top of page

సుధ - ఎపిసోడ్ 3


'Sudha Episode 3' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala

'సుధ - ఎపిసోడ్ 3' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కధ….


రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింది సుధ. క్లాస్మేట్ విజయ్ తో పరిచయాన్ని, అతని గతాన్ని గుర్తుచేసుకుంది. విజయ్ తండ్రి రాఘవరావుకు రేవతి వలన దీప పుట్టింది. విజయ్, దీపలు చక్కగా పెరిగి చక్కగా చదువుకుంటున్నారు. సుధ తన తండ్రిని తలుచుకుంటూ మంచిమార్కులతో డిగ్రీ పాసై ఏదైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అని మనసులో అనుకుంది.


ఇక ఈ వారం కధ…


సుధ కాలేజి నుంచి వస్తుంటే విజయ్ కలిశాడు. ఇద్దరూ నడుస్తూ కాసేపు రాబోయే పరీక్షలు, వాటికి ఎలా సన్నధ్ధం కావాలో మాట్లాడుకున్నారు. ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. విజయ్ ఇంటికి వెళ్లేటప్పటికి రాఘవరావుగారు వరండాలో హడావిడిగా తిరుగుతూ కన్పించారు. ఆయన ముఖం చాలా ఆందోళనగా ఉంది. విజయ్ ఆయన దగ్గరగా వెళ్లి "ఏంటి నాన్నా! అలా ఉన్నారు? ఏమైంది?" అని అడిగాడు. ఆయన చెప్పేలోగానే విజయ్ రాకను గమనించిన రేవతి లోపలినుంచి హడావుడిగా వస్తూ "బాబూ! విజయ్! దీప ఇంకా ఇంటికి రాలేదు. కాలేజీ నుంచి ఫోన్ చేసి తన స్నేహితురాలు మాధవి వద్దకు వెళుతున్నాను. అని చాలా కంగారుగా చెప్పింది. మాధవి హాస్టల్ లో ఉంటోందని దీప లోగడ ఒకసారి మాటల్లో చెప్పింది. అక్కడేం జరిగిందో? ఏమిటో? తను ఫోన్ చేసి చెప్పి కూడా చాలా సేపయింది. నాకు చాలా కంగారుగా ఉంది " అంది రేవతి.


అది విన్న విజయ్ ఆమెకు దగ్గరగా వెళ్లి

"ఏం భయం లేదమ్మా! చెల్లాయికి ఏమీ కాదు. పరీక్షలు జరుగుతున్నాయి కదా! కాసేపు తన స్నేహితురాలితో వాళ్ల హాస్టలుకు వెళ్లిందేమో! నేను దీపకు ఫోన్ చేసి తెలుసుకుంటా. నీవు ధైర్యంగా ఉండు. " అన్నాడు విజయ్. వెంటనే దీపకు ఫోన్ చేసి ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయి అది బయటకు కనిపించకుండా " నీవక్కడే ఉండు. నేనిప్పుడే వస్తున్నాను. నీవు ఉన్న చోటు అడ్రసు చెప్పు. " అన్నాడు విజయ్. దీప చెప్పగానే అతను ఫోన్ పెట్టేశాడు.


జరిగిందేంటో తెలియక విజయ్ వేపు చూస్తున్న తల్లితండ్రులకు "ఏంలేదు. దీప క్షేమంగా మాధవి వద్ద ఉంది. నేను వెళ్లి దీపను తీసుకుని వస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. " అని వెంటనే బయలుదేరి దీప చెప్పిన గవర్నమెంట్ హాస్పిటలుకు వెళ్లాడు విజయ్. అక్కడికి వెళ్లేటప్పటికి పోలీసులు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్లో దీప చెప్పిన రూమ్ నెంబరుకు వెళ్లగానే కంగారుగా దీప ఎదురొచ్చింది. ఆ వెనకే మాధవి కూడా వచ్చింది. వాళ్లతో పాటే ఇంకాస్త ముందుకు వెళితే బెడ్ మీద ఒక బాలిక కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. దీప ఆమెని చూపిస్తూ "అన్నయ్యా! ఈమె నీకు తెలియదు కదా! ఈమె సుమ. మాధవి చెల్లెలు. కాలేజీ నుంచి మేము రావడం కాస్త ఆలశ్యమైనా, హాస్టల్ వాళ్లు సమయానికి తనని హాస్పిటల్ లో చేర్చకపోయుంటే తనీపాటికి శాశ్వతంగా ఈలోకాన్ని వీడి ఉండేది. మైగాడ్! ఎంత గండం తప్పింది?" అంది దీప.

విజయ్ సుమ వంక చూశాడు. కళ్లు మూసుకొని పడుకున్నా ఆమె ముఖంలో ఏదో ఆందోళన, బాధ కనపడుతోంది. వెంటనే మాధవి వంక చూశాడు. బాధతో ఏడ్చినట్లుగా తన కళ్లు చాలా ఉబ్బి ఉన్నాయి. ఇంక తనను అడిగి బాధపెట్టడం ఇష్టం లేక "దీపా! ఏం జరిగిందో చెప్పు" అన్నాడు విజయ్.

దీప వెంటనే "అన్నయ్యా! మాధవి, సుమ లకు చిన్నప్పుడే తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోతే దూరపు బంధువు ఒకరు చేరదీసి పెంచి పెద్దచేశారుట. ఇద్దరూ ఇక్కడ ఉచితంగా హాస్టలులో ఉంటూ కష్టపడి చదువుతున్నారు. మాధవి లాగానే సుమ కూడా బాగా చదివే పిల్ల. సుమ పదవతరగతి పరీక్షలు వ్రాసింది మొన్ననే వాటి ఫలితాలు వచ్చాయి. సుమ రాష్టస్ధాయిలో రాంకు వస్తుందని పగలూ, రాత్రి కష్టపడి చదివి పరీక్షలు వ్రాసిందిట. ఫలితాలమీద ఎంతో ఆశ పెట్టుకుందిట. ఎక్కడ జరిగిందో పొరపాటు తెలీదు కానీ తీరా తనకి ఫస్ట్ క్లాసు మాత్రమే వచ్చిందట. దీంతో తను పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయిందని తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయి నిద్ర మాత్రలను మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిందిట. తన క్లాసమేట్ గమనించి హాస్టలు వార్డెనుకు, మాధవికి ఫోన్ చేసింది. విషయం విన్న మాధవి ఏడుస్తుంటే తనను ఓదార్చి వెంటనే నేను కూడా తనతో వచ్చాను. అప్పటికే హాస్టలు వాళ్లు ఆమెను అంబులెన్సులో హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు శ్రమించి తనని బ్రతికించారు. కాసేపటికి తను స్పృహలోకి వస్తుంది. ప్రమాదం తప్పింది అన్నారు డాక్టర్లు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు" అంది దీప.


కాసేపటికి సుమకి స్పృహ వచ్చి కళ్లు తెరవగా మాధవి, దీప ఆమెకి దగ్గరగా వెళ్లారు. మాధవి సుమకు విజయ్ ను పరిచయం చేసింది. విజయ్ ఆమె వద్దకు వెళ్లి కూర్చుని "చూడు సుమా! అంతా విన్నాను. నేను నీకు అన్నయ్య లాంటి వాడిని. నాకు దీప ఎంతో ఇకనుంచి మీరిద్దరూ అంతే. పరీక్షలలో రాంకు రాకపోతే ఏమైంది? మరలా పరీక్షలు వ్రాయచ్చు. రాంకు రాలేదని విలువైన జీవితాన్ని కోల్పోతామా? ప్రతి సమస్యకు చావొక్కటే మార్గమనుకుంటే ఈ భూమ్మీద ఎవరూ మిగలరు. ఇంకెప్పుడూ ఎలాంటి అఘాయిత్యము చేయనని నాకు మాటివ్వు". అని అనునయంగా ఓదార్చి సుమకి ధైర్యం చెప్పాడు.



తర్వాత డాక్టర్లతో‌, పోలీసులతో మాట్లాడి కష్టపడి వాళ్లని ఒప్పించి కేసు లేకుండా చేశాడు. వాళ్ల ముగ్గురినీ తనింటికి తీసుకొచ్చాడు.


========================================================================

ఇంకా ఉంది...


========================================================================

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


49 views0 comments
bottom of page