top of page
Original.png

పనిముట్ల పంచాయతీ

17 hours ago
2 min read

పనిముట్ల పంచాయతీ తెలుగు నీతి కథలో అన్ని వృత్తుల ప్రాముఖ్యతను వివరిస్తున్న టెడ్డీబేర్ సర్పంచ్, డాక్టర్ స్టెతస్కోప్, కుట్టుమిషన్, కత్తెర, చెప్పులు కుట్టే సూది, చీపురు.

Panimutla Panchayithi - Telugu Moral Story | Ganti Asa Padmini

పనిముట్ల పంచాయతీ - తెలుగు నీతి కథ | గంటి ఆశ పద్మిని

Published in manatelugukathalu.com on 18/10/2026


పనిముట్ల పంచాయతీ గంటి ఆశ పద్మిని రచించిన చక్కని తెలుగు నీతి కథ. అన్ని వృత్తుల ప్రాముఖ్యత, పరస్పర సహకారం, ప్రతి పనిని గౌరవించాలనే విలువైన సందేశాన్ని ఈ కథ పిల్లలకు సరళంగా తెలియజేస్తుంది.


ఆరో తరగతి గదిలోకి వచ్చారు తెలుగు టీచర్ పద్మజ. టీచర్ రాగానే పిల్లలందరూ లేచి నమస్కారం పెట్టారు.


అందరినీ కూర్చోమని పాఠం చెప్పడం ప్రారంభిస్తున్న టీచర్‌కు పక్క గదిలో ఇద్దరు పిల్లల కేకలు వినిపించాయి. పక్క గదికి వెళ్లి, "ఏమైంది?" అని అడిగారు టీచర్.


"చూడండి టీచర్, రాము 'డాక్టర్ వృత్తే గొప్ప' అంటున్నాడు," అన్నాడు శ్యామ్.


"'దర్జీ వృత్తే దర్జాగా ఉంటుంది' అంటున్నాడు శ్యామ్," అన్నాడు రాము.


ఆ మాటలకు టీచర్, "నేను ఒక కథ చెబుతాను వింటారా?" అని అడిగారు.


"వింటాము," అన్నారు పిల్లలు.


టీచర్ కథ చెప్పడం ఆరంభించారు...


ఒక ఊరిలో టెడ్డీబేర్ సర్పంచ్‌గా ఉండేది. ఒక రోజు ఊరిలో ఉన్న రకరకాల వృత్తుల పనిముట్లు... 'స్టెతస్కోప్, కుట్టుమిషన్లు, బార్బర్ కత్తెర, చెప్పులు కుట్టే సూది, రహదారులు శుభ్రం చేసే చీపురు' ఇలా అన్నీ 'ఊరికి ఎవరికి వారు మాత్రమే అవసరం' అని గొడవపడసాగాయి.


టెడ్డీబేర్ వచ్చి, "ఎందుకు గొడవపడుతున్నారు?" అని అడిగింది.


స్టెతస్కోప్, "నేను రోగాన్ని కనిపెట్టి నయం చేస్తాను, నేనే ఊరికి అవసరం," అంది.


కుట్టుమిషన్లు, "నేను బట్టలు కుట్టకపోతే ఎవరికీ బట్టలు ఉండవు, నేనే ఊరికి అవసరం," అన్నాయి.


ఇలా ఒక్కో పనిముట్టు ఊరికి తాము ఎంత అవసరమో చెప్పసాగాయి.


టెడ్డీబేర్ ఆలోచించి, స్టెతస్కోప్‌తో... "నువ్వు నీ తెల్లకోటు కుట్టుకో," అని చెప్పింది.


స్టెతస్కోప్, "నాకు కుట్టుకోవడం రాదు," అని చెప్పింది.


అప్పుడు కుట్టుమిషన్లతో... "మీకు రోగం వస్తే ఆ రోగమేంటో తెలుసుకుని మందులు వేసుకోండి," అని చెప్పింది.


"మాకు రోగమేంటో తెలుసుకోవడం రాదు," అన్నాయి కుట్టుమిషన్లు.


"ఇప్పుడు అర్థమైందా ఒకరి అవసరం ఇంకొకరికి ఉందని?" అని అడిగి, అన్ని పనిముట్లకు ఒక వృత్తి అవసరం ఇంకో వృత్తికి ఎప్పుడూ ఉంటుందని, "సమాజంలో అన్ని వృత్తులూ అవసరమే! ఏ వృత్తి ప్రాముఖ్యత, గొప్పతనం ఆ వృత్తిదే," అని చెప్పింది టెడ్డీబేర్.


ఆ మాటలకు అన్ని పనిముట్లు ఒకరినొకరు కౌగలించుకుని క్షమాపణ చెప్పుకున్నాయి.


అని కథ సమాప్తం చేసి... "ఇప్పుడు చెప్పండి, సమాజంలో ఏ వృత్తి గొప్పది?" అని అడిగారు టీచర్.


"సమాజంలో అన్ని వృత్తులూ గొప్పవే!" అని రాము, శ్యామ్ ఇద్దరూ ఏకకంఠంతో చెప్పారు.


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.

నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page