top of page

పిచ్చి ముదరహా!

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


 'Pichhi Mudaraha' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 14/02/2024

'పిచ్చి ముదరహా' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంతశివరామ్ వాళ్ల అబ్బాయికి పెళ్లి చూపులు. పిల్ల స్నేహ ఇంటికి వెళ్లారు పెళ్ళిచూపులకి. శివరామ్ "నీ పేరేమిటమ్మా!"అనగానే, సోఫాలో కూర్చున్న పిల్ల లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ! ఒక నిట్టూర్పు విడిచి "స్నేహ!" అంది. 


"అది ఇక్కడే సోఫాలో కూర్చుని చెప్పోచ్చుగా!" అన్నాడు శివరాం.


"ఎఫెక్ట్ కోసం కిటికీ దగ్గరకు వెళ్ళాను" అంది స్నేహ. 


"టీవి సీరియల్స్ ఎక్కువగా చూస్తావా తల్లీ!” అన్న శివరామ్ మాటలకు నవ్వుతూ అవునని తలవూపింది స్నేహ. శివరామ్, కొడుకు వైపు చూస్తూ "నీ బతుకు ఇక కిటికీ దగ్గరే" అన్నాడు చెవిలో. 


"నీ హాబీస్ ఏంటమ్మా!" అంటే, మళ్ళీ వేరే కిటికీ వైపు వెళ్ళి, కనుగుడ్లు సాగదీసి "వాచింగ్ టివి, నెట్ సర్ఫింగ్, షాపింగ్. " మిగతా సమయాల్లో ఏమిచేస్తావంటే "యూట్యూబ్ చూసి వంటలు చేస్తాను" అంది. 


"అవి తినబులా, పారేయబులా!" అన్న శివరామ్ మాటలకు స్నేహ, నాన్న అచ్యుతరావు "బావగారు భలే కామెడీగా మాట్లాడతారు, తినబుల్ గానే చేస్తుంది" అన్నాడు


మొత్తం సీరియల్ బ్యాచ్ లాగా ఉన్నారు! అనుకుని. 

ఇక లాభం లేదనీ శివరామ్, నేరాలు ఘోరాలు, చదువుతున్న, నూతన్ ప్రసాద్ లాగా, "నేను ఏదైనా మొహం మీద చెప్పే అలవాటు నాది. మాకు ఈ సంబంధం నచ్చలేదని చెప్పటానికి ఏ మాత్రం భయపడకుండా, నా పీక నొక్కుకుని మరీ! వక్కాణిస్తున్నాను, సెలవు ఉంటాం. "


 దారిలో కొడుకు సురేషు, "డాడీ నాకు ఆ అమ్మాయి, నచ్చింది. అంత తొందరపడి కోర్టులో తీర్పు చెప్పినట్లు మాకు నచ్చలేదని చెప్పకపోతే ఏం!" అన్నాడు. 


దానికి శివరామ్, "మీ అమ్మ సీరియల్ పిచ్చికే తట్టుకోలేక చస్తుంటే ఇపుడు వచ్చే ఆ పిల్లకి ఈ పిచ్చి ఉంటే నీ మొహాన కూడు వేస్తుందనీ నాకు నమ్మకం లేదురా. "


 "కోర్టులో జడ్జి కాదు కానీ, పతిదానికి, ఈయనతో చస్తున్నాము. మొన్నా అంతే ఒకమ్మాయిని, నీ డ్రెస్ బాగాలేదు, ఈ డ్రెస్సులు ఇలా ఉంటే మగపిల్లలు గోల చేయక ఏమి చేస్తారని, ఆ పిల్లకు క్లాస్ తీసారు. నేను అప్పటికి వూరుకుంటారనీ, చెవిలో ఆడరు, ఆడరు, అన్నా, అప్పటికి ఆగారు. పెళ్లికి వెళుతూ! పిల్లిని చంక బెట్టుకుని వెళ్తున్నట్లుగా ఉందిరా! ఆయనను తీసుకువెళితే, ఆయన వద్దురా! అంటే, ఆయన బాగా తీర్పు చెప్తాడని, డాడీ రావాలంటావు. ఈసారి నన్ను పిలవకుండా మీరిద్దరూ! వెళ్ళండి. నేను రా”నంది నాంచారి. 


 "అదంతా! నాకు వదిలిపెట్టు నేను చూసుకుంటా! నేను స్నేహతో మాట్లాడుతాననీ, వాళ్లకు చెప్పం”డన్నాడు సురేష్. 


 శివరాం అచ్యుతరావుకు "మా అబ్బాయి, మీ అమ్మాయి తో మాట్లాడుతాడుట, ఒకసారి వీడియో కాల్ ఏర్పాటు చేయమనీ!" మెసేజ్ చేసాడు. ఆనందపడి, సరేనన్నాడు అచ్యుతరావు. 


 అచ్యుతరావు భార్యతో "ఒసేయ్, జడ్జి గారి అబ్బాయి మన స్నేహతో మాట్లాడుతాడుటా. !"


