top of page
Writer's pictureKidala Sivakrishna

నిర్లక్ష్యం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





'Nirlakshyam' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

అవకాశాలు ఎప్పుడూ రావు.

నిర్లక్ష్యంతో వచ్చిన అవకాశం జారవిడుచుకుంటే ఎంతో విలువైన సమయం వృధా అవుతుందని తెలియ జెప్పే ఈ కథను యంగ్ రైటర్ శివకృష్ణ గారు రచించారు.

మాది సిటీకి దగ్గరగా ఉండే గ్రామీణ ప్రాంతం. మా గ్రామంలో ఆర్మీ కి వెళ్ళాలని అనుకునే అబ్బాయిలు ఎక్కువ. ఈ కోవలోనే చాలా మంది అబ్బాయిలు ప్రయత్నాలు చేస్తూ, గతంలో ఆర్మీ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదే విధంగా ఈ సారి ఆర్మీ రిక్రూట్మెంట్ రాలీలో మా గ్రామ పోరగాళ్ళు పాల్గొన్నారు. బాగా ప్రయత్నం చేసి, ఆరుగురు అబ్బాయిలు ఫిజికల్ టెస్ట్ లో

పాస్ అయ్యారు. తరువాత మెడికల్ టెస్ట్ లో కూడా పాస్ అయ్యారు. అందులో నా మిత్రుడు ఒకడు ఉన్నాడు.

తరువాత రిటన్ టెస్ట్ కోసం 3 నెలల 20 రోజులు సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సమయాన్ని ఉపయోగించుకోకుండా నా మిత్రుడు చాలా నిర్లక్షం చేశాడు. అప్పటికీ నేను, నా ఇతర మిత్రులు మరియు కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు కూడా ‘చదువుకో’ అని ఎంతో చెప్పాం. కానీ వాడు మాత్రం వినకుండా నిర్లక్ష్యంతో సమయాన్ని వృధా చేశాడు.

పరీక్షా సమయం ఆసన్నమైంది. నా మిత్రునికి ఒక్క మంచి అవకాశం వచ్చింది. అది ఏమిటి అంటే వాడి పరీక్ష చివరి తేది లో ఉంది. కానీ అతడు ఆ సమయాన్ని కూడా వృధా చేసాడు. చివరి రోజుల్లో చదవడం మొదలు పెట్టాడు. పరీక్ష ముగిసింది. కొద్ది రోజుల్లోనే ఫలితాలు వచ్చాయి. చివరిలో ఎంత ప్రయత్నం చేసినా తగిన ఫలితం దక్కలేదు నా మిత్రుడికి.

అపుడు వాడు బాధపడుతుంటే “నువ్వు బాధపడకు. నీకు ఇంకా వయస్సు ఉంది కదా. మళ్లీ నోటిఫికేషన్ వచ్చినపుడు ప్రయత్నం చేద్దువు గానీ” అని చెప్పాను.

తరువాత ఆర్మీ రాలీ నోటిఫికేషన్ వచ్చింది. ఫిజికల్ టెస్ట్ లో మంచి మార్కులు సాధించాడు. దేవుడి దయ వల్ల మెడికల్ టెస్ట్ లో పాస్ అయ్యాడు.

తరువాత రిటన్ టెస్ట్ కు 4 నెలల సమయం ఇచ్చారు.

గతంలో చేసిన నిర్లక్ష్యం వల్ల తన జీవితంలో ఒక సంవత్సరం వృధా అయినా విషయం గుర్తుకు వచ్చింది. ఈసారి తప్పకుండా ఉద్యోగం సాధించాలని మొదటినుండీ శ్రమిస్తూ ఉన్నాడు. వాడి అదృష్టం ఏమిటో కానీ పరీక్షా సమయాన్ని పొడిగించారు. ఇది మంచి అదునుగా భావించిన నా మిత్రుడు రాత్రింబవళ్ళు కష్టపడి చదవడం మొదలు పెట్టాడు. పరీక్షా సమయం ఆసన్నమైంది. పరీక్ష రోజున దేవుడి దర్శనం చేసుకుని పరీక్ష సెంటర్ కు వెళ్ళాడు.

పరీక్ష చాలా బాగా రాశాడు. పరీక్షా ఫలితాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఫలితాలు వచ్చాయి. విజేతల జాబితాలో నా మిత్రుడి పేరు వుంది. అతడి ఆనందానికి అవధులు లేవు.

నా వద్దకు వచ్చి “చాలా సమయాన్ని వృధా చేయడం వల్ల నాకు ఇంత సమయం పట్టింది. అదీకాక నువు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చావు. నీకు చాలా ఋణ పడి ఉంటాను” అని చెప్పాడు.

అపుడు నేను “రుణం లేనిదే కదరా స్నేహం” అని, “అంతా నీ ప్రయత్నం ద్వారానే సాధ్యం అయింది” అని నాలుగు సినిమా డైలాగ్ లు చెప్పి అభినందించి “జాగ్రత్తగా ఉండు” అని చెప్పాను.

ఇపుడు అతను డ్యూటీ నుంచి వచ్చిన ప్రతి సారి పండుగ వాతావరణం లో మా గ్రామం తేలియాడుతూ ఉంది. ఏదైనా నిర్లక్షం చేయకుండా ఉంటేనే మనం అనుకున్నది సాధించడానికి వీలు అవుతుందని వాడికీ, వాడివల్ల నాకూ తెలిసి వచ్చింది.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


574 views1 comment

1 comentário


pandrankis
pandrankis
21 de dez. de 2021

కథలో ఉదాత్త భావం ఉంది.కథా గమనంలో నడక ఉంది.కిడాల శివకృష్ణగారు మరిన్ని మంచి పుస్తకాలు-ముఖ్యంగా తెలుగు నుడికారం గల కథలు నవలలు చదివి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కథలు వ్రాయగలరు.శుభస్తు--

Curtir
bottom of page