సర్దుకుపోదాం

Sardhukupodam - Telugu Social Story | B. N. Satyanarayana
సర్దుకుపోదాం - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ
Published in manatelugukathalu.com on 18/09/2026
జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి చిన్న అసౌకర్యాన్ని గొడవగా మార్చాల్సిన అవసరం లేదు.
కొంచెం సహనం, మరికొంచెం అవగాహన ఉంటే ఎన్నో అపార్థాలు సులభంగా తొలగిపోతాయి. “సర్దుకుపోదాం” కథ ఒక సినిమా థియేటర్‌లో జరిగిన చిన్న సంఘటన ద్వారా ఈ మానవీయ విలువను చక్కగా చూపిస్తుంది.చిన్న విషయాల్లో సర్దుకుపోవడం ద్వారా సంబంధాల్లో ప్రశాంతత ఎలా నిలుస్తుందో ఈ కథ తెలియజేస్తుంది.
గోపాల్ సినిమా థియేటర్‌కు చేరుకున్నాడు. తన మోటార్ సైకిల్‌ను పార్కింగ్ ప్లేస్‌లో పెట్టి, తలపై నుండి హెల్మెట్ తీసి, బండికి తగిలించి, అద్దంలో ముఖం చూసుకుని చెదిరిన తన జుట్టును జేబులో ఉన్న దువ్వెనతో సరిచేసుకుని, టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. ప్రేక్షకులు ఎవ్వరూ లేరక్కడ. కౌంటర్ ఖాళీగా ఉంది. తనకు కావలసిన టికెట్‌ను కౌంటర్లో డబ్బు చెల్లించి తీసుకున్నాడు. తీసుకుని లిఫ్టులో రెండో ఫ్లోర్‌కు చేరుకున్నాడు. మొబైల్‌లో టైం చూశాడు. అది 18:30 గం॥లు చూపిస్తుంది.
హాలు లోపలికి వెళ్ళాడు. లైట్లు మినుకుమినుకుమంటూ వెలుగుతున్నాయి. తన మొబైల్ తీశాడు, టార్చి ఆన్ చేశాడు. ఆ వెలుగులో తన సీటు కోసం వెదకసాగాడు. ఒక వరుసలో తనది 12వ నంబరు. వెదుకుతూ నెమ్మదిగా ముందుకు సాగాడు. ఆ సమయంలో పొరపాటుగా ఒక సీట్లో కూర్చుని ఉన్న వ్యక్తి బూటుకాలిపై తన బూటుకాలు పడింది.
అతడు బాధతో చిన్నగా కేక వేశాడు. కొద్ది బాధ, కోపంతో గోపాల్ వైపు చూశాడు. గోపాల్ ‘సారీ’ అని చెబుతూ ఉండగా స్క్రీన్ పై యాడ్స్ మొదలయ్యాయి. స్క్రీన్ నుండి వెలువడ్డ వెలుగులో ఇద్దరూ ముఖాముఖాలు చూసుకోవడం జరిగింది.
ఆశ్చర్యం! గోపాల్‌కు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అతను. ఇద్దరూ ఒకరినొకరు గుర్తు చేసుకుని, ‘హలో సార్’ అంటే ‘హలో సార్’ అంటూ ఇద్దరూ ఒకేసారి విష్ చేసుకున్నారు. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి, “ఏవండీ, మీ సీటు నెంబరు ఎంత?” అని అడిగాడు. గోపాల్, “నాది 12 సర్” అనగానే, ఆ వ్యక్తి, “నాది 13, అయితే ఈ పక్క సీటు మీదే. కూర్చోండి” అన్నాడు.
గోపాల్ ఆ సీటులో కూర్చుని మరొకమారు ఆ వ్యక్తికి సారీ చెప్పాడు. అందుకు అతడు, “పర్వాలేదు లెండి” అంటూ గోపాల్‌తో ముచ్చట్లు మొదలుపెట్టాడు.
కొద్దిక్షణాల్లో స్క్రీన్ పై యాడ్స్ పూర్తయి సినిమా మొదలైంది. దాంతో గోపాల్ నిశ్శబ్దంగా తన సీట్లో ఒరిగి సినిమాను ఆనందించడంలో మునిగిపోయాడు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.
( బొడ్డేడ నూక సత్యనారాయణ )
బి. ఎ.
వయసు: 75 సం॥లు
స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)
ప్రస్తుతం
హైదరాబాద్ లో
స్థిరపడ్డాను
వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో
అక్కౌంటెంట్‌గా చేసి
రిటైర్ అయ్యాను
ప్రస్తుతం వ్యాపార
రంగంలో ఉన్నాను
ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై
పత్రికలకు లేఖలు
రాయడం
రెండు సంపుటాలు కూడా
ప్రచురించడం జరిగింది
ఛిన్న కథలు వ్రాయడం
మొదలుపెట్టాను







Comments