top of page
Original.png

"ఒక నిమిషం" మాత్రమే

Updated: Sep 19, 2025

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #ఒకనిమిషంమాత్రమే, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

కేవలం "ఒక నిమిషం" మాత్రమే మాట్లాడాలి.. ఎందుకు అలా ??? 

Oka Nimusham Mathrame - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 18/09/2025

ఒక నిమిషం మాత్రమే - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


*1)


భారత దేశంలో, అది ఒక అంతర్జాతీయ పాఠశాల. 


5 సెప్టెంబర్, 2025 న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఆ పాఠశాలలో చర్చా పోటీలు. 


టీచర్ల బృందం ఇలా తీర్మానం చేసింది. 


ప్రతి విద్యార్థి - విద్యార్థిని కేవలం "ఒక నిమిషం" మాత్రమే మాట్లాడాలి. ముందు మాట్లాడిన వారు చెప్పిన విషయం ఇంకో వ్యక్తి (రిపీట్) పునరావృతం చేయరాదు. కొత్త విషయం ప్రస్తావించాలి.. ఎందుకు అంత తక్కువ సమయం??? అది తుదకు చెప్తాము!!!

--------------------------


*2)

------- భాషణలు - ప్రసంగాలు ----


I) మొదటి భాషణ: బెట్టీ: Betty (అనే అమ్మాయి భాషణ): 


"భారత దేశం లో, సెప్టెంబర్ 5, 2025 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము, 1962 సంవత్సరం నుండి. 

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన-రోజు కాబట్టి. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి. అతడు గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు కాబట్టి. అతడు 1888 నుండి 1975 వరకు జీవించారు". 

------------------------


ii) వెరోనికా: Veronica (అనే అమ్మాయి భాషణ): 


"ప్రపంచ - అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న జరుపుకుంటున్నాము, 1994 సంవత్సరం నుండి. యునెస్కో (UNESCO) ప్రతిపాదించింది కాబట్టి. 


5 అక్టోబర్ 1966లో ఉపాధ్యాయుల హోదాపై ILO - UNESCO సిఫార్సును స్వీకరించిన వార్షికోత్సవాన్ని గుర్తించడమే. 


ఈ (UNESCO) సిఫార్సు ఉపాధ్యాయుల హక్కులు మరియు బాధ్యతలను, అలాగే వారి ప్రాథమిక తయారీ, నియామకం, ఉపాధి మరియు బోధనా పరిస్థితుల ప్రమాణాలను నిర్దేశిస్తుంది. "

------------------------------------------


iii) చెన్: Chen (అనే అమ్మాయి భాషణ):


"టీచర్లకు పని భారం తగ్గించాలి. రోజుకు కొన్ని తరగతులు మాత్రమే ఇవ్వాలి. వేరే కాళీ సమయంలో రిలాక్స్ అవ్వొచ్చు, వేరే పుస్తకాలు చదువుకోవచ్చు, వారికి ఇష్టమైన విషయం పైన పరిశోధన చెయ్యవచ్చు". 

-------------------------------------------


Iv) ఆర్చి: Archie (అనే అబ్బాయి భాషణ):


"పిల్లల పుస్తకాలు - పరీక్ష సమాధానాల పత్రాలు దిద్దటానికి వేరే ఉద్యోగులను నియమించుకోవాలి - పెట్టుకోవాలి. దీని వల్ల 

దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీరుతుంది (కొద్ది శాతం అయినా)". 


టీచర్ లకు పార్ట్ టైం ఉద్యోగ సౌకర్యం కూడా కల్పించాలి. వారు పై చదువులు చదువుకోవచ్చు (కళాశాల లో చేరి), వేరే వ్యాపకాలు చేసుకోవచ్చు". 

---------------------------------------------


V) సన్నీ: SUNNY (అనే అబ్బాయి భాషణ):


"టీచర్ ల జీతం పెంచాలి. పెక్కు వెసులుబాట్లు - సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే ఈ వృత్తికి ఎక్కువ మంది ప్రజలు వస్తారు". 

--------------------------------------------


vi) స్టేసీ స్మిత్: Stacy Smith (అనే అమ్మాయి భాషణ):


"ప్రతి తరగతి గదిలో ప్రొజెక్టర్ పెట్టాలి. ప్రతి టీచర్ ప్రొజెక్టర్ - స్లైడ్స్ ద్వారా పాఠాలు బోధించాలి. అప్పుడు టీచర్ కు రాసే శ్రమ ఒత్తిడి పని భారం తగ్గుతుంది. పాఠం యొక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించ 

వచ్చు టీచర్. పెద్ద స్క్రీన్ కాస్త పైకి పెడితే.. వెనుక బెంచీలు పిల్లలకు కూడా కనిపిస్తూ ఉంటుంది.. ముందు బెంచీల వారి తలలు అడ్డు రాకుండా". 

