top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 5'Sabhaash Sanjeevi - Episode 5' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 24/01/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


Youtube Video link
జరిగిన కథ:


‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 


వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 


గుడ్దిగోలాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చండుడు. ఆ మెజిషియన్, సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు. సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డెన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. 

పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం. ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 5 చదవండి.. 


హెడ్ మాస్టర్ వెంకటరమణకు ఫోన్ చేసి పోలీసు స్టేషనుకు వెంటనే రమ్మని చెప్పాడు విశ్వనాథం 

 విశ్వనాథం పోలీసు స్టేషనుకు వెళ్ళగానే హెడ్ మాస్టారుతో పాటు యుగంధర్, వెంకటకృష్ణమూర్తి, భగవాన్, మధుబాబు లు ఉండటం చూసారు. పోలీసు స్టేషన్ నందు ఒక్క అక్షరం వదలకుండా నిజం చెప్పాడు విశ్వనాథం. 


"ఆ రోజు సంజీవి గదిలోనికి రాగానే జరిగింది చెప్పి, ‘కాస్సేపు దొంగ అన్నా బాధపడొద్దు. పదివేల రూపాయలు తీసుకున్నందుకు ఉష్ణకుడు చెప్పినవిధంగా కాస్త అయినా పనిచెయ్యాలిగా. నీవు కాసేపు అవమానం భరించావంటే ఆ పదివేల రూపాయలతో పిల్లలకు దుప్పట్లు ఈ రోజే కొంటాను. సాయంత్రం వేళ జరిగిందంతా అందరికీ చెబుతాను’ అని వాడితో చెబుతామనుకొంటూ ‘సంజీవి!’ అని కోపం నటిస్తూ పిలిచాను. 


వాడితో పాటు చెంగయ్య రావడం, తలుపు దగ్గర ఇంకొకడు నిలబడటం చూసి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మరలా చెబుదామనుకున్నాను. వాడిని మందలించాను తప్ప ఎక్కువగా తిట్టలేదు. " అన్నాడు విశ్వనాథం.

 

"ఆ పదివేల రూపాయలు ఏం చేశారు " అడిగాడు ఇన్స్పెక్టర్.

 

"సార్! పదివేల రూపాయలతో హాస్టల్ పిల్లలకు కో ఆప్ టెక్స్ నందు రిబేటు ఉండుటవలన వెళ్లి దుప్పట్లు కొన్నాను. బిల్ చూడండి సార్, సంజీవి చేత ఆ దుప్పట్లు పంచాలనుకొని అలాగే ఆఫీసు గదిలో వుంచాను సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు, వాడు హాస్టల్ దాటి వెళ్ళగానే నేను బయటకు వెళ్లి చెబుతామనుకొని వెళ్ళాను. బయట ఆ ఉష్ణకుడు ఉండటంవలన సంజీవితో మాట్లాడలేక పోయాను. 


వాడితో నీవు చెప్పిన పని అయిపోయిందని చెప్పాను. బడికి పిల్లలు వెళ్తున్న సమయాన పదవతరగతి చదువుతున్న వాడి స్నేహితుడిని పిలిచి జరిగిందంతా చెప్పి సంజీవితో చెప్పి బాధపడొద్దని చెప్పు అంటూ చెప్పి పంపాను. కానీ సంజీవి బడికి వెళ్లలేదని తెలిసింది. ఏం జరిగిందో ఏమో " అంటూ కళ్ళు తుడుచుకున్నాడు విశ్వనాథం. 


"కిడ్నాప్ చేసింది నిజం, కారు నంబర్లలో ఒక నంబరు రెండు అన్నది నిజం కావచ్చు, తెల్ల కారు అన్నది నిజం. ఉష్ణకుడు అన్నపేరు నిజం కాదు " అంటూ కళ్ళుమూసుకొని ఆలోచించసాగాడు రాంమూర్తి.

 

"అంకుల్.. సారీ.. సార్ ఒక చిన్న.. "అన్నాడు మధుబాబు.

 

పిల్లలవైపు చూస్తూ "మీరు నన్ను అంకుల్ అని పిలవండి, అప్పుడే భయం లేకుండా స్నేహంగా మాట్లాడగలరు " అన్నాడు రాంమూర్తి.

 

 "ఆ ఉష్ణకుడు మార్కెట్ దగ్గర విశ్వనాథం సారును కలిశారు. మార్కెట్ దగ్గరున్న వీధిలో కొన్ని అంగళ్లలో సీసీటీవీ లు వున్నాయి మేము వెళ్లి చూడవచ్చా సార్ "


 "మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి మా ప్రయత్నాలు మేము చేస్తాము " రాంమూర్తి చెప్పారు. 

 "ఈ రోజు మీరు నలుగురు బడికి రాకపోయినా పరవాలేదు " వెంకటరమణ మాస్టారు అన్నారు. 


