top of page

నది


'Nadi - New Telugu Story Written By Ashok Anand

'నది' తెలుగు కథ

రచన: అశోక్ ఆనంద్


'ఆర్నెల్ల ముందు ఆ ఒక్క ఉత్తరానికి నేను రెస్పాండ్ అవ్వకుండా ఉండాల్సింది.' అని అర్ణవ్ గుండెలో మెదిలిన ఈ మాట, ఎదురుగా ఉన్న సముద్రానికి వినిపించిందో ఏమో !! ఒక్కసారిగా భయపడ్డ అలలు, తీరంలో నిల్చున్న అర్ణవ్ బూట్లను తాకకముందే స్తంభించిపోయాయ్.

ఆర్నెల్ల ముందు - సాయంత్రం ఆరున్నరౌతుంది. పాల ప్యాకెట్ కోసం బయటకెళ్ళిన అర్ణవ్ కారొచ్చి అతని గుమ్మం ముందు ఆగింది. అర్ణవ్ కళ్ళు ఇంటి ముందునున్న లెటర్ బాక్స్ మీద ఆగాయి.

** కాఫీ తయారైంది. కప్పును బాల్కనీ టేబుల్ మీద పెట్టి, లెటర్ కవర్ను చించాడు.

ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా చెక్కుతాడో, అచ్చం అలానే ఉంది ఈ చేతి వ్రాత. ఇంద్రధనుస్సు అటూ ఇటూ చెదిరిపోకుండా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో, అంతే నిర్దోషంగా అమర్చిఉన్నాయి అందులోని అక్షరాలు.

వాతావరణంలో కమ్ముకుంటున్న కాఫీ పొగలో ఈ ఉత్తరపు అక్షరాలు కూడా జత కట్టడం మొదలుపెట్టాయి.

'పూర్తిస్థాయి వాణిజ్యపరంగా మారిపోతున్న ఇప్పటి ఎంటర్టైన్మెంట్ మాధ్యమాల్లో ఈ రోజుక్కూడా నేను ఎఫ్.ఎమ్ వింటున్నానంటే కారణం, మీ భావాల చాటున భావుకత. Yes, I'm talking about your podcasts. అందరి అక్షరాల ఖాళీల మధ్య అబద్ధముంటే, మీ అక్షరాల ఖాళీల మధ్య మాత్రం అవసరముంది. ఇప్పటి మనుషులు తెలుసుకోవాల్సిన/నేర్చుకోవాల్సిన అవసరం. మిమ్మల్ని రోజూ అభినందించే వంద మందిలో నేనూ ఒకరినని నాకు తెల్సు.

కానీ వందలాది అభినందనల్లో నాది ఒకటిగా మిగిలిపోవడం ఇష్టం లేకనే ఇలా ఉత్తరం రాయాల్సొచ్చింది. ఒక కళాకారుడికి, అందులోనూ ముఖ్యంగా రచయితకి 'అభినందన' కంటే బలమింకేది ఉండబోదు. And you can erase a whatsapp message. But you can't tear a paper. కవికి కాగితం కాలక్షేపం కాదు. కన్నీటిని తుడిచే కౌగిలి కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అక్షర ప్రస్థానం మాత్రం మహాప్రస్థానమొందకూడదని నా మనవి. మీకు ఇబ్బంది లేదనిపిస్తే మీ అరచేతిని ఓ కాగితంపై ఆన్చి, దాని చుట్టూ పెన్సిల్తో గీసి నాకు పంపించగలరు.

అలా ఎందుకడిగానో ఇంకెప్పుడైనా చెప్తాను. మిమ్మల్ని కలిసి మీతో ఓ సెల్ఫీ అడగడానికి నా ఆత్మాభిమానం అడ్డురాకపోయినా దాన్ని చూడాలంటే మాత్రం నా అంధత్వం అడ్డొస్తుంది - నది.'