-------------------------------


Vii) పాట్రిసియా: Patricia (అనే అమ్మాయి భాషణ):


"ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ పెట్టాలి.. టీచర్ల - పిల్లల హక్కుల కోసం, సమస్యల కోసం.. పరిష్కారాలు ఇవ్వడానికి. 


 ప్రతి పాఠశాల లో కౌన్సిలర్లు ఉండాలి. వారు టీచర్లకు - విద్యార్థులకు సంతోష పూర్తి నిర్వహణ మరియు ఆనంద దాయక పరిష్కారాల తీరులో శిక్షణ ఇవ్వాలి. 

సమస్యలకు పరిష్కారాలు ఇవ్వాలి, ఎవరిని బలి పశువులు 

చేయకుండా. Corporate punishment మటు మాయం అవుతుంది. Corporate punishment will disappear immediately. Apply the WIN-WIN counselors concept in every office too. "

-------------------------------


Viii) వాంగ్: WANG (అనే అమ్మాయి భాషణ):


 "ప్రతి విషయంలో సిలబస్ తగ్గించాలి. అప్పుడు టీచర్ పాఠం యొక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. తక్కువ సిలబస్ అంటే చిన్న హోంవర్క్ లు - చిన్న ప్రాజెక్టులు ఇవ్వ వచ్చు పిల్లలకు. 


 చిన్న ప్రాజెక్ట్లు స్కూల్ సమయం లోన చేయాలి విద్యార్థులు జట్లు గా.. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో. అప్పుడు పిల్లలు ఇష్టంగా చదువుతారు విషయం అర్ధం చేసుకొని.. మార్కుల కొరకు బట్టి పట్టరు. 


పరీక్ష ప్రశ్నలు తరగతి లో చేసిన సిలబస్ కు తగినట్లుగా ఉండాలి.. అసంతుష్ట - అసంతృప్తి - అసహజ నిర్వహణ ఉండరాదు". 

--------------------------------------------------------------


 ix) నారింజ: ORANGE (అనే అమ్మాయి భాషణ):


 "అవును.. సిలబస్ తగ్గించాలి. రోజు:- వ్యాయామం - చురుకైన నడక - స్విమ్మింగ్ - సైక్లింగ్ మరియు సంగీత- ఆటల - అభిరుచుల - యోగ - ARTS తరగతులు తప్పక పెట్టాలి. ఎవరికి ఇష్టమైనదీ వారు యెన్చుకోవచ్చు. వాటికీ సమయం దొరుకుతుంది సిలబస్ కుదిస్తే. 


వీటి వల్ల.. విద్యార్థులకు టీచర్లకు కూడా ఉల్లాసం ఉత్సాహం శక్తి - మానస వికాసం లభ్యం అవుతాయి. బృందముగా - జట్టుగా పని పంచుకొని చేయటం - delegation and division of work - నాయకత్వపు లక్షణాలు కూడా వస్తాయి. 

అప్పుడు పిల్లలకు ఒత్తడి అనిపించదు. తేలిక గా పాఠాలు అర్ధం అవుతుంది. 

అలాగే తరచు విహార యాత్రలు - పిక్నిక్లు పెట్టాలి.. ప్రతి వారం. మానస వికాసం తో బాటు ప్రకృతి నుండి నేరుగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు". 

--------------------------------------------------------------


x) నీలం: BLUE (అనే అమ్మాయి భాషణ):


"పాఠ్యపుస్తకాల్లో ఆధునిక సాంకేతికత గురించి - ఈనాటి నవ యుగ సాహిత్యం గురించి పాఠాలు కూడా ఇవ్వాలి. సంతోష పూరిత నిర్వహణ మరియు ఆనంద దాయక పరిష్కారాల తీరు (జీవిత) పాఠాలు కూడా ఇవ్వాలి". 


"పాఠ్యపుస్తకాల్లో ఎక్కువ గా బొమ్మలు పెట్టాలి.. ఎక్కడ వీలు ఉంటే.. అక్కడ ఆ విషయాలలో.. యానిమేషన్ ఆడియో వీడియో తరగతులు ఆన్లైన్ లో తీసుకోవాలి.. పిల్లలకు తేలికగా - సులభంగా - సరళంగా - అర్థం అవుతుంది.. ఓ ఆట లాగ పాట లాగ". 

--------------------------------------------------------------


Xi) పసుపు: YELLOW (అనే అమ్మాయి భాషణ):


ఆర్ట్స్ - అబాకస్ (ABACUS) - వేదిక్ స్పీడ్ మత్ (VEDIC SPEED MATHS)- పజిల్స్ సొల్వింగ్.. తరగతులు కూడా పెట్టాలి.. సిలబస్ కుదిస్తే ఇవన్నీ సాధ్యం. అప్పుడు పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుంది. కుటుంబ - 

 సంతోష పూరిత - నిర్వహణ లో కూడా తరగతులు పెట్టాలి.. మంచి శిక్షణ ఇవ్వాలి. వాటికీ సమయం దొరుకుతుంది సిలబస్ కుదిస్తే". 

--------------------------------------------------------------


XIi) ఆకుపచ్చ: GREEN (అనే అమ్మాయి భాషణ):


"రేపు ఉద్యోగంలో చేరితే నిర్మాణాత్మక సంతోష పూరిత - మరియు - ఆనంద దాయక పరిష్కారాల తీరు నిర్వహణ 

చేస్తారు. 

భూత సర్ప పైశాచిక తత్వం రాదు. 


ఏడిపించడం - కీడు - హాని - కుతంత్రం చేయడం

బలి పశువులు చేయడం - కుట్ర పన్నడం, దుష్ట ప్రణాళికలు వేయడం లేదా మోసం చేయాలనుకోవడం రాదు. 


చెడు ఆలోచనలను నియంత్రించడం వస్తుంది. "

--------------------------------------------------------------


XIiI) ఎరుపు: RED (అనే అమ్మాయి భాషణ):


"డబ్బులు మరియు ఇతర దాన ధర్మాలు జట్టు తీరు తో చేయాలి.. ఒక్కరి పై భారం వేయకుండా.. దాతృత్వం - దాన ధర్మాలు చేయటం వ్యవస్థీకరణ చేయాలి. ఇవన్నీ చిన్నపటి నుండి నేర్పించాలి". 

--------------------------------------------------------------


XIV) వైలెట్: VIOLET (అనే అమ్మాయి భాషణ):


ఓపెన్ బుక్ పరీక్షల (OPEN BOOK SYSTEM EXAMS) విధానం పెట్టాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు కవర్ చేసిన సిలబస్‌ను బట్టి ప్రశ్నలు ఇవ్వాలి పరీక్ష లో.. ఇష్టానుసారం వేరే ప్రశ్నలు ఇవ్వకూడదు. అప్పుడ మార్కుల కొరకు పిల్లలు బట్టి పట్టరు.. అర్థం చేసుకొని చదువుతారు.. అభివృద్ధి చెందుతారు జీవితంలో. 

-------------


XV) నీలిమందు: INDIGO (అనే అమ్మాయి భాషణ):


ప్రతి మనిషి ఒక రోజు చనిపోతాడు.. అందుకే, ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం - ఆత్మీయత ప్రగతిపథం - అభివృద్ధి - సుఖసంతోషాల జీవితం పై పాఠాలు పెట్టి అవి నేర్పించాలి.. ప్రతి ఇల్లు కార్యాలయం స్కూల్ కాలేజీ అవి నేర్పించాలి - పాటించాలి.. ఇష్టం లేని వారితో - స్థలాలతో - సంస్థలతో దూరం గా ఉంటే.. కొట్లాటలకు - మనస్పర్ధలకు టెన్షన్ కు తావు ఉండదు. ఉపాధ్యాయులు - పిల్లలు ... ఒక స్నేహ పూరిత - అనురాగ పూరిత ... ఆదర్శ - "మంచి" కుటుంబంలా మెలగాలి ... (Teachers and students should live like one FRIENDLY - AFFECTIONATE family)

3-tier fees structure - system should be implemented in education to help the poor and the middle class.


I)

పేదవారికి ...

ఉచిత విద్య +

స్కాలర్‌షిప్లు + ఉచిత వైద్యం ఇవ్వాలి. వడ్డీలేని రుణాలు ఇవ్వాలి.


Ii)

మధ్యతరగతి వారికి మధ్య రకం

ఫీజు ... వారు భరించ కలిగేలా + స్కాలర్‌షిప్లు

పెట్టాలి.


Iii) ధనవంతులకు ఎక్కువ ఫీజు పెట్టాలి

---X X X ---


------- భాషణలు - ప్రసంగాలు - సమాప్తం ---



*3)

ఉపాధ్యాయుల బృందము ఇలా చెప్పింది - ప్రకటన చేసింది విద్యార్థులకు:-


I)

మీ ఉపాయాలు పరిష్కారం.. మీ పేరు మీద ప్రభుత్వానికి మరియు ఐక్యరాజ్య సమితికి (UNOకి) పంపిస్తాము. 