 "నేనూ మీతో పాటు వస్తాను. "అన్నాడు విశ్వనాథం.

 

 "క్షమించండి సార్ మిమ్మల్ని చాలా బాధపెట్టాము" - మధు బాబు.

 

"నాకు క్షమాపణలు ఎందుకు " అన్నాడు విశ్వనాథం.

 

"మీపై అనుమానంతో.. రాత్రివేళల్లో మీ ఇంటికి వచ్చింది మేమే సార్ " - భగవాన్.

 

"ఇంతకూ అవన్నీ ఎలా.. రహస్య ఉత్తరం సంగతి తెలుసు ఆకాశంలో దెయ్యం? "


"మానాన్న పెళ్లిళ్లకు వీడియో తీస్తుంటారు సార్. మానాన్న దగ్గర డ్రోన్ కెమెరా వుంది. అది మినీ హెలికాఫ్టర్ లాగా పనిచేస్తుంది. దానికి ఒక ఆకారం తగిలించి, దానితో పాటు చిన్న రికార్డెడ్ సెట్ పెట్టి మీ కిటికి దగ్గర వచ్చేలా చేసాము. మీరు లైట్ వేసి ఇంటి తలుపులు తెరవడం చూడగానే దూరంగా వున్న మేము రిమోట్ ద్వారా పైకి వెళ్లేలా చేసాము "


 "చెంగయ్య దగ్గర..? "


 "చెంగయ్యకు సంజీవి అంటే ప్రాణం సార్, మేము చేసిన పనులన్నీ చెబుతూ నీ ముందు కూడా ఆ ఆకారం వచ్చిందని అబద్దం చెప్పమంటే చెప్పాడు".

 

 *** *** ***

" సీసీటీవీ నుండి తీసిన ఉష్ణకుడు ఫోటోను అన్ని స్టేషన్లకు పంపినా ఫలితం లేకపోయింది. చివరగా రెండు నంబరున్న తెల్లకారు కనిపెట్టలేకపోయాను. చ్చ.. ఛా.. డామిట్ ఈ కేసులో ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లలేక పోయాము. " నుదురు రుద్దుకొంటూ బాధగా అన్నాడు రాంమూర్తి. 


 "అంకుల్, ఏమనుకునుంటే నేనొక సలహా ఇమ్మంటారా "


 "ఏమిటి యుగంధర్ "


"నాకు ఇంకొకరిమీద అనుమానంఉంది. కేవలం అనుమానం మాత్రమే. ” అన్నాడు యుగంధర్.

 

 "ఎవరు యుగంధర్ "

 

"సార్ ఆరోజు మేజిక్ ప్రదర్శనకు నేనూ వెళ్ళాను. అతను కొన్ని ప్రదర్శనలలో గుడ్డి గోలాను పొగడడంతో పాటు సంజీవిని విమర్శించడం చేసాడు. ఆ మేజిక్ ప్రదర్శనను ఎవరు చేయమని చెప్పారో వారే సంజీవిని కిడ్నాప్ చేసి ఉండవచ్చు అని అనుమానం కలుగుతుంది " అన్నాడు యుగంధర్. 

 "నీవన్నట్టు అన్ని కోణాలలోనూ విచారించాలి " అనుకొంటూ రాంమూర్తి జడ్డు దగ్గరకు వెళ్ళడానికి జీపులో ఎక్కుతూ వాళ్ళనూ ఎక్కించుకొని బడి దగ్గర దింపాడు. 

 జడ్డు అంగడికి వెళ్ళాడు రాంమూర్తి. 


"జడ్డూ! మాకొక పెద్ద తలనొప్పి కేసు తగులుకొంది. ఆ సంజీవి తప్పిపోయి మా ప్రాణాలు తీస్తున్నాడు. నీ అంగడికి చాలామంది పిల్లలు వస్తుంటారుగా. అలా విచారించి తెలుసుకో. నీకేదైనా క్లూ దొరికిందంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు" అంటూ నంబరు చెబితే వ్రాసుకొన్నాడు జడ్డూ.

 "తప్పకుండా సార్" అన్నాడు.

 

"ఇప్పుడు మరలా నీ వ్యాపారం బాగా సాగుతుందని వినపడ్డాను" 


"మా అంగడి ముందు మేజిక్ షో పెట్టక పిల్లలలో మార్పు వచ్చింది సార్ "


"ఆ మేజిక్ షో బాగుందని చాలామంది చెప్పారు. ఎక్కడినుండి తెప్పించావు "


 "ఏమోసార్! నాకు తెలీదు, గుడ్డి గోల పానీయం జిల్లా ఏజెంట్ చండుడు ఏర్పాటు చేసాడు " అన్నాడు జిడ్డు. 


