కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Star ki..' New Telugu Story Written By Venku Sanathani
రచన: వెంకు సనాతని
వెండి తెర మీద ఆనందంతో స్టెప్పులు వేస్తూ వుండే స్టార్ లకి కూడా గుండెల్లో విషాదం ఉంటుందని తెలిపే ఈ కథను ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించారు.
ఫోటోషూట్ బాగొచ్చింది అక్షయ్..!! హీరోగా ఆఫర్స్ వచ్చే పాసిబులిటీ ఉంది. "మే బీ ఇట్ విల్ సూన్" అన్న ఫోటోగ్రాఫర్ సన్నీ మాటలకు చిన్న చిరునవ్వుతో సమాధానమిచ్చాడు అక్షయ్.
***
అక్షయ్! హీరో అవ్వాలని.. స్టార్ గా వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కనే వాళ్ళలో అతడూ ఒకడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి, అదీ ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుండి వచ్చిన వాడు. రెండు మూడు సినిమాల్లో హీరో ఫ్రెండుగా నటించాడు. హీరో అవ్వాలన్న దృఢనిశ్చయంతో ప్రయత్నాలు సాగిస్తున్నాడు.
కొత్తగా ఫోటోషూట్ చేసిన ఫొటోలను తెలిసిన దర్శక నిర్మాతలకు, స్టూడియోలకి పంపటం, తెలిసిన నిర్మాత కబురు చేసి ఓకె అనటం, ముహూర్తపు సన్నివేశానికి శ్రీకారం చుట్టటం, ప్రముఖులతో క్లాప్ కొట్టించటం అన్నీ చకచకగా జరిగిపోయాయి.
ఫస్ట్ షెడ్యూల్ హైదరబాద్ శివారు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సెకండ్ షెడ్యూల్ కులుమనాలి ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఫస్ట్ మూవీ అందులోనూ సెకండ్ షెడ్యూల్ మనాలి..
అక్షయ్ ఆనందానికి అవధుల్లేవు! ప్రయాణ తేదీ ఖరారైంది. అన్నీ ఏర్పాట్లతో చిత్ర యూనిట్ మానాలి బయలుదేరింది.
***
ప్రకృతి అందాల నడుమ హీరో హీరోయిన్లపై పాట చిత్రీకరణ జరుగుతోంది. అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సగం పాట పూర్తి చేశారు. తదుపరి చిత్రీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొద్దిగా తీరిక దొరకడంతో కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతున్నాడు అక్షయ్. మేకప్ మాన్ తన పనిలో తానున్నాడు.
ఇంతలో అక్షయ్ ఫోన్ మోగటంతో, ఫోన్ తీసి చూస్తే "అన్ నౌన్ నంబర్!". లిఫ్ట్ చేద్దామా వద్దా అన్న సందేహానికి సమాధానంగా లిఫ్ట్ చేస్తాడు. అవతలి వైపు నుండి ఏడుపుతో కూడిన మాటలు వినపడుతున్నాయి. సరిగా అర్థం కాక పోయేసరికి మేకప్ మాన్ ని ఆపు అన్నట్లుగా చేతితో సంజ్ఞ చేస్తాడు!
"హలో.. ఎవరు మాట్లాడేది?"
"అక్షయ్! నేనురా అమ్మని!" అంటూ బోరున ఏడ్చింది పద్మ.
అమ్మా.. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా, అన్నాడు అక్షయ్.
"మీ నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చిందిరా..!! హాస్పిటల్ కి తీసుకుని వచ్చాం..!! కంగారులో ఫోన్ మర్చిపోయాను. పక్కన వారి దగ్గర తీసుకుని చేస్తున్నాను. ఆపరేషన్ చేయాలని అంటున్నారు! నాకు భయంగా ఉందిరా..! నువ్వు రారా..!!" ఏడుస్తూ విషయం చెప్పి ఫోన్ పెట్టింది పద్మ.
ఆ మాటకు ఏం మాట్లాడాలో అక్షయ్ కి అర్థం కాలేదు. చుట్టూ చూశాడు! చిత్ర యూనిట్, మిగిలిన సగం పాట చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి చిత్రీకరిస్తున్నారు. తొలి అవకాశం పెద్ద బ్యానర్లోనే పురుడు పోసుకోబోతుంది. నాన్న ప్రాణం కంటే ఇవేం ఎక్కువ కాదు. కానీ, విషయం చెప్తే తన వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. “ఏం చేయాలి?” ఇలా! క్షణంలో లక్షల సందేహాల సందోహాలు అక్షయ్ మనసుని సంధించాయి.
నిర్మాత చిరునవ్వుతో తన వైపే చూస్తూ “ఏమైంది?” అన్నట్లుగా కళ్ళు ఎగరేశాడు. ఉబికి వస్తున్న కన్నీళ్ళను రెప్పల వెనుకే దాచి, అతి బలవంతం మీద తెచ్చుకున్న చిన్న చిరునవ్వుతో “ఏం లేదు!” అన్నట్లుగా తలూపాడు అక్షయ్!!
“సార్..! షాట్ రెడీ!” అన్న అసిస్టెంట్ డైరెక్టర్ మాటలకు కెమెరా ముందు కొచ్చాడు అక్షయ్!!
పాట ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్, కొద్దిగా డిఫెరెంట్ గా ఉంటుందని, మితిమీరి స్టెప్పులు వేయాలని, మధ్య మధ్యలో హీరోయిన్ తో రొమాన్స్ కూడా ఉంటుందని ఇలా పలు విధాలుగా సాంగ్ సెకండ్ పార్ట్ గురించి వివరించారు దర్శకుడు, కొరియోగ్రాఫర్.
అన్నీ వింటున్నాడే కానీ మనసంతా తండ్రి గురించే ఆలోచిస్తుంది.
“అక్కడే మో తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు!”, “ఇక్కడే మో చిందులెయ్యాలి అంటున్నారు!”
వదిలితే వరదవ్వాలన్న కన్నీళ్లకు ఆనకట్ట వేసి గట్టిగా నిట్టూర్చాడు అక్షయ్.
దర్శకుడు సైలెన్స్ అన్న మాటకు, చెట్టూ చేమలు కూడా విన్నట్టున్నాయి. చుట్టూ అంతా నిశ్శబ్దం అలుముకుంది. కానీ అక్షయ్ మనసులో అంతులేని అలజడి రేగుతుంది.
“ఓకె సౌండ్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్..” చెప్పాడు డైరెక్టర్.
సాంగ్ ఫస్ట్ పార్ట్ కి, ఒక షాట్ రెండు మూడు టేకులు మాత్రమే తీసుకున్న అక్షయ్, రెండవ పార్ట్లో అయిదారు టేకులైనా అవ్వటం లేదు. కొరియోగ్రాఫర్ మళ్ళీ మళ్ళీ చెప్పి చేయిస్తున్నాడు. అయినా అక్షయ్ మొదటికే వస్తున్నాడు. దర్శక నిర్మాతలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“అక్షయ్! ఆర్ యూ ఓకె..” అన్నాడు డైరెక్టర్.
ఆ మాటకు, నెల ముందు వరకు పడిన చీత్కారాలు, చీవాట్లు, ఒక్క సారిగా అక్షయ్ కళ్ళ ముందుకు వచ్చాయి. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఇంతలా పరీక్షిస్తుందని , అంతకు మించి బాధిస్తుందని ఊహించి ఉండడు తను. నిజమే.. ఎవరైనా సుఖాన్ని ఊహించగలరు కానీ బాధను ఊహించగలరా..
గొంతులో ఉన్న బాధను అక్కడే దాచి, “యా.. ఐ యామ్ ఫైన్! ఐ యామ్ ఫైన్! అన్నాడు అక్షయ్. ఇష్టపడిన వృత్తిని అతిఇష్టంగా చేయటమే అక్షయ్ కి తెలుసు. కానీ, అతికష్టం మీద సాంగ్ సెకండ్ పార్ట్ పూర్తి చేసే సరికి సాయంత్రం అయ్యింది. షూటింగుకి పేకప్ చెప్పాడు దర్శకుడు.
వెంటనే ఫోన్ అందుకున్నాడు. ఉదయం తల్లి చేసిన ఫోన్ నంబర్ కి కాల్ చేసాడు. “స్విచ్ ఆఫ్ అని వస్తుంది!”, తల్లి ఫోన్ కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ, “సమాధానం లేదు!” ముఖమంతా చెమటలు పట్టాయి. ఆ చెమటను తుడుచుకుని కుర్చీలో వెనక్కి వాలి, "అమ్మకు రాలేను!!" అన్న సమాచారం సమాధానంగా చెప్పిగలనా..!! ఆ ఆలోచనకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ క్షణం, అక్షయ్ కి! తనకు తానే ఓ కరుడుగట్టిన ఖలుడిలా కనిపించాడు. సెకండ్ షెడ్యూల్ వారం రోజుల్లోనే పూర్తవ్వటంతో హైదరబాద్ వచ్చేసింది చిత్ర యూనిట్.
***
కాళ్ళకు తడి తగలటంతో పడుకున్న శేఖర్ కి మెలకువ వచ్చింది. తండ్రి కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అక్షయ్!! నాన్నా నన్ను క్షమించు! తండ్రి ప్రాణం కన్నా సినిమానే ఎక్కవని నిరూపించిన కొడుకుని!! క్షమాపణ కోరే అర్హత కూడా నాకు లేదు!! అంటున్న అక్షయ్ కన్నీళ్ళతో తండ్రి పాదాలు తడిసి ముద్దయ్యాయి.
ఇంతలో పక్కనే పడుకున్న అమ్మ కూడా లేవటంతో, అమ్మ ఒడిలో తలపెట్టి చంటి పిల్లాడిలా బోరున ఏడ్చాడు అక్షయ్. ఊరుకో నాన్నా..! నాన్నకు ఏం కాలేదు!! అంటూ తల నిమురుతూ ఓదారుస్తున్న తల్లిని చూసి, నవ్వుతూ చూస్తున్న తండ్రిని చూసి బాధంతా ఎటో ఎగిరిపోయింది. తల్లిదండ్రులకు ఏం తెలుసు? తాము కష్టాన్ని దాచుకుని పిల్లలకు ప్రేమను పంచటం తప్ప! అక్షయ్ తల్లిదండ్రులు అదే చేశారు. ఇద్దరికీ కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అక్షయ్.
***
"హీరో!" అనే పేరుతో చిత్రం విడదలై థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఓ థియేటర్లో ప్రేక్షకుల మధ్యనే కూర్చున్నాడు అక్షయ్. మనాలి పాటకు వంత పాడుతూ తెర ముందు స్టెప్పులు వేస్తున్న ప్రేక్షకులను చూసి ఆనందించినా.., పాట చిత్రీకరణ సమయంలో జరిగిన పరిణామాలన్నీ మనసు తెర మీద వరుస పెట్టి మరీ కనపడ్డాయి. కొద్దిసేపు ఆలోచనలో పడినా.. ప్రేక్షకుల గోలలకు, ఈలలకు తేరుకున్నాడు.
“స్టార్..! స్టార్..!!” అంటూ ఒకటికి వెయ్యింతలుగా ఉన్న కేరింతలను చూస్తూ, రీల్ కి, రియల్ కి అసలు పోలికుండదు. చాలా మందికి ఇది తెలీదు. చిత్రంలో అసామాన్య ప్రతిభ కలిగిన స్టార్ కూడా బయట ప్రపంచంలో ఓ సామాన్య మనిషే! “స్టార్ కీ కష్టాలు ఉంటాయి!” “స్టార్ కీ కన్నీళ్ళు వస్తాయి!!” అన్న ఆలోచనలకు సమాధాన మిచ్చి, తండ్రిని కాపాడిన దేవుడికి, తమను కాపాడే ప్రేక్షక దేవుళ్ళకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుని, రుమాలుతో ముఖం కప్పుకుని థియేటర్ బయటకు నడిచాడు అక్షయ్.
శుభమ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
పేరు : వెంకు సనాతని
అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత
ఊరు : బాపట్ల
జిల్లా : గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
Comments