top of page
Original.png

పరోపకారం

#Paropakaram, #పరోపకారం, #గొర్రెపాటిశ్రీను, #GorrepatiSreenu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Paropakaram - New Telugu Story Written By - Gorrepati Sreenu

Published in manatelugukathalu.com on 22/12/2025

పరోపకారంతెలుగు కథ

రచన: గొర్రెపాటి శ్రీను


తేజ కిటికీ లో నుండి బయటకు చూస్తున్నాడు. 

టేబుల్ పై అమ్మ పెట్టిన వేడి వేడి జీడిపప్పుల ఉప్మా నోరు ఊరిస్తుంది. 

పల్లీలతో చేసిన చట్నీ ఎదురుగా ఉంది. 

స్కూల్ టైం అవుతుంది. 


"తేజ !స్కూల్ టైం అవుతుంది. త్వరగా తిను, అక్క అప్పుడే రెడీ అయి షూ వేసుకుంటుంది. ఎప్పుడూ నీవల్లే స్కూల్ బస్ కి ఆలస్యం అవుతుంది. బస్ వాళ్ళు మనల్ని కోపం చేస్తుంటే బాగుండడం లేదు. "


అమ్మ వంటింట్లో నుండి క్యారేజ్ సర్దుతూ అంటున్న మాటలు అతడి చెవిన పడుతున్నాయి. 

కిటికీ లోనుండి కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే అతడికి టిఫిన్ చేయబుద్ధి కావడం లేదు. 


ఏదో ఆలోచన వచ్చిన వాడిలా గబుక్కున అక్కడి నుండి గెంతి.. పెరట్లో చేరాడు. 

నాలుగో తరగతి చదువుతున్న తేజ ఆటపాటల్లో చలాకీ గా ఉంటాడు. 

కానీ ఉదయం స్కూల్ కి మాత్రం వేగంగా రెడీ అవ్వాలంటే కుదరదు. 

లేవగానే మొక్కలకు నీళ్ళు పోయడం, ఏపుగా పెరిగిన మొక్కలు మరింత గా ఎదగాలని పాదులు చేయడం, జామకాయలు కోసుకుని స్కూల్ బ్యాగ్ లో వేసుకుని వెళ్ళి ఫ్రెండ్స్ కి పంచడం.. 


మరీ ముఖ్యంగా తమ పెరట్లోకి వచ్చిన పక్షుల ని తీరికగా చూస్తూ.. 

వాటి ధ్వనులను అనుకరించడం, స్నేహితులని జోక్స్ తో మురిపిస్తూ వాళ్ళ నవ్వులతో శృతి కలపడం ఇష్టం. 


సన్నగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా గూడు దాటి బయటకు వచ్చిందేమో.. ఓ చిన్ని పిచ్చుక పిల్ల ఎగరలేక పోతూ నేలపై ఆపసోపాలు పడుతుంది. 

దాన్ని తన చిన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. 


ఎక్కడి నుండి వచ్చిందో ఓ పిచ్చుక వచ్చి కీచు కీచు మంటూ అరుస్తోంది. 

బహుశా ఆ చిన్నారి పిచ్చుక కి తల్లి అయివుంటుంది.. అనుకున్నాడు. 

చేతుల్లో ఉన్న పిచ్చుక పిల్ల ని వదల బుద్ధి కాలేదు. 


"అమ్మ!"


అంటూ గట్టిగా అరవబోయి.. తన చేతుల్లో ఉన్న పిచ్చుక పిల్ల  భయపడుతుందేమో అనుకుంటూ మెల్లగా పిలిచాడు. 


తనకు కావలసిందేంటో తల్లికి కను సైగలతో చెప్పాడు. 

మెల్లగా తిరుగుతున్న టేబుల్ ఫ్యాన్ ఎదురుగా వేసిన స్టూల్ పై చిన్ని పిచ్చుకను కూర్చోబెట్టాడు. 


ఏ మాత్రం ఒత్తిడి తగలకుండా రెక్కల ని వేళ్ళతో పట్టుకున్నాడు. 

పదినిమిషాల్లో రయ్యిన ఎగురుకుంటూ దూరంగా ఉన్న తల్లి పిచ్చుక తో కలిసి గూడు వైపు ఎగిరిపోయింది చిన్నారి పిచ్చుక. 


"పరోపకారం ఇదం శరీరం" అంటే "ఈ శరీరం పరోపకారం కోసమే" అని అర్థం. 

లోకోక్తి ఏమిటంటే ప్రకృతిలోని వృక్షాలు, నదులు, పశువులు వంటివి ఇతరులకు ఎలా ఉపయోగపడతాయో, అలాగే ఈ శరీరం కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది అని వివరిస్తుంది. 


కేవలం మన తో ఉన్న సాటి మానవులకు సాయం చేయమనేకాదు.. 

మనతో కలిసి జీవించే పశుపక్ష్యాదులకు సైతం చేయగల సాయం చేయడం అవసరం. 

అదే మనమంతా ఆచరించవలసిన  ప్రకృతి ధర్మం!  


అంటూ క్లాస్ లో మేడం చెప్పిన మాటల కి అర్థం ఇప్పుడిప్పుడే అతడికి అర్థమవుతుంది.  


"శ్రీవారు! తేజా కి స్కూల్ టైం అవుతుంది. దివ్య స్కూల్ బస్ కి వెళ్ళింది. 

వీడిని మీరే స్కూల్ దగ్గర దించి వెళ్ళాలి"అంటూ చెబుతూ ఉదయమే పుత్రుడు చేసిన ఘనకార్యాన్ని భార్య వివరిస్తుంటే.. 

మురిపెంగా తేజ తల నిమురుతూ.. 

కొడుకు ని స్కూటీ ఎక్కించుకుని స్కూల్ వైపు కదిలాడు కార్తీక్. 


తను చేసిన చిన్ని సాయానికి తోడుగా నిలిచిన తల్లి కి కళ్ళతోటే కృతజ్ఞతలు చెబుతున్నాడు తేజ.  

***

గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


bottom of page