top of page
Original.png

సరైన సమయం

#SarainaSamayam, #సరైనసమయం, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Saraina Samayam - New Telugu Story Written By Palla Deepika

Published In manatelugukathalu.com On 20/12/2025

సరైన సమయం - తెలుగు కథ

రచన: పల్లా దీపిక

కుమారి అనే అమ్మాయి పదవ తరగతి చదువుతూ ఉండేది. తను ఆటల్లోనూ మరియు చదువులోనూ చాలా చురుగ్గా ఉండేది. కుమారి వాళ్ళ నాన్న ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ఉండేవాడు. విలువలు, క్రమశిక్షణ, నిజాయితీనే అసలైన సంపద అని భావించేవారు. కుమారి తల్లి సుశీల, గృహిణి. ఆమె ఇంటి బాధ్యతలతో పాటు, కుట్టు పనులు చేస్తూ కుటుంబ ఆదాయానికి కొద్దిగా తోడ్పడేది. 


కుమారి తన తరగతిలోఎప్పుడూ మొదటి స్థానంలో వచ్చేది, దానితో తనపై తనకి ఎన్నో ఆశలు ఉండేవి. తన తల్లిదండ్రులు కూడా కుమారి విషయంలో చాలా గర్వంగా ఉండేవారు. తను అనుకున్నట్టుగానే పదవ తరగతిలో మంచి మార్కులు సాధించింది. 12వ తరగతిలో కూడా మంచి మార్కులు సాధించింది కానీ తను అనుకున్న కాలేజీలో సీటు రాలేదు. దానితో ఆరోజు రాత్రి మొత్తం ఏడ్చింది. 


ఆ తరువాత కుమారి ఒక సాధారణమైన కాలేజీలో చేరింది. మొదటి సంవత్సరం మొత్తం ఆమె మనసు దిగులుతోనే గడిచింది. కుమారి తనలో తాను " అందరూ తమ కలల కాలేజీలో చదువుకుంటున్నారు మరియు పోటీలలో గెలుస్తున్నారు కానీ, నేను మాత్రం ఇక్కడ ఒక సాధారణమైన కాలేజీలో చదువుతున్నాను"అని ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు కుమారి క్లాసులోకి కొత్తగా శేఖర్ అనే లెక్చరర్ వచ్చారు. ఆయన క్లాసులో అందరితో ఇలా మాట్లాడారు "జీవితం మనకు కావలసినది వెంటనే ఇవ్వదు. మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం మనల్ని బాగా సిద్ధం చేస్తుంది, అప్పుడే మనకి కావాల్సినది దొరుకుతుంది" అని. 


ఆ మాటలు విన్నాక కుమారిలో చిన్న మార్పు మొదలైంది. ఆ తర్వాత కుమారి తనలో తాను "జరిగిన దాని గురించి ఆలోచించకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మంచి ఉద్యోగం సాధించాలి" అని అనుకుంది. కుమారి నాలుగో సంవత్సరం లో ఉండగా కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ మొదలయ్యాయి. కుమారి కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసింది. కానీ మొదటి రౌండ్లో లేదా రెండో రౌండ్లో రిజెక్ట్ అవుతూ ఉండేది. తన స్నేహితులలో కొంతమంది కి ఉద్యోగాలు వచ్చాయి కానీ తనకు మాత్రం రాలేదు. దానితో ఆమె చాలా బాధపడింది. 


ఒకరోజు తన ఇంటి వెనకాల ఉన్న తోటలో కూర్చుని "నాకు ఇంకా ఏం మిగిలింది" అని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన కుమారి వాళ్ళ అమ్మమ్మ తన తల పైన నిమురుతూ కుమారితో "తల్లీ! ఎందుకు అలా బాధపడుతున్నావు, మనం కోరుకున్నది ఏదైనా సరైన సమయంలోనే వస్తుంది" అని అంది. 


అప్పుడు కుమారి వాళ్ళ అమ్మమ్మతో "మరి అయితే నా సమయం ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ?" అని అడిగింది. 


దానికి వాళ్ళ అమ్మమ్మ కుమారికి ఒక చిన్న గింజ ఇచ్చి దీనిని నాటు నీకు సమాధానం నేల నుంచే వస్తుంది అని చెప్తుంది. 


కుమారి ఆ గింజను నాటింది. రోజు నీళ్లు పోస్తూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ గింజ మొలకెత్తలేదు. కానీ కుమారి స్వభావంలో చిన్న మార్పు మొదలైంది. అవసరంలేని తొందర తగ్గింది. ఆత్మవిశ్వాసం కొంచెం కొంచెంగా పెరిగింది. ఓపిగ్గా ఉండడం మొదలుపెట్టింది. 


కాలేజీ పూర్తయ్యాక కుమారి ఒక చిన్న స్టార్టప్ లో ఇంటర్న్ షిప్ తీసుకుంది. జీతం తక్కువ, పని ఎక్కువ కానీ ఆమె దాని గురించి ఏం ఆలోచించలేదు. ఎందుకంటే ఆమె తెలుసుకుంది జీవితం ఎప్పుడూ ఒక టైం టేబుల్ లాగా గడవదు అని. అలా ఆరు నెలలు పూర్తయ్యాక, పెద్ద ఎమ్మెన్సి కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అపారమైన పోటీ ఉంది, ఈసారి తను ఆ ఉద్యోగం మీద ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. 

 మొదటి రెండు రౌండ్ల తర్వాత ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయింది. ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నకు తగ్గ సమాధానం చక్కగా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత కుమారికి "కంగ్రాట్యులేషన్స్, మీరు సెలెక్ట్ అయ్యారు" అని మెయిల్ వచ్చింది. మొదట ఆమె అసలు నమ్మలేకపోయింది. తరువాత సంతోషంతో తన ఇంటి వెనకాల ఉన్న తోటలోకి వెళ్ళింది. 


సంతోషంతో తోట అంతా కలయ తిరుగుతూ ఉండగా ఆమెకు కనిపించింది. ఆమె నాటిన గింజ చిన్నగా మొలకెత్తింది. హరితవర్ణంలో చిన్ని మొలక మట్టిని తోసుకొని పైకి వచ్చింది. అక్కడే ఉన్న అమ్మమ్మ కుమారితో "గింజ మొలకెత్తడానికి ఇదే సరైన సమయం. అది తొందరగా మొలకెత్తి ఉంటే బలహీనంగా అయిపోయేది, లేదా మొలకెత్తడం ఆలస్యం అయ్యుంటే ఎండిపోయేది"అని అంది. అది విన్న కుమారి తనలో తాను "జీవితం లో మనకు కావాల్సింది ఏది ఆలస్యంగా రాదు. అలా అని మనం దేనికి తొందరపడకూడదు. మనకు ఏం కావాలో అది సరైన సమయంలో మరియు మనం సిద్ధంగా ఉన్నప్పుడు అందుతుంది" అని అనుకుంది. 


***

పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక


వయసు: 21


చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్


హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం


నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page