top of page
Original.png

ప్రేమకు మరో కోణం

1 hour ago
3 min read

ప్రేమ అంటే పిల్లలు కోరినవన్నీ ఇవ్వడం కాదు, మంచి విలువలు మరియు మానవత్వం నేర్పడమేనని చూపించే రాధ, గౌరి, తన్వి, రాము

Premaku Maro Konam - Telugu Social story | Nandyala Vijaya Lakshmi

ప్రేమకు మరో కోణం - తెలుగు సామాజిక కథ | నంద్యాల విజయలక్ష్మి

Published in manatelugukathalu.com on 18/09/2026


పిల్లలపై ప్రేమ అంటే వారు కోరిన ప్రతిదీ కొనివ్వడమేనా? “ప్రేమకు మరో కోణం” కథ ఈ ప్రశ్నకు మానవత్వంతో కూడిన సమాధానం చెబుతుంది.పిల్లలకు వస్తువులు ఇవ్వడంతో పాటు మంచి నడవడిక, పంచుకునే గుణం, బాధ్యత వంటి విలువలను నేర్పడం ఎంత ముఖ్యమో ఇందులో తెలుస్తుంది.అదే సమయంలో, కష్టాల్లో ఉన్న ఒక కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన రాధ, గోపి మానవసేవకు చక్కని ఉదాహరణగా నిలుస్తారు.


రాధ, గోపీల గారాలబాల తన్వి. ఈ కాలపు తల్లిదండ్రుల లాగానే వీళ్ళిద్దరూ కూడా కూతురు ఏది కోరితే అది కొని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. తన్వి చూడటానికి బొద్దుగా, ముద్దుగా ఉంటుంది. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు బంగారు బొమ్మ అని అంటూ ఉంటే కొంచెం గర్వంగా అనిపించేది. వాళ్ళ దృష్టిలో పిల్లలకు ఏ లోటూ తెలియకుండా కావాల్సినవి అమర్చడమే అసలైన ప్రేమ.


ఒక రోజు ఒక సంఘటన జరిగింది. ఎదురింటి గుడిసెలో ఉంటున్న వాళ్ళ పిల్లవాడు గట్టిగా సైకిల్ కొనివ్వమని ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ గౌరి, "ముందు ఆ ఏడుపు ఆపు. ఇప్పుడు కొనడం కుదరదు అని చెప్పాను కదా" అని అరిచింది.


తన్వికి ఇదంతా కొత్తగా అనిపించింది. తను ఏది అడిగినా వెంటనే కొని తెస్తారు అమ్మ, నాన్న. కానీ ఏడ్చి గోల చేస్తున్నా కొనమని చెప్పడము వింతగా అనిపించింది ఆ పసి వయసుకు.


ఇంతలో పిల్లవాడి తండ్రి శివ వచ్చి, "నోరు మూయ్" అని ఒక దెబ్బ వేయబోయాడు.


అంతే, వెంటనే పిల్లాడు ఏడుపు ఆపేశాడు. ఇంతలో రాధ వచ్చి, "తన్వి, రా, స్కూల్కి టైమ్ అవుతోంది. నీకు ఇష్టమని పూరి, బిర్యానీ బాక్సులో పెట్టాను" అంది.


తన్వి, "నాకు అవి కాదు, ముందు సైకిల్ కావాలి" అంది.


"సరే, మేము సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాం" అన్నారు రాధ, గోపి.


సాయంత్రం అన్నట్టుగానే తన్వి కోరిన సైకిల్ తెచ్చారు. వెంటనే తన్వి ఎదురింటి వైపు సైకిల్ తీసుకుని వెళ్ళి, "బాబూ, రా! నీకోసము సైకిల్ తెచ్చాను, తీసుకో" అని పిలిచింది.


ఇంతలో గౌరి బయటకు వచ్చింది. తన్వి కోసమని వచ్చిన రాధకు తన్వి మాటలు కొత్తగా అనిపించాయి.


గౌరి, "వద్దు అమ్మా, ఇలా అడిగినవన్నీ కొనడం మొదలుపెడితే పిల్లలు మొండిగా అన్నీ కొనమని వేధిస్తారు. అది మంచిది కాదు. రాము ఇందాకే ఏడుపు మానేసి సైకిల్ టైర్ తో ఆడుకుంటున్నాడు" అంటూనే, "రామూ, ఇటు రా" అని పిలిచింది.


తన్వి, "ప్లీజ్, నేనూ నీ టైరుతో ఆడుకోవచ్చా?" అని అడిగింది.


"రామూ, ఈ అక్కకి ఒకసారి నీ టైరు ఇవ్వు" అంది గౌరి.


ముందు "ఊహూ" అనబోయాడు.


వెంటనే గౌరి, "అది తప్పు. మనకి ఉన్నదానిని పంచుకుంటేనే ఎక్కువ ఆనందం కలుగుతుంది" అని చెప్పగానే ఇద్దరూ కలిసి ఆడుకోవడం మొదలు పెట్టారు.


ఇది చూసిన రాధకి ఆశ్చర్యంగా అనిపించింది.

"పిల్లలకు ఏది అడిగితే అది కొంటేనే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు కాదు. వారికి సరైన వయసులో మంచి నడవడిక నేర్పించడం అవసరం" అంది గౌరి.


రాధకు ఒక్కసారిగా గౌరి మీద గౌరవం కలిగింది. స్నేహపూర్వకంగా ఆమెను చూసి నవ్వింది. రాధ, గౌరి మంచి స్నేహితులుగా మారారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనుకున్న రాధకు గౌరి సాంగత్యం ఎన్నో కొత్త విషయాలను నేర్పింది. పిల్లలు కూడా కలిసి ఆడుకుంటున్నారు.


ఒక రోజు అనుకోకుండా శివ తాగి వచ్చి గౌరిని తిడుతూ కొడుతున్నాడు. వారి వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండలేక రాధ, గోపి ఎదురింట్లోకి వెళ్ళారు.


శివుడిని ఇవతలికి లాగి, "చూడు శివా, ఎందుకు గౌరిని కొడుతున్నావు? ఆమె చేసిన తప్పు ఏమిటి? నువ్వు ఒక్కసారైనా ఆమె గురించి కానీ, పిల్లల గురించి కానీ పట్టించుకోకపోయినా, ఆమె సంసారాన్ని గుట్టుగా నడుపుకుంటోంది. సంతోషించక ఆమెను ఇలా హింసించడం నువ్వు చేస్తున్న పెద్ద తప్పు" అన్నారు.


"అవును, నాకూ తెలుసు నేను జీవితంలో ఎలా మోసపోయానో. తలచుకున్నప్పుడల్లా భరించలేని బాధ. దానిని మర్చిపోవడానికి తాగుడు మొదలుపెట్టాను. తప్పు అని తెలిసీ ఏమి చెయ్యాలో తోచక ఇలా చేతకాని వాడిగా మారిపోయాను" అన్నాడు శివ.


"నా మాట విను, రేపు నాతో రా. నీకు తగిన పని చూపిస్తాను. చేజేతులా పచ్చని సంసారాన్ని పాడు చేసుకోకు" అన్నాడు గోపి.


శివ, గౌరి ఇద్దరూ రాధ, గోపీల కాళ్ళమీద పడ్డారు. "అందరూ మమ్మల్ని చులకనగా మాట్లాడేవారు. దానితో ఏ పని చేయడానికి కూడా కుదరలేదు. చదువు కూడా అంతంతమాత్రమే. మీరు మా పాలిట దేవుళ్ళు" అని చేతులు జోడించారు.


"గౌరీ, రేపటి నుండి నీ పని అయ్యాక మా ఇంటికి రా. నీకు చదువు చెప్తాను" అంది రాధ.


ఆ మర్నాడు శివ గోపితో కలిసి వెళ్ళాడు. ఆఫీసులో పని ఇప్పించాడు. గౌరి కూడా శ్రద్ధగా చదవడం, రాయడం నేర్చుకుంది. ఆమెకు రాధ పని చేస్తున్న స్కూలులోనే 'ఆయా' ఉద్యోగంలో చేరింది. రామూని కూడా అదే స్కూలులో ఫీజు తగ్గించి రాధ సిఫారసుతో చేర్చుకున్నారు. శివ, గౌరిల జీవితాల్లో ఆనందం వెల్లివిరిసింది.


తోటివారికి సహాయపడితే ఆ దేవుడికి సేవ చేసినట్లే. 'మానవసేవే మాధవసేవ' అనే నానుడిని రుజువు చేస్తూ, రాధ, గోపి తమవలన ఒక సంసారం కుదుటపడినందుకు ఎంతో సంతోషించారు.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


నంద్యాల విజయలక్ష్మి

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి

ఊరు. హైదరాబాదు

నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను. రెండు వందలపైగా కవితలు, మూడుకథానికలు రాసాను. యాభై పైగా సర్టిఫికెట్స్, సహస్రకవిమిత్ర బిరుదు పొందాను. పుస్తకపఠనము పై నాకు ఆసక్తి. విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను. ఇంకా ఎన్నో చదవాలని కోరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page