పళ్ళు రాలాకే...
- Kotha Viritha

- 1 day ago
- 2 min read

Pallu Raalake - Telugu Inspirational Article | Kotha Viritha
పళ్ళు రాలాకే... - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 19/08/2026
పెద్దలు చెప్పినప్పుడు వినం…జీవితం చెప్పినప్పుడు మాత్రం తప్పకుండా వింటాం!
“డబ్బు దాచుకో” అంటే — రేపు చూద్దాం!
“ఆరోగ్యం చూసుకో” అంటే — గూగుల్ ఉంది కదా!
“అందరినీ నమ్మొద్దు” అంటే — మోసం చేసిన తర్వాతే బ్లాక్ లిస్ట్!
చివరికి అర్థమయ్యేది ఒక్కటే…
కొన్ని పాఠాలు పళ్ళు రాలాకే తెలుస్తాయి!
చిన్నప్పుడు పెద్దలు చెప్పిన ప్రతి మాటా, మనకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌లా అనిపిస్తుంది. "డబ్బు దాచుకో" అంటే... "రేపు చూద్దాం!" అంటాం. "ఆరోగ్యం చూసుకో" అంటే, "ఏమైనా అయితే గూగుల్ ఉంది కదా!" అని ధైర్యం చెప్పుకుంటాం. "అందరినీ నమ్మొద్దు" అంటే, మోసం చేసిన తర్వాతే వాళ్లకు బ్లాక్ లిస్ట్ వేస్తాం. "కోపం తగ్గించుకో" అంటే, ముందు కోపంతో నాలుగు మాటలు అనేసి, తర్వాత "అలా అనకూడదు" అని పశ్చాత్తాపపడతాం.
జీవితం భలే టీచర్! ముందు పరీక్ష పెడుతుంది... ఫెయిల్ చేస్తుంది... తర్వాత సిలబస్ చేతిలో పెడుతుంది. వింత ఏంటంటే, ఆ పాఠాలన్నీ పూర్తయ్యాక, మనమే కొత్తవాళ్లకు ఉచిత సలహాల కేంద్రాలుగా మారిపోతాం. "నేను కూడా ఒకప్పుడు నీలాగే అనుకున్నా" అనే డైలాగ్‌తో క్లాస్ మొదలుపెడతాం. వాళ్లు మన మాట వినరు, ఎందుకంటే ఒకప్పుడు మనమూ మన పెద్దల మాట వినలేదు కాబట్టి! అదే జీవితంలోని గొప్ప కామెడీ! ప్రతి తరం అనుభవాన్ని వారసత్వంగా ఇవ్వాలని చూస్తుంది, కానీ ప్రతి తరం దాన్ని స్వయంగా అనుభవించడానికే ఇష్టపడుతుంది.
కొన్ని పాఠాలు వినడం వల్ల అర్థం కావు. అవి అహంకారానికి దెబ్బ తగిలినప్పుడు, మనసు గాయపడినప్పుడు, జేబు ఖాళీ అయినప్పుడు, పళ్ళు రాలాకే తెలుస్తాయి.
అనుభవం, మనిషికి దొరికే అత్యంత ఖరీదైన గురువు. ఫీజు ముందే తీసుకుంటుంది, కానీ పాఠం మాత్రం తర్వాత చెబుతుంది!
రచన: కొత్త విరిత
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






పెద్దవాల్లు అనుభవంతో చెప్పేటప్పుడు అర్థం చేసుకోని ఈతరం స్వానుభవంతో నే అర్థం చేసుకోవడం దానికి మూల్యం చెల్లించడం మామూలే... మంచి ఆర్టికల్
Excellent 👌 👌 👌 👌
Nice 👌
Baggunndhi madam
Good content