కాఫీ అయిపోయింది. అర్ణవ్ జీవితంలో అతను తయారుచేస్కున్న కాఫీ కంటే మొదటిసారి ఓ మనిషి మాటలు అందంగానూ, అర్థవంతంగానూ తోచాయి.

×× పేపర్, పెన్సిల్ అందుకున్నాడు. ×× 'నాకు లేనిది చూపు మాత్రమే, మెదడు కాదు. By the way నమ్మితే నమ్మండి. లేదంటే లేదు.. ఈ ఉత్తరాన్ని చూడటంలో మరో మనిషైతే నాకు సాయం చేయలేదు. Sorry for wasting your time. Good Bye. - నది.'

చదివి, కవర్లో పెట్టి, ఆలోచనలో పడ్డాడు అర్ణవ్.

'నాకేమాత్రం నమ్మశక్యంగా లేదు. కానీ నేను పంపింది నా చేతిగీతలు కాదు పిచ్చిగీతలు అని ఎవరి సాయం లేకుండానే మీరు కనిపెట్టడం అనేది నిజమైతే.. నాకు ఇప్పుడే మిమ్మల్ని కలవాలనుంది. మీకు సమ్మతమైతే దీనికి ప్రత్యుత్తరంగా మీ ఫోన్ నంబర్ పంపగలరు' అని రాసి ముగించాడు అర్ణవ్.

×× నది ఫోన్ మ్రోగింది. అర్ణవ్ కాకుంటే అది కస్టమర్ సర్వీస్ కాల్ అయ్యుండాలి.

"నదీ.. how's it possible?"

"Everything is possible when you pour your mind into it."

"Shall I meet you?"

"I would like to"

"నన్ను రమ్మంటావా?"

"నేనే వస్తాను."

** అర్ణవ్ ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది. నిస్సందేహంగా అది నది మాత్రమే అయ్యుంటుంది.

** ఇద్దరూ చెరో కాఫీ కప్పుతో బాల్కనీలో కూర్చున్నారు. "Arnav, I don't know how.. but ఇదంతా ఎవరికైనా చెప్పినా నమ్మరు. And ఇప్పటివరకూ ఎవరితోనూ చెప్పుకోవాలన్న సందర్భం కూడా రాలేదు.

I can sense and feel every little thing. సాధారణంగా మనుషుల సొంతమైన దేనిమీదైనా వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యం, శరీరం. జబ్బు చేస్తే గానీ ఆరోగ్యం విలువ, వృద్ధాప్యం వస్తే గానీ శరీరం విలువ ఎవ్వరికీ అర్థం కావు. కళ్ళున్నాయనే ఒక ధీమాతో ఈ మనుషులందరూ చూడటం మానేసి కొన్ని యుగాలౌతుంది. నా వరమనుకుంటా, ఇలా పుట్టడం. ప్రతీది చూడగల్గుతున్నాను.

శ్రద్ధతో. You really don't need eyes to observe and to feel things. నేనుండేది ఇక్కడ్నుంచి నాలుగు కిలోమీటర్లు. నడుచుకుంటూనే వచ్చాను. ప్రకృతి మీద నాకు నమ్మకముంది కానీ మనుషుల అలవాట్ల మీద లేదు. అందుకే చెప్పులేసుకుని నడవాల్సొచ్చింది." నది మాటలేవీ అర్ణవ్ కు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. కానీ ఆ మాటల లోతుల్లో ఒక సత్యమేదో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.

"సరే అయితే నా చేతినెందుకు అడిగినట్లు" అన్నాడు.

"I can feel your face with your touch" తడుముకోకుండా చెప్పింది.

"Interesting Nadhi. BTW You're looking beautiful."

"I know"

"ఎలా!! నీ చేతుల్ని నువ్వే పట్టుకుని చూస్కున్నావా" వెటకారం జోడించాడు.

"దయచేసి నువ్ కామెడీ మాత్రం రాయకే.. ప్లీజ్" అంది. -- నవ్వులు --

** అలల నురగలు చెప్పుల్లేని అర్ణవ్ పాదాలను ముంచెత్తుతున్నాయ్. దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది నది. తడుముకోకుండా. ఆత్మస్థైర్యంతో. "Heyyyy Nadhiiii" పలకరించాడు.