 "మాకు నచ్చలేదని ఖరాఖండిగా చెప్పాడు ఇపుడు మళ్ళీ ఏమైందిటా!" అంది సుబ్బాయమ్మ. 


 "వాళ్ల అబ్బాయికు నచ్చిన్నట్లుంది. స్నేహా! నువ్వు ఈ సారి చాలా చక్కగా మాట్లాడు. జడ్జిగారి సంబంధం, కుదరం మాటలా!" అన్నాడు అచ్యుతరావు. 


"పెళ్ళికొడుకుకు నచ్చితే, చాలు, ఆయన మనకు ముఖ్యం కాదు. అయినా! ఆ అబ్బాయి వీళ్ల దగ్గర ఉండడు కాబట్టి బాధ లేదు" అంది సుబ్బాయమ్మ. 


 "సరే నువ్వు ఈవెనింగ్ బాగా రెడీ అయ్యి, ఆ వీడియో కాల్లో, లేచి మళ్ళీ కిటికీ దగ్గరకు వెళ్ళకుండా, కిటికీ దగ్గరే కుర్చీ వేస్తాను ఆ అబ్బాయితో నింపాదిగా మాట్లాడు, మంచి సంబంధం, వదులుకోవద్దు" అన్నాడు, అచ్యుతరావు. 


 సరేనని తల వూపింది స్నేహ. సురేషుతో చాలా చక్కగా మాట్లాడింది. మధ్యలో సీరియల్స్ ఇష్టమా! నవ్వుతూ అన్న సురేషుతో, "పెద్దగా లేదు, ఏవో ఒకటి రెండు సీరియల్స్ నా చిన్నప్పటి వస్తుంటే, చూస్తా, అంతే కానీ పిచ్చి లేదు" అంది స్నేహ. 


 సురేష్, స్నేహాల పెళ్లి బాగా జరిగింది. స్నేహ అత్తవారింటికి వచ్చింది. సాయంత్రం, అత్తాకోడళ్ళు కలిసి సీరియల్స్ చూస్తూ కూచున్నారు. బయట నుండి వచ్చిన శివ రామ్ భార్యతో కాఫీ ఇవ్వు అన్నాడు. , "నన్ను అడిగితే కొడతా!" అంది నాంచారీ. 


 "ఒసేయ్, కాఫీ అడిగితే, కొడతానంటావే!" కోపంగా అన్న శివరామ్ తో "మామయ్యగారు అది సీరియల్ పేరు" అంది స్నేహ. "సీరియల్ పేరా! ఇవ్వకపోతే, చంపుతా!, అనే సీరియల్ ఏమి లేదా!" అన్నాడు శివరాం. 


 నవ్వుతూ! "ఇంకా ఎవరూ ఆ సీరియల్ తీయలే”దనీ కాఫీ ఇచ్చింది శివరాంకు స్నేహ. తర్వాత, పైకి వెళ్లి తమ రూంలో ఉన్న టివిలో సీరియల్ చూస్తూ కూర్చుంది. బయటనుండి, వచ్చిన, సురేష్ పైకి వెళితే, స్నేహ సీరియల్ చూస్తూ ఉంది. 


"ఏంటీ బేబీ పెద్దగా అలవాటు లేదన్నావు, చూస్తున్నావుగా, సీరియల్" అన్నాడు సురేష్ ప్రేమగా.


"జస్ట్, ఆరునుండి, తొమ్మిది వరకు వచ్చే సీరియల్స్ చూస్తాను, మూడు గంటలేగా చూసే”దనీ ముద్దుగా అనేసరికి, "సరే చూడనీ!" తను లాప్టాప్ పెట్టుకుని ఆఫీసు వర్క్ చూసుకున్నాడు. 


 స్నేహ, సురేష్ లు కొత్తకాపురం, హైదరాబాద్ లో పెట్టారు. స్నేహ, సీరియల్స్ చూడటం మానలేదు. సురేష్ సర్దుకుని, ఆ టైంలో తన పని చూసుకుంటున్నాడు. పండక్కి, ఇంటికి వచ్చారు, కొత్త దంపతులు. పండగరోజు, కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్, ఉంటే అత్తా కోడళ్ళు, కూర్చుని చూస్తున్నారు. మాటల్లో"ఇంకా మీరు చూసే సీరియల్ కన్నా, నేను చూసే సీరియల్ బావుంటాయి" అంది స్నేహ. నా సీరియల్స్ ను అంత మాట అంటావా! కోపం వచ్చింది నాంచారీకి. ఇద్దరూ కోపంతో వంట చేయకుండా కూచున్నారు. సురేష్ బయట హోటల్ నుండి, ఆర్డర్ పెట్టీ మీల్సు తెప్పించాడు. 


 "నేను చెపితే, విన్నావా! ఆ పిల్లకు సీరియల్ పిచ్చి వద్దురా అంటే, ఏడువు!" అన్నాడు, కోపంగా శివరామ్. "అందరికీ తీర్పులివ్వటం కాదు సీరియల్స్ తీయకుండా చట్టం తీసుకురా నాన్నా! మనలాంటి వాళ్ళను కాపాడినవాడివి అవుతావు. "

 

 "అవునురా నేనెప్పుడో! ఈ చట్టం చేయటానికి ప్రయత్నం చేస్తుంటే, మహిళా సంఘాలు గోల చేస్తున్నాయి. మేము పనంతా చేసి, కాసేపు సీరియల్ చూస్తే, ఏమౌతుంది అనే వాదనను లేవదీసారు. వాళ్ళు పనంతా చేసుకుని సీరియల్స్ చూస్తున్నారు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళేరా! దారుణంగా ఉన్నారు. ఈ సీరియల్స్ పిచ్చిలో ఇంట్లో పనులు చేయటం లేదురా. !


 మరి సీరియల్లో వాళ్ళను ఇమిటేట్, చేసి మాట్లాడటం, మీ అమ్మ అయితే ఫుల్ మేకప్ వేసుకుని సొమ్ములేసుకుని, సీరియల్ చూస్తున్నది." 


"స్నేహా అంతే నాన్నా! ఒక వడ్రాణం చేయిస్తే, ఆ సీరియల్లో హీరోయిన్ పెట్టుకుంటుందిటా, తను పెట్టుకుని ఆ సీరియల్ చూడాలంటుంది. దాని కోసం లోన్ పెట్టానని!" ఏడుస్తూ, అన్నాడు సురేష్. 


 సీరియల్స్ ఆపి వేసే ప్రసక్తి లేదు కాబట్టి, శివరాం, సురేష్ కూడా తగాదాలవ్వకుండా! భార్యల పక్కన కూర్చుని సీరియల్స్ చూడటం అలవాటు చేసుకున్నారు. ఇపుడు సురేష్, శివరామ్ ల ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్ళు, నిమిషానికో మాట, నిట్టూర్పులు విడవటం, గుడ్లు మిటకరించటం కిటికీల దగ్గరకు వెళ్ళి, బయట శూన్యం లోకి చూసి మాట్లాడటం, నేర్చుకున్నారు. వాళ్ల మొహాల్లో భావాలు చూస్తే, ఆరు నారాయణమూర్తి కూడా సిగ్గు పడ్తాడు. వీళ్ళలాగా, నేను చేయలేకపోయానని. వీళ్ళను తమకు తగ్గట్లుగా మార్చుకున్నందుకు, అత్తా, కోడళ్ళు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 


 భర్తలూ! భార్యలు చూసే సీరియల్స్ మాత్రమే చూడాలి. మధ్యలో చానల్స్ మార్చకూడదు. అందరూ పండగల్లో కలుసుకున్నప్పుడు, ఎవరి సీరియల్స్ ను వారు గౌరవించు కోవాలి. ఎదుటి వాళ్ళ సీరియల్స్ ను అగౌరపర్చకూడదనే నియమం పెట్టుకున్నారు. ఇంట్లో గొడవలు జరగకుండా. 


 రిటైర్ అయ్యి ఖాళీగా ఉండటం వల్లఇపుడు అందరిలో ఎక్కువగా, సీరియల్స్ చూస్తుంది, శివరామ్. ఫ్రెండ్స్ దగ్గర ఆరిపోయిన దీపం సీరియల్ గురించి, మాట్లాడుతున్నాడు. ఈమధ్య మరీ ఎక్కువగా తలకాయ తిప్పుతుంటే శివరామ్ ఫ్రెండ్స్ "అంతలా తల తిప్పుతున్నావు పీయస్సీడి సోకిందా! అని అడిగితే లేదనీ! నిట్టూర్చాడు శివరామ్. 


 ఫ్రెండ్స్, నాంచారికి శివరాంను డాక్టర్ కు చూపించమని సలహా ఇచ్చారు. పీఎస్సీడి వల్ల ఐ డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్, పేషంట్స్ ఎక్కువ రావటం వల్ల సంబరాలు జరుపుకుంటున్నారు. వీళ్ళతో పాటు కొత్తగా సైకాలజిస్టులు కూడా, బాగుపడ్డారు. 


 అయ్యో! నా మతి మండా! చూడకపోతే, చస్తావు కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది, చూడాలి తర్వాత, ఈయన సంగతి చూడాలనుకుంటూ! టివి ఆన్ చేసేసరికి, పక్కన ఓవర్ ఎక్స్ప్రెషన్స్ తో శివరామ్ కొత్త సీరియల్ పెట్టన్నట్లు చూడగానే, ఇంతగా సహకరిస్తున్న భర్తను ప్రేమగా చూసింది నాంచారి. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.82 views2 comments

2件のコメント@venkataswamynaidusadanala7540

• 5 hours ago

కథ, పఠనం రెండూ బాగున్నాయి. శుభకామనలు

いいね!


@user-ud1vg2qu7b

• 5 hours ago

బావుందక్కా.

いいね!
bottom of page