top of page
Original.png

రేపటి కోసం – “నేడు” ని చంపొద్దు

#RepatiKosamNeduniChampoddu, #రేపటికోసంనేడునిచంపొద్దు, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

  

Repati Kosam Neduni Champoddu - New Telugu Story Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 31/12/2025

రేపటి కోసం – “నేడు” ని చంపొద్దుతెలుగు కథ

రచన: పుల్లేటికుర్తి నగేష్ 


రేపటి కోసం – “నేడు” ని చంపొద్దు. 


అవును, మనం అందరం అలానే చేస్తున్నామా?


పగలనక రాత్రనకా గొడ్డు చాకిరీ చేసి కూడబెట్టడం, 

చచ్చి చెడి, రూపాయి రూపాయి దాచి, 

తిని తినక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. 


తిరిగి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దాచినదంతా ఖరీదైన హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టి, 


సారీ, మా ప్రయత్నం మేం పూర్తిగా చేశాం, ఆపై దేవుని దయ అని డాక్టర్తో అనిపించుకొని,


ఈ తనువు చాలిస్తున్నామా? 


రేపటి కోసం నేడు ని చంపేస్తున్నామా?


ఒక్కసారి ఆలోచించండి.. 


నిజమనిపిస్తుంది కదూ!!!


అవును తరువాత చూద్దాంలే అనే స్టేజ్ చూస్తుండగానే దాటిపోతుంది. 


ఆ తరువాత వుందో? లేదో?


అసలు వస్తుందో? రాదో ?


ఎవరు ఎందుకు రాశారో కానీ “ఉందిలే మంచి కాలం ముందు ముందున” అనే పాట,


దాన్ని నమ్ముకొని ఇంకా మంచి కాలం వస్తుంది, వస్తుంది అని ఎదురు చూస్తుంటే.. , 


ఒక మంచి రోజు, ఇప్పటి వరకు జరిగిపోయిందే నీ మంచి కాలం.. పద ‘టైమ్ అయిపోయింది’ అంటాడు ఆ పై వాడు. 


ఆలస్యం చేస్తే, త్రాగే “టీ” లానే.. మన ఆసక్తి కూడా చల్లరిపోవచ్చు. 


మనం నిర్ణయం తీసుకునేలోగా మన వంట్లో మన శక్తి కూడా తగ్గిపోవచ్చు. 


ఇప్పుడిప్పుడే నా జీవితం, నా ఆలోచనా విధానం మెల్ల మెల్లగా అర్థం అవుతున్నట్లు వుంది. 


ఉదయం తొమ్మిదిగంటలకి లంచ్ బాక్స్ పట్టుకొని, 10 కి ఆఫీసుకి వెళ్లడం, 


రోజంతా పనిచేయడం,


 సాయంత్రం ఇల్లు, భార్య, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్లు పుణ్యాలు ఇదేనా జీవితం. 


మనకంటూ ఏమి లేదా? 


ఇంకొన్ని సంవత్సరాలు పనిచేసి, చేసి చేసి రిటైర్ అయి, 


ఈ దాచిన డబ్బులన్నీ పిల్లలకి అప్పచెప్పి,


అప్పటికి వచ్చిన జబ్బులు నయం చేసుకొనే పనిలో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పైకి పోవడమేనా. 


ఈ అంతర్మదనానికి కారణం క్రిందటి వారం మా నాన్నతో జరిగిన ముచ్చట్లు. 


ఆ రోజు ఉదయం మా నాన్న నా దగ్గర కూర్చుని గట్టిగా నిట్టూర్చారు. 


"ఒరేయ్, నేను మంచి ఉద్యోగం సంపాదించి, ఇల్లు కట్టి, కారు కొని, అన్నీ దాచిపెట్టానూ. 


 కానీ! ఒక్కసారి కూడా నేను ఎటూ తిరగలేదు, మీ అమ్మని కూడా తిప్పలేదు. 


మీ చదువులు, ఉద్యోగాలు పుణ్యమా అని మీరు కూడా ఎప్పుడు అడగలేదు. 


 మీరందరూ ఏమైనా అడిగితే రేపు చూద్దాంలే, తరువాత తీరికగా తిరుగుదాంలే అని వాయిదా వేసుకుంటూ వచ్చాను. "


"ఇప్పుడు చూడు," తన వణుకుతున్న చేతులను చూపించారు. 


 "ఇప్పుడు నాకు కాళ్ళు లేవు, నడవలేను. 


నా జేబులో డబ్బు ఉన్నా.. అప్పటి ఆరోగ్యం, ఆ పాత ఉత్సాహం నాలో లేదు. 


రేపటి కోసం దాచుకున్న డబ్బు, ఇప్పుడు నా ఆనందానికి కాదు, నా వైద్యానికి ఖర్చు అవుతోంది. "


ఆ మాట వినగానే నా మనసు అదో మాదిరిగా అయిపోయింది. 


అవును ఈ ‘మా’ తరంలో కూడా ఇదే జరుగుతోంది కదా!


డబ్బు దాయడమేనా మన పని? 


దాచి దాచి.. దాచిందంతా పిల్లల కిచ్చి ఎప్పుడో 80కి ఒక ఖరీదైన హాస్పిటల్ బెడ్ లో చేరి, పైకి పోతాం.. 


అయితే ఇక్కడ ఓ చేదు నిజం, అప్పటికి మన పిల్లలు 60కి దగ్గర పడుతుంటారు.. 


అంటే వాళ్ళూ వృద్ధాప్యం ముంగిట నిలబడి వుంటారు.. 


మరి మనమూ అనుభవించక, వాళ్ళునూ అనుభవనీయక.. 


ఈ దాచిన డబ్బు ఉపయోగం ఏమిటి? 


ఇది కేవలం వాయిదా వేసి ‘ఆశ’ను, ‘నిరాశ’గా మార్చుకోవడమేనా!


అవును ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది, 


అన్నింటికన్నా కష్టం మనల్ని మనం ఆనందంగా ఉంచుకోవడం. 


 అవకాశం వస్తే వదులుకోకండి. 


ఎవరో అన్నట్లు, ఐస్ క్రీం తిన్నా తినక పోయిన కరగడం గ్యారంటీ కదా!


 జీవితం కూడా అంతే. నువ్వు ఆస్వాదించినా, పక్కన పెట్టినా.. అది గడిచిపోవడం ఖాయం. 


కరిగిపోయే ఈ కాలాన్ని రేపటి కోసం దాచడానికి ప్రయత్నించడం.. 


వర్తమానంలో మన సంతోషాన్ని మనమే చంపేసుకోవడమే!


మరి ఏం ఆలోచిస్తున్నట్లు?


 ఎవరికోసం తాపత్రయ పడుతున్నట్లు???


నాకోసమా?


నేనెప్పుడూ రెడీ, నా బ్యాక్పాక్ తో.. 


బ్యాంకాక్ కి!

😊😊😊


పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

ree

పేరు: పుల్లేటికుర్తి నగేశ్ 

వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం. 

వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్ 

పుట్టిన ఊరు;;;;  శ్రీకాకుళం 

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Swetha Gopu
Swetha Gopu
an hour ago
Rated 5 out of 5 stars.

true

Like
bottom of page