Ii) 

ప్రతి విద్యార్థి - విద్యార్థిని "కేవలం ఒక నిమిషం మాత్రమే మాట్లాడాలి".. అని ఎందుకు నిబంధన పెట్టాము - చెప్పాము అంటే ???.. అందరు జట్టు రీతిలో పంచుకొని పని చేయడం నేర్చుకోవడానికి.. Delegate AND distribute the work.. కేవలం ఒక్కరి పై భారం వేయకుండా. 


అందరి చప్పట్లతో ఆనాటి ఆ కార్యక్రమం - సభ ముగిసింది. 


----------- చిన్న కథ సమాప్తం -------------


నీతి:


1)

తేలిక బోధనా పద్ధతులు అవలంభించాలి. 


2)

సిలబస్ తగ్గిస్తే - కుదిస్తే పని భారం తగ్గుతుంది, పిల్లలకు - టీచర్లకు.. అప్పుడు మనో - వికాస తరగతులు పెట్టడానికి సమయం - వీలు ఉంటుంది.. హోంవర్క్ ప్రాజెక్ట్ సైజు తగ్గుతుంది పిల్లలకు. 


3)

టీచర్ల జీతాలు - సౌకర్యాలు పెంచాలి.. పని భారం ఒత్తడి తగ్గించాలి. అప్పుడే ఎక్కువ మంది టీచర్ బోధనా వృత్తికి వస్తారు


4)

జట్టు తీరు పని + Delegate AND distribute the work.. ఏ ఒక్కరి పైన భారం వేయకుండా


5)

డబ్బులు మరియు ఇతర దాన ధర్మాలు జట్టు తీరు తో చేయాలి.. ఒక్కరి పై భారం వేయకుండా.. దాతృత్వం - దాన ధర్మాలు 

చేయటం వ్యవస్థీకరణ చేయాలి. 


6)

అసంతుష్ట - అసంతృప్తి - అసహజ నిర్వహణ ఉండరాదు. 

Corporate punishment ఉండరాదు. Apply the "WIN-WIN well-trained Counsellors as employees concept" in every school, college, office, organisation, business house. 


7)

ఓపెన్ బుక్ పరీక్షల (OPEN BOOK SYSTEM EXAMS) పెట్టాలి. అప్పుడ మార్కుల కొరకు పిల్లలు బట్టి పట్టరు.. అర్థం చేసుకొని చదువుతారు.. అభివృద్ధి చెందుతారు జీవితంలో. 


8)

పాఠ్యపుస్తకాల్లో ఆధునిక సాంకేతికత గురించి - ఈనాటి నవ యుగ సాహిత్యం గురించి పాఠాలు కూడా ఇవ్వాలి. సంతోష పూరిత నిర్వహణ మరియు ఆనంద దాయక పరిష్కారాల తీరు (జీవిత) పాఠాలు కూడా ఇవ్వాలి. 


9) 

పాఠ్యపుస్తకాల్లో ఎక్కువ గా బొమ్మలు పెట్టాలి.. ఎక్కడ వీలు ఉంటే.. అక్కడ ఆ విషయాలలో.. యానిమేషన్ ఆడియో వీడియో తరగతులు ఆన్లైన్ లో తీసుకోవాలి.. పిల్లలకు తేలికగా - సులభంగా - సరళంగా - అర్థం అవుతుంది.. ఓ ఆట లాగ పాట లాగ"


10)


ఉపాధ్యాయులు - పిల్లలు ... ఒక స్నేహ పూరిత - అనురాగ పూరిత ... ఆదర్శ - "మంచి" కుటుంబంలా మెలగాలి ... (Teachers and students should live like one FRIENDLY - AFFECTIONATE family)

------


11)

3-tier fees structure - system should be implemented in education to help the poor and the middle class


*i)

పేదవారికి ...

ఉచిత విద్య +

స్కాలర్‌షిప్లు + ఉచిత వైద్యం ఇవ్వాలి. వడ్డీలేని రుణాలు ఇవ్వాలి.


*ii)

మధ్యతరగతి వారికి మధ్య రకం

ఫీజు ... వారు భరించ కలిగేలా + స్కాలర్‌షిప్లు

పెట్టాలి.


*iii) ధనవంతులకు ఎక్కువ ఫీజు పెట్టాలి


------------- చిన్న కథ - నీతి సమాప్తం -------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page