"చండుడు మంచి వ్యాపారవేత్త. కష్టపడి పైకి వచ్చాడు. ఇప్పుడు అతని ఆలోచనవలన మరలా నీ వ్యాపారం బాగా సాగుతోంది "

 “ఔను సార్ “

 "ఏదైనా క్లూ దొరికితే మరిచిపోకుండా చెప్పు. అన్నట్లు అడగడం మరచిపోయాను”


“ఏమిటి సార్” అడిగాడు జడ్డు.

 

“ఈ బడిలో చేసిన మేజిక్ కన్నా మీ అంగడి ముందు చేసిన మేజిక్ చాలా బాగుందని చెప్పారు. పక్కఊరిలో ఒక సంఘంవారు ఆ మేజిక్ గురించి వినబడ్డారంట. ఆ ఊరి ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి అడిగాడు. నేరుగా చండుడుని అడుగుతామనుకొన్నాడు. ఆ మెజీషియన్ ఫోన్ నంబరు ఉంటే ఇస్తావా "


"సార్, ఆ మేజిక్ అతను వెళ్ళేటప్పుడు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. వుండండి సార్ ఒకసారి చూసి ఇస్తాను " అంటూ  టేబుల్ సొరుగు తెరచి వెతకగా ఆ కార్డు దొరికింది. 


"ఈ కార్డు నాకు అక్కరలేదు. అంతగా కావాలంటే చండుడును అడుగుతాను. మీరు తీసుకోండి సార్ " అంటూ ఆ విజిటింగ్ కార్డు ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టాడు. 


“జడ్డూ, ఈ సంజీవిని ఎవరు కిడ్నాప్ చేశారో కానీ ఈ హెడ్ మాస్టర్ నాప్రాణాలు తీసేస్తున్నాడు. ఏదో తన ఇంటి మనిషి తప్పిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. ముందు ఆయనను సమాధానపరచి వెళ్ళాలి" అంటూ బడి వైపు వెళ్ళాడు. 

 హెడ్ మాస్టర్ గదిలోనికి వెళ్ళాడు.

 

"రామూర్తీ, కూర్చో " అన్నాడు వెంకటరమణ.

 

"మీ డిటెక్టివ్స్ చెప్పినట్లు నాకిప్పుడు చండుడు మీద అనుమానం వస్తోంది. సంజీవి అన్ని బడులలో ప్రదర్శన ఇస్తానని చెప్పడం చండుడుకి తెలిసిపోయివుంటుంది. తన వ్యాపారం దెబ్బతింటుందని సంజీవిని కిడ్నాప్ చేసివుంటాడు. " అన్నాడు రాంమూర్తి.

 

"వాడిప్పుడు పెద్ద కోటీశ్వరుడు, బాగా పలుకుబడివున్నవాడు. వాడిని పట్టుకోవాలంటే బలమైన సాక్షం కావాలి. " అన్నాడు వెంకటరమణ. 


“ఈ విషయం మన నలుగురు డిటెక్టీవులకు చెప్ప వద్దండి. ఇది చాలా పెద్ద విషయం. బలమైన సాక్ష్యం సంపాదించాలి" అన్నాడు రామూర్తి. 


ఇంటర్వెల్ బెల్ కొట్టగానే నలుగురూ హెడ్మాస్టర్ గదిలోనికి వచ్చారు.

 

"వెల్కమ్ డిటెక్టివ్స్ " అన్నాడు రామూర్తి. 


"నిన్నటి రోజు సైన్స్ మాస్టర్ జబ్బార్ సార్ మాతరగతికి వచ్చినప్పుడు ఆ మేజిక్ గురించి ప్రశ్నించినప్పుడు సమాధానాలు చెప్పారు " అన్నాడు భగవాన్.

 

"పాకెట్ పాలను ఒక గ్లాస్ నందు పోసి ఎవరికీ తెలీకుండా పొటషియం పర్మాంగనేట్ ను కలపడంద్వారా నల్లటి లావా పొంగుతో వస్తుందని చెప్పారు. " అన్నాడు కృష్ణమూర్తి.

 

“సార్, ఇప్పుడు తెలిసింది సార్. ఆ మెజీషియన్ ఒక మంత్రదండం లాంటిది పాలలో ఉంచి ఊదడం గమనించాను. అంటే పొటషియం పర్మాంగనేట్ మంత్రదండంలా ఉపయోగించినా ఆ గొట్టంలో ఉంచి ఊదగానే పాలలో కలిసింది “ అన్నాడు యుగంధర్.

 

"మరి క్యాబేజీ రసం ఐదు గ్లాసులలో ఐదురంగులుగా మారడం.. " అడిగాడు వెంకటరమణ.


 "ఐదు గ్లాసులలో వున్నది నీరు కాదు. నీరు, స్ప్రైట్, బేకింగ్ సోడా, సాల్ట్, వెనిగర్ వున్నాయి. కానీ అతని అసిస్టెంట్లు ఇద్దరువచ్చి నీరు అని అబద్దం చెప్పారు. వాళ్ళను కూడా విచారించండి సార్ "-  యుగంధర్.

 

“మన బడిలో మేజిక్ ప్రదర్శన జరిగినప్పుడు అతని అసిస్టెంట్లు ఎవరికీ తెలీకుండా దాక్కొని వైర్ తో కట్టిన ప్లాస్టిక్ బాటిల్, సంచులను లాగలేదా. మెజీషియన్ అన్నాక అసిస్టెంట్లు వుంటారు. మన బడిలో మేజిక్ చేసినప్పుడు కూడా అతను అసిస్టెంట్లను పిలుచుకొనివచ్చాడు " అన్నాడు వెంకటరమణ. 

 *** *** *** 

వారిద్దరూ ప్రతిరోజూ తప్పించుకొనడం ఎలాగా అని ఆలోచించసాగారు. సంజీవి ఎన్నో ఆలోచనలను చెప్పినా అనుభవపూర్వకంగా జరగదంటూ తిరస్కరించేవాడు బాలు.

 

“సంజీవి, నాకో ఆలోచన వస్తోంది “

 “ఏమిటి అన్నా” 


"సంజీవీ, మనకున్న సామ్రాజ్యం వంటగది, కాస్తా పెరడు. ఆ తరువాత పెద్ద గోడ. వంటగదిలో గుడ్డి గోలా పానీయమున్న ప్లాస్టిక్ కేన్స్ వుంచుతున్నారు. సమయం దొరికినప్పుడు ఈ పెరడు కాస్తా హాయినిస్తోంది. మంచి గాలి పీల్చుకొనడానికి మనం మాట్లాడుకొనడానికి ఉపయోగపడుతోంది. మనం తప్పించుకోవాలంటే ఆ గోడ పడిపోవాలి. ఆ గోడ పడగొట్టడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం గుడ్డి గోలా పానీయం. ఆ గోడ దగ్గర ప్రతిరోజూ గుడ్డి గోలా పానీయం పోయడం చేద్దాము. ఏదో ఒక రోజు ఆ గోడ పడటానికి అవకాశం వుంది. అప్పుడు మనం సులభముగా తప్పించుకొనవచ్చు. మనమిప్పుడు ఏఊరిలో ఉన్నామో ఏ రాష్ట్రంలో ఉన్నామో మనకు తెలీదు “


"మనం బయటపడితేనే మనమెక్కడున్నామని తెలుస్తుంది. కానీ నీవు చెప్పేది లాజిక్ అంటే తర్కం "


 "సంజీవి, వైద్యుడు లేనిచోట బామ్మగారు చెప్పే చిట్కా వైద్యం లాంటిది నా తర్కం. కొన్నిసార్లు బామ్మ చిట్కా పలించినట్లు నేను ఊహించింది పాటిస్తే జరగవచ్చన్న చిన్న నమ్మకం కలుగుతోంది. " అన్నాడు బాలు. 

 "అన్నా, నీకు ఆ ఆలోచన ఎలా కలిగింది "


 "ఒక దేశంలో గుడ్డి గోలాను మరుగుదొడ్లు శుభ్రంచేయడానికి ఉపయోగిస్తున్నట్లు చదివాను. అంటే ఆసిడ్ లాగ పనిచేస్తుందన్న ఆలోచన కలిగింది”

 

"అన్నా, నీవు చెప్పిన తర్కాన్ని శాస్త్రీయంగా రుజువు మనం చేయలేకున్నా, నీవు చెప్పిన దానిపైన కాస్త నమ్మకం కలుగుతోంది. ఈ రోజునుండి ఒకే చోట ఆ పది అడుగుల పొడవు వరకు ప్రతిరోజూ ఎవరికీ తెలీకుండా ఆ గుడ్డి గోలాను పోస్తాము. ఆ పానీయం గోడను కొద్ది కొద్దిగా బలహీనం చేస్తుంది. మంచి వర్షం వచ్చిందంటే మనం రోజూ పోసే ఆ పది ఆడుదిగుల గోడ పడిందంటే చాలు మనమిద్దరం ఇక్కడనుండి బయట పడవచ్చు. “


“కొండకు చిన్న దారం కట్టి లాగుదాము. వచ్చిందంటే కొండ వస్తుంది లేకుంటే దారంతో పోతుంది. " అన్నాడు బాలు. 


 అప్పటినుండి సమయం దొరికినప్పుడంతా ఒక చోట గోడకు గుడ్డి గోలా పానీయాన్ని పోయసాగారు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు

81 views0 comments

Comments


bottom of page