top of page

పర్యవేక్షకులు


'Paryavekshakulu' New Telugu Story

Written By Nallabati Raghavendra Rao

'పర్యవేక్షకులు' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆ రాజ్యంలో రాజు గారి పేరు మహావీర పరాక్రముడు. చాలా కాలం నుండి రాజ్యం సుభిక్షంగా పరి పాలి స్తున్నాడు. వందలాది ముఖ్య అనుచరుల సహాయ సహకారాలతో అర్థశాస్త్ర అంతరంగికుల ఆర్థిక ఆలోచనలతో అరడజను మంది ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రుల ఆలోచన పటిమతో.. బలవంతులైన కొందరు సైనిక అధిపతుల సహకారంతో శత్రుమూక నుండి ఏమాత్రం భయం లేకుండా కడు ధైర్య సాహసాలతో రాజ్య పరిపాలన కొనసాగిస్తు న్నాడు. అతని పరిపాలన విధానం చూసి చుట్టుపక్కల రాజులు కూడా అసూయ పడుతున్నారు . ప్రతి మాసం అతను నిర్వహించే కొత్త కొత్త పరిపాలన విధానాలను చూసి వాళ్లంతా కుళ్లుకునేలా ఉంది మహావీర పరాక్రముడి రాజ్యపాలన. ఆ రాజ్యంలో ఉన్న మూడువేల మంది ప్రజలు ఆయా రంగాలలో మహానిష్ణాతులే. అలాంటి సుసంపన్నమైన రాజ్యంలో ఒకరోజు ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతను రాజుగారు సభ నిర్వ హిస్తున్నప్పుడు అక్కడకు వెళ్లి చేతులు కట్టుకుని ఇలా విన్నవించాడు.. ''రాజా నా పేరు విలాసకుడు. నా గొప్ప నేను చెప్పు కోకూడదు కానీ నేను ధర్మ నీతి శాస్త్రంలో నిష్ణాతుడు గా మూడు పుష్కర కాలాల అనుభవం కూడా సంపా దించి ఉన్నాను. ఆ అనుభవంతో చాలా రాజ్యాలలో నేను పర్యవేక్షకుడు గా నియమింపబడి ఆయా రాజ్యా లను సుభిక్షం వైపు నడిపించడానికి కృషి చేశాను. అయితే నేను ప్రతి రాజ్యంలో కొంతకాలం మాత్రమే ఉండాలి అనే నియమం పెట్టుకోవడం వల్ల రాజ్యాలు తిరిగి తిరిగి చివరికి మీ రాజ్యం వచ్చాను. కావున నా ప్రతిభను బట్టి నన్ను ఉన్నత మహామేధావి వర్గానికి చెందిన వానిగా భావించి ఏలిన వారు దయ వుంచి నన్ను తమ రాజ్యపు పర్యవేక్షకునిగా నియ మించుకు న్నట్లయితే మీ రాజ్యం అభివృద్ధి చెంది ఉన్నత స్థానం లో ఉండేలా కృషి చేయగలను అని విన్నవించుకుంటు న్నాను'' అంటూ సవినయంగా చేతులు కట్టుకొని తెలియ జేశాడు. రాజుకు అతను చెప్పిన విధానం నచ్చింది. అతనిని మరుసటి దినం రమ్మని పంపించి అత్యవసరంగా ఆ రాజ్యంలో ఉన్న మేధావులతో సమావేశం అయ్యాడు. ''పర్యవేక్షకులు అంటే ఏమిటి వాళ్ళ అవసరం ఏమిటి సవివరంగా వివరించండి .'' అంటూ కోరాడు రాజుగారు. అందులో ముఖ్య ప్రధానమంత్రి విజయకేతుడు ముందుకు వచ్చి రాజుకు ఇలా చెప్పాడు.. '' రాజా! పర్యవేక్షకులు అనగా మా తాతలు చెప్పిన సవివరణ ఇస్తాను వినండి... రాజ్యంలో రాజుగారు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి పరిపాలన సాగిస్తు ఉంటారు. అనేక సంస్కరణల పట్ల తలమునకులై ఉన్నప్పుడు.. ఏదో ఒక వ్యవహారం లో రాజుగారి ఆలోచన కొద్దిగా పక్క దారి పట్టి ఉండవచ్చు. అటు వంటి సమయంలో పర్య వేక్షకుల అవసరం ఉంటుంది. అప్పుడు పర్యవేక్షకులు ఆ విధానాన్ని తమ సున్నిత సునిశత శక్తితో పర్యవేక్షించి పరిశీలించి ఒక విలువైన సమాచారాన్ని తయారుచేసి రాజుగారికి మాత్రమే అందించవలసి ఉంది. ఆ విధంగా రాజుగారికి మాత్ర మే అంతరంగికులుగా పర్యవేక్షకులను భావించవచ్చు. అంతేకానీ వారు.. పరిపాలన అధికారుల మీద కానీ ఇతర ప్రజానీకం మీద కానీ తాము మాత్రమే ఆ రాజ్యా నికి రాజులము అన్నట్టు ఇష్టం వచ్చినట్టు జులుం చలాయించే శక్తి, ప్రజలను దూషించే శక్తి మాత్రం వారికి లేదు.. ఉండదు. ఇది పర్యవేక్షకుల విధివిధాన ము. హక్కులు.. ఆచరణలు. ఆ విధంగా పర్యవేక్షకులు చేసిన ఆ సూచనతో రాజు గారు ..తమ పరిపాలనలో చట్టవిధానం తప్పుదైతే దానిని తొలగించుతారు. లేదా సవరణ చేసుకుంటారు. ఇందుకు పర్యవేక్షకుల అవసరం తప్పకుండా ఉంది. పైగా అతను నిజాయితీగా ధనాపేక్ష లేకుండా వ్యవ హరిస్తూ కొద్ది కాలం మాత్రమే ఇక్కడ ఉంటాను అనడం వల్ల నమ్మవచ్చు. అతనిని పర్యవేక్షకునిగా నియమించి కొంతకాలం చూడవచ్చు.'' అంటూ సవినయంగా విన్నవించుకున్నాడు. రాజ్యంలో ముఖ్య ప్రధానమంత్రి అయిన విజయ కేతుడు అలా రాజుగారికి విన్నవించడంతో రాజుగారు ఆనందించి మరునాడు నుండి విలాసకుడుని ఆ రాజ్యంలో పర్యవేక్షకుడిగా నియమింపచేశారు. విలాసకుడికి శిల్ప శాస్త్రంలో కూడా అనుభవం ఉండ డంతో రాజ్యంలో కడుతున్న దేవాలయపు పనిలో పర్యవేక్షకునిగా దేవాలయ ప్రాంతానికి ప్రవేశించాడు. ఆరోజు ఏమి జరిగింది అంటే.. రాజుగారికి నచ్చి ఆయన ఇష్టపడి వేసిన ఒక చిత్రాన్ని శిల్పంగా చెక్క డానికి కొందరు శిల్పులు ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అయిపోయింది. ఆ పరిస్థితుల్లో అక్కడకు విలాసకుడు ప్రవేశించాడు. ''మీరు చెక్కిన శిల్పం తప్పుల తడకగా ఉంది. నాకు శిల్ప కళలో ప్రావీణ్యం ఉంది ఇటువంటి శిల్పం వల్ల రాజ్యంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా వ్యతిరేక భావం పెరగవచ్చు. మీరు అజ్ఞానంతో.. అవి వేకంతో..