టైమ్ వచ్చేదాకా టైమ్ ఇవ్వాలి

Time Vachhedaka Time Ivvali - Telugu Inspirational Article | Kotha Viritha
టైమ్ వచ్చేదాకా టైమ్ ఇవ్వాలి - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 18/10/2026
విత్తనం నాటిన మరుసటి రోజే చెట్టు పెరిగిపోవాలని ఆశించం. కానీ మన జీవితంలో మాత్రం ప్రతి ప్రయత్నానికీ వెంటనే ఫలితం రావాలని కోరుకుంటాం!
డైట్ మొదలుపెడితే రెండు రోజుల్లో మార్పు కావాలి. ఇంటర్వ్యూ ఇస్తే వెంటనే ఉద్యోగం రావాలి. వ్యాపారం ప్రారంభిస్తే మొదటి నెలలోనే లాభాలు రావాలి!
ప్రకృతికి సమయం ఇచ్చే మనం, మన కలలకు మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం?
ఓపిక, ప్రయత్నం, ఎదుగుదల గురించి సరదాగా ఆలోచింపజేసే కొత్త విరిత గారి రచన “టైమ్ వచ్చేదాకా… టైమ్ ఇవ్వాలి!”
విత్తనం వేస్తే… చెట్టు వెంటనే పెరిగిపోదు.
కానీ మన జీవితంలో మాత్రం అన్నీ “ఇప్పుడే” జరిగిపోవాలట!
డైట్ మొదలుపెట్టగానే బరువు తగ్గాలి… లేక పెరగాలి, రెండు రోజుల్లో అద్దంలో మార్పు కనిపించకపోతే డైట్కే దండం పెట్టేస్తాం!
ఇంటర్వ్యూ ఇచ్చామంటే… ఇంటికి చేరకముందే జాబ్ ఆఫర్ మెయిల్ రావాలట!
పరీక్ష రాశామంటే, ఫలితాలు రాకముందే ర్యాంక్ ఊహించేసుకోవాలి!
కొత్త బిజినెస్ మొదలు పెడితే మొదటి నెలలోనే లాభాలు రావాలట!
జిమ్‌కి నాలుగు రోజులు వెళ్తే, సిక్స్ ప్యాక్ ఎందుకు రాలేదని బాధ!
ఒక పుస్తకం చదివితే,
వెంటనే జ్ఞానం అంతా తలలోకి వచ్చేయాలట!
ఒక్కసారి ప్రయత్నిస్తే, విజయం తలుపు తట్టి “సర్, నేనే ఒచ్చేసా” అనాలట! ఒకేఒక మొక్క నాటి, నీడ కోసం దాని కింద కూర్చోవాలంటే ఎలా?
అలాగే ఒక ప్రయత్నం చేసి ఫలితం కోసం తొందరపడితే ఎలా?
మనకు విత్తనం నుంచి చెట్టు వరకు ఓపిక ఉంది,
కానీ మన కలల విషయంలో మాత్రం “ఫాస్ట్ ఫార్వర్డ్” బటన్ కావాలి!
నిన్న మొదలుపెట్టిన అలవాటు ఇవాళే జీవితాన్ని మార్చేయాలని ఆశిస్తాం. నిన్న నేర్చుకున్న నైపుణ్యం ఇవాళే గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటాం.
కానీ ఎదుగుదలకి కూడా తనకంటూ ఒక కాలం, ఒక క్రమం ఉంటుంది.
ప్రకృతికి టైమ్ ఇస్తాం, మన ప్రయత్నాలకు మాత్రం ఇవ్వం.
ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది
ఒక్కటే
"టైమ్ వచ్చేదాకా… టైమ్ ఇవ్వాలి!" మరి
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments