top of page
Original.png

తప్పేంటి???

2 hours ago
4 min read

“తప్పేంటి?” కథకు ప్రతీకగా ఆధునిక జీవితం మరియు కుటుంబ విలువల మధ్య ఆలోచనలో ఉన్న తెలుగు వ్యక్తి

Tappenti - Telugu Social Story | Bhaskara Rao B. R. K. V.

తప్పేంటి??? తెలుగు సామాజిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 19/09/2026


“తప్పేంటి?” అనే ప్రశ్న నేడు మనిషి తీసుకునే ఎన్నో నిర్ణయాలకు సమర్థనగా మారుతోంది. కుటుంబ బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, సంప్రదాయాలు, సుఖాన్వేషణ వంటి అంశాలను రచయిత ఈ కథనంలో ప్రశ్నించారు. ప్రతి పనినీ “తప్పేంటి?” అంటూ సమర్థించుకునే ముందు, దాని పర్యవసానాలను ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది ఈ రచన. నేటి సమాజం పురోగమిస్తోందా? లేక విలువలను కోల్పోతుందా? అనే ఆలోచనను పాఠకుడిలో రేకెత్తించే సామాజిక చింతనాత్మక కథనం ఇది.


అర్జంటుగా ఈ పదాన్ని తెలుగు భాషలోంచి తొలగించాలనిపిస్తుంది అప్పడప్పుడు నాకు. ఒక్క తెలుగులోనే కాదు ప్రపంచ భాషల్లో దీనికి చోటు లేకుండా చేస్తే బావుణ్ణు. నేటి రోజుల్లో ఈ పదం అణుబాంబు కంటే ప్రమాదకరం. ఎలాగంటారా??

తెల్లవారుజామునే నిద్ర లేవాలా? ఎనిమిదింటికి లేస్తే తప్పేంటి? సమాధానం ఏమని చెప్పాలి?


చిన్నప్పట్నుంచి ఎదురింటి అంకుల్ సిగరెట్టు కాలుస్తున్నానని చాలాసార్లు నాతో ఎన్నోసార్లు చెప్పాడు. ఒకవేళ కాల్చకపోతే బాత్రూమ్మే రాదట. అన్ని సిగరెట్లు తాగిన రాయిలా ఉన్నాడు. నేను రోజుకు నాలుగు సిగరెట్లు తాగితే తప్పేంటి?

సమాధానం దొరకని తల్లి బేలగా చూసింది.


ఉదయం నుంచి కష్టపడ్డ నాకు రాత్రిళ్ళు నిద్రపట్టకపోతే నాలుగు పెగ్గులేస్తే తప్పేంటి? ఏ భార్య దగ్గరుంది దీనికి సమాధానం?


నిన్ను చూస్తుంటే బోర్ కొడుతోంది, విడిపోదామా? పిల్లల్ని హాస్టల్లో వదిలేద్దాం. దీనిపై నీ అభిప్రాయం?


నాకు అలాగే ఉంది, నాకు కొత్తగా వేరేవారితో జీవించాలని ఉంది. పిల్లల గురించి నాదగ్గర ఒక సొల్యూషన్ ఉంది. నువ్వు, నేను కలసి కొంతకాలం ఉద్యోగం చేసి వచ్చిన ఇన్కం వాళ్ళ చదువులకి కట్టేద్దాం. తరువాత విడిపోదాం. ప్రాబ్లెమ్ సాల్వ్.. సంతోషం దానికదే రాదు, తెచ్చుకోవడంలో తప్పేంటి?


కొద్ది రోజులు ఒకే ఇంట్లో సహజీవనం చేద్దాం. ఎంజాయ్ చేద్దాం. అభిప్రాయాలు ఒకటైతే కంటిన్యూ అవుదాం. లేకపోతే విడిపోదాం. ఒకరి మనసులు ఒకరు తెలుసుకోక పెళ్ళి చేసుకుని విడాకులు తీసుకోవడంకంటే ఈ పద్ధతి ఫాలో అవడంలో తప్పేంటి?

సంపన్నవంతమైన ఒక దేశం ఆర్థికంగా బలహీనమైన ఇంకో దేశాన్ని ఆక్రమించడంలో తప్పేంటి?


నాన్న వీలుదొరికినప్పుడల్లా సెల్ చూస్తున్నాడు. నువ్వేమో ఖాళీ ఉన్నప్పుడల్లా టీవీ చూస్తున్నావు. నేనేమో గంట సెల్ చూస్తే తప్పేంటి?


సంద్రంలోని ఇసుక రేణువంత పరిమాణం కల ఈ ఉదాహరణలు నేటి సమాజంలోని వికృత చేష్టలకు ఏ మూలకు సరిపోతాయి?


మనది పురోగమనమా? తిరోగమనమా?


ప్రతినిత్యం ఆనందాన్ని కోరుకునే మనిషికి దుఃఖాన్ని తట్టుకునే ఓపిక లేదు. నేటి రోజుల్లో పెళ్ళికి సరేసరి, చావుని కూడా ఆర్భాటంగా చేసి బంధువులతో సంతోషంగా ఉంటున్నారు. స్వార్థపూరితమైన మనిషి బంధబాంధవ్యాలను తుంగలోకి తొక్కి తన సుఖాల కోసం చేయని అకృత్యం లేదు, తొక్కని అడ్డదారి లేదు.


సృష్టి రహస్యాన్ని భేదించే క్రమంలో శాస్త్రజ్ఞులు అహర్నిశం కష్టపడుతుంటే, ధనార్జనలోనే సుఖముందని భ్రమపడే అమాయకులు సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతారు?


'తప్పేంటి' అనే ప్రశ్న జననం ఇప్పటిది కాదు. మహార్షుల కాలంలోనే ఉద్భవించినా, వారు దాన్ని తమ తపశ్శక్తితో నిరోధించి, వాటి వల్ల వచ్చే అనర్థాలను గ్రహించి, అల్పబుద్ధికల కలియుగ మానవులు నాశనమవకుండా కొన్నింటిని రహస్యాలుగా ఉంచి, వాటి జోలికి వెళితే ప్రాణాలకే ముప్పు అని భయపెట్టి కాపాడారు.


మరికొన్నింటిని సంప్రదాయాల పేరిట బంధస్థం చేసి సమాజంలో అవి తప్పనిసరి చేశారు. ఉదాహరణకు పెళ్ళి వంటివి. గుప్పెడు మూసి ఉంచినప్పుడు దానిలో ఏదో ఉందని తాపత్రయపడుతూ, ఎప్పటికైనా దాని మర్మాన్ని ఛేదించాలని ఆరాటపడతాం. కానీ దానిలో ఏమీలేదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక తరం, తరువాతి తరం కూడా అంతే ఆసక్తి చూపేలా గుట్టుగా ఉంచుతారు.


ఎందుకంటే గుప్పెడు మూసినప్పుడే దేనితోనైనా యుద్ధం చేయగలం. అదే విడిపోతే ఉమ్మడి సంసారం విడిపోయినట్టు వేళ్ళు ఒక్కొక్కటిగా దూరమై సంసారం బలహీనపడిపోతుంది. ఇప్పటి తరం గుట్టు విడదీయడమే పనిగా పెట్టుకుని సమాజాన్ని బలహీనపరుస్తోంది. రహస్యాన్ని తెలుసుకున్నాం అనుకుంటున్నారు తప్ప దాని అంతరార్ధాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇటువంటివి ఎన్నో రహస్యాలుగా ఉంచి భయపెట్టడంవల్ల అనర్థాలు దరిచేరవు.


ఉదాహరణకు చిదంబరంలోని ఆకాశలింగాన్ని దర్శనం చేసుకోవడానికి నిత్యం ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉంటారు. తీరా అక్కడకు వెళ్ళాక గర్భగుడిలో శివలింగం ఉండదు. ఒక తెర కట్టి ఉంటుంది, దానివెనుక ఏముందో ఇప్పటికీ తెలియదు. దాన్ని రహస్యంగానే ఉంచి భక్తిని ప్రజల్లో పెంచుతున్నారు. అందుకే మనకు తెలియని రహస్యాన్ని చిదంబర రహస్యం అనడం పరిపాటి అయింది. కొన్నింటిని గుట్టుగానే ఉంచితే మంచిదని మన పెద్దలు మన మంచి కోసమే చెప్పారు.


పెళ్ళి అనే ఒక తంతును పూర్వికులు మరియు కొందరు చాందసవాదులు బలవంతంగా మనపై రుద్దారని భావించి, ఒక పురుషుడు, స్త్రీ కలిసి ఉండటానికి పెళ్ళి అనే ఖర్చు వేడుక అవసరమా అని ప్రశ్నించిన చాలామంది నేటి యువత దాన్ని విసర్జించి, నానా పేర్లు పెట్టి ఒకటై ఉంటూ పిల్లల్ని కూడా కనకుండా శారీరక వాంఛ తీర్చుకుంటున్నారు.


మేము చేస్తున్నది తప్పుకాదని, భగవంతుడు ఇచ్చిన మేనును సుఖపెట్టకపోతే దానిలో నివసించే ఆత్మ క్షోభిస్తుందని, ఆత్మ యొక్క సంతోషాలు, బాధలు అనుభవించేది శరీరమే కదా, అటువంటి శరీరాన్ని సుఖింపజేయడమే మానవుని విధి అంటూ తాము చేస్తున్న పనిని సమర్థించుకుంటున్నారు కొంచెం తెలివైన వాళ్ళు.


ఆదినుంచి మన సంప్రదాయాలు, పద్ధతులు, రహస్యాల వెనకున్నది సైన్స్. కొత్తదనాన్ని అంత తేలికగా తీసుకుని మనకు ఈ రూపంగా అందిస్తే తప్పకుండా ఆచరిస్తారని మన పూర్వికుల నమ్మకం.


'తప్పేంటి' అని ప్రశ్నించడానికి మునుపే, 'తప్పేంటి' అనే పదంలోనే తప్పు ఉందని గ్రహించి వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే, ఎవరినీ తాము చేసినదానిలో తప్పేముందని అడగాల్సిన అవసరం లేదు.

*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page