"నీ గొంతులోని వైబ్రేషన్ వింటుంటే జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం ఉన్నట్లు లేదే!" నవ్వుతూ జవాబిచ్చింది.

"నదీ.. కాళ్ళకు చెప్పుల్లేకుండా సముద్రంలో తిరగడంలో ఇంత అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందని తెలిస్తే పాతికేళ్ళు వృథా చేసేవాణ్ణి కాదు." అన్నాడు.

"అర్ణవ్.. కళ్ళు మూసుకో" అంది. మూసుకున్నాడు.

"Observe the travel of your breath. మనం చేసే ప్రతీ 'చిన్న పని' అనుకుంటున్న పనిలోనూ ఒక జీవం ఉంటుంది. దాన్ని గమనించడానికి కాస్త టైమ్ ఇవ్వగలిగితే చాలు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మన శరీరంలో 'మనసు' అనే వస్తువు ఫిజికల్గా ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. It is all about the MIND. I don't believe in God things. But I always believe in the process of the Universe. మనలో ఎంత కావాలో అంతా ఇంద్రజాలాన్ని అది వరమిచ్చేసింది. దాన్ని use చేసుకునే వాళ్ళు కాబట్టే అప్పట్లో ఈ మునులు, యోగుల మైండ్స్ కు వయసు సోకేది కాదు. That's why they're so powerful in doing miraculous things. కానీ మనమేం చేస్తున్నాం. ద్వేషం అనే పొరలతో మెదడుకో ముసలి చర్మాన్ని తొడుగుతున్నాం."

ఒక పెద్ద అలొచ్చి అర్ణవ్ మోకాళ్ళను తడితే గానీ నది మాటల నుండి స్పృహలోకి రాలేకపోయాడు అర్ణవ్.

** మాసాలు మాసిపోయాయి.

నది సాన్నిహిత్యంలో తనో రచయితనన్న విషయం పూర్తిగా మర్చిపోయి, ఓ విద్యార్థిగా మారిపోయాడు అర్ణవ్. తను కల్పించుకునే ప్రపంచం నుంచి బయటకొచ్చి నిజమైన ఉనికి గల ప్రపంచాన్ని వెతుక్కునే కార్యంలో నిమగ్నమై ఉన్నాడు అర్ణవ్.

** రాత్రి తొమ్మిదిన్నర. F.M లో అర్ణవ్ podcast ప్లే అవుతుంది. అది వింటూ తన గదిలో తల స్నానం చేస్తుంది నది. అర్ణవ్ తన ఇంట్లో నుంచి బయల్దేరాడు. మొదటిసారి నది ఇంటికి వెళ్ళబోతున్నాడు. కార్ కీస్ ను సోఫా పైకి విసిరేసి, దారిపై అడుగులు మోపాడు అర్ణవ్. అర్ణవ్ ఊర్లో ఉన్న విషయం నదికి తెలీదు. ఈరోజు ప్లే అవ్వబోయే podcast ను మాత్రం వినమని చెప్పాడు. నది వింటుంది. అర్ణవ్ నడుస్తున్నాడు.

** 'మనలో చాలామంది ప్రపంచాన్ని చూడాలంటే పాస్పోర్ట్ కావాలనో లేక డబ్బులు కావాలనో భ్రమలో బ్రతికేస్తుంటారు. నిజానికి.. టైముంటే సరిపోతుంది. బోర్డర్లు దాటలేకపోయినా, డాబా మీదకెళ్ళి గాలి పీల్చుకున్నా సరిపోతుంది. నా దగ్గరెన్ని డబ్బులున్నా.. నేను తిరిగే పబ్బులు, గడుపుతున్న ఇంటర్నెట్.. ఇవే ప్రపంచమనే భ్రాంతిలో బ్రతికేవాణ్ణి. అప్పుడే వచ్చింది, నది. నేను మిస్సవుతున్న ప్రతీ అణువు పనిలోనూ ఓ విశ్వముందని గుర్తించేలా చేసింది.

డియర్ నది.. పెళ్ళి, ప్రేమ, స్నేహం లాంటి పదాల చాటున బంధాల కోసం నాకు నిజంగా తెలీదు. కానీ, నువ్వు నా పక్కనుంటే ప్రపంచం అందంగా కనపడుతుంది. నాలో ఆనందం కనపడుతుంది. నా నుంచి ఏమీ అడగకుండానే, నీ నుంచి అన్నీ నేర్చుకునేలా చేసింది నీ సాన్నిహిత్యం. నీకు అభ్యంతరం లేకపోతే.. నీ నీడలోనే నిరంతర విద్యార్థిగా చచ్చేవరకూ బ్రతకాలని అభ్యర్థిస్తూ.. అర్ణవ్'

** నది ఇంటి తలుపుపై అర్ణవ్ చేయి పడినంతనే, నీలం రంగు చీర కట్టుకున్న ఓ అమ్మాయొచ్చి, అర్ణవ్ చేయి పట్టుకుని లోపలికి తీస్కెళ్ళి, ఒక ఆల్బమ్ ను అతని ముందు పడేసింది. అందులో ఉన్న చాలామంది అమ్మాయిల ఫోటోల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అర్ణవ్.

"ఏంటలా చూస్తున్నావ్! త్వరగా సెలెక్ట్ చేసుకుంటే నైట్ కి రేట్ చెప్పి, అమ్మాయిని పంపిస్తాను. రూమ్ మాత్రం నీదే" అంది.

ప్రపంచం దాని పని అది చేస్కుపోతుంది. ఎవరి బాధ కోసమూ అది ప్రళయాలు పుట్టించదు. సునామీలు సృష్టించదు. భూమి తిరుగుతోంది. అర్ణవ్ మాత్రం ఆగిపోయాడు. ఆగిపోయిన అణువుల్ని తనలోకి లాక్కునే విశ్వం, అర్ణవ్ ని మాత్రం వదిలేసింది. జాలి పడి ఉండొచ్చు. మొహంలో ఏ భావం లేని అర్ణవ్ అరచేయి, ఆల్బమ్ లోని నది ఫోటో పైకి వెళ్ళింది.

"ఈ గుడ్డిదా !! దీనికేవైందో, ఈ మధ్య ఎవరి పక్కలోకీ వెళ్ళనని ఆకలితోనే పడుకుంటుంది." అని చెప్పింది.

** ప్రస్తుతం - బూట్లతోనే సముద్రంలో నిల్చున్న అర్ణవ్ దగ్గరకి అలలు రావడానికి భయపడుతున్నా, నది మాత్రం వచ్చి నిల్చుంది.

"చెప్పుండాల్సింది నది" అన్నాడు, క్రింద రాలిపడుతున్న కన్నీటి కనులతో. బహుశా ఈ సముద్రం ఇలానే సృష్టించబడిందేమో.

"అబద్ధం ఎప్పుడైనా చెప్పానా?" అంది.

ప్రపంచానికి వినిపిస్తున్న సముద్ర ఘోష వీళ్ళిద్దరి చెవుల ముందు మాత్రం విఫలమైంది. అర్ణవ్ బూట్లను తీసి విసిరేశాడు. అతని అరచేతి స్పర్శతో అర్ణవ్ మొహాన్ని, చెప్పాలనుకుంటున్న భావాన్ని ఫీలవ్వగల్గింది నది.

** ఎంతమంది విటులు నదిలో వ్యర్ధాన్ని విడిచిపెట్టినా, పారే నది ఎన్నటికీ మలినం కాదు.

***

అశోక్ ఆనంద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అశోక్ ఆనంద్.

రచయిత, దర్శకుడు, సాహితీ వేత్త


31 views0 comments
bottom of page