ అమ్మాయి పేరు వైదేహి, అంటే సీతమ్మ తల్లి! కష్టాలు మూట కట్టిన దేవత! మన ఇంట్లో అడుగు పెడితే మనం కష్టాలు కొని తెచ్చుకోవడం అవుతుంది. అదే మీ వదిన పేరు అష్టలక్ష్మి, కట్నం, కానుకలు బోలెడు తెచ్చుకుని కొడుకు-కోడలు హాయిగా నాలుగు చేతులతో సంపాదిస్తూ, ఇంటి నిండా పనివాళ్ళతో సుఖంగా ఉన్నారు. ఈ పిల్ల.. వై అంటే ఎందుకు? దేహి అంటే బిచ్చం; వద్దు, మరో అమ్మాయిని చూడు.” అభ్యంతరం తెలిపింది ప్రమీల.


“ప్రేమీ! పర్యాయపదాలు, ఉత్పత్తి అర్థాలు చూడటం కాదు. వేరే సరైన కారణం చెప్పు.” అన్నాడు శాంతమూర్తి.


“వేరే కారణం చెప్తే, నాకు అభ్యుదయ భావాలు లేనట్టు జమ కడతారు మీరు!” ప్రమీల తెలివిగా భుజాలు దులుపుకుంది.


“ఫర్వాలేదు, చెప్పు.” అనునయంగా అన్నాడు శాంతమూర్తి.


“వద్దు, మీ తండ్రి, కొడుకులు నా తప్పులు చూడాలి అని కాచుకొని నన్ను వెంటాడుతూ ఉంటారు.” తప్పుకునే ప్రయత్నం చేసింది ప్రమీల. 


“ప్రశాంత్, అమ్మ ఆ అమ్మాయిని ఇష్టపడకపోవడానికి అసలైన కారణం అమ్మాయి పేరు, కట్నం, కానుకలు కాదు. అమ్మాయి మామూలు బి.ఎ., పైగా చామనఛాయ; ఒక్కతే కూతురు అయినా హై సొసైటీ కాదు. ఏదో నగర శివార్లలో ఉంటున్న దిగువ మధ్య తరగతి ఫ్యామిలీ. పెద్ద కోడలు ముందు మనం తలదించుకుని ఇబ్బంది పడతామని. అంతే..” భార్యకు అనుకూలంగా మాట్లాడాడు భర్త.


“మీ ఇబ్బంది నాకు అర్థం అయ్యింది. నా మనసులోని మాట కూడా వినండి; అమ్మాయి పేరు, చదువు, వాళ్ళ స్థితిగతులు నాకు పట్టింపు లేవు. మనం ఉంటున్న ఈ మెట్రోపాలిటన్ సిటీలో నా యాంత్రికమైన జీవితంలో వీకెండ్స్ ఎటైనా వెళ్లి టైమ్ సరదాగా గడిపే బదులు, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళితే..”


“ఆ.. వెళితే?” నోరెళ్లబెట్టింది ప్రమీల.

“పెళ్లి చూపుల్లో మీ పెద్దలు మమ్మల్ని ‘అలా ఇంటి వెనుక వెళ్లి మాట్లాడి రండి’ అని నన్ను, వైదేహిని తరిమారు.. అవునా?”


“అవును, అయితే, అక్కడ ఆ అమ్మాయి మంత్రమేసి నిన్ను వశపరచుకుంది. ఇదేనా నీ జవాబు?”


“కాదు. సిగ్గుల మొగ్గయి వైదేహి మాట్లాడలేకపోయింది. ఇది ఉద్యోగానికి కావాల్సిన ఇంటర్వ్యూ కాదని, నేను ఏమీ మాట్లాడక చుట్టూ ఉన్న పళ్ళ చెట్లు, పూల మొక్కలు గమనిస్తూ డిసైడ్ అయిపోయాను.”


“ఏమని?” ప్రమీల గుండె దడ పెరిగింది.


“ఏమిటే నీ అడ్డు ప్రశ్నలు? వాడు నీ ఫ్లాష్‌బ్యాక్ లో ఇరుక్కున్నాడు. వాడిని చెప్పనీ” భార్య నోటికి తాళం వేశారు భర్త.


“మా చెట్టు మామిడి పండు చాలా తియ్యగా ఉంటుంది. తినండి.” అంటూ వైదేహి మామిడి పండు నా చేతిలో తన చేతి వేళ్ళు తగలకుండా జాగ్రత్త పడి ఇచ్చింది. అమ్మాయి చేతి వేళ్ళు తగలాలని నేను ఆశ పడ్డాను. వైదేహి ఇచ్చిన మధురమైన మామిడి పండు తిని మైమరచిపోయాను. ఆహా! ఏమి రుచి! ఎంత మధురం!!


ఆ తర్వాత కలలు కనడం పరిపాటి అయింది. ఆ అమ్మాయితో నా పెళ్లి! మాకు ఇద్దరు పిల్లలు, ప్రశాంతమైన జీవితం. ఇక్కడ మన ఇంట్లో అదే సిటీలో మీ సమక్షంలో మంచి స్టాండర్డ్ చదువులు, వీకెండ్స్ ఎటైనా మాల్ వెళ్లి టైమ్ గడిపే బదులు, నా భార్య పుట్టింటికి వెళ్లి, వాళ్ళ పెరటి తోటలో నా పిల్లలు ఆడుకోవడం; ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఆ మామిడి చెట్టు, మమ్మల్ని జత కలిపిన తీపి గుర్తుగా మేము నలుగురు కూర్చుని ఆ తీయటి మధురాతి మధురమైన మామిడి పళ్ళు తింటూ; ఈ పగటి కల నిజం చేసుకోవాలని నా తీపి కోరిక!”


“ఇదేదో సినిమా సీన్ లాగా ఉంది. నిజమైయ్యేనా?” వ్యంగ్యంగా నవ్వుతూ అంది తల్లి.


“మీరు ఎస్ అంటే నిజం అవుతుంది. ఇక వదిన పట్ల మీ అవమానం అనే మీ ఆలోచన తప్పు. అన్నా వదినలకు మాత్రం రొటీన్ లైఫ్ నుండి చేంజ్ కావాలని ఉండదా? ఎప్పుడూ పనీ, డబ్బు సంపాదన మాత్రమే జీవితం కాదు. వాళ్ళు కూడా ప్రశాంతమైన పరిసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పెళ్లి సంబంధం తప్పకుండా హర్షిస్తారు.” అన్నాడు ప్రశాంత్.


“ఓకే. అలాగే. మాకు నీ పెళ్లి ముఖ్యం! నువ్వు పెళ్ళికి ముందే నీ పిల్లల బాగోగులు ఆలోచిస్తే, మేము నీకు తక్కువ కాదు సుమా!” అంది ప్రమీల. శాంతమూర్తి కాబోయే వియ్యంకుడికి తమ సమ్మతిని తెలియజేశాడు.


ఫోన్లో తమ్ముడి నిర్ణయం విని ‘వేసవిలో పెళ్లి ముహూర్తం పెట్టుకొమ్మని సలహా ఇచ్చాడు ప్రవీణ్. (మధురమైన మామిడి పళ్ళ కోసం కాబోలు).

*******

“హలో.. వైదేహి.. నేను ప్రశాంత్!” ప్రేమగా అన్నాడు.


“చెప్పండి..” ఫోన్లోనే సిగ్గులు అందుకున్నాడు ప్రశాంత్.


“నాదొక కల.. చెప్పనా?” ఆసక్తి ఉరకలేసింది. 


“వద్దు. కల వింటే నేను కలలో తేలిపోతాను.” వారించింది వైదేహి.


“ఇది తీపి మామిడి కల!” ప్రశాంత్ నోట్లో మామిడి పండు తీపి రుచి రివైండ్ అయ్యింది.


“చెప్పండి వింటాను..” వైదేహి అప్పుడే చెట్టు నుంచి కోసిన తీపి మామిడి పండు తింటూ అంది.  


సమాప్తం.

*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


bottom of page