top of page
Original.png

ప్రేమాన్వేషి

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #Premanveshi, #ప్రేమాన్వేషి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Premanveshi - New Telugu Story Written By Vasundhara Rani Munipalle

Published in manatelugukathalu.com on 24/01/2026

ప్రేమాన్వేషి - తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


​అక్షర చిన్నతనంలోనే ఒక పెద్ద శూన్యాన్ని చవిచూసింది. తన తమ్ముడి పురిట్లోనే అమ్మ శాశ్వతంగా దూరమైపోయింది. ఆ పసికందు పుట్టుకతోనే అనారోగ్యంతో ఉండటంతో, తాతయ్య, నానమ్మ మరియు అమ్మమ్మలు వాడిని ప్రాణం పెట్టి పెంచారు. రఘు వయసు చిన్నదే కావడం, అక్షర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఇంట్లో వారు ఒత్తిడి చేయడంతో రఘు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.


తమ స్థాయికి తగకపోయినా, రేఖ అనే అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. రఘు ఆశ అంతా ఒక్కటే—రేఖ వస్తే తన కూతురికి తల్లి ప్రేమ దొరుకుతుందని. కానీ రఘు రేఖను ఎంత బాగా చూసుకున్నా, ఆమె మాత్రం అక్షరను కానీ, ఆ పసి బాబును కానీ తన బిడ్డల్లా స్వీకరించలేకపోయింది


రఘుకి రెండో పెళ్లి అయిన కొద్ది రోజులకే ఆ బాబు చనిపోయాడు.

​తమ్ముడు కూడా దూరం కావడంతో అక్షర మరింత ఒంటరిదైపోయింది. రేఖ తనను దూరం పెడుతున్న కొద్దీ, అక్షర తన తండ్రిలోనే అమ్మను వెతుక్కునేది. రఘు కూడా తన కూతురిని అమితంగా ప్రేమించేవాడు. ఈసమయంలో అక్షర మానసిక స్థితి చాలా దయనీయంగా ఉండేది. నాన్న తనను ప్రాణంగా చూసుకుంటున్నా, రేఖ తనను దూరం పెట్టడం వల్ల వచ్చే శూన్యాన్ని ఆమె భరించలేకపోయేది. తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచించడం, లేనిపోనివన్నీ ఊహించుకుని తనలో తనే బాధపడటం చేసేది. ఎప్పుడూ దిగులుగా ఉంటూ, ఆ ఒంటరితనాన్ని భరించలేక తన మూడ్ ఆఫ్ చేసుకునేది. ఆ బాధలోంచి పుట్టిన అభద్రతా భావమే అత్తపై చూపించే అతి ప్రేమగా మారింది.

​అమ్మ ప్రేమ దొరకని ఆ లోటును అక్షర తన మెనత్తతో భర్తీ చేసుకోవడం మొదలుపెట్టింది. అత్త అక్షరను తన కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించి అక్కున చేర్చుకుంది.


అయితే అక్షర అత్తపై చూపించే ప్రేమ చాలా సున్నితంగా, అదే సమయంలో ఆందోళనతో కూడి ఉండేది. అత్తకు కొంచెం తలనొప్పి వచ్చినా అక్షర తట్టుకోలేకపోయేది, ఏదో జరిగిపోతుందన్నట్లు కంగారుపడిపోయేది. అక్షర ఏ పని చేసినా, అది అత్తకు ఇష్టమా కాదా అని వంద సార్లు ఆలోచించి చేసేది. తన కేరింగ్ ని రకరకాలుగా చూపిస్తూ నిరంతరం అత్త క్షేమం గురించే ఆలోచించేది. అక్షర తన గురించి తాను పట్టించుకోకుండా, తన చిన్న చిన్న సంతోషాలను కూడా పక్కన పెట్టి ఎప్పుడూ తన చుట్టూనే ఉండటం చూసి అత్త మనసు ద్రవించేది. తనపై ఉన్న ప్రేమే అక్షరను ఒక బందీగా మారుస్తోందని, తనకంటూ ఒక లోకాన్ని నిర్మించుకోలేకపోతోందని అత్త లోలోపల బాధపడేది.


​పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన రఘు, అక్షరను ఒక కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్షరతో మాట్లాడిన కౌన్సిలర్, రఘును పిలిచి ఇలా వివరించారు: "రఘు గారు, అక్షర మనసులో తీవ్రమైన భయం ఉంది. చిన్నప్పుడే అమ్మను, తమ్ముడిని కోల్పోవడంతో, తను ప్రేమించే వ్యక్తులు తనకు దూరమవుతారేమో అన్న ఆందోళన ఆమెను వెంటాడుతోంది. రేఖ ఆమెను దూరం పెట్టడం వల్ల అక్షర మనసులో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడింది. అత్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అక్షర, తన అతి జాగ్రత్త ద్వారా అత్తను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఆమెకు ఎటువంటి చిన్న కష్టం రాకుండా చూసుకుంటేనే ఆ బంధం పదిలంగా ఉంటుందని బలంగా నమ్ముతోంది. ఆ అమాయకపు నమ్మకమే తనను ఇలా అతిగా ప్రవర్తించేలా చేస్తోంది."


​కౌన్సిలింగ్ తర్వాత రఘు అక్షరను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఇలా చెప్పాడు: "తల్లీ అక్షర, నువ్వు అత్తను ఎంతలా ప్రేమిస్తున్నావో మాకు తెలుసు. కానీ నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిని ఊపిరి సలపకుండా చేయడం కాదు, వాళ్ళని స్వేచ్ఛగా గాలి పీల్చుకోనివ్వడం. నువ్వు అత్తకు ఏ చిన్న కష్టం రాకూడదని పడే ఆరాటం, ఆమెకు ఒక భారంగా మారుతోంది. నువ్వు నీ గురించి మర్చిపోయి తన చుట్టూనే తిరుగుతుంటే, నిన్ను చూసి ఆమె సంతోషపడదు సదా బాధపడుతుంది. అత్త నీకు దూరం కాదు, కానీ నువ్వు తన మీద చూపిస్తున్న ఈ అతి జాగ్రత్త తనను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది.


మీ అమ్మ కూడా నిన్ను ఇంత బలహీనంగా చూడాలని అనుకోదు. నువ్వు ధైర్యంగా ఉండి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, నీకంటూ ఒక లోకాన్ని సృష్టించుకున్నప్పుడే అత్త సంతోషిస్తుంది, అప్పుడే పైన ఉన్న మీ అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది."


​ఆ మాటలు అక్షరలో పెను మార్పును తీసుకువచ్చాయి. అక్షర తన ప్రేమను బాధ్యతగా మార్చుకుంది. అత్త చుట్టూ తిరగడం తగ్గించి, తనను తాను స్ట్రాంగ్ గా చేసుకుంది. అత్తను సంతోషంగా ఉంచడం అంటే ఎప్పుడూ ఆమె వెంటే ఉండటం కాదు, ఆమెకు ప్రశాంతతను, స్వేచ్ఛను ఇస్తూనే తాను కూడా స్వతంత్రంగా ఎదగడం అని అక్షర తెలుసుకుంది.


ఆత్మవిశ్వాసంతో తన సమస్యలను తనే పరిష్కరించుకునే ప్రయత్నానికి నాంది పలికింది. వాస్తవాన్ని అర్థం చేసుకుని, మనం మార్చలేని వాటి నుంచి తప్పుకోవడానికి ఇంకో దారి వెతుక్కోకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంది. ఈ మార్పుతో అక్షర ఇప్పుడు ఆనందంగా ఉండటమే కాకుండా, తనను చూసి ఎప్పుడూ మధనపడే అత్తకు కూడా అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. తన బలహీనతను బలంతో జయించి, ఆ ఇంట్లో మళ్ళీ ఒక కొత్త వెలుగును నింపింది.


సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page