విదూషకులు వలె ప్రవర్తిస్తూ అవహేళన చేస్తున్నట్టుగా పూర్తి చేసిన ఈ శిల్పం... నాకు నచ్చ లేదు. దీనిని చూస్తుంటే నాకు గుండెలో చాలా బాధగా ఉంది'' అంటూ చెప్పాడు. అప్పుడు అక్కడ శిల్పం చెక్కి పూర్తి చేసిన వారిలో ప్రధాన శిల్పి అయిన జక్కన్న ఇలా అన్నాడు. ''అయ్యా..పర్యవేక్షకుల వారు మీకు నమస్కారం. ఏ రాజ్యంలో ఆయన రాజే కదా ముఖ్యుడు. ఆయన నిర్ణయం శిరోధార్యం. రాజుగారు నేను వేసిన చిత్రాన్ని పరిశీలించి పరిశోధించి ఏ మాత్రం లోటుపాట్లు లేవు అని దానిని శిల్పంగా చెక్కడానికి నాకు అనుమతి ఇచ్చారు. నేను దానిని వారు చెప్పిన విధానంలో పూర్తి చేశాను. ఇది రాజు గారికి నాకు మాత్రమే సంబంధించిన వ్యవ హారము. సరే రాజ్యంలో మీరు పర్యవేక్షకులు కనుక మిమ్ములను గౌరవించవలసిన బాధ్యత మాకు ఉంది. రాజుగారు ఒప్పుకొని, ఇష్టపడి, నచ్చి చేస్తున్న పనిని మీరు తప్పు అనడం ధర్మమేనా. ఎన్నో సమస్యలలో సతమతమయ్యే రాజుగారు నాకు సరైన నిర్ణయం ఇచ్చి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పర్యవేక్షకునుగా మీ బాధ్యత ఉంటుంది కాదనను. మీరు ఇక్కడ శిల్పము పూర్తి విరుద్ధముగా ఉన్నట్లు అనిపించినట్లయితే మా రాజుగారు పూర్తి చేయమని సలహాలు ఇచ్చిన ఈ శిల్పంలో తేడాపాడాలు ఉన్న ట్లయితే ఆ తేడా పాడాలతో ఒక నివేదికను తయారు చేసి రాజుగారికి ఉదాహరణలతో సహా వినిపించి తద్వారా జరుగు నష్టాన్ని రాజుగారికి అర్థమయ్యేటట్లు వారికి తెలియజేసి వారి ద్వారా నా పనిని ఆపించాలి. అప్పుడు వారే శిల్పాన్ని తొలగించవచ్చు. లేదా వారు తొలగించమని చెబితే నేనే తొలగిస్తాను. అంతేకానీ మీరు వచ్చి మీరే పరిపాలనాధికారిగా నన్ను నానా దుర్భాషలాడి రాజుగారి నిర్ణయానికి నాకు కూడా విలు వ లేకుండా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల రాజ్యంలో మాలాంటి శిల్పులే కాదు ఏ ఒక్క నిష్ణాతులు ఉండడానికి సాహసించలేరు. భయపడి పారిపోతారు. మీరు కూడా శిల్పాలు చెక్కడం లో ప్రావీణ్యం ఉన్న మహా శిల్పులు అని విన్నాం. మీరు సాటి శిల్పిని ఇన్ని దుర్భాషలు ఆడవచ్చా. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు శిల్పి కి శిల్పి కూడా శత్రువేనా. ఇప్పుడు నేను చెక్కిన శిల్పము వందలాది సంవత్స రాల క్రితమే ఆయా శిల్ఫులు చెక్కిన శిల్పాలకి ప్రతీక మాత్రమే. కొత్తగా నేనేమీ సృష్టించలేదు. ఇప్పుడు మీరు నన్ను మాత్రమే కాదు గత కాలంలో ఇదే విధమైన శిల్పాలు చెక్కిన మహామహులు అయిన శిల్పుల అందరినీ తిట్టినట్టే కదా. మీరు ఈ శిల్పాన్ని చూసి బాధపడి నానాధూర్భాషల మాటలు ఆడితే గత 100 