ప్రేమకు అంతం లేదు…
- Srinivasu Bommu
- Jun 10
- 5 min read
Telugu love story, village love story, first love experience, romantic Telugu story, youth love story, Telugu relationship story, engineering student love story, rural romance, Telugu fiction, emotional romance, balcony love story, pure love story, village romance Telugu
Premaku antham Ledu - Telugu Love Story | B. Srinivasu
ప్రేమకు అంతం లేదు… - తెలుగు ప్రేమ కథ | B. శ్రీనివాసు
Published in manatelugukathalu.com on 10/06/2026
ప్రేమ అనేది ఎప్పుడూ పెద్ద మాటలతోనే మొదలవదు. కొన్ని సార్లు ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక ఎదురుచూపే ప్రేమకు పునాది అవుతాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న శివకు, తన స్వగ్రామంలో ఎదురింటి అమ్మాయి శైలజ రూపంలో ప్రేమ అనుకోకుండా ఎదురవుతుంది. మాటలు లేకుండా, కేవలం చూపులతో సాగిన ఆ మధుర అనుబంధం ఎలా ప్రేమగా మారిందో హృద్యంగా చెప్పే కథే ‘ప్రేమకు అంతం లేదు’.
మే 23, 2002 — రాత్రి 11:30
రేపు నాకు పరీక్ష ఉంది. ఇది నా సెమిస్టర్‌లో చివరి పరీక్ష మాత్రమే కాదు, నా ఇంజినీరింగ్ కోర్సుకి ఫైనల్ ఎగ్జామ్ కూడా. అంటే రేపటితో నా స్టూడెంట్ లైఫ్‌కు ముగింపు. అందుకే నేను పూర్తిగా ఎక్సైటెడ్‌గా ఉన్నాను—కొంచెం నర్వస్, కొంచెం హ్యాపీ. నిజం చెప్పాలంటే, “రేపు ఎగ్జామ్ ఉంది” అన్న టెన్షన్ కంటే “రేపటితో నేను ఫ్రీ బర్డ్ అవుతాను” అన్న ఆలోచనే ఎక్కువగా ఉంది. నిద్ర కూడా రావట్లేదు. ఈ రాత్రి నాకు నిద్ర రాదనిపిస్తోంది… ఎందుకంటే మనం చాలా హ్యాపీగా లేదా సాడ్‌గా ఉన్నప్పుడు సాధారణంగా నిద్ర రాదు కదా…
తర్వాతి రోజు
ఎగ్జామ్ అయిపోయింది. పర్లేదు, బానే రాశాను—డెఫినిట్‌గా పాస్ అవుతాను. సో, గేమ్ ఓవర్. బుక్స్‌కి, కాలేజీకి ఒక పెద్ద దణ్ణం పెట్టి, రూమ్‌కి వచ్చి బ్యాగ్, లగేజ్ సర్దుకుని, లంచ్ చేసి స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాను. స్టేషన్ ఎప్పటిలాగే జనాలతో ఫుల్ క్రౌడెడ్‌గా ఉంది. నేను నా బోగీలోకి వెళ్లి నా సీట్‌లో కూర్చున్నాను.
నా పేరు శివ. నేను బెంగుళూరులోని ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాను. ఈరోజుతో అది అయిపోయింది. మాది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. మేము ఒక చిన్న అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న ఫార్మర్—మాకు గ్రామంలో 20 ఎకరాల భూమి ఉంది. అమ్మ హౌస్‌వైఫ్. అక్కకి ఇటీవలే మ్యారేజ్ అయింది, అదే గ్రామంలో ఉంటుంది. అంటే మా ఫ్యామిలీ అంతా మా గ్రామంలోనే ఉంటుంది.
I’m going to my village… కాదు, I’m going back to my family.
తర్వాతి రోజు ఉదయం
మా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక టౌన్‌కి ట్రైన్ వచ్చింది. నేను ట్రైన్ దిగిపోయి ఒక ఆటో తీసుకుని మా గ్రామం వైపు స్టార్ట్ అయ్యాను. చివరికి ఇంటికి చేరుకున్నాను. అమ్మ, నాన్న, అక్క—ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ. ఫుల్‌గా ఫుడ్, ముచ్చట్లు… తెలియకుండానే రెండు రోజులు అయిపోయాయి.
ఒక రోజు నాన్న వచ్చి, “నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్‌లో ఏం చేస్తావు?” అని అడిగారు. నేను, “ఇక్కడే మన ఊరిలో ఉండి, మీకు హెల్ప్ చేస్తూ ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతాను” అన్నాను. నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఒకటే చెప్పారు—“నీకేం చేయాలనిపిస్తే అదే చేయి.”
