'Sanchika Pongindi - Episode 6/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao
'సంచిక పొంగింది - ఎపిసోడ్ 6/6' తెలుగు ధారావాహిక చివరి భాగం
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
సంచిక శ్రీకర్ మంచి స్నేహితులు. ఒక టెస్ట్ రాయడానికి ఇద్దరూ మరో ఊరు వచ్చి హోటల్ లో స్టే చేస్తారు. అనుకోకుండా వాళ్ళు ఉన్న గదికి పోలీసులు వస్తారు.
పెళ్లికాని యువతీయువకులు ఇలా ఒక గదిలో ఉండటం మంచిది కాదంటారు పోలీసులు. సంచికకు ఇబ్బంది రానివ్వ వద్దని శ్రీకర్ తల్లి అతనితో చెబుతుంది.
ఇంటర్వ్యూకి వెళ్లిన శ్రీకర్, సంచికలకు వాగ్దేవి అనే యువతి పరిచయమవుతుంది. వాగ్దేవి ఉద్యోగానికి సెలెక్ట్ అయినా తనకి యాక్సిడెండ్ కావడంతో నెలరోజులు ఆఫీసుకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది.
తాత్కాలికంగా ఆ ఉద్యోగం చేయడానికి సంచికకు ఆ కంపెనీ నుండి అనుమతి లభిస్తుంది. గాయం నుండి వాగ్దేవి కొద్దిగా కోలుకుంటుంది.
ఇక సంచిక పొంగింది ధారావాహిక ఆరవ భాగం చదవండి..
వాగ్దేవి జాబ్ ను.. సంచిక చేపట్టి.. పదహారు రోజులు పూర్తయ్యాయి.
కంపెని క్యాంటిన్ లో.. లంచ్ సమయాన..
"ఆ వాగ్దేవి.. మీ అంత పనిమంతురాలేనా.. అలా కాకపోతే.. తను డ్యూటీలో జాయినయ్యాక.. తనకు కష్టమవుతుంది. " అంది ఆ కంపెని ఎంప్లాయ్ ఒకరు. తను సంచిక టేబుల్ న.. ఎదురుగా కూర్చుని ఉంది.
సాంబారుతో అన్నం కలుపుకుంటున్న సంచిక తలెత్తింది.
"ఎందుకు. " అడిగింది.
"మరే.. మీ వర్క్ చూస్తున్నాంగా. చాలా గొప్పగా సాగిస్తున్నారు. మీ తీరు ఆమెకు లేకపోతే కష్టమవుతుందిగా. " అంది ఆ ఎంప్లాయ్.
"మొదటిలో నాకూ ఈ వర్క్ కొత్తే. అవసరం కొద్దీ నేను అలవాటు చేసుకోలే. తనూ అంతే కాదనుకోవడం ఏమిటి. " విడ్డూరమయ్యింది సంచిక.
"ఏమో. చాన్నాళ్లు అవుతుంది మేము చేరి. మాకు ఇప్పటికీ మీ అంత స్పీడ్ రాలే. " చెప్పింది ఆ ఎంప్లాయ్.
"శ్రద్ధ ఉండాలి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే.. ఏదీ అసౌకర్యం కాదు.. అసాధ్యం కాదు. " చెప్పింది సంచిక.
"ఏమో. " అనేసింది ఆ ఎంప్లాయ్.
సంచిక.. తల దించుకొని.. లంచ్ కొనసాగిస్తుంది.
"మీకు ఇంత టాలెంట్ ఉండి.. మీరు సెలక్ట్ కాకపోవడం చిత్రంగా ఉంది. " అనేసింది ఆ ఎంప్లాయ్.
సంచిక తలెత్తింది. ఆ ఎంప్లాయ్ నే చూస్తుంది.
"మాట వరసగా అనుకోవాలిగా. " తడబడింది ఆ ఎంప్లాయ్.
"ఎందుకు. ఐనా. ఇంటర్వ్యూ ఉన్న టైంలో ఫేస్ చేయడం ఒక లెక్క.. ఇలా జాబ్ టైంలో వర్క్ చేయడం మరో తీరు. దానికి దీనికి లింక్ అసమంజసం. అప్పుడు టెన్షన్ ఉంటుంది.. ఇప్పుడు మెన్షన్ ఉంటుంది. " అంది సంచిక. వెంటనే తల దించుకుంది. పెరుగును అన్నంలో వేసుకుంటుంది.
అప్పుడే.. "ప్రయివేట్ కంపెని ఐనంతన.. ఒకరిది బదులు మరొకరితో జాబ్ చేయించడం ఏమిటో. " టక్కున అనేసింది ఆ ఎంప్లాయ్.
సంచిక గమ్మున తలెత్తింది.
"ఇంతకీ మీ ప్రస్తావన దేనికి. ఈ సంభాషణ ఎందుకు. మీకు పరస్పర సహకార లక్షణాలు బొత్తిగా తెలియనట్టు ఉందే. " అంది సంచిక.
ఆ వెంబడే.. "సో.. డోన్ట్ పాస్ ది లిటిల్ స్టేట్మెంట్స్ ప్లీజ్. " చెప్పేసింది.
ఆ ఎంప్లాయ్ మరి మాట్లాడ లేదు. సంచిక లంచ్ పూర్తి చేసేసి.. లేచి.. అక్కడ నుండి కదిలింది.
ఐదు రోజులు పిదప.. మేనేజర్ కేబిన్ లో ఉంది సంచిక.
"మీ వర్క్ చాలా చాలా ఎప్రిసియేట్ గా ఉంటుంది. అంతా మీలా ఉంటే కంపెనికి బాగుణ్ణు. " చెప్పాడు మేనేజర్.
సంచిక చిన్నగా నవ్వేసింది.
"మీరు బినామీ ఎంప్లాయ్ కావడం శోచనీయంగా తోస్తుంది. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావపోడమేమిటి. " అనేశాడు మేనేజర్.
"లేదు సార్.. తొలుత నాకు ఈ జాబ్ వర్క్ కొత్తే. కానీ ఈ వర్కే కంటిన్యూ చేయాలి కనుక.. వర్క్ ను పట్టి నేర్చుకోగలిగాను. బట్.. ఇంటర్వ్యూలో జనరల్ థింక్స్ ఫేస్ చేయవలసి వచ్చింది. రెండింటిని ఫేస్ చేయడంలో తేడా బాగా ఉంటుంది కదా సార్. టైం ఫాక్టర్ కూడా కారణమవుతుందిగా సార్. ఏదైనా కుదురు కదురందే పనితనం బయటకు రాదు. " చెప్పింది సంచిక.
"వెల్.. వెల్ సెడ్. ఇంప్రష్. గో ఎహెడ్. " గొప్పగా చెప్పాడు మేనేజర్.
"థాంక్యూ సార్. " చెప్పింది సంచిక. తర్వాత.. అక్కడ నుండి తన సీట్ వైపు నడిచింది.
తొమ్మిది రోజుల పిదప..
మేనేజర్ కేబిన్ లోకి సంచిక వచ్చింది. కొన్ని పేపర్స్ ను అందించింది.
"ఇవి వాగ్దేవి.. మెడికల్ రిపోర్ట్స్. తను అనుకున్న దానికంటే ముందుగా.. చక్కగా తెములుకోగలిగింది. తను ఇప్పుడు నడవ గలదు. సో, మీరు అనుమతిస్తే.. రేపటి నుండే తను జాబ్ లోకి రావడానికి సిద్ధమయ్యింది. " చెప్పింది సంచిక.
"గుడ్. బట్.. ఈ సమయం వస్తే.. మీకు మేనేజ్మెంట్ ఒక విషయం చెప్పమంది. ఈ మధ్య జరిగిన మా మీటింగ్ లో మీ ప్రస్తావన వచ్చింది. మీ వర్క్ తీరు ధీటుగా గుర్తింపు ఐంది. సో.. " ఆగాడు మేనేజర్.
"సో. " అంది సంచిక.
"మీ సర్వీసెస్ ను కంపెని వదులుకో తల్చడం లేదు. అందుకనే.. వాగ్దేవి జాబ్ ను తనకే చూపుతూ.. మిమ్మల్ని ప్రత్యేకంగా కంపెని ఎంప్లాయ్ గా నియమించ తలచింది యాజమాన్యం. " చెప్పేశాడు మేనేజర్.
"ఈజ్ ఇట్. " సంచిక చిత్రమవుతుంది.
"కంగ్రాట్స్ సంచిక. యు ఆర్ అవర్ ఎంప్లాయ్ టుమారో ఆన్వర్డ్స్. " గొప్పగా చెప్పాడు మేనేజర్.
సంచిక వెంటనే ఏమీ అనలేదు.
"మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేయిస్తాను. మీ సర్టిఫికేట్స్ రేపు తీసుకు రండి. " చెప్పాడు మేనేజర్.
అప్పటికి సంచిక ఏమీ మాట్లాడ లేదు.
"వై. ఏమిటలా ఉండి పోయారు. " అడిగాడు మేనేజర్.
"మీ ఆఫర్ నచ్చింది. కానీ.. నాకు సంతోషంగా లేదు. " చెప్పింది సంచిక.
"వై. " వెంటనే ప్రశ్నించాడు మేనేజర్.
సంచిక తేరుకుంది.
"నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతడు కూడా నాతో పాటే మీ కంపెని ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు. నాలానే సెలెక్ట్ కాలేదు. " చెప్పుతుంది సంచిక.
"పేరు. " అప్పుడే అడిగాడు మేనేజర్.
"శ్రీకర్. " చెప్పింది సంచిక.
ఆ వెంబడే.. "అతడు నా కంటే బ్రిలియంట్. చాలా ఓపిక ఉంది వాడికి. సహకార తత్వం బాగా ఎక్కువ. మేము చాన్నాళ్లుగా కలిసి జాబ్స్ కై టెస్ట్ లకు హాజరవుతున్నాం. ఏమీ తగల లేదు. ఇప్పుడు నాకు ఇలా అవకాశం కలిసి వచ్చింది. వాడు మాత్రం ఎలోన్ అవుతున్నాడు. యాజ్ ఎ ఫ్రెండ్ గా నాకు సమ్మతంగా లేదు.. స్తిమితంగానూ లేదు. సో. అడుగుతున్నానని ఏమీ అనుకో వద్దు.. వాడికి నాతోనే.. నా లాగే.. మీ కంపెనిలో పోస్టు కల్పించండి. మా వర్క్స్ తో మేము మిమ్మల్ని మిక్కిలిగా ఇంప్రష్ చేస్తాం.. చేయగలం. " ఏక బిగిగా చెప్పింది.
"అదెలా. ఎలా సాధ్యం. " నీళ్లు నములుతున్నాడు మేనేజర్.
"ప్లీజ్ సార్. మీ మేనేజిమెంట్ తో మాట్లాడండి. లేదా అవకాశం ఇస్తే నేనే మాట్లాడతాను. వాళ్లను కన్వెన్స్ చేసు కుంటాను. మా పనితనంతో వాళ్ల మెప్పును తప్పక మెండుగా పొందుతాం.. పొందగలం. " దృఢంగా మాట్లాడింది సంచిక.
మేనేజర్ తడబడుతున్నాడు.
సంచిక మరింత పట్టుగా మాట్లాడుతుంది.
"సరే. మేనేజ్మెంట్ తో మాట్లాడి చెప్తాను. మిమ్మల్ని వదులుకోవడం మేనేజ్మేంట్ కు ఇష్టంగా లేదు. " ఒప్పేసుకున్నాడు మేనేజర్.
సంచిక తన సీట్ వైపుకు వెళ్లి పోయింది.
రెండు గంటల పిదప.. మేనేజర్ కాల్ తో.. సంచిక.. ఆయన కేబిన్ లోకి వచ్చింది.
"మీ పోస్ట్ ఓకే. మీ ఫ్రెండ్ పోస్ట్ మాత్రం.. నెల రోజుల పాటు టెస్టింగ్ లో ఉంచబడుతుంది. అతని పనితనం కంపెనికి ఉపయోగ పడుతుందనిపిస్తే.. అప్పుడు అతని పోస్ట్ పర్మనెంట్ అవుతుంది. " చెప్పాడు మేనేజర్.
సంచిక వెంటనే "సరే. " అనేసింది.
ఆ వెంబడే.. "ఉయ్ విల్ ఎచీవ్.. ఉయ్ విల్ షూర్లీ గెట్ యువర్ అప్రువల్.. మా ఆర్డర్స్ మాకు ఇప్పించండి సార్. " చెప్పేసింది సంచిక.
"సరే. రేపు మీతో పాటు అతనిని తీసుకు రండి. మీ ఇద్దరూ మీ మీ సర్టిఫికేట్స్ ను తెచ్చుకోండి. " చెప్పాడు మేనేజర్.
"మాతో పాటు వాగ్దేవి కూడా రేపటి నుండే వస్తుంది. " చెప్పింది సంచిక.
"తప్పక. యు ఆర్ వెల్కమ్. " చక్కగా నవ్వేడు మేనేజర్.
సంచిక పొంగింది.
***
========================================================================
సమాప్తం.
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ బివిడి ప్రసాదరావు గారి తరఫున, మనతెలుగుకథలు.కామ్ తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.
========================================================================
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments