top of page
Original.png

తెలియని - "పడవ వాడి - పండితుడి" కథ!

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #TeliyaniPadavaVadiPandithudiKatha, #పడవవాడిపండితుడికథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Teliyani Padava Vadi Pandithudi Katha - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 06/03/2026

తెలియని - "పడవ వాడి - పండితుడి" కథ! - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


తెలిసిన కథ:


ఒక పడవ వాడు పడవ నడుపుతున్నాడు. అందులో కూర్చున్న ఒక పండితుడి వాక్ధాటి ఇలా నడుస్తున్నది: "అయ్యో! నువ్వేమీ చదువుకోలేదా? నీ సగం జీవితం వృథా అయినట్టే."


పడవ వాడి కడుపు మండిపోయింది ఈ ఏకధాటి స్వయం పొగడ్తలకు, ఇతరులను కించపరిచే విధానానికి, అడగని ఉచిత సలహాకు.


ఇంతలో పడవలో నీరు చేరి పడవ మునిగిపోతున్నది. పడవ వాడు పండితుడిని అడిగాడు, "మీకు ఈత వచ్చా?" అని.


"రాదు" అన్నాడు పండితుడు.


"అయితే మీ పూర్తి జీవితం వృథా అయినట్టే!" అని పడవ వాడు నదిలో దూకాడు, ఒడ్డు వైపుకు ఈదుతూ.


పండితుడికి జ్ఞానోదయం అయింది.


"తప్పయిపోయింది. నా జ్ఞాన సంపద సిద్ధాంతం వరకే... నీ జీవిత నైపుణ్యమే ఎక్కువ ఉపయోగం. 'నేనే గొప్ప' అనే అహంకారం, ఇతరులను కించపరిచే భూత విధానం, స్వభావం ఉండరాదు. దేవుడిపై భారం వేసి అందరితో స్నేహ-సోదర భావంతో మెలగాలి. నన్ను కూడా గట్టుకు చేర్చమని మనవి," అన్నాడు (పండితుడు).


పడవ వాడు కరుణించి పండితుడిని కూడా ఒడ్డుకు చేర్చాడు, (పండితుడి చేయి పట్టుకొని ఒడ్డు వైపుకు ఈదుతూ).-----2)


ఇక... "తెలియని కథ" లోకి వెళదామా!


అందులో (పడవలో) మూడో వ్యక్తి శ్రీలేఖ కూడా ఉంది.


"మీకు ప్రపంచ అగ్రశ్రేణి నోబెల్ బహుమతి గ్రహీతలు, టాప్ 10 విశ్వవిద్యాలయాల టీచర్లు, విద్యార్థులు తెలుసా?" అని శ్రీలేఖ అడిగింది (వారిరువురిని).


వారిరువురు "తెలియదు" అన్నారు.


"అయితే మీరు జీవించి ఉండడం వృథా!" అన్నది శ్రీలేఖ.


గట్టిగా నవ్వారు ఇద్దరు.


3)


శ్రీలేఖ వారిరువురికీ లైఫ్ జాకెట్ ఇచ్చింది. "నాలా తొడుక్కోండి" అని చెప్పింది, నేర్పింది, చేసి చూపింది.


పడవ వాడు మరియు పండితుడు అలాగే చేశారు.


నీళ్లలోకి దూకండి అన్నది శ్రీలేఖ... తను కూడా దూకుతూ.


ఇద్దరూ అలాగే చేశారు.


ఆశ్చర్యము! ముగ్గురూ నీటిలో తేలారు.


అదే పడవలో తను పెట్టిన లైఫ్ బోట్ తీసింది శ్రీలేఖ. చకచకా విప్పి పెద్దది చేసింది లైఫ్ బోట్‌ను. మోటార్ ఆన్ చేసింది. అందులో కూర్చుని ముగ్గురూ ఒడ్డు చేరుకున్నారు.


కర్రను తెడ్డులా ఉపయోగించే అవసరం కూడా పడలేదు.


------------ చిన్న కథ సమాప్తం -----------


-------------- నీతి --------------


1)


ప్రపంచ అగ్రశ్రేణి నోబెల్ బహుమతి గ్రహీతల, టాప్ 10 విశ్వవిద్యాలయాల టీచర్ల మరియు విద్యార్థుల పనితీరు, మంచి అలవాట్లు, తయారీ విధానం తెలుసుకోండి... స్నేహం చేసుకోండి. ఆ టాప్ 10 విశ్వవిద్యాలయాల వార్తాలేఖలు, పరిశోధన పత్రాలు తరచుగా చదవండి.


అప్పుడు వినూత్నంగా, సృజనాత్మకంగా, మంచిగా, నిర్మాణాత్మకంగా ఆలోచించే తీరు అలవడుతుంది. సంతోషకరమైన అభివృద్ధి, నిర్వహణ మరియు విన్-విన్ -


(అందరికీ విజయం దక్కే) - ఆనందకరమైన విజయ పరిష్కారాల తీరు, ఆలోచనలు, నిర్వహణ అలవాటుగా మారుతుంది. అప్పుడు జయం నిశ్చయం.


వినూత్న ఆవిష్కరణలు చేయండి... ప్రపంచానికే సాయపడండి.


2)


జ్ఞాన సంపద సిద్ధాంతం వరకే... జీవిత నైపుణ్యమే ఎక్కువ ఉపయోగం. 'నేనే గొప్ప' అనే అహంకారం, ఇతరులను కించపరిచే భూత విధానం, స్వభావం ఉండరాదు. దేవుడిపై భారం వేసి అందరితో స్నేహ-సోదర భావంతో, సహాయ-పూర్వకంగా కలసికట్టుగా మెలగాలి.


3)


Make friends with Nobel Laureates and with the students and teachers from top-tier universities.


Know and learn from them...


i) good, innovative thinking (or thought process), organised preparation mode (macro/micro level).


ii) happy development management and WIN-WIN JOYFUL success SOLUTIONS, CONSTRUCTIVE nature... becomes a regular, daily, breathing-like habit.


iii) read regularly their newsletters and research papers... At least headings, subheadings, and an introduction.


THEN Success becomes EASY and definite.


iv) Do innovative inventions - help the EXCELLENT WORLD.


4)


Knowledge is THEORETICAL. Life skills are more useful in daily life. No one should have the arrogance that "I am great".Treat all as equals, as every human has strengths, skills (and weaknesses too). To err is human (by all means). Hence, no human should have arrogance, a devilish nature, or a 'put others down' nature. Hence, put everything on God. Live a life of equality, fraternity, harmony, brotherhood, a helping nature, togetherness, and a united, cooperative team.


----------- నీతి సమాప్తం ------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page