ఒక రోజు ఉదయం… కాదు, చాలా ఎర్లీ మార్నింగ్—6:00
మా ఇంటి పైకప్పుపై నేను చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను. అప్పుడే నేను చూసాను— శైలజ(శైలూ) . మా ఇంటికి ఎదురు వైపు వాళ్ల ఇల్లు—చిన్న పెంకు ఇల్లు. వాళ్ల నాన్న కూడా ఫార్మర్ కానీ వాళ్లకు భూమి లేదు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న దగ్గర వర్క్ చేస్తాడు.
తనని చిన్నప్పుడు చాలా సార్లు చూశాను, కానీ రీసెంట్‌గా చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తే… ఎందుకో చాలా అందంగా కనిపించింది. నేను మా కాలేజీలో చాలా మంది అమ్మాయిలను చూశాను. చాలామంది నన్ను కూడా చూసేవారు. కానీ శైలూ మాత్రం నాకు బాగా నచ్చింది.
“నన్ను ఇష్టపడని అమ్మాయి ఉండదు” అన్న కాన్ఫిడెన్స్ నాకు బాగా ఉంది. అందుకే నేను డిసైడ్ అయ్యాను—శైలూని ఎలా గానో పడేయాలి.
శైలూ అంత పెద్ద అందగత్తె ఏమీకాదు. అవరేజ్‌గా ఉంటుంది. స్కిన్ టోన్ ప్యూర్ వైట్ కాదు—లైట్ వైట్. లాంగ్ హెయిర్, స్లిమ్‌గా ఉంటుంది. అందుకే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది—తనకి నేను డెఫినిట్‌గా నచ్చుతాను.
అప్పుడు నుంచి నేను ఆమెని చూడడం స్టార్ట్ చేశాను—డైలీ మా బాల్కనీ నుంచి. రోజుకు 4–5 సార్లు, లేదా ఛాన్స్ దొరికినప్పుడల్లా, ప్రతి సారి బాల్కనీకి వచ్చి ఆమెకి సైట్ కొడుతూనే ఉండేవాడిని. ఇలా కొన్ని రోజులు గడిచాయి… కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు.
ఒక రోజు—దాదాపు 20 రోజుల తర్వాత—నేను ఆమెని చూస్తూ ఉండగా, ఆమె ఫ్రెండ్ వచ్చింది. నేను అలాగే చూస్తూ ఉండడం ఆమె ఫ్రెండ్ గమనించి, శైలూకి చెప్పింది. అప్పుడు శైలూ “నాకు తెలుసులే” అన్నట్టు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ఇద్దరూ నవ్వుకున్నారు.
అది నేను శైలూ నవ్వడం చూసిన మొదటి సారి. ఎందుకో ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించింది.
ఆ రోజు నుంచి శైలూ కూడా కొంచెం కొంచెంగా నన్ను చూడడం స్టార్ట్ చేసింది. అవును… అవును… తనలో కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. I can smell that. ఇలా నేను ఆమెని చూడడం, ఆమె లైట్‌గా నన్ను చూడడం—అలా కొన్ని రోజులు గడిచాయి.
ఒక రోజు—మా మేన కోడలు ఉయ్యాల ఫంక్షన్
ఆ ఫంక్షన్‌కి అందరూ వస్తారు. శైలూ కూడా వస్తుందని నాకు తెలుసు. అందుకే నేను బాగా డ్రెస్ అప్ అయ్యాను—వైట్ షర్ట్, బ్లూ జీన్స్… క్లాసిక్ కాంబో.
ఫంక్షన్ స్టార్ట్ అయింది. కానీ శైలూ కనిపించలేదు. నేను సాధారణంగా ఫంక్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యాను. అప్పుడు సడన్‌గా నా హార్ట్ బీట్ పెరిగింది. నా వెనకాల నుంచి శైలూ ఫ్రెండ్ “శైలూ… శైలూ…” అని గట్టిగా పిలుస్తోంది. అసలు శైలూ తన పక్కనే ఉంది. అలా ఎందుకు పిలుస్తోంది అంటే—ఇండైరెక్ట్‌గా నన్ను ఆటపట్టించడానికి. అది నాకు అర్థమైంది. కానీ ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది.
అప్పుడే నేను వెనక్కి తిరిగాను… సడన్‌గా శైలూని చూసాను. OMG! తనని అంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైమ్.
తనూ నన్ను చూసింది. వెంటనే మూతి బిగించుకుని, అప్పటివరకు ఉన్న నవ్వును కంట్రోల్ చేసుకుంటూ, తన చూపును నా నుండి తిప్పుకుంది.
“అబ్బా… దీనికి చాలా ఎక్స్‌ట్రాలు ఉన్నాయ్!” అనుకున్నాను.
“తనకే అన్ని ఉంటాయా? మనకి ఏమైనా తక్కువా?” అనుకుని, నేను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను.
ఆ రోజు మొత్తం నేను ఆమె చుట్టూ తిరిగినా… అసలు ఆమెని పట్టించుకోలేదు. తనకి నా వాల్యూ తెలియాలి కదా—అందుకే అలా చేశాను.
తర్వాతి 5 రోజులు కంటిన్యూస్‌గా నేను శైలూని కావాలనే అవాయిడ్ చేశాను. నేను ఆమె లవ్‌ని టెస్ట్ చేయాలనుకున్నాను.
6వ రోజు…
నేను బాల్కనీ లోపల, ఎవరికి కనిపించకుండా కూర్చున్నాను. శైలూ బయటకి వచ్చింది. తన పని చేసుకుంటోంది. మా బాల్కనీ వైపు చూస్తుందేమో—నాకోసం అనుకుంటూ నేను చూస్తున్నాను.
కానీ ఆమె తన పనిలో ఇన్వాల్వ్ అయిపోయింది… అసలు చూడట్లేదు. “ఏంటి ఇలా?” అని నేను అనుకుంటూ ఉండిపోయాను…
తన పని చేసుకుని వెళ్లిపోతూ సడన్‌గా మా బాల్కనీ వైపు చూసింది. నేను తనకు కనిపించకుండా ఉన్నాను. కొంచెం సేపు అలాగే చూస్తూ నిలబడి, తర్వాత వెళ్లిపోయింది. ఇలా మూడు రోజుల పాటు జరిగింది.
అప్పుడు మేము విజాగ్ వెళ్లి, ఒక వారం రోజుల పాటు మా రిలేటివ్స్ హౌస్‌లో ఉండి వచ్చాం.
దాదాపు 10 రోజులు నేను అసలు శైలూని చూడలేదు… తాను కూడా నన్ను చూడలేదు. నాకు మాత్రం ఆమెను చూడాలనిపిస్తోంది. కానీ తాను నిజంగా నన్ను లవ్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే… ఇలా చేయక తప్పదు.
అలా 10 రోజుల తర్వాత నేను మళ్లీ ఇంటికి వచ్చాను. బాల్కనీకి వెళ్లి, ఈసారి కూడా ఆమెకు కనిపించకుండా శైలూని ఆబ్జర్వ్ చేస్తున్నాను. ఆమె యూజువల్‌గా తన పని చేసుకుంటోంది. కానీ ఈసారి ఒక చిన్న చేంజ్ ఉంది—ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మా బాల్కనీ వైపు చూస్తోంది. అంటే… she is searching for me.
ఆమె అలా చూసే టైంలోనే నేను సడన్‌గా ఎంట్రీ ఇచ్చాను. ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. తన ముఖంలో హ్యాపీనెస్, షాక్… మరియు అందులోనే మోస్ట్ లవ్లీ థింగ్—క్లీన్ & ప్యూర్ లవ్—అది నేను స్పష్టంగా చూసాను. ఆ క్షణం… its worthless.
I’m in love… we are in love.
మేమిద్దరం అలాగే ఒకరినొకరు చూస్తూ సుమారు 10 నిమిషాలు గడిపాము. తర్వాత ఆమె ఒక చిన్న నవ్వు నవ్వింది.
“ఏమైపోయావు? కనిపించట్లేదు…” అని సైగ చేసింది…
ప్రేమకు అంతం లేదు…
Keep Loving & Keep Reading......
Thanks for reading the story.
Author @Srinivasu B
B. శ్రీనివాసు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
I'm a tech enthusiast by profession and a storyteller by passion. By day, I explore logic, systems, and innovation; by night, I turn thoughts into stories that capture love, life, and the quiet moments we often overlook. My writing is inspired by real emotions, simple settings, and the kind of connections that don't need loud words-just a glance, a silence, or a memory.
Here, you'll find stories rooted in Indian culture-village vibes, relatable characters, slow-burn romance, and heartfelt journeys that feel real. I believe the best stories are not always dramatic... sometimes, they're hidden in everyday life.
If you enjoy:
• Soft, emotional love stories
• Realistic characters and desi settings
• Slow-burn romance and meaningful connections
• Stories that stay with you even after the last line
Then you're in the right place.
New stories and updates are coming regularly.
Follow along and be part of this journey.







Comments