సంవత్సరాలలో ఇటువంటి శిల్పాలు చెక్కిన శిల్పులు అందరు పేర్లు ఎత్తి వాళ్లం దర్నీ కూడా తిట్టాలి. కానీ నా ఒక్కడిని మాత్రమే మీరు కసిగా తిట్టారు అంటే ఇది నాపై కక్ష సాధింపు చర్య గా కనిపిస్తున్నది. గొప్ప పర్య వేక్షకునిగా గొప్ప శిల్పిగా అతి తెలివైన వారిగా మీ ఒక్కరు మాత్రమే ఈ రాజ్యంలో ఉండాలి ఇక ఎవరూ ఈ రాజ్యంలో ఉండకూడదు అన్నట్లు మీ ఆలోచన మాకు తెలుస్తున్నది. మీరు సూచనలు చేయవచ్చు సలహాలు చేయవచ్చు అవి కూడా సున్నితంగా సద్విమర్శగా ఎదుటివారి మనసుకు బాధ కలగని విధంగా ఎలా చేసినా పర్వా లేదు. కానీ ఇంకొక శిల్పి ఇక్కడ ఉండడం ఏమిటి అన్న అక్కసు, చూడలేని తనం లాంటివి ప్రదర్శించే విధంగా ఇలా మాట్లాడటం భావ్యం కాదేమో. ఈ రాజ్యపు పర్య వేక్షకులు కనుక మీరు నన్ను ఎన్ని ఘాటు దుర్భాషలు ఆడిన నేను ఇంతవరకు ఒక్క దుర్భాష మిమ్ములను ఆడ లేదు. ఎందుకంటే ఈ రాజ్యం అంటే మాకు గౌరవం ఈ రాజ్యపు రాజు గారు అంటే మాకు ఎనలేని మహా గౌరవం..' అంటూ తను చేస్తున్న పనిలో మునిగిపోయాడు శిల్పి జక్కన్న. వేగుల ద్వారా ఈ విషయం మొత్తం రాజు గారికి చేరింది. వెంటనే ప్రధాన మంత్రి విజయకేతుని ద్వారా మహాసభ ఏర్పాటు చేయబడింది. ఆ సభలో ఒకపక్క ప్రధాన శిల్పి జక్కన్న.. మరోపక్క నియమింపబడిన పర్యవేక్షకులు విలాసకుడు నిలబ డ్డారు మౌనంగా చేతులు కట్టుకొని. దేవాలయ ప్రాంతంలో జరిగిన మొత్తము విషయము తన అనుచరుల ద్వారా తెలుసుకున్న మహారాజు అక్కడ నిలబడ్డ పర్యవేక్షకుడు విలాసకుడిని ఉద్దే శించి..ఇలా అన్నాడు. ''పర్యవేక్షకునిగా ఎన్నిక కాబడిన విలాసకుడు వారిని గౌరవిస్తున్నాం. ఎందుకంటే అది మా రాజ్యపు సంప్ర దాయం కనుక. పోతే ఈరోజు దేవాలయం దగ్గర జరి గిన సంభాషణలో పర్యవేక్షకులవారు కొంచెం అతిగా వ్యవహరించిన తీరు మాకు బాధ కలిగించింది. ''పర్యవేక్షకులు అంటే రాజ్యంలో చిన్నచితక ఉద్యో గులపై సాధారణ ప్రజానీకం పై జులుం చూపించమని కాదు. రాజ్యంలో జరిగే నష్టాలను పరిశీలించి పర్య వేక్షించి తగు నివేదికను తయారుచేసి రాజుగారికి అందించి తద్వారా పరిపాలన ఉన్నత శిఖరాల వైపు పయనం చేయుటకు కృషి చేయవలసిన బాధ్యత కలిగిన వ్యక్తి. ఆ విషయం ఏ మాత్రం గ్రహించకుండా పర్యవేక్షకుడు అంటే తనే రాజు అయినట్లు ఈరోజు దేవాలయం దగ్గర తన తోటి శిల్పితో వ్యవహరించిన మాట విధానము తీరు అత్యంత బాధాకరము. పైగా అక్కడి శిల్పము రాజుగా నాకు నచ్చి నా అను మతితో ఆ శిల్పి చెక్కినది. నేను అనుమతి ఇచ్చిన తర్వాత ఏ విధంగా పర్యవేక్షకులవారు దానిపై స్పంది స్తారు. ఏమైనా ఉంటే నాతో కదా సంప్రదించాలి. శిల్పిది దోషము అయితే అతనిని రాజ్యం నుండి బహిష్కరిస్తాం. ఆ హక్కు కూడా మాకు మాత్రమే ఉంటుంది. ఆ విషయం మాకు సూచించవలసిన బాధ్యత మాత్ర మే పర్యవేక్షకులపై ఉంటుంది. పర్యవేక్షకుల వారు కేవలము ఒక గౌరవ ఉద్యోగి మాత్రమే. ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుని రాజ్య పరిపాలన తమ చేతిలోకి తీసుకునే హక్కు పర్యవేక్షకులకు ఉండదు అది కేవలం రాజుగారికి మాత్రమే ఉంటుంది. రాజ్యంలో ప్రవేశించిన అనతి కాలంలోనే రాజ్యం లో సాటి ప్రజానీకం పట్ల ప్రవర్తించకూడని విధానంగా ప్రవర్తించడం వల్ల పర్యవేక్షకులను ఈ రాజ్యము నుండి గౌరవంగా పంపించి వేయడం తప్ప మేము ఏమీ చేయ లేము. ఇప్పుడు సైతం మా అధికార బలంతో మాట్లాడి తగు చర్యలు తీసుకునే హక్కు మాకు ఉంది. కానీ ఎవరినైనా గౌరవించాలి అన్న విషయం మాకు తెలుసు కనుక మేము ఆ పని చేయలేకపోతు న్నాము '' అంటూ రాజుగారు మహావీర పరాక్రముడు తన మందిరంలోకి చరచరా వెళ్ళిపోయారు. మంత్రులు ప్రధాన మంత్రులు సామంతులు కూడా నిష్క్రమించారు. ''ఏ రాజ్యంలో అయినా ఏ అధికారి అయినా తన హోదా తెలుసుకొని తన హద్దులు తెలుసుకొని అంతవరకు మాత్రమే ప్రవర్తించాలి. అప్పుడే రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి. అంతేకానీ హోదా దక్కింది కదా అని హద్దు మరచిపోయి ప్రవర్తిస్తే.. ఇలాగే రాజుగారు అప్రతిష్టపాలు అవుతారు. అంతేకాదు అటువంటి రాజ్యంలో ఉండడానికి నిష్ణాతులైన ఉద్యోగులు. ప్రజానీకం కూడా భయపడి పారిపోతారు.'' ''పర్యవేక్షకులు అంటే రాజ్యాన్ని రాజ్యంలో ఉన్న రాజు గారిని ఏలేసే హక్కు ఉండదు. రాజ్య పరిపాలనలో లోసుగులను గ్రహించి, గుర్తించి ఒక నివేదికను తయారుచేసి రాజుగారికి ఇవ్వడం వరకు మాత్రమే పర్యవేక్షకుల బాధ్యత.'' ''నిజమే ఇది రాజ్యం వరకు మాత్రమే కాదు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి తమ బాధ్యత, హక్కులు గుర్తించి ప్రవర్తిస్తే.. ప్రతి ఇల్లు స్వర్గధామం అవుతుంది. అంతే కానీ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో లేని హక్కులను తెచ్చుకునే ప్రవర్తిస్తే కుటుంబం కూడా అల్లరి పాలు అవుతుంది.'' అనుకుంటూ సభకు వచ్చిన ప్రజలందరూ గుసగుస లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ***

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు

54 views0 comments

コメント


bottom of page