షడ్రుచులు
- Vangeepuram Shashirekha
- Jun 16
- 3 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.
షడ్రుచులు కథ, వంగీపురం శశిరేఖ కథలు, తెలుగు కథ, తెలుగు సాహిత్యం, కుటుంబ కథ, జీవిత పాఠాలు, inspirational Telugu story, Telugu short story, emotional Telugu story, family relationships, life lessons Telugu, contemporary Telugu fiction, Telugu magazine story, తెలుగు చిన్న కథలు, భావోద్వేగ కథలు, జీవితం కథలు

Shadruchulu - Telugu Emotional Family Story | Vangeepuram Shashirekha
షడ్రుచులు - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | వంగీపురం శశిరేఖ
Publishes in manatelugukathalu.com on 16/06/2026
జీవితం ఎప్పుడూ ఒకే రుచితో ఉండదు. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు కలిసిన షడ్రుచుల్లా మన జీవితమూ ఎన్నో అనుభవాల సమాహారం. "షడ్రుచులు" కథలో సుమతి అనే మహిళ అనుకోకుండా యుద్ధ పరిస్థితుల్లో విదేశాల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న మనుషుల జీవితాలను, వారి కష్టసుఖాలను గమనిస్తూ తన జీవితాన్ని కొత్త దృక్పథంతో అర్థం చేసుకుంటుంది. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, సహనం, జీవన సత్యాలను హృద్యంగా ప్రతిబింబించే ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తుంది.
ఫిబ్రవరి 28వ తేదీన హైదరాబాదు విమానాశ్రయం వచ్చేపోయేవాళ్ళతో చాలా రద్దీగా ఉంది. అమ్మాయి పురుడు కోసమని సుమతి అమెరికాకు ప్రయాణం కట్టింది. "నాకు అన్ని రోజులు సెలవులు కష్టం" అనడంతో భర్త లేకుండానే ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. ఈ మధ్య చీటికీ మాటికీ విసుగులు, కోపాలు ఎక్కువయ్యాయి; కొన్ని రోజులు దూరంగా వెళ్తే నాక్కూడా కాస్త మార్పుంటుంది, నా విలువ కూడా తనకి తెలిసొస్తుంది అనుకుంది. వాళ్ళిద్దరి మధ్య చెప్పుకోదగ్గ సమస్యలేమీ లేవు కానీ, ఏదో నిరాసక్తత.
సుమతి అబుదాబిలో విమానం మారి అమెరికా చేరుకోవాలి. అబుదాబిలో దిగిన తర్వాత అంతా గందరగోళంగా, హడావుడిగా ఉండటంతో సుమతి భయపడిపోయింది. అసలు విషయం విన్న తర్వాత కంగారు పడిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడంతో, అక్కడి నుండి ఇంకో విమానం ఎక్కే పరిస్థితులు లేవు. అందరి ముఖాల్లో భయం, ఆందోళన; సుమతికైతే దిక్కు తోచలేదు.
ఇంటర్నెట్ సేవలు ఆపివేయడంతో, ప్రయాణీకులు వాళ్ళ బంధువుల భయాందోళనలతో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందరినీ కొన్ని బృందాలుగా చేసి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
సమయం గడిచేకొద్దీ మెల్లగా ప్రయాణీకులు స్థిరపడి, పక్కవాళ్ళతో సంభాషించసాగారు. సుమతి పక్కనే ఓ యువజంట, వారిద్దరికీ ఓ ఏడాదిన్నర బాబు, చూడముచ్చటగా ఉన్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బాబుని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మాటల్లో ఆ అమ్మాయి సుమతికి చెప్పింది - ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులని. చాలా సఖ్యంగా ఉంటారు, ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసిమెలిసి చేసుకుంటారట.
కొంచెం దూరంలో ఒక మధ్య వయస్సులో ఉన్న జంట; అతను ఆవిడతో చాలా కరుకుగా మాట్లాడుతున్నాడు. ఆవిడ మౌనంగా వింటోంది. "డబ్బంటే లెక్క లేదు నీకు, విచ్చలవిడిగా ఖర్చు పెడతావు. అసలు ఒళ్ళుపైనా తెలియటం లేదు" అంటూ అతను అంటున్న మాటలు సుమతి చెవిన పడ్డాయి. అతను దూరంగా వెళ్ళినప్పుడు మెల్లిగా మాటలు కలిపింది సుమతి ఆమెతో. ఆమె గవర్నమెంటు ఉద్యోగస్తురాలు. అతనికి సరైన ఉద్యోగం లేదు కానీ పెత్తనం అంతా అతనిదే; అది విని హతాశురాలైంది సుమతి.
ఎక్కడ చూసినా చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళే పిల్లలు - ఎవరి గాధలు వారివి, ఎవరి బాధలు వారివి. తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు మరియు కారం... షడ్రుచులు కలిపిన జీవితం అయితే, కొందరికి తీపి మోతాదు ఎక్కువ, కొందరికి చేదు మోతాదు. అందరికీ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉండదు.
అలా మూడు నాలుగు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపి, భయం భయంగా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపి, దఫదఫాలుగా తిరిగి ఇండియాకు చేర్చబడ్డారు.
విమానాశ్రయంలో భర్తని చూస్తూనే ప్రాణం లేచొచ్చింది సుమతికి. అతను కూడా చాలా కంగారుపడ్డట్లు తెలుస్తూనే ఉంది. ఏమీ సమస్యలు లేకపోయినా గోరంతలు కొండంతలుగా మలచుకోకూడదు. జీవితంలో అన్నీ సహనంతో ఎదుర్కోవాలి. బహుశా తనకొచ్చిన సమస్య ఇంకెవరికీ రాదు, అందరూ ఏమనుకుంటారో అని విపరీత ధోరణిలో ఆలోచించడమే దానికి కారణం. కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలెయ్యడమే, ఇకపై అలాగే ఉండాలి వీలైనంత వరకు అనుకుంది సుమతి.
***************************************
వంగీపురం శశిరేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వంగీపురం శశిరేఖ
నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం
గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా
ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. మా మనవడు
